Brahmamudi July 14th Episode: కళ్లు తెరిచిన రాజ్.. బావ కోసం ఇందూ కంటతడి, కరగని చలపతి మనసు

Photo Courtesy: JioHotstar

ఈరోజు మీ అమ్మని చూడబోతున్నావని లక్కీకి చెబుతాడు రాజ్.. మా అమ్మ ఎలా ఉంటుంది? ఎక్కడ ఉంటుందని లక్కీ ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తుండటంతో సాయంత్రం వరకు వెయిట్ చేయమని చెబుతాడు రాజ్. ఆ వెంటనే రేఖకి ఫోన్ చేసి లక్కీకి తల్లినని ఒప్పుకుంటావా? లేక నేనే వచ్చి అందరి ముందు నిజం చెప్పానా అని బెదిరిస్తాడు. ఆ మాటలు విన్న రేఖ షాక్ అవుతుంది. ఇంతలో భ్రమరాంబ, ఐశ్వర్య వచ్చి నీకు ఏమైంది? ఎందుకంత పరధ్యానంలో ఉంటున్నావు? ఆ రాజ్ గాడే ప్లాన్ చేసి మరి నందూని మనింటిలోకి పంపించాడు. ఈ ఇంటికి దూరంగా ఉంటున్నా నిన్ను దెబ్బకొట్టాడని ఫైర్ అవుతుంది.

దాంతో రాజ్ కథ ఈరోజుతో ముగించేస్తున్నానని, దానికి ఏర్పాట్లు చేశానని రేఖ చెబుతుంది. ఈ మాటలన్నీ విన్న స్వాతి వెంటనే ఈ విషయం ఇందూకి చెబుతుంది. రాజ్‌ని ఎలాగైనా కాపాడుకోవాలని అతను ఫోన్ ఎత్తకపోవడంతో వెంటనే రాజ్ తల్లిదండ్రులకు ఫోన్ చేసి చెప్పడంతో వారిద్దరూ కంగారుపడతారు. రాజ్‌ను వెంటాడుతున్న రేఖ మనిషి కారుతో గుద్దేయడంతో అతను కిందపడిపోతాడు. ఆసుపత్రిలో చావుబతుకుల మధ్యలో ఉన్న రాజ్‌ని చూసి కంటతడి పెడతారు ఇందూ, లక్ష్మీ, చలపతి. వాడు నీ మొగుడు అయినందుకే ఆ రేఖ చంపాలని అనుకుంది. అదే దుగ్గిరాల వారసుడని తెలిస్తే అస్సలు బతకనివ్వదని చలపతి అనడంతో ఇందూ షాక్ అవుతుంది. వాడు మీ నాన్నగారి అక్క కొడుకు, నీకు స్వయానా బావ అని చలపతి నిజం చెప్పేస్తాడు. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. ఇక జూలై 14వ తేదీ ఎపిసోడ్ 1084లో ఇంకా ఏం జరిగిందంటే?

Brahmamudi Serial July 14th 2026 Episode 1084 Here is Today s full story

Photo Courtesy: JioHotstar

వాడు ప్రాణాలతో ఉండాలంటే నీ ప్రేమను చంపేసుకోవాలి, నువ్వు వాడి జీవితంలో నుంచి తప్పుకోమని ఇందూ కాళ్లపై పడతాడు చలపతి. దాంతో ఇందూ బాధతో వెళ్లిపోతుంది. కిచెన్‌లో వంట చేసుకుంటున్న అపర్ణ దగ్గరికి రేఖ వచ్చి .. మీ మనవడు కానీ మనవడు ఆ రాజ్ గాడు ఇంట్లో నుంచి వెళ్లిపోయినా హాయిగా ఉన్నావా? అని అడుగుతుంది. మీకు వాడి మీద చాలా కాన్ఫిడెన్స్ ఎక్కువ కదా? మీ మహారాణి ఇందూకి వాడు అడ్డుగా నిలబడి కాపాడతాడని ఫీలింగ్ కదా? వాడు దీనిని కాపాడుకోవాలంటే ముందు వాడిని వాడు కాపాడుకోవాలి కదా అని అంటుంది రేఖ. వాడు ఇక ఎప్పటికీ రాడు, రాలేడు. ఈ కుటుంబంలోనే కాదు .. ఈ భూమ్మీదే ఎక్కడా కనిపించడని రేఖ చెప్పడంతో అపర్ణ షాక్ అవుతుంది.

