Brahmamudi July 13th Episode: రాజ్ హత్యకు రేఖ కుట్ర.. రాజ్ దుగ్గిరాల వారసుడని తెలుసుకున్న ఇందూ
Photo Courtesy: JioHotstar
తల్లి కోసం లక్కీ పడుతున్న బాధను చూడలేక కిందకి వస్తున్న రాజ్‌కి.. ఆంటోనీ కనిపించడంతో అతనిని ఫాలో అవుతాడు. ఓ చోట రేఖని ఆంటోనీ కలవడంతో రాజ్ షాక్ అవుతాడు. మీ కొడుకు లక్కీ తల్లి ఎక్కడ చూపించమని గొడవ చేస్తున్నాడని ఇక నా వల్ల కావడం లేదని ఆంటోనీ చెప్పడంతో రాజ్ ఉలిక్కిపడతాడు. లక్కీ గాడు రేఖ పిన్ని కొడుకా అని అనుకుంటాడు. మీరు 50 లక్షల రూపాయలు ఇస్తే ఓకే.. లేదంటే నీ తల్లి ఎవరో చెబుతానని 10 లక్షల రూపాయలు కావాలని అడిగితే ఆ లక్కీగాడు తల తాకట్టు పెట్టైనా తెస్తాడని చెబుతాడు ఆంటోనీ.
అతను వెళ్లిపోగానే రేఖ దగ్గరికి వెళ్లిన రాజ్.. మా లక్కీగాడు తల్లి కోసం పడే బాధను చూడలేను. మీరే తల్లి అని అందరి ముందు ఒప్పుకోండి లేదంటే నేనే నిజం చెప్పేస్తానని వార్నింగ్ ఇస్తాడు. ఉదయాన్నే ఇందూకి పనులు చెబుతున్న భ్రమరాంబ, ఐశ్వర్యలపై మండిపడుతుంది నందూ. తను దుగ్గిరాల ఇంటికి వారసురాలు, ఈ ఆస్తికి అధిపతి తనకు ఇలాంటి పనులు చేయాల్సిన అవసరం లేదు. మీ పనులు మీరే చేసుకోవాలని వార్నింగ్ ఇస్తుంది. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. ఇక జూలై 13వ తేదీ ఎపిసోడ్ 1083లో ఇంకా ఏం జరిగిందంటే?

Photo Courtesy: JioHotstar
ఈరోజు మా అమ్మని చూడబోతున్నానని లక్కీ చాలా సంతోషిస్తాడు. ఇంతలో రేఖకి రాజ్ ఫోన్ చేసి ఈరోజు సాయంత్రం లోపు నేను చెప్పింది చేయాల్సిందే, నా ఫ్రెండ్‌కి ఈ నిజం చెప్పేశాను. మా ఫ్రెండ్ ఎప్పుడెప్పుడు మా అమ్మని చూస్తానని ఎదురుచూస్తున్నాడు అని రాజ్ అంటాడు. వాడికి నిజం చెప్పేశావా? అని రేఖ అడగ్గా.. నువ్వే వాడికి తల్లివని ఇంకా నిజం చెప్పలేదు.. ఎందుకంటే ఆ నిజం నువ్వు చెబితేనే బాగుంటుందని చెబుతాడు రాజ్. ఒకవేళ నువ్వు నీ తెలివితేటలు చూపిస్తే నేరుగా లక్కీగాడిని తీసుకుని నీ నట్టింటిలో నిలబడతాను, ఏం కావాలో నువ్వే తేల్చుకోమని వార్నింగ్ ఇస్తాడు రాజ్.
