Brahmamudi 15th July episode: కల్యాణ్ అరెస్ట్.. షాక్‌లో రాజ్, కావ్య

తల్లిదండ్రుల పెళ్లిరోజుని గ్రాండ్ గా జరిపించి ఇంట్లో ఉన్న మనస్పర్ధలు తొలగిపోయేలా చేయాలని ప్లాన్ చేస్తారు రాజ్ దంపతులు. తల్లి చేత తండ్రికి గిఫ్ట్ ఇప్పిస్తారు రాజ్ దంపతులు. అపర్ణ గిఫ్ట్ తీసుకోవడంతో ఎమోషనల్ అవుతాడు సుభాష్ అయితే ఆ చీరని పని మనిషికి ఇచ్చేస్తుంది అపర్ణ. ఇదే విషయం గా భార్యని నిలదీస్తాడు సుభాష్. జీవితంలో మిమ్మల్ని క్షమించలేనంటుంది అపర్ణ. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలెట్‌గా మిగిలాయి. ఇక జులై 15వ తేదీ ఎపిసోడ్ 462లో ఏం జరిగిందంటే..

మీ మామయ్య తప్పు చేయలేదంటున్నావా అంటుంది అపర్ణ. అలా అని అనటం లేదు కానీ ఎన్నాళ్ళని ఇలా మావయ్య గారిని దూరం పెడతారు, ఇంట్లో ఇంతమంది వున్నా మావయ్య ఒంటరిగా ఫీల్ అవుతున్నారు అంటుంది కావ్య. కావ్య ని కోపంగా అక్కడ నుంచి వెళ్లిపోమంటుంది అపర్ణ. కానీ కావ్య వినిపించుకోదు. ధాన్యలక్ష్మి అత్తయ్య ఎన్నిసార్లు తప్పు చేసినా మీరు క్షమించారు కదా మావయ్యని ఎందుకు క్షమించలేకపోతున్నారు అంటుంది కావ్య.

Brahmamudi serial July 15th 2024 Episode of 462 Here is full story

ఒక్క ధాన్యలక్ష్మీ ఏమిటి నువ్వు తప్పు చేయలేదా, మీ అమ్మ తప్పు చేయలేదా, గడప దాటే వరకు అనామిక ఎన్ని తప్పులు చేసింది అయినా నేను ఎవరిని ఏమీ అనలేదు కానీ మీ మామయ్య నా ఆత్మ అభిమానం మీద దెబ్బ కొట్టారు ఆయనని ఎప్పటికీ క్షమించలేను కావ్యతో చెప్పి ఆమెని కోప్పడి అక్కడి నుంచి వెళ్లిపోమని కేకలు వేస్తుంది అపర్ణ. వెళ్ళిపోతాను కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి మీరు కేవలం మావయ్యకి మాత్రమే శిక్ష వేయటం లేదు మిమ్మల్ని మీరు కూడా శిక్షించుకుంటున్నారు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది కావ్య.

మరోవైపు కళ్యాణ్ అప్పుకి ఫోన్ చేస్తూ ఉంటే ఆమె ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో స్వప్నని ఫోన్ అడుగుతాడు కళ్యాణ్. ఇప్పటివరకు జరుగుతున్న గొడవలు చాలు కళ్యాణ్, మీరు కొద్ది రోజులు మాట్లాడుకోకుండా ఉండటమే మంచిది, కొద్దిరోజులు ఆఫీసుకు వెళ్ళు నీ మైండ్ కాస్త సెట్ అవుతుంది అంటుంది స్వప్న. అంతలోనే అక్కడికి రాహుల్ వచ్చి అప్పుతో మాట్లాడితే ఏం పోయింది మాట్లాడనివ్వు అంటాడు.

Brahmamudi serial July 15th 2024 Episode of 462 Here is full story

నీకు, మీ అమ్మకి కాపురాలు కూల్చే సలహాలు తప్పితే మంచి సలహాలు రావా ఏం చేయాలో మాకు తెలుసు నువ్వు వెళ్ళు అని భర్తని కసురుకుంటుంది స్వప్న. కొద్ది రోజులు ఓపిక పడితే సమస్యలన్నీ సర్దుకుంటాయి, అప్పటివరకు ఎలాంటి డెసిషన్ తీసుకోవద్దు అని కళ్యాణ్ కి చెప్పి వచ్చేస్తుంది స్వప్న. రాహుల్ వచ్చేస్తుంటే అతనికి రుద్రాణి ఎదురుపడుతుంది వాళ్లకి ఏం సలహా ఇస్తున్నావు అని కొడుకుని అడుగుతుంది రుద్రాణి. జరిగింది చెప్తాడు రాహుల్.

నీకేమైనా మతిపోయిందా ఇప్పుడు కళ్యాణ్ డిప్రెషన్ లో ఉన్నాడు ఈ సమయంలో వాడికి ఆ అప్పు తోడైందంటే పెళ్లి చేసుకుంటానంటాడు అప్పుడు నష్టపోయేది మనమే అంటుంది రుద్రాణి. మనకేం నష్టం అంటాడు రాహుల్. కామ్ గా ఉన్న కావ్య తోనే మనం గెలవలేక పోతున్నాము అలాంటి కావ్యకి అప్పు తోడైందంటే మనం చేతులు ముడుచుకొని కూర్చోవాల్సిందే. కావ్య కాస్త ఆలోచిస్తుంది కానీ అప్పు మాత్రం బుల్డోజర్ లాంటిది గుద్దుకొని వెళ్ళిపోతుంది అంటుంది రుద్రాణి.

ఒకవేళ కళ్యాణ్ అప్పుని పెళ్లి చేసుకుంటానంటే ఏం చేస్తావు అంటాడు రాహుల్. అప్పుడు ధాన్యలక్ష్మి ని అడ్డం పెట్టుకొని నేను చేయాలనుకున్నది చేస్తాను అంటుంది రుద్రాణి. మరోవైపు తల్లిదండ్రుల కాపురం గురించి బాధపడతాడు రాజ్. మన కాపురం ఏదో బాగున్నట్టు మనం వేరే వాళ్ల కాపురం గురించి ఆలోచిస్తున్నాం అని వెటకారంగా అంటుంది కావ్య. అంత లో ఏదో గుర్తొచ్చినట్లుగా శోభనం రోజు ఏదో చెప్పాలనుకున్నారు ఏంటది అంటుంది కావ్య.

Brahmamudi serial July 15th 2024 Episode of 462 Here is full story

రాజ్ తన మనసులో మాట చెప్పాలనుకునే లోపే వాష్ రూమ్ కి వెళ్లి వచ్చిన కావ్య నీరసం గా ఉంది అని చెప్పి పడుకుండిపోతుంది. నీ బ్రతికింతే నువ్వు ఎప్పటికీ నీ మనసులో మాట చెప్పలేవు అని రాజ్ ఆత్మ రాజ్ కి చివాట్లు పెడుతుంది. మరోవైపు బంటి, అప్పు కూరగాయలు తీసుకుని వస్తూ ఉండగా దారిలో ఆకతాయిలు అప్పు గురించి తప్పుగా మాట్లాడుతారు. ఆ మాటలు భరించలేని అప్పు ఒకడి చెంప పగలగొడుతుంది.

వాడి తలకి పెద్ద గాయం అవ్వడంతో అప్పు ని పోలీసులు అరెస్టు చేస్తారు. ఈ విషయం బంటి కళ్యాణ్ కి ఫోన్ చేసి చెప్తాడు. ఇప్పుడే వస్తున్నాను అంటూ బయలుదేరిన కళ్యాణ్ ని ఎక్కడికి వెళ్తున్నావు మళ్లీ ఆ అప్పు దగ్గరికేనా అని అడుగుతుంది ధాన్యలక్ష్మి. అప్పు దగ్గరికి అంటే అమ్మ రాద్ధాంతం చేస్తుంది, వెళ్ళనివ్వదు అని మనసులో అనుకొని లేదు ఫ్రెండ్ దగ్గరికి వెళ్తున్నాను అని అబద్ధం చెప్పి వెళ్ళిపోతాడు కళ్యాణ్.

తరువాయి భాగంలో పోలీస్ స్టేషన్ కి వచ్చిన కళ్యాణ్ కి వాళ్లే అప్పు అక్కని తప్పుగా మాట్లాడారు అని ఆకతాయిలని చూపిస్తాడు బంటి. ఆవేశంతో వాళ్లని కొడతాడు కళ్యాణ్. కళ్యాణ్ ని కూడా పోలీసులు అరెస్టు చేసి రాజ్ కి విషయం చెప్తారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X