వాడు చూడటానికి నీ కొడుకులా కనిపిస్తాడని కదా అంత ప్రేమ కురిపిస్తున్నావు? నీ అసలు కొడుకు లాగే వీడు కూడా అంతర్ధానమైపోతాడని చెబుతుంది రేఖ. ఎదుటివాళ్ల నాశనం కోరుకుంటే ఏమొస్తుంది నీకు? ఆ నోటితో ఎందుకు అశుభాలు పలుకుతావని మండిపడుతుంది అపర్ణ. మీరు సమూలంగా నాశనమైపోతుంటే నాకు చాలా ఆనందంగా ఉంటుంది. ఆ రాజ్‌గాడు నీకు సపోర్ట్‌గా ఉంటాడని కలలు కనొద్దు. ఆ రాజ్‌గాడు వచ్చాడు, పోయాడు.. ఇక ఇంట్లో వాడు ఒక చరిత్ర మాత్రమేనని చెబుతుంది రేఖ. నీకు మిగిలింది ఒకే ఒక్క ఆప్షన్ వాడిని మరిచిపోవడమేనని అంటుంది. రేఖ మాటలతో అపర్ణ కంగారుపడి రాజ్‌కి ఫోన్ చేయగా స్విచ్ఛాఫ్ వస్తుంది. ఆ వెంటనే ఇందూకి ఫోన్ చేస్తుంది అపర్ణ. అయితే ఇందూ కూడా ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో కంగారుపడుతుంది.

డబ్బులో పుట్టి దరిద్రంలో పెరిగాడు.. విలాసంగా బతకాల్సినవాడు మన చేతిలో పడి కష్టాల్లో బతికాడు. వాడు బతికుంటే చాలు, వాడు అనుకున్నట్లు బిజినెస్‌లు చేస్తాడు.. వాడు బాగుంటే అంతే చాలని చలపతి బాధపడతాడు. డాక్టర్ వచ్చి పేషెంట్ కండీషన్ బాలేదు, తనని బతికించేందుకు మా శాయశక్తులా మేం ప్రయత్నిస్తామని చెబుతాడు. ఆ మాటలు విన్న చలపతి, ఇందూ, లక్ష్మీలు షాక్ అవుతారు. రాజ్‌కి ఏం కాకూడదు.. మీకు ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు ఇస్తానని చెబుతుంది ఇందూ. మా ప్రయత్నం మేం చేస్తాం.. మీరు ధైర్యంగా ఉండండి అని చెబుతాడు డాక్టర్. మా మధ్యలో నువ్వెందుకు ఉన్నావని ఇందూపై మండిపడతాడు చలపతి.

నీ పరీక్షలేంటో నీ లీలలు ఏంటో అర్ధం కావు. ఆ రోజు ఆ యాక్సిడెంట్‌లో నా వాళ్లు నాకు దూరమయ్యారని అనుకున్నా.. కానీ నా కోసం ఒక బంధాన్ని తోడుగా ఉంచావు. కానీ ఆ బంధాన్ని ఎందుకు హాస్పిటల్ బెడ్ మీద ప్రాణాలతో పోరాడేలా చేశావు. మా నానమ్మ తాతయ్య డౌట్ పడుతూనే ఉన్నారు.. తను మా సొంత మనవడు అయ్యుండొచ్చు అని చెబుతూనే ఉన్నారు. కానీ నేనే మనిషిని పోలిన మనుషులు ఉంటారని వదిలేశాను. నా కష్టాలు తీరడానికి నేనే అద్దె మొగుడిగా నా ఇంట్లోకి తీసుకొచ్చాను. కానీ నా బంధాన్ని నాకు దగ్గర చేయాలని, నువ్వే నా బావని పంపించావని ఇప్పుడే అర్ధమైంది. ఇన్నిరోజులుగా నేను ఎన్నో కష్టాలు భరించాను, కానీ నా బావకి ఏమైనా అయితే భరించలేను.. నాకు నా బావ కావాలని దేవుడికి ఏడుస్తూ దండం పెట్టుకుంది ఇందూ.

రేఖ మాటలతో అపర్ణ, సుభాష్‌లు కంగారుపడతారు. రేఖ అలా మాట్లాడటం ఏంటీ? రాజ్ ఫోన్ స్విచ్చాఫ్ రావడం ఏంటీ? ఇందూ కూడా ఫోన్ ఎత్తకపోవడం ఏంటీ? అని సుభాష్ అడుగుతాడు. అసలు ఏం అర్ధం కావడం లేదు.. చాలా కంగారుగా ఉందని అంటుంది అపర్ణ. రాజ్ కోసం ఆసుపత్రిలో పడిగాపులు కాస్తుంటారు ఇందూ, చలపతి, లక్ష్మీ. డాక్టర్ గారు రాజ్ దగ్గరికి వెళ్లారు కదా? ఏం చెబుతారోనని కంగారుగా ఉందని అంటుంది లక్ష్మీ. మీ అబ్బాయికి ప్రమాదం ఏం లేదు.. బాగానే ఉన్నాడని వారం రోజులు రెస్ట్ తీసుకుంటే సరిపోతుందని చెబుతాడు డాక్టర్. తనను వేరే రూమ్‌కి షిప్ట్ చేస్తున్నాం.. స్పృహలోకి వచ్చాక డిశ్చార్జ్ చేస్తామని అంటాడు డాక్టర్.

ఇంకా ఇక్కడే ఎందుకు ఉన్నావు? మీ ఇంటికి వెళ్లిపో.. నా భార్య పర్లేదు అన్నది కాబట్టే నిన్ను ఉండనిచ్చా.. కానీ నువ్వు వెళ్లిపోయే వరకు ఊరుకోనని చెబుతాడు చలపతి. నువ్వు ఇక్కడే ఉంటే వాడి దగ్గరికి వెళ్తావు, వాడితో మాట్లాడతావు.. ఆ తర్వాత ఏం జరుగుతుందో మాకు తెలుసు అని మండిపడతాడు. నువ్వు వాడి భార్యవి, వాడిని ఈ పరిస్ధితుల్లో వదిలి వెళ్లాలంటే చాలా కష్టంగా ఉంటుంది, కానీ తప్పదని అంటుంది లక్ష్మీ. మేం కోపంతోనో, పాపంతోనో నిన్ను వాడికి దూరంగా ఉండమనడం లేదు.. ఇది నీకు కూడా అర్ధమై ఉంటుంది, ఇక నువ్వు వాడి జీవితంలోకి రావొద్దని చెబుతాడు చలపతి.

అయితే అది మాత్రం కుదరదు.. తను నా బావ, నా బావని వదిలి నేను వెళ్లలేను. తను నా బావ అని తెలియక నాకు ఇష్టం లేకపోయినా కేవలం మీకోసమే తనని మీ ఇంటికి పంపించానని చెబుతుంది ఇందూ. ఇప్పుడు తెలిసింది కాబట్టి మీ ఇంటికి తీసుకెళ్తానని అంటావా అని ప్రశ్నిస్తాడు చలపతి. నా బావని నాతో పాటే నా ఇంటికి తీసుకెళ్తానని తేల్చేస్తుంది ఇందూ. అర్ధం చేసుకుంటావని నిజం చెబితే మా వాడిని మాకు కాకుండా చేసేలా ఉన్నావని ఫైర్ అవుతాడు చలపతి. మా బావ మీ ఇంటి దగ్గర ఉన్నాడు కాబట్టే మా రేఖ ఆంటీ అటాక్ చేయించింది, అదే మా ఇంట్లో ఉండుంటే ఇలా జరిగేది కాదని చెబుతుంది ఇందూ. మీ ఇంటికి తీసుకెళ్లే ఏకంగా వాడి ప్రాణాలే తీసేస్తుందేమోనని భయపడుతుంది లక్ష్మీ.

నా బావని నాతో పంపించండి, రాజ్‌ను తెలియకుండానే మా నానమ్మ, తాతయ్య వాళ్ల సొంత మనవడిలా ఫీలైపోతున్నారని చెబుతుంది ఇందూ. మా ఇంట్లో మేం ఓ మూలన తలదాచుకుంటున్నాం, ఎన్నో కష్టాలు పడ్డాం. మా బాధల్ని తీర్చడానికి మా బావని మా ఇంటికి పంపించాడు ఆ దేవుడు. మా నానమ్మ తాతయ్య.. మాకు మగదిక్కు లేదని బాధపడేవారు, ఎప్పుడైతే రాజ్ మా ఇంటికి వచ్చాడో వాళ్లు చాలా సంతోషంగా ఉంటున్నారు. వాడికి ఎప్పుడు ఏమవుతుందోనని ప్రతిరోజూ భయపడుతూ బతకలేం.. వాడు మా దగ్గరే ఉంటాడని చెబుతాడు చలపతి. తను మీ ఇంట్లో ఉంటే మీరే కాపాడుకోలేరు.. మా ఇంట్లో ఉంటే నేను కాపాడుకోగలను అని చెబుతుంది ఇందూ. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X