Brahmamudi July 15th Episode: రాజ్- ఇందూలని కలిపిన చలపతి... రేఖ గతంపై భ్రమరాంబలో అనుమానం
Photo Courtesy: JioHotstar
వాడు ప్రాణాలతో ఉండాలంటే నీ ప్రేమను చంపేసుకోవాలి. నువ్వు వాడి జీవితంలో నుంచి తప్పుకోమని ఇందూకి చెబుతాడు చలపతి. మీ మనవడు వస్తాడు.. మమ్మల్ని ఉద్దరిస్తాడని కలలు కంటున్నావా? వాడు ఇక ఎప్పటికీ తిరిగిరాడని రేఖ చెప్పడంతో ఏం జరిగిందోనని అపర్ణ కంగారుపడి రాజ్, ఇందూలకి ఫోన్ చేస్తుంది, కానీ ఎవ్వరూ ఫోన్ తీయరు. నా కొడుకు ప్రాణాలతో ఉండి, మా కళ్ల ముందే ఉంటే చాలు వాడి బిజినెస్‌లు చేయొద్దని ఏడుస్తాడు చలపతి. మా మధ్యలో నువ్వు ఉండొద్దు వెళ్లిపోమని ఇందూని కసురుకుంటాడు. అయితే ఆ అమ్మాయిని కూడా ఇక్కడే ఉండనివ్వండి అని నచ్చచెబుతుంది లక్ష్మీ.
రాజ్‌ని బతికించమంటూ దేవుడి ముందు ఏడుస్తుంది ఇందూ. నా బావకి ఏమైనా అయితే నేను భరించలేను, నాకు నా బావ కావాలని చెబుతుంది. రేఖ మాటలతో అపర్ణ, సుభాష్‌లు కంగారుపడతారు. రాజ్‌కి ఏం జరిగింది? ఇందూ ఎందుకు ఫోన్ లిఫ్ట్ చేయడం లేదని ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. రాజ్ స్పృహలోకి రావడంతో చలపతి, ఇందూ, లక్ష్మీలు సంతోషిస్తారు. ఇకపై నువ్వు వాడి జీవితంలో ఉండొద్దు, వాడి మీద నీ ప్రేమను చంపేసుకోమని చెబుతాడు చలపతి. అది మాత్రం మా బావని మా ఇంటికి తీసుకెళ్తాను, అక్కడైతేనే రాజ్ సేఫ్‌గా ఉంటాడని చెబుతుంది ఇందూ. కానీ చలపతి, లక్ష్మీలు మాత్రం ససేమీరా అంటారు. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. ఇక జూలై 15వ తేదీ ఎపిసోడ్ 1085లో ఇంకా ఏం జరిగిందంటే?

Photo Courtesy: JioHotstar
మా బావ మా ఇంట్లో ఉంటేనే నేను కాపాడుకోగలగుతాను ఒప్పుకోండి అని బతిమలాడుతుంది ఇందూ. నువ్వు చెప్పింది కూడా నిజమే కానీ అని టెన్షన్ పడతాడు చలపతి. మా బావని కంటికి రెప్పలా చూసుకుంటాను.. మా బావని నాతో పంపించమని చలపతి కాళ్లపై పడుతుంది ఇందూ. దాంతో తీసుకెళ్లమని చెబుతాడు చలపతి. మాకు కావాల్సింది వాడు ప్రాణాలతో ఉండటం, సంతోషంగా ఉండటం.. అందుకే వాడిని నీతో పంపించడానికి ఒప్పుకుంటున్నానని అంటాడు. కానీ నువ్వు నాకు ఒక మాట ఇవ్వాలి.. రాజు దుగ్గిరాల వారసుడని, మీ బంధువలకు కానీ, మీ ఇంట్లో వాళ్లకి కానీ చెప్పకూడదు. ఈ నిజం ఎప్పటికీ నీ మనసులోనే దాచుకోవాలని మాటివ్వమని అడుగుతాడు చలపతి. దాంతో ఇందూ మాటిస్తుంది. తను దుగ్గిరాల వారసుడని ఎవ్వరికీ చెప్పనని అంటుంది.
రాజ్ కళ్లు తెరవడంతో చూడటానికి వెళ్లి బావ అని పిలవబోతూ ఆగిపోతుంది ఇందూ. ఇన్నిరోజులు నువ్వు నా పక్కనే ఉన్నప్పటికీ నిన్ను గుర్తుపట్టలేకపోయాను. ఇక నిన్ను దూరం చేసుకోనని అనుకుంటుంది ఇందూ. నిన్ను చాలా మాటలు అన్నాను, చాలా బాధపెట్టానని బాధపడతాడు చలపతి. ఇంతలో ఇందూకి అపర్ణ ఫోన్ చేసి రాత్రి ఇంటికి రాలేదు, ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయడం లేదు. ఏం జరిగిందని అడుగుతుంది. ఆ రాజును మరిచిపోండి ఈ భూమ్మీద ఉండడని రేఖ పిచ్చి కూతలు కూస్తోందని అంటుంది అపర్ణ. రాజుకు ఏం కాలేదు.. తను బానే ఉన్నాడు, రాజు దగ్గరే ఉన్నానని చెబుతుంది ఇందూ.
నానమ్మ నీ గురించి చాలా టెన్షన్ పడుతుంది బావ అని ఇందూ పిలవడంతో రాజ్, చలపతి, లక్ష్మీలు షాక్ అవుతారు. భర్తని బావ అని పిలవొచ్చు కదా అని ఇందూ కవర్ చేస్తుంది. నీకు ఏదో జరిగిందని అమ్మమ్మ కంగారుపడుతోంది. ఇంటికి వెళ్దామని అంటుంది ఇందూ. యాక్సిడెంట్ చేసిన వాడి దగ్గర నుంచి పెనాల్టీ డబ్బులు తీసుకున్నావా లేదా అని తండ్రిని రాజ్ అడగటంతో ఇందూ నవ్వుకుంటుంది. వాడిని మాత్రం వదలొద్దని చెబుతాడు రాజ్. మేం మా ఇంటికి వెళ్తాం.. నువ్వు మీ ఇంటికి వెళ్లమని రాజ్ అంటాడు. తను ఒక్కతే కాదు.. నువ్వు కూడా అత్తారింటికి వెళ్లమని చెబుతాడు చలపతి.
దాంతో రాజ్ సంతోషిస్తాడు. ఏదో ఒకరోజు నువ్వే నన్ను వెళ్లమని అంటావని నాకు తెలుసు.. ఇప్పుడు అదే జరిగిందని అంటాడు. ఆ ఇంటికి వెళ్లొద్దని చెప్పావు.. నీ మనసెలా కరిగిందని రాజ్ ప్రశ్నిస్తాడు. ఈ అమ్మాయిని చూసినరోజే మనింటి కోడలు కావాలని అనుకున్నాం.. నిన్న నీకిలా జరిగిన తర్వాత తనకు నీ మీదున్న ప్రేమ చూశాకా నా మనసు కరిగిపోయిందని అంటాడు చలపతి. మిమ్మల్ని దూరం చేయడం కరెక్ట్ కాదని అనిపిస్తోందని అంటాడు. నువ్వు వాడిని సంతోషంగా తీసుకెళ్లమని ఇందూకి చెబుతాడు చలపతి.
ఉదయాన్నే అందంగా రెడీ అయిన రేఖని చూసి ఎక్కడికి వెళ్తున్నావని అడుగుతుంది భ్రమరాంబ. ఆ రాజ్ గాడు పోయాడు శ్రద్ధాంజలి ఘటించడానికి వెళ్తున్నానని రేఖ చెప్పడంతో భ్రమరాంబ షాక్ అవుతుంది. వాడిని సక్సెస్‌ఫుల్‌గా ఈ లోకం నుంచి పంపించేశానని అంటుంది. అసలు వాడిని ఎందుకు చంపావు అని భ్రమరాంబ ప్రశ్నించగా.. వాడు నాకే వార్నింగ్ ఇస్తూ ముచ్చెమటలు పట్టిస్తాడా? అని చెప్పబోతుండగా గతం గుర్తొచ్చి ఆగిపోతుంది రేఖ. ఆస్తికి అడ్డొస్తే ఇంకేదో చేయాలి కానీ చంపడం ఏంటీ అని భ్రమరాంబ ప్రశ్నిస్తుంది. ఆ రాజ్ చనిపోయాడు కాబట్టి రాజ్ తల్లిదండ్రులు నీ మీద డౌట్ పడతారు కదా అని భయపడుతుంది. ఇందూని తీసుకుని రాజ్ దగ్గరికి వెళ్దామని భ్రమరాంబకి చెబుతుంది రేఖ.
ఇందూ లేదు.. రాజ్ దగ్గరికి వెళ్లిందని అపర్ణ చెప్పడంతో రేఖ, భ్రమరాంబలు షాక్ అవుతారు. రాజ్‌ని తీసుకుని రావడానికి తనే వెళ్లిందని చెప్పడంతో రేఖ షాక్ అవుతుంది. ముందు ఇందూకి ఫోన్ చేద్దామని చేయగా బిజీ వస్తుంది. దాంతో రౌడీకి ఫోన్ చేసి నిజంగానే వాడు చచ్చాడా లేదా అని అడుగుతుంది రేఖ. మీ గురించి తెలిసి కూడా నేనెందుకు అబద్ధం చెబుతాను, వాడు నిజంగానే చచ్చాడని అంటాడు. రాజ్ గాడు చనిపోతే వాడిని ఇందూ ఇంటికి తీసుకొస్తానని వెళ్లడం ఏంటీ అని భ్రమరాంబ ప్రశ్నిస్తుంది. రాజ్ చచ్చిన వార్త తెలిస్తే అపర్ణ తట్టుకోలేదని ఇందూ ఇలా కవర్ చేస్తుందని చెబుతుంది రేఖ.
మీ అత్తారింటికి వెళ్తావంటే ఇక్కడికి ఎందుకొచ్చావని చలపతి అడుగుతాడు. నేను ఇక్కడే ఉంటాను, ఎక్కడికి వెళ్లను అని చెబుతాడు రాజ్. నువ్వు ఒప్పుకుంటే సరిపోతుందా? నేను ఒప్పుకోవాలి కదా అని రాజ్ అనగా నేను ఒప్పిస్తానని చెబుతుంది ఇందూ. నేను రాను అని చెప్పాను కదా ఎందుకొచ్చావు? నీకు నాకు ఏ బంధం లేదు? నువ్వు మీ ఇంటికెళ్తే నేను ప్రశాంతంగా ఉంటానని అంటాడు రాజ్. భార్యాభర్తలు అన్నాక గొడవలు ఉండవా అని మండిపడుతుంది ఇందూ. నీలో చాలా కలలు ఉన్నాయి.. ఈ అమ్మాయి మెడలో మూడు మళ్లు వేసి ఏ బంధం లేదని అంటావా అని ఫైర్ అవుతాడు చలపతి. దాంతో లక్ష్మీతో గొడవల గురించి బయటపెడతాడు చలపతి. నువ్వు ఇక్కడే ఉన్నా ఇందూ గురించి, వాళ్ల గురించే ఆలోచిస్తుంటావు. అదే తనతో పాటు ఆ ఇంట్లో ఉంటే నువ్వు బాగుంటావని చెబుతుంది లక్ష్మీ. నీ కోసం తను రాత్రంతా కంటి మీద కునుకు లేకుండా గడిపిందని అంటుంది. తనతో మాత్రం ఆ ఇంటికి వెళ్లడం కుదరదని తేల్చేస్తాడు రాజ్. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications