Brahmamudi July 13th Episode: ఆ శిక్ష ని నేనే అనుభవిస్తా? మీరైనా సుఖంగా ఉండండి.. అపర్ణ హైడ్రామా
అప్పుని అవమానించేలా మాట్లాడుతారు చుట్టుపక్కల వాళ్ళు. వాళ్లకి కనకం సరైన సమాధానం చెప్తుంది. తల్లిదండ్రుల పెళ్లిరోజుని గ్రాండ్ గా జరిపించి ఇంట్లో ఉన్న మనస్పర్ధలు తొలగిపోయేలా చేయాలని ప్లాన్ చేస్తారు రాజ్ దంపతులు. తల్లి చేత తండ్రికి గిఫ్ట్ ఇప్పిస్తారు రాజ్ దంపతులు. అపర్ణ గిఫ్ట్ తీసుకోవడంతో ఎమోషనల్ అవుతాడు సుభాష్ అయితే ఆ చీరని పని మనిషికి ఇచ్చేస్తుంది అపర్ణ ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలెట్‌గా మిగిలాయి. ఇక జులై 13వ తేదీ ఎపిసోడ్ 461లో ఏం జరిగిందంటే..
రుద్రాణి శాంతతో అందరికీ కూల్ డ్రింక్స్ తీసుకురమ్మని చెప్తుంది. అపర్ణ ఇచ్చిన చీర కట్టుకొని కూల్ డ్రింక్స్ తీసుకొని వస్తుంది శాంత. అది చూసిన సుభాష్, రాజ్, కావ్య షాక్ అవుతారు. అపర్ణ కూడా షాక్ అవుతూ ఇంత ఖరీదైన చీర నీకు ఎక్కడిది అని అడుగుతుంది. ఈరోజు పెళ్లిరోజు అని అమ్మగారు ఈ చీరతో పాటు డబ్బులు కూడా ఇచ్చారు అంటుంది శాంత. ఇంతకుముందు ఎప్పుడు ఇలా ఇవ్వలేదే అని అనుమానంగా అంటుంది రుద్రాణి.

ఇప్పుడు ఇచ్చాను అయితే నీకేంటి అభ్యంతరం అంటుంది అపర్ణ. సరే, సరే కేకు కోయటానికి టైం అవుతుంది అని ఇందిరా దేవి చెప్పడంతో కేక్ కటింగ్ కి ప్రిపేర్ అవుతుంది అపర్ణ. అక్కడ నుంచి బాధగా వెళ్ళిపోబోతే రాజ్ కళ్ళతోనే వారిస్తాడు. కేక్ కట్ చేస్తూ ఉంటే అందరూ ఆనందంగా ఉంటారు అది చూసిన రుద్రాణి భరించలేక పోతుంది. అన్నయ్య చాలా అదృష్టవంతుడు ఆ మాయ మాయలో పడినా మా అన్నయ్యని వదిన త్వరగానే క్షమించేసింది.
నిజంగా మా వదినది విశాల హృదయం అంటుంది. ఏ సమయంలో ఏం మాట్లాడాలో తెలియదా, అందరూ సంతోషంగా ఉంటే చూడలేవు, ఈ సమయంలో అలాంటి విషయాలు గుర్తు చేయటం అవసరమా అంటూ కుటుంబ సభ్యులందరూ రుద్రాణి కి చివాట్లు పెడతారు. తన మాటలు మనకు అలవాటే కదా వదిలేయండి అంటుంది అపర్ణ కేక్ కట్ చేసి భర్తకి పెట్టకుండా కొడుక్కి పెడుతుంది. అప్పుడు కూడా సుభాష్ ఫీల్ అవుతాడు.

తర్వాత తన రూమ్ లో ఉన్న భార్యతో నువ్వు చేసిన పనికి అర్థం ఏమిటి అని నిలదీస్తాడు సుభాష్. నా సౌభాగ్యాన్ని వేరొకరికి దోచిపెట్టి మీరు చీరకొని ఇచ్చేస్తానంటే నేను కట్టుకోవాలా అని కోపంగా అడుగుతుంది అపర్ణ. నేను చేసింది తప్పే కాదటడం లేదు కానీ ఏం చేస్తే క్షమిస్తావు అంటాడు సుభాష్. ఏం చేసినా క్షమించలేను అని కోపంగా చెప్తుంది అపర్ణ బాధగా అక్కడ నుంచి వెళ్ళిపోతాడు సుభాష్. గది బయట ఉన్న కొడుకు కోడల్ని చూసి మీరేంటి ఇక్కడ అందరూ ఏరి అని అడుగుతాడు.
అందరూ గార్డెన్ లో ఉన్నారు కానీ మీరు ఏంటి ఇలా ఉన్నారు, మీ ఇద్దరు కలిసి పోలేదా, నటిస్తున్నారా అని అడుగుతారు రాజ్ దంపతులు. అప్పుడు కొడుకు కోడల్ని కోప్పడుతూ ఏదైతే మీకెందుకు, కొన్ని రోజులు స్వప్న రాహుల్ ని కలపటానికి, కొన్ని రోజులు అనామిక, కళ్యాణ్ ని కలపటానికి ఇప్పుడు అమ్మ నాన్నలని కలపటానికి కష్టపడుతున్నారా ఇక చాలు మీకోసం మీరు జీవించండి నేను చేసినది తప్పు, ఆవిడ నన్ను శిక్షిస్తుంది.

ఆ శిక్ష ని నేను మాత్రమే అనుభవిస్తాను మీరైనా సుఖంగా ఉండండి అని బాధగా అక్కడ నుంచి వెళ్ళిపోతాడు సుభాష్. అప్పుడు కావ్య అపర్ణ గదిలోకి వెళుతుంది. ఏం చేస్తున్నారు అత్తయ్య నిలదీస్తుంది. ఆ మనిషి నిన్ను రాయబారానికి పంపించారా అంటుంది అపర్ణ. లేదు నాకు మీ అబ్బాయికి బాధనిపించింది అందుకే వచ్చాను అంటుంది కావ్య. పోనీలే కదా అని కోడలిగా అంగీకరిస్తే నువ్వు నన్నే నిలదీయటానికి వచ్చావా అని కోప్పడుతుంది అపర్ణ. మిమ్మల్ని నిలదీసే మొహమేనా నాది అంటుంది కావ్య.
తరువాయి భాగంలో కళ్యాణ్ ఆవేశంగా పోలీస్ స్టేషన్ కి వస్తాడు. అప్పు జైల్లో ఉంటుంది, అక్కడ కొంతమందిని చూపించి వీళ్లే అక్క గురించి తప్పుగా మాట్లాడారు అని కళ్యాణ్ కి చెప్తాడు బంటి. పోలీసుల లాఠీ లాక్కొని వాళ్ళని కొడతాడు కళ్యాణ్. అప్పుడు కళ్యాణ్ ని అరెస్టు చేస్తారు పోలీసులు. విషయం తెలుసుకున్న రాజ్ షాక్ అవుతాడు.


Click it and Unblock the Notifications