అసలు నీకు ఏం జరిగింది? పరధ్యానంలో ఉంటున్నావు? నందూ అంతలా రెచ్చిపోతుంటే సైలెంట్‌గా ఎందుకు ఉన్నావని రేఖని ప్రశ్నిస్తుంది భ్రమరాంబ. ఆంటీ ఆలోచించేది ఆ రాజ్ గాడి గురించే, వాడే ప్లాన్ చేసి నందూని ఇక్కడికి పంపించాడు, వాడు అనుకున్నట్లుగానే ఆంటీకి ఆస్తిని దూరం చేశాడని చెబుతుంది ఐశ్వర్య. వాడు ఇంటిలో లేకుండానే నిన్ను దెబ్బకొడుతున్నాడు.. అదే ఆ రాజ్‌గాడు, నందూ కలిస్తే మనల్ని బతకనిస్తారా అని భ్రమరాంబ చెబుతుంది. అందుకే ఆ రాజ్‌గాడికి ఈరోజుతో ఫుల్‌స్టాప్ పెట్టబోతున్నాను, నన్ను దెబ్బకొట్టిన వాడిని అంత ఈజీగా ఎలా వదిలేస్తాను, వాడికి చావు భయం చూపించబోతున్నాను, మరికొద్దిసేపటిలో రాజ్ అనేవాడి చాప్టర్ క్లోజ్ అంటుంది రేఖ. ఈ విషయాలన్ని విన్న స్వాతి.. వెంటనే ఇందూకి చెప్పడంతో ఆమె షాక్ అవుతుంది.
రాజ్ బావకి ఏం కాకూడదు, బావని కాపాడుకోవాలని స్వాతి చెప్పడంతో రాజ్‌కి ఫోన్ చేస్తుంది. అయితే అప్పటికే లక్కీ ఫోన్ చేసి మా అమ్మ ఎక్కడ ఉంటుంది? అని అడుగుతాడు. సాయంత్రం వరకు నేను ఆగలేను, మా అమ్మ ఎవరో చెప్పమని బతిమలాడతాడు. తనే నీకు కాల్ చేస్తుంది, తన కాల్ కోసం వెయిట్ చేయమని చెబుతాడు రాజ్. వీడికి అనవసరంగా వాళ్ల అమ్మ గురించి చెప్పాను, ఈరోజంతా ఫోన్లు చేసి చంపుతానే ఉంటాడని ఫోన్ సైలెంట్‌లో పెడతాడు. ఇందూ ఎంత ఫోన్ చేస్తున్నా రాజ్ ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో చలపతికి ఫోన్ చేస్తుంది ఇందూ.
నువ్వు వాడి మీద ఆశలు వదిలేసుకో.. వాడు ఇంకెప్పుడూ మీ ఇంటికి రాడు అని చెబుతాడు చలపతి. రాజ్ ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయని ఇందూ చెప్పడంతో చలపతి- లక్ష్మీ షాక్ అవుతారు. నేను రాజ్ కోసం వెళ్తున్నానని నువ్వు ఈ విషయం నానమ్మకి చెప్పొద్దని అంటుంది ఇందూ. రాజ్ కోసం ఇందూ, చలపతిలు ఊరంతా వెతుకుతూ ఉంటారు. రాజ్‌ను వెంటాడుతున్న రౌడీ.. రేఖకి ఫోన్ చేయడంతో ఏం చేయమంటారని అడుగుతాడు. నీకు 5 లక్షల రూపాయలు ఇస్తాను.. వాడు మిగలకూడదు గుద్ధి పడేయమని చెబుతుంది. దాంతో ఆ రౌడీ.. రాజ్ బైక్‌ను గుద్ధేయడంతో అతను చెట్టుకు గుద్ధుకుని పడిపోతాడు. వెంటనే ఈ విషయాన్ని రేఖకి ఫోన్ చేసి వాడు ఔట్.. కాసేపట్లో చావు వార్త మీ ఇంటికి వస్తుందని చెప్పడంతో సంతోషిస్తుంది.
ఆసుపత్రిలో చావు బతుకుల మధ్య ఉన్న కొడుకుని చూసి చలపతి- లక్ష్మీ తల్లడిల్లిపోతారు. నాకు చాలా భయంగా ఉంది, మన రాజ్‌కి ఏం కాదు కదా అని అడుగుతుంది. ఆ దేవుడు మనకి అన్యాయం చేయడని అంటాడు చలపతి. ఇంతలో ఆసుపత్రికి ఇందూ వచ్చి రాజ్‌కి ఎలా ఉంది అని అడుగుతుంది. వాడు స్పృహలో లేడు, చాలా సీరియస్ కండీషన్‌లో ఉన్నాడని లక్ష్మీ చెప్పడంతో ఇందూ కంటతడి పెడుతుంది. రాజ్ కోసం వెళ్లబోతుండగా ఇందూని అడ్డుకుంటాడు చలపతి. మీ గొప్పింటి వాళ్లతో పెట్టుకుంటే ఏ రోజుకైనా వాడి ప్రాణాలకు ప్రమాదమే. నువ్వు వాడిని మా ఇంటికి పంపించావని చెప్పాడు. కానీ వాడు ఇక్కడికి వచ్చాక కూడా నీ గురించి, మీ ఇంటి గురించే ఆలోచించాడని చెబుతాడు చలపతి.
వాడికి ఎప్పుడు ఏమవుతుందోనని భయంతో బతికాం, నువ్వంటే మాకు ఇష్టం ఉన్నా కూడా వాడి ప్రాణాలు కాపాడటానికే నీకు దూరం చేశామని చెబుతుంది లక్ష్మీ. మేం అనుకున్నదే జరిగింది.. ఈరోజు వాడు ఆ రేఖ కోపానికి బలైపోయాడు, నువ్వు ఇక్కడ ఉండొద్దని చెబుతాడు చలపతి. నేనే ఇక్కడే ఉంటాను, రాజ్‌ని చూడాలని ఇందూ బతిమలాడటంతో చలపతి వద్దని తేల్చేస్తాడు. నువ్వు ఇక్కడే ఉంటే ఆ రేఖ ఊరుకోదని చెబుతాడు. రాజ్‌ని ఇలాంటి పరిస్ధితుల్లో వదిలేసి నేను వెళ్లలేనని అంటుంది ఇందూ. వాడు ఈ పరిస్ధితుల్లో ఉండటానికి కారణం నువ్వే కదా? నీ వల్లే వాడిప్పుడు ప్రాణాలతో పోరాడుతున్నాడు. ఆ ప్రాణాలు నిలబడాలంటే నువ్వు ఇక్కడ ఉండొద్దని చెబుతాడు చలపతి.
వాడు నీ మొగుడు అన్న కోపంతోనే ఆ రేఖ ఇదంతా చేసింది. అదే వాడు దుగ్గిరాల ఇంటి వారసుడు అని తెలిస్తే.. వాడిని ప్రాణాలతో ఉండనివ్వదని చలపతి చెప్పడంతో ఇందూ షాక్ అవుతుంది. రాజ్ దుగ్గిరాల వారసుడా అని ప్రశ్నిస్తుంది ఇందూ. వాడు దుగ్గిరాల వారసుడు అని చలపతి నిజం చెప్పబోతుండగా లక్ష్మీ అడ్డుకుంటుంది. ఈ అమ్మాయికి నిజం తెలియాలి.. అప్పుడే మనం వాడిని కాపాడుకోగలమని చెబుతాడు చలపతి. వాడు మీ నాన్నగారి అక్క కొడుకు, నీకు స్వయానా బావ.. వాడు మా కన్నకొడుకు కాదు.. మేం పెంచుకున్న కొడుకు అని చలపతి చెప్పడంతో ఇందూ షాక్ అవుతుంది.
మా బావ మీ కొడుకుగా ఎలా పెరిగాడని ఇందూ అడగ్గా.. శ్రీశైలంలో ఏదో యాక్సిడెంట్ జరిగింది, అక్కడే మాకు రాజ్ దొరికాడు. వాడి కుటుంబం కోసం మేం అంతా వెతికినా ఏం తెలియలేదు. అందుకే మేమే పెంచుకున్నాం.. ఈ విషయం రాజ్‌కి కానీ, మా చిన్న కొడుకు వెంకీకి కానీ తెలియదు. కొన్ని నెలల క్రితమే రాజ్ దుగ్గిరాల వారసుడు అని తెలిసింది. మీ కుటుంబం మొత్తాన్ని ప్లాన్ చేసి యాక్సిడెంట్‌లో చంపేశాడని తెలిసింది. ఆ యాక్సిడెంట్‌లో రాజ్ ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ విషయం ఆ రేఖకి తెలిస్తే వాడిని ఎక్కడ చంపేస్తాడని భయపడ్డామని చెబుతారు చలపతి- లక్ష్మీ. మాకు రాజ్, వెంకీ వేరే వేరు కాదు.. వాళ్లిద్దరూ మా కొడుకులేనని అంటుంది లక్ష్మీ. రాజ్ దుగ్గిరాల వారసుడని తెలిస్తే ఆ రేఖ బతకనివ్వదు, కానీ వాడు ప్రాణాలతో ఉండాలంటే నీ ప్రేమను చంపుకోవాలి, నువ్వు వాడి జీవితం నుంచి తప్పుకోమని చెబుతాడు చలపతి. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications