Brahmamudi July 12th Episode: దుగ్గిరాల వారింట్లో అత్తారింటికి దారేది సీన్.. రాహుల్- రుద్రాణిలకు బడితపూజ

Photo Courtesy: JioHotstar

ఏసీబీకి రెడ్ హ్యాండెడ్‌గా దొరకడంతో అప్పూ తన యూనిఫాంను ప్రభుత్వానికి సరెండర్ చేస్తుంది. అప్పూని సెల్‌లో పెడుతుండగా కావ్య వచ్చి బెయిల్‌పై విడిపిస్తుంది. ఇంత ఫాస్ట్‌గా బెయిల్ ఎలా వచ్చింది? మీకు అంత బ్యాక్‌గ్రౌండ్ ఉందా? అని ఏసీబీ ఆఫీసర్ ఆశ్చర్యపోతాడు. మా చెల్లెలు దుగ్గిరాల వారి ఇంటి కోడలు అని చెప్పడంతో ఏసీబీ ఆఫీసర్ షాక్ అవుతాడు. ఇంటికొచ్చిన రాజ్‌తో కళావతికి ప్రపోజ్ చేశావా? లేదా? అని అడుగుతుంది యామిని.

నేను ప్రపోజ్ చేస్తున్న ప్రతిసారి కళావతికి ఏదో ఒక అర్జెంట్ వర్క్ వస్తోందని చెబుతాడు రాజ్. తను కావాలనే నీ నుంచి దూరం అవుతోందని యామిని అనడంతో రాజ్ కోప్పడతాడు. స్టేషన్ నుంచి ఇంటికి వచ్చిన అప్పూని రుద్రాణి, ధాన్యలక్ష్మీ నానామాటలు అంటారు. తన చెల్లెలు నిర్దోషి అని నేను నిరూపిస్తానని.. అలా చేయలేకపోతే అప్పూ ఇంట్లోనే ఉండిపోతుందని కావ్య సవాల్ విసురుతుంది. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. ఇక జూలై 12వ తేదీ ఎపిసోడ్ 772లో ఏం జరిగిందంటే?

Brahmamudi Serial July 12th 2025 Episode 772 Here is Today s full story

Photo Courtesy: JioHotstar

ప్రపోజ్ చేసే సమయానికి కావ్య వెళ్లిపోవడం, అప్పూ అరెస్ట్ కావడంతో ఏం జరిగిందోనని రాజ్ టెన్షన్ పడతాడు. వెంటనే కావ్యకి ఫోన్ చేసి ఆరా తీస్తాడు. అప్పూని బెయిల్ మీద తీసుకొచ్చానని, మేం ఉన్న టెన్షన్‌లో మీకు ఫోన్ చేయడం మరిచిపోయానని అంటుంది కావ్య. అప్పూని విడిపించినా ప్రాబ్లమ్ ఇంకా సాల్వ్ కాలేదని, తనను ఈ కేసులో నుంచి ఎలా బయటపడేయాలో అర్ధం కావడం లేదని చెబుతుంది. అప్పూని ఎందుకు అరెస్ట్ చేశారని రాజ్ ప్రశ్నించగా.. లంచం తీసుకుంటూ ఏసీబీ వాళ్లకి రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయిందని అంటుంది కావ్య.

అప్పూ అలాంటి పనులు చేయదని.. కానీ తను చేసినట్లుగా క్రియేట్ చేసి అప్పూని ఈ కేసులో ఇరికించారని చెబుతుంది కావ్య. ఇంకో రెండ్రోజుల్లో అప్పూని కోర్టులో హాజరు పరుస్తారని, తను నిర్దోషిగా బయటికి రావాలంటే తనని ఈ కేసులో ఇరికించిన వారిని పట్టుకుని వాళ్ల చేతే నిజం చెప్పించాలని చెబుతుంది. లేదంటే అప్పూ జాబ్ పోవడంతో పాటు తనకి శిక్ష కూడా పడే ఛాన్స్ ఉందని బాధపడుతుంది కావ్య. అప్పూని తప్పుడు కేసులో ఇరికించింది ఎవరైనా సరే, వదిలిపెట్టే ప్రసక్తే లేదని.. మీకు నేనున్నాను కదా అని అంటాడు రాజ్. మిమ్మల్ని ఇంకా ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదని చెబుతుంది కావ్య.

నన్ను పరాయివాడిని చేస్తున్నారా? నేను మీకు సాయం చేయడానికి పనికి రానా? అని ప్రశ్నిస్తాడు రాజ్. టీవీలో న్యూస్ చేస్తున్నప్పుడు ఎవరికో ఏదో ప్రాబ్లమ్ వచ్చింది అంటేనే తట్టుకోలేమని, అలాంటిది మన అనుకున్న మనిషికి కష్టం వస్తే చూస్తూ ఎలా ఉంటానని అంటాడు రాజ్. ఏం చేయాలో? ఎలా చేయాలో? రేపు ఇంటికొచ్చాక మాట్లాడుకుందామని ఫోన్ పెట్టేస్తాడు. ఇంతలో అపర్ణ, ఇందిర వచ్చి కావ్యని ఏం జరిగింది అడుగుతారు. అప్పూ అరెస్ట్ విషయంలో హెల్ప్ చేస్తానని చెబుతుంటే నేనే వద్దు అన్నానని అంటుంది కావ్య. ఆయనకు నిజం తెలిస్తే మళ్లీ ఏ ప్రమాదంలో పడుతాడని భయపడుతుంది. అప్పూని అరెస్ట్ చేయించింది యామినియే.. ఆ రోజు అప్పూ వార్నింగ్ ఇచ్చినందుకు పగ తీర్చుకుందని చెబుతుంది కావ్య. అంతేకాకుండా మన కంపెనీని సిద్ధార్ధ్ లాక్కునేలా రెచ్చగొట్టింది కూడా యామినియే అని అంటుంది. ఇన్ని రోజులు పోనీలే అని వదిలేశామని.. దాని పాపాలు పండే రోజు దగ్గరపడిందని చెబుతుంది ఇందిర. అప్పూ కేసు విషయంలో రాజ్ సాయం తీసుకోమని ప్రోత్సహిస్తుంది.

లంచం కేసులో అరెస్ట్ కావడం, ఇంట్లో గొడవ జరగడంతో అప్పూ ఏడుస్తుండటంతో కళ్యాణ్ వచ్చి ఆమెను ఓదార్చేందుకు ప్రయత్నిస్తాడు. యూనిఫాం నా చేజారిపోవడంతో నేను కన్నకలలు, పెంచుకున్న ఆశలు.. నా కళ్లముందే కూలిపోయినట్లు అనిపించిందని చెబుతుంది అప్పూ. అమ్మ నిన్ను అర్ధం చేసుకుంటుందని కళ్యాణ్ అంటాడు. నేను ఇన్నిరోజులు అదే ఆశతో ఉన్నానని.. కానీ ఈరోజు జరిగింది చూశాక అది జరగదని కన్ఫమ్ అయ్యిందని అంటుంది. అమ్మని సరిగా అర్ధం చేసుకోలేదని ఆమెకు నా మీదున్న ప్రేమ అలా చేయిస్తుందని చెబుతాడు కళ్యాణ్.

ఉదయాన్నే దుగ్గిరాల కుటుంబం అప్పూని ఎలా కాపాడాలా? అని మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ శీను వచ్చి సాక్ష్యం చెబితేనే అప్పూ బయటపడుతుందని అంటాడు కళ్యాణ్. ఇంతలో రాజ్ వచ్చి మనం వాడిని వెతికి పట్టుకుందామని చెబుతాడు. అసలు వాడి వెనుక ఎవరున్నారో తెలిస్తే నిజం దానంతట అదే బయటికొస్తుందని అంటాడు రాజ్. అప్పూని ఇరికించినవాళ్లని అంత సులభంగా ఎందుకు వదిలేస్తామని అంటాడు రాజ్. ముందు ఆ శీనుతో నిజం చెప్పించాలని కావ్య చెప్పగా.. మీరు కొత్తగా కనిపిస్తున్నారని చెబుతాడు రాజ్. మీరు వెళ్లి అడగ్గానే ఆ శీనుగాడు నిజం చెప్పేస్తారా? అని రుద్రాణి నిలదీస్తుంది. తప్పు ఒప్పుకుని లొంగిపోతే శిక్ష తక్కువ పడుతుందని అంటుంది రుద్రాణి.

చేయని తప్పుని ఎందుకు ఒప్పుకోవాలని కళ్యాణ్ మండిపడతాడు. ఈ కేసు గురించి మీకు ఏం వివరాలు తెలుసు.. వాడు అప్పూని ఎలా ఇరికించాడు? ఏసీబీ వాళ్లకి ఫోన్ ఎలా చేశాడు? ఇలాంటి వివరాలు తెలియాలి కదా అని అంటుంది రుద్రాణి. అప్పూని కాపాడటానికి సూపర్ ఐడియా ఇచ్చారని రుద్రాణిని రాజ్ మెచ్చుకోవడంతో అంతా షాక్ అవుతారు. ఇదే పోలీస్ స్టేషన్ అనుకుందాం? మొత్తం సీన్ రీ క్రియేట్ చేద్దామని, అప్పుడు అందరికీ ఏం జరిగిందో తెలుస్తుందని అంటాడు రాజ్. ఇందిర, అపర్ణలు ఏసీబీ ఆఫీసర్లుగా.. రుద్రాణి, రాహుల్‌లు ఆ శీనుగాడు, వాడి ఫ్రెండ్ క్యారెక్టర్లు.. రాజ్, కావ్యలు కానిస్టేబుల్స్‌గా నటిస్తారు.

ఆ శీనుని కలవకుండా చూస్తేనే అప్పూకి శిక్ష పడేలా చేయొచ్చని రాహుల్‌తో చెబుతుంది రుద్రాణి. ఇంతలో రాజ్ వచ్చి మీరు ఏం మాట్లాడుకుంటున్నారో నాకు తెలిసిపోయిందని అంటాడు. నిజాన్ని మా అందరికీ తెలిసేలా చేయడానికి ప్లాన్ చేస్తున్నారు కదా అని చెబుతాడు. తర్వాత పోలీస్ స్టేషన్‌లో ఏం జరిగిందో సీన్ రీ క్రియేట్ చేస్తుంది దుగ్గిరాల ఫ్యామిలీ. రుద్రాణి, రాహుల్‌లు అప్పూకి డబ్బులు ఇవ్వబోతుండగా.. ఏసీబీ ఆఫీసర్లుగా ఇందిర, అపర్ణలు వచ్చి పట్టుకుంటారు. అప్పూని ఇరికించాలని చూసిన ఆ శీనుగాడు, వాడి ఫ్రెండ్‌ క్యారెక్టర్లు వేసిన రుద్రాణి, రాహుల్‌లను చితక్కొడతారు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X