Brahmamudi July 15th Episode: రేవతి కొడుకుతో అపర్ణ ఫ్రెండ్‌షిప్.. శీనుని కిడ్నాప్ చేసిన యామిని

Photo Courtesy: JioHotstar

అత్తారింటికి దారేది తరహాలో సీన్ రీక్రియేట్ చేసి రుద్రాణి- రాహుల్‌లను చితక్కొడతారు దుగ్గిరాల ఫ్యామిలీ మెంబర్స్. అప్పూని ఇరికించిన శీనుగాడి అడ్రస్ కనుక్కొని రాజ్- కావ్యలు అక్కడికి బయల్దేరతారు. తమను ఇంట్లో వాళ్లంతా కలిసి కొట్టడంపై రాహుల్- రుద్రాణిలు రగిలిపోతారు. వాళ్లను దెబ్బకొడతానని చెప్పి యామినికి ఫోన్ చేస్తుంది రుద్రాణి. అప్పూని బయటికి తీసుకురావడానికి రాజ్- కావ్యలు ప్లాన్ చేస్తున్నారని చెప్పడంతో యామిని షాక్ అవుతుంది.

ఆ శీనుగాడు దొరికితే నువ్వు ఇరుక్కుంటావని, రాజ్ నీకు దక్కడని చెప్పడంతో యామిని టెన్షన్ పడుతుంది. వెంటనే శీనుగాడికి ఫోన్ చేసి అండర్‌గ్రౌండ్‌కి వెళ్లిపోమని చెబుతుంది. అపర్ణ, స్వప్నలకు దొరక్కుండా రేవతి ఇంటికి వస్తుంది ఇందిర. శీనుగాడుని వెతుక్కుంటూ వెళ్తుండగా రాజ్- కావ్యల కారును అతనే ఢీకొడతాడు. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. ఇక జూలై 15వ తేదీ ఎపిసోడ్ 774లో ఏం జరిగిందంటే?

Brahmamudi Serial July 15th 2025 Episode 774 Here is Today s full story

Photo Courtesy: JioHotstar

రేవతి చాలా మంచిది కాబట్టి నన్ను ఇంకా భరిస్తుందని బాధపడతాడు ఆమె భర్త. నేను మీ కుటుంబానికి చేసిన ద్రోహానికి నా వ్యాపారాలన్నీ దెబ్బతిన్నాయని ఇందిరతో అంటాడు. నన్ను నమ్మి వచ్చినందుకు రేవతికి మిగిలింది ఈ పేదరికమేనని అంటాడు. ఆ మాటలు విన్న రేవతి నన్ను వేరు చేసి మాట్లాడొద్దని అంటుంది. నువ్వు వద్దని చెప్పినా నిజం మారదని, మహారాణిలా ఉండాల్సిన దానివి, నాతో ఇలా కష్టాలు పడుతున్నావని అంటాడు. మీరేం బాధపడొద్దని త్వరలోనే అన్ని సమస్యలు తీరిపోతాయని, వాళ్ల కోపం పోగొట్టి మిమ్మల్ని మళ్లీ ఆ ఇంటికి తీసుకెళ్తానని చెబుతుంది ఇందిర. ఈ జన్మకి అమ్మ నన్ను క్షమిస్తుందన్న నమ్మకం నాకు లేదని అంటుంది రేవతి. అప్పటి వరకు మీరు సంతోషంగా ఉండాలి కదా అని డబ్బులు తీసి ఇవ్వబోతుంది ఇందిర.

నాకు డబ్బులు అక్కర్లేదని నేను కోల్పోయిన బంధం, దూరమైన మనుషులు కావాలని అంటుంది రేవతి. ఆయన తిండికి, గుడ్డకి ఏ రోజూ లోటు చేయలేదని చెబుతుంది. నేను తప్పు చేశాను, కాబట్టి శిక్ష అనుభవిస్తున్నానని, ఇది నా తలరాత అని సర్దుకుంటున్నానని అంటుంది రేవతి. కానీ నా బాధంతా నా కొడుకు గురించే.. వాడికి ఒక అమ్మమ్మ, తాతయ్య పెద్ద కుటుంబమే ఉందని కానీ ఎవరూ లేనివాడిలా బతుకుతున్నాడని బాధపడుతుంది. వాళ్లు నన్ను క్షమించకపోయినా పర్లేదని, కానీ వాళ్ల అమ్మమ్మ దగ్గరికి తీసుకుంటే చాలని అంటుంది రేవతి. ఆ రోజు ఎంతో దూరంలో లేదని చెబుతుంది ఇందిర. నా మునిమనుమడు ఎక్కడ అని ఇందిర అడగ్గా.. స్కూల్‌కి వెళ్లాడని ఈపాటికి వచ్చేస్తాడని అంటుంది రేవతి.

అపర్ణ కారు డోర్‌ను చూసుకోకుండా తీయడంతో అది ఓ బాబుకి తగిలి కిందపడిపోతాడు. దీంతో ఆ చిన్నారిని పైకి లేపి చూసుకోలేదని చెబుతుంది అపర్ణ. ఆ బాబు రేవతి కొడుకు. సారీ చెబితే కిందపడిపోయిన ఐస్‌క్రీమ్ తిరిగి నా చేతుల్లోకి వస్తుందా అని అడుగుతాడు ఆ బాబు. మరి ఏం చేయాలి? పడిపోయిన ఐస్‌క్రీమ్‌కు డబ్బులు ఇవ్వమంటావా? అని అడుగుతుంది అపర్ణ. తెలియనివాళ్ల దగ్గర డబ్బులు తీసుకోవడం తప్పని మా అమ్మ చెప్పిందని అంటాడు బాబు. అయితే ఐస్‌క్రీమ్ నేనే కొనిపిస్తానని చెబుతుంది అపర్ణ. ఒక ఐస్‌క్రీమ్ కొనిస్తే కిందపడిపోయిన దానికి సరిపోతుంది, మీరు చేసిన తప్పుకి లెక్క సరిపోదని అంటాడు చిన్నారి.

ఆ బాబు మాటలతో ముచ్చటపడ్డ అపర్ణ.. నీ పేరేంటీ అని అడగ్గా, ఆ బాబు రాజ్.. స్వరాజ్ అని చెబుతాడు. నా కొడుకు పేరు కూడా అదేనని అపర్ణ అనడంతో .. మీ కొడుకు పేరు నేను పెట్టుకున్నానా అని ప్రశ్నిస్తాడు బాబు. మొత్తం రెండు ఐస్‌క్రీమ్‌లు కొనివ్వాలని ఇదే మీకు శిక్ష అంటాడు చిన్నారి. ఆ బాబుని తీసుకెళ్లి ఐస్‌క్రీమ్స్ కొనిస్తుంది అపర్ణ. మీ అమ్మ పేరు, నాన్న పేరు చెప్పమని అడగ్గా పిల్లాడికి గుర్తుండదు. మా అమ్మ దగ్గరికి వెళ్లి రెండు ఐస్‌క్రీమ్‌లు తిన్నానని కంప్లయంట్ ఇస్తారా అని మండిపడతాడు. నిన్ను ఇంటి దగ్గర దించేస్తానని అపర్ణ చెప్పగా.. నా దారిన నేను వెళ్తా, మీ దారిన మీరు వెళ్లండి అని అంటాడు చిన్నారి.

పిల్లాడిని ముద్దుపెట్టుకుని మురిసిపోతుంది అపర్ణ. మనిద్దరం ఫ్రెండ్స్ అని రోజూ ఇక్కడే కలుద్దామని చెబుతాడు చిన్నారి. ఆరోజు నేను చేసిన తప్పు నా కొడుకుని ఒంటరి వాడిని చేసిందని బాధపడుతుంది రేవతి. ఇంట్లో ఎవరికి తెలియకుండా వచ్చానని ఇక బయల్దేరతానని ఇందిర చెబుతుండగా రాజ్- కావ్యలు వచ్చి తలుపు కొట్టడంతో రేవతి, ఇందిరలు టెన్షన్ పడతారు. ఇందిరను లోపల దాచేసి బయటికొచ్చి మాట్లాడుతుంది. ఎందుకలా కంగారు పడుతున్నావని అడుగుతారు రాజ్- కావ్య. మాకు ఓ అడ్రస్ కావాలని రాజ్ చెబుతాడు. మా అప్పూని ఎవరో కావాలని లంచం తీసుకుంటున్నట్లు ఏసీబీ కేసులో ఇరికించారని మొత్తం చెబుతుంది కావ్య.

ఎవరో శీను అనే వ్యక్తే ఇదంతా చేశాడని, వాడు ఈ బస్తీలోనే ఉంటాడని చెప్పిందని అంటాడు రాజ్. అడ్రస్ చూపించడంతో రేవతి షాక్ అవుతుంది. మీరు ఆరోజున వచ్చినప్పుడు మీ బంధువులా అని అడిగిన వ్యక్తి శ్రీనుగాడు అని అంటుంది రేవతి. దాంతో తమ కారును ఢీకొట్టింది వాడేనని గుర్తుచేసుకుంటారు రాజ్- కావ్య. మా ఇద్దరికి వాడు ఎదురుపడినా కావాలని వదిలేశామని అనుకుంటారు. వాడి ఇంటికి రాజ్- కావ్యలను తీసుకెళ్లి నీ కొడుకు ఎక్కడ అని నిలదీస్తుంది రేవతి. ఏం జరిగిందని శీను తల్లి అడగటంతో జరిగినదంతా కావ్య చెబుతుంది. శీనుగాడి వల్ల మా అప్పూ జీవితం నాశనమైపోతుందని అంటాడు రాజ్. మా అప్పూ కనుక బయటికి వచ్చిందంటే మీ అబ్బాయిని జీవితాంతం జైళ్లోనే ఉండేలా చేస్తుందని కావ్య హెచ్చరించడంతో శీనుగాడి తల్లి వణికిపోతుంది.

యామిని మనిషికి దగ్గరికి వెళ్లిన శీనుగాడికి తల్లి ఫోన్ చేయగా.. మీ అబ్బాయిని కిడ్నాప్ చేశామని, ఇక ఫోన్ చేయొద్దని వార్నింగ్ ఇస్తాడు యామిని మనిషి. ఆ మాటలతో శీనుగాడు షాక్ అవుతాడు. నా కొడుకుని ఎవరో కిడ్నాప్ చేశారని చెప్పడంతో రాజ్- కావ్య కంగారు పడతారు. రేవతి భర్తకి జాగ్రత్తలు చెప్పి ఇందిర వెళ్లబోతుండగా రాజ్ చూస్తాడు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X