Brahmamudi july 16th episode: ఎస్సై చెంప పగలగొట్టిన రాజ్.. కావ్య కాళ్లు పట్టుకున్న ఆకతాయిలు!
తల్లిదండ్రుల పెళ్లిరోజుని గ్రాండ్ గా జరిపించి ఇంట్లో ఉన్న మనస్పర్ధలు తొలగిపోయేలా చేయాలని ప్లాన్ చేస్తారు రాజ్ దంపతులు. తల్లి చేత తండ్రికి గిఫ్ట్ ఇప్పిస్తారు రాజ్ దంపతులు. అపర్ణ గిఫ్ట్ తీసుకోవడంతో ఎమోషనల్ అవుతాడు సుభాష్ అయితే ఆ చీరని పని మనిషికి ఇచ్చేస్తుంది అపర్ణ. ఇదే విషయం గా భార్యని నిలదీస్తాడు సుభాష్. జీవితంలో మిమ్మల్ని క్షమించలేనంటుంది అపర్ణ. అత్తగారి మనసు మార్చే ప్రయత్నం చేస్తుంది కావ్య. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలెట్‌గా మిగిలాయి. ఇక జులై 16వ తేదీ ఎపిసోడ్ 463లో ఏం జరిగిందంటే..
అప్పుని జైల్లో పెట్టిన ఎస్ఐ ఆకతాయిలని కొట్టినందుకు ఆమెని మందలిస్తాడు. వాళ్ళు నన్ను కామెంట్ చేశారు అంటుంది అప్పు. మాకు కంప్లైంట్ చేయవలసింది, అంతేకానీ ఇలా తలకాయలు కొబ్బరికాయలు కొట్టినట్టు కొట్టేస్తావా అంటూ అప్పు మీద కేకలు వేస్తాడు ఎస్సై. అంతలోనే కళ్యాణ్ స్టేషన్ కి వస్తాడు. బంటి ఆకతాయిలని చూపించి వాళ్లే అక్కని కామెంట్ చేశారు అంటాడు.

కళ్యాణ్ ఆవేశంగా పోలీసుల దగ్గర లాఠీ లాక్కొని వాళ్ళని చితక్కొడతాడు. అప్పుడు కళ్యాణ్ ని కూడా అరెస్టు చేస్తాడు ఎస్సై. నా ఎదురుగానే కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చిన వాళ్ళని ఇలా కొడతావా అసలు ఎందుకు అంత ఆవేశం, నేను ఉన్నప్పుడే ఇలా కొట్టావంటే నేను లేకపోతే ఏం చేసేవాడివో అసలు నిన్ను ఇలా పెంచినందుకు మీ పేరెంట్స్ ని అనాలి మీ పేరెంట్స్ ఫోన్ నెంబర్ ఇవ్వు అని అడుగుతాడు ఎస్ఐ. కళ్యాణ్ రాజ్ ఫోన్ నెంబర్ ఇస్తాడు. అదే సమయంలో రాజ్ కి కాఫీ తీసుకొస్తుంది కావ్య.
ఈ మూడు రోజులు రెస్ట్ తీసుకోవచ్చు కదా ఈ పనులన్నీ నీకెందుకు అంటాడు రాజ్. పెళ్లయిన సంవత్సరానికి తెలిసిందా ఆడవాళ్ల సమస్యల గురించి, కొత్తగా కేరింగ్ చూపిస్తున్నారు ప్రతి నెల ఈ సమస్య నాకు ఉండేదే అంటుంది కావ్య. నీతో ఎలా మాట్లాడినా ప్రమాదమే అంటాడు రాజ్. పోలీస్ స్టేషన్ నుంచి ఎస్ఐ ఫోన్ చేసి మీ అబ్బాయిని అరెస్టు చేశాను అసలు మీ అబ్బాయిని పెంచే విధానం ఇదేనా అంటూ మాట్లాడతాడు.

