Brahmamudi July 14th Episode: కావ్యతో యామిని మైండ్ గేమ్.. సీక్రెట్‌గా రేవతిని కలిసిన ఇందిర

Photo Courtesy: JioHotstar

అప్పూకి ఏం జరిగింది? స్టేషన్ నుంచి బయటికి వచ్చిందా? లేదా అని కంగారుపడుతూ కావ్యకి ఫోన్ చేసి అడుగుతాడు రాజ్. అప్పూ లంచం తీసుకుంటున్నట్లుగా ఇరికించి జాబ్ పోయేలా చేశారని రాజ్‌కు చెబుతుంది కావ్య. అప్పూని ఇరికించిన ఎవ్వరినీ విడిచిపెట్టొద్దని.. ఆమె నిజాయితీని నిరూపిద్దామని కావ్యతో అంటాడు. కుట్రకు బలవ్వడం, ఉద్యోగం పోవడం, ధాన్యలక్ష్మీ నానామాటలు అనడంతో ఏడుస్తున్న అప్పూని ఓదారుస్తాడు కళ్యాణ్. మా అమ్మని తప్పుగా అర్ధం చేసుకోవద్దని ఎస్ఐ ఉద్యోగం మానేస్తే నాతో ఎక్కువసేపు గడపొచ్చనే ఉద్దేశంతోనే ఆమె అలా మాట్లాడుతుందని చెబుతాడు కళ్యాణ్.

అప్పూని ఎలా బయటికి తీసుకురావాలా? అని దుగ్గిరాల కుటుంబం మాట్లాడుకుంటూ ఉండగా రాజ్ వస్తాడు. అప్పూని ఇరికించిన వాడిని వెతికి వాడితోనే కోర్టులో సాక్ష్యం చెప్పిద్దామని అంటాడు. దానికి రుద్రాణి అడ్డుపడి అవన్నీ వేస్ట్ అని.. వృథా ప్రయత్నాలని అంటుంది. దీంతో సీన్ రీ క్రియేషన్ పేరుతో ఏం జరిగిందో తెలుసుకోవడానికి రాజ్ నాటకం ఆడతాడు. ఇందులో ఏసీబీ ఆఫీసర్లుగా అపర్ణ, ఇందిరలు నటిస్తారు.. శీనుగాడు, వాడి ఫ్రెండ్ గెటప్స్ వేసిన రాహుల్- రుద్రాణిలకు దుగ్గిరాల ఫ్యామిలీ బడితపూజ చేస్తుంది. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. ఇక జూలై 14వ తేదీ ఎపిసోడ్ 773లో ఏం జరిగిందంటే?

Brahmamudi Serial July 14th 2025 Episode 773 Here is Today s full story

Photo Courtesy: JioHotstar

అప్పూకి పోలీస్ స్టేషన్‌లో ఏం జరిగిందో సీన్ రీ క్రియేట్ చేసేలా అప్పూ అమాయకురాలు అనే నాటకం వేయిస్తాడు రాజ్. అన్ని రకాలుగా రుద్రాణి, రాహుల్‌లను చితకబాదుతారు. ఇంతకీ ఆ శీను గాడు ఎక్కడ ఉంటాడని అప్పూని రాజ్ అడుగుతాడు. రెహమత్ నగర్‌లోని పాతబస్తీలో ఉంటాడని, అదే తన అడ్రస్ అని చెబుతుంది అప్పూ. మొన్న మిమ్మల్ని కాపాడిన వాళ్లు కూడా అదే ఏరియాలో ఉంటున్నారు కదా అని కావ్యని అడుగుతాడు రాజ్. రేవతి హెల్ప్ తీసుకుందామని.. ఒకవేళ అక్కకి ఆ శీనుగాడు తెలిస్తే వాడిని పట్టుకోవడం ఈజీ అవుతుందని చెబుతాడు రాజ్.

నేను కూడా వస్తానని కళ్యాణ్ అడగ్గా.. ఇప్పుడు మీ అవసరం అప్పూకి చాలా ఉందని, మీరు అప్పూకి తోడుగా ఉండండి అని చెబుతుంది కావ్య. కళావతి గారు మాటిచ్చారు అంటే ఖచ్చితంగా పట్టుకుంటారు, నువ్వు నిశ్చింతగా ఉండమని చెబుతాడు రాజ్. నాటకం పేరుతో మనిద్దరినీ చితక్కొట్టారని రాహుల్, రుద్రాణిలు బయటికొచ్చి విలవిలలాడిపోతారు. ఆయిల్ లేకుండా బాడీ మసాజ్ చేశారని, నీ వల్లే ఇంట్లో వాళ్లంతా చితక్కొట్టారని రుద్రాణిపై మండిపడతాడు రాహుల్.

నువ్వేం బాధపడొద్దు.. వాళ్లని ఎలా దెబ్బ కొట్టాలో అలాగే కొడతానని అంటుంది రుద్రాణి. నువ్వు మళ్లీ మళ్లీ వాళ్ల జోలికి వెళితే.. ఈసారి దెబ్బలు కాకుండా మన అస్థిపంజరాలే మిగులుతాయని అంటాడు రాహుల్. అప్పుడు మనం నిలబడటానికి కాదు కదా? దిష్టిబొమ్మల్లా వేలాడదీయడానికి కూడా పనికిరామని చెబుతాడు. కావ్య- రాజ్ చేస్తున్న ప్లాన్స్ ఫెయిల్ అయ్యేలా ఎలా ప్లాన్ చేస్తానో చూడు అని అంటుంది రుద్రాణి. అలాంటివేవీ జరగవని వదిలేయమని చెబుతాడు రాహుల్.

వెంటనే యామినికి ఫోన్ చేసి అప్పూని బయటికి తీసుకురావడానికి రాజ్- కావ్య ప్లాన్ చేస్తున్నారని చెప్పడంతో యామిని షాక్ అవుతుంది. నువ్వేదో గొప్పగా ప్లాన్ చేశావని అనుకుంటే ఇంత సింపుల్‌గా చేశావేంటీ అని రుద్రాని మండిపడుతుంది. నువ్వు ఎలా చేస్తావో? ఏం చేస్తావో? నీ ఇష్టం కానీ ఆ శీనుగాడు మాత్రం రాజ్- కావ్యలకి దొరక్కూడదని చెబుతుంది. వాడు కానీ దొరికాడంటే అప్పూ జైలుకు వెళ్లడం ఏమో కానీ నువ్వు మాత్రం ఇరుక్కుంటావని యామినికి వార్నింగ్ ఇస్తుంది రుద్రాణి. అప్పూకి శిక్ష పడాలన్నా? రాజ్ నీకు దక్కాలన్నా? వాళ్లకి సాక్ష్యం దొరక్కూడదని చెబుతుంది రుద్రాణి.

రుద్రాణి మాటలతో భయపడ్డ యామిని వెంటనే శీనుగాడికి ఫోన్ చేస్తుంది. కోర్టులో అప్పూకి శిక్ష పడేంత వరకు నువ్వు మీ ఇంట్లో ఉండొద్దని.. నానక్‌రామ్ గూడాలో నా మనిషి రంగా అని ఉంటాడని వాడి దగ్గరికి వెళ్లిపోమని చెబుతుంది యామిని. దాంతో శీనుగాడు సరేనని వెంటనే అక్కడికి వెళ్తానని అంటాడు. ఫోన్ పెట్టేసి వెనక్కి తిరిగి చూసేసరికి రేవతి ఉండటంతో శీనుగాడు షాక్ అవుతాడు. ఫ్రెండ్ ఫోన్ చేసి అర్జెంట్‌గా రమ్మన్నాడని ఆ కంగారులో ఉన్నానని చెబుతాడు శీనుగాడు.