మీరు ఎవరి గురించి మాట్లాడుతున్నారో నాకు అర్థం అవ్వటం లేదు కరెక్ట్ నెంబర్ కే ఫోన్ చేశారా అంటాడు రాజ్. తప్పు చేసేసరికి మీ అబ్బాయి మీ అబ్బాయి కాకుండా పోతాడా అంటాడు రాజ్. ఇంతకీ అబ్బాయి పేరేంటి అంటాడు రాజ్. నీ కొడుకు పేరు నీకు తెలియదా అంటాడు ఎస్సై. పక్కనే ఉన్న బంటి కళ్యాణ్ అని చెప్పటంతో అదే విషయం రాజ్ కి చెప్తాడు ఎస్ఐ. కళ్యాణ్ ని అరెస్టు చేశారా అని షాక్ అవుతాడు రాజ్.
ఇప్పుడే వస్తున్నాను అంటూ బయలుదేరబోతుంటే నేను వస్తాను అంటుంది కావ్య. నువ్వు ఎందుకు అక్కడికి వచ్చి ఏం చేస్తావు నేనైతే సిచువేషన్ హ్యాండిల్ చేస్తాను అంటూ కావ్య చెప్తున్నా వినిపించుకోకుండా వెళ్ళిపోతాడు రాజ్. అప్పుడే ప్రకాష్ కనిపించి ఏంటి హడావుడి అని అడుగుతాడు. ఏమీ లేదు అని చెప్పి వెళ్ళిపోతాడు రాజ్. అప్పుడు కావ్య ని ఏం జరిగింది అని అడుగుతాడు ప్రకాష్.

కావ్య కూడా అతనికి కల్యాణ్ అరెస్టు అయిన విషయం చెప్పకుండా మాట దాటవేస్తుంది. మరోవైపు పోలీస్ స్టేషన్ కి వెళ్ళిన రాజ్ కళ్యాణ్ ని అరెస్టు చేశారని కోపంలో ఎస్సై పై చేయి చేసుకుంటాడు. కోపంతో రెచ్చిపోయిన ఎస్సై రాజ్ ని కూడా అరెస్టు చేస్తాడు. నేనెవరినో తెలుసా ఇప్పుడే కమిషనర్ తో మాట్లాడుతాను అని ఫోన్ చేయబోతాడు రాజ్ అతని దగ్గర ఫోన్ లాగేసుకుంటారు పోలీసులు. అప్పుడు అప్పు కావ్యకి ఫోన్ చేయమని బంటి కి చెప్పడంతో బంటి కావ్య కి ఫోన్ చేస్తాడు.
స్టేషన్ కి వచ్చిన కావ్య వాళ్లు ముగ్గురు మా వాళ్లే అంటుంది. ఇప్పుడు నువ్వు ఎవరి తల పగలగొడతావు అంటాడు ఎస్సై. వాళ్లు కావాలని తప్పు చేయలేదు అని ఎస్సై కి చెప్తుంది కావ్య. కానీ ఎంత నచ్చి చెప్పినా ఎస్సై వినిపించుకోకపోవడంతో మీరు లక్ష రూపాయలు లంచం తీసుకొని ఇలా మాట్లాడటం ఏమీ బాగోలేదు అంటుంది కావ్య. షాక్ అయిన ఎస్ఐ నేను లంచం తీసుకోవడం ఏమిటి అని కోప్పడతాడు. చూశారా చెయ్యని తప్పుని చేశారు అంటే మీరు ఎంత కోప్పడుతున్నారు అలాగే మా చెల్లిని కూడా చెయ్యని తప్పు చేసింది అని వాళ్ళు అంటే మా చెల్లికి కోపం వచ్చి కొట్టింది.

అయినా వీళ్ళు ఎంత ఎదవలో మీకే నిరూపిస్తాను అంటూ వాళ్ళ దగ్గరికి వెళ్లి మీరు అప్పుని ఏమన్నారు అని అడుగుతుంది కావ్య. ఏమీ అనలేదు అంటారు ఆకతాయిలు. బంటి నువ్వు వాళ్ళు చేసిన కామెంట్స్ ని ఫోన్లో వీడియో తీసావు కదా అది చూపించు అంటుంది కావ్య. ముందు బంటి కన్ఫ్యూజ్ అవుతాడు కానీ కావ్య సైగ చేయడంతో అర్థం చేసుకొని అలాగే అక్క చూపిస్తాను అంటూ జేబులో చేయి పెడతాడు బంటి. భయపడిన ఆకతాయిలు కావ్య కాళ్ళ మీద పడతారు.
తరువాయి భాగంలో గోరింటాకు తీసుకు వచ్చిన కావ్య భర్తని గోరింటాకు పెట్టమంటుంది. ఇప్పుడు ఎందుకు గోరింటాకు అంటాడు రాజ్. ఆషాడ మాసంలో ఆడవాళ్లు గోరింటాకు పెట్టుకుంటే మంచిదంట అని కావ్య అనటంతో ఆమెకి గోరింటాకు పెడతాడు రాజ్.


Click it and Unblock the Notifications