ఇంట్లో ఎవ్వరూ లేకపోవడంతో తాను అర్జెంట్‌గా వెళ్లాలని కంగారుపడుతుంది ఇందిర. ఇంతలో స్వప్న వచ్చి అంత హడావుడిగా వెళ్తున్నారని అడుగుతుంది. ఆ వెంటనే అపర్ణ వచ్చి ఎక్కడికి వెళ్తున్నారో చెప్పకపోతే ఎలా? ప్రశ్నిస్తుంది. కాశీకి వెళ్తున్నాను.. తెలుసుకుని ఏం చేస్తావ్? నువ్వు కూడా వస్తావా? అని మండిపడుతుంది ఇందిర. మీరు రమ్మంటే ఎక్కడికైనా వస్తానని చెబుతుంది అపర్ణ. పనిమీద వెళ్తున్న నన్ను ఆపడమే కాకుండా అడ్డదిడ్డమైన ప్రశ్నలు వేస్తూ నా టైం వేస్ట్ చేస్తారేంటీ అని ఫైర్ అవుతుంది. నేను కూడా బయటికి వెళ్తున్నానని.. ఎక్కడికి వెళ్లాలో చెబితే మధ్యలో మిమ్మల్ని దించేస్తానని చెబుతుంది అపర్ణ. నీ కారులో నువ్వు వెళ్లు.. నా కారులో నేను వెళ్తానని అంటుంది ఇందిర. అనవసరంగా రెండు కార్లు బయటికి తీయడం ఎందుకు? డబ్బు వృథా అని చెబుతుంది అపర్ణ. ఎలాగొలా వాళ్లని తప్పించుకుని బయటపడుతుంది ఇందిర.

కావ్య, రాజ్‌లు శీనుగాడిని వెతుక్కుంటూ రెహమత్‌నగర్ బయల్దేరతారు. ఆ శీనుగాడిని అడ్డం పెట్టుకుని అప్పూని కావాలనే ఇరికించారని అనిపిస్తోందని చెబుతాడు రాజ్. మీ అనుమానం కరెక్టే ఇదంతా చేసింది ఆ యామినియేనని మనసులో అనుకుంటుంది కావ్య. అప్పూకి ఎవరైనా శత్రువులు ఉన్నారా? అని కావ్యని అడుగుతాడు రాజ్. అప్పూ మీద ఎవరైనా పగ తీర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నవారు ఎవరైనా ఉన్నారా? అడుగుతాడు. తన శత్రువుల గురించి నాకు తెలియదని, స్టేషన్ విషయాలు అప్పూ నాకు చెప్పదని అంటుంది కావ్య. ఆ శీనుగాడు ఎక్కడున్నా వాడిని పట్టుకుందామని, అప్పూ ఏ తప్పు చేయలేదని వాడితో సాక్ష్యం చెప్పిద్దామని అంటాడు రాజ్.

ఇంతలో శీనుగాడి బైక్‌ని రాజ్ గుద్ధబోతాడు. కారును పక్కకి తిప్పడంతో శీనుగాడు కిందపడిపోతాడు. ఎక్కడ చూసి డ్రైవింగ్ చేస్తున్నావ్? కొంచెం ఉంటే నా బైక్‌ని గుద్దేసేవాడివని రాజ్‌తో శీనుగాడు గొడవకి దిగుతాడు. నువ్వు రాంగ్ రూట్‌లో వచ్చి నాతో గొడవ పడతావేంటీ అని మండిపడతాడు రాజ్. మీరు మా రేవతి అక్కవాళ్లింటికి వచ్చిన బంధువులు కదా అని గుర్తుపట్టిన శీనుగాడు.. వాళ్లకి క్షమాపణలు చెబుతాడు. మీరు ఇలా అందరితో గొడవపడితే ఆ శీనుగాడు పారిపోతాడని రాజ్‌పై కోప్పడుతుంది కావ్య. ఇంతలో ఇందిర కారులో ఓ చోటికి వచ్చి ఆగుతుంది. ఆమె నేరుగా రేవతి ఇంటికి రావడంతో నానమ్మని చూడగానే రేవతి హత్తుకుంటుంది.

నువ్వు దూరంగా ఉన్నావనే బాధతో బతుకుతున్నానని.. మీ అమ్మ మనసు మార్చలేనని అంటుంది ఇందిర. నీ మీద అపర్ణకి కోపం తగ్గలేదని, ఎన్నోసార్లు నీ ప్రస్తావన తీసుకొచ్చానని .. నువ్వు ద్రోహం చేశావన్న బాధను దాటి బయటికి రాలేకపోతోందని చెబుతుంది. నేను ఆ రోజు ఆ నిర్ణయం తీసుకోకుండా ఉండి ఉంటే మీ మనవరాలు మహారాణిలా ఆ ఇంట్లో సంతోషంగా ఉండేదని అంటాడు రేవతి భర్త. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X