Brahmamudi July 16th Episode: రాజ్‌కు దొరికిపోయిన ఇందిర.. అప్పూ జీవితాంతం జైళ్లో ఉండేలా యామిని కుట్ర

Photo Courtesy: JioHotstar

నా కోసం కుటుంబాన్ని వదులుకుని రేవతి ఎంతో కష్టపడుతోందని ఇందిర చెప్పుకుని బాధపడతాడు రేవతి భర్త జగదీష్. జీవితంలో అమ్మ నన్ను క్షమించదని, కనీసం నా కొడుకునైనా వాడి అమ్మమ్మ దగ్గరికి చేర్చాలని అనుకుంటున్నానని అంటుంది రేవతి. అపర్ణ కారు డోర్ తగిలి ఓ బాబు కిందపడిపోతాడు. చిన్నారిని పైకి లేపి సారీ చెప్పగా.. నాకు సారీ వద్దు ఐస్‌క్రీమ్ కావాలని బాబు అడగ్గా అపర్ణ షాక్ అవుతుంది. నీ పేరేంటీ అని అడగ్గా స్వరాజ్ అని చిన్నారి చెప్పడం.. ఆ బాబు మాటలకు అపర్ణ మురిసిపోతుంది. మనిద్దరం ఫ్రెండ్స్ అని రోజు ఇక్కడే కలుద్దామని అపర్ణతో బాబు చెబుతాడు.

ఇందిర ఇంటికి బయల్దేరబోతుండగా కావ్య- రాజ్‌లు రేవతి ఇంటికి రావడంతో అంతా షాక్ అవుతారు. పెద్దావిడని లోపల దాచిపెట్టి రేవతి బయటికొచ్చి కావ్య- రాజ్‌లను పలకరిస్తుంది. దాంతో అప్పూకి జరిగిన అన్యాయాన్ని చెబుతుంది కావ్య. శీనుగాడి ఇంటికి వెళ్లి కావ్యను తీసుకెళ్లిన రేవతి వాడి గురించి అడుగుతుంది. మీ అబ్బాయి మా చెల్లెలి జీవితాన్ని నాశనం చేశాడని ఎక్కడున్నారో చెప్పకపోతే అతనే ఇరుక్కుంటాడని కావ్య బెదిరించడంతో శీనుగాడి తల్లి కొడుక్కి ఫోన్ చేస్తుంది. మీ అబ్బాయి కిడ్నాప్ అయ్యాడని ఫోన్ చేయొద్దని చెప్పడంతో ఆమె షాక్ అవుతుంది. రేవతి ఇంటి నుంచి ఇందిర బయటకు రావడాన్ని రాజ్ గమనిస్తాడు. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. ఇక జూలై 16వ తేదీ ఎపిసోడ్ 775లో ఏం జరిగిందంటే?

Brahmamudi Serial July 16th 2025 Episode 775 Here is Today s full story

Photo Courtesy: JioHotstar

మరోసారి శీనుగాడి ఫోన్‌కి కాల్ చేయమని రేవతిని అడుగుతాడు రాజ్. నేను ఆల్రెడీ ఫోన్ చేశానని కానీ స్విచ్ఛాఫ్ వస్తుందని చెబుతుంది రేవతి. అందరూ టెన్షన్ పడుతుండగా రేవతి ఇంట్లో నుంచి ఇందిర బయటకు రావడాన్ని రాజ్ చూసి పట్టుకుంటాడు. మీకు ఈ బస్తీలో పనేంటీ? మీకు తెలిసిన వాళ్లు కూడా ఎవరూ లేరు కదా అని అంటుంది కావ్య. బస్తీలో మనుషులు ఉండరా? వాళ్లతో పని ఉండదా? అని అడుగుతుంది ఇందిర. నాకు వచ్చిన పని అయిపోయింది వెళ్లిపోతున్నానని చెబుతుంది ఇందిర. మీరిద్దరు ఇక్కడికి ఎందుకొచ్చారని అడుగుతుంది.

పిల్లలు అడిగినప్పుడు పెద్దవాళ్లు చెప్పనప్పుడు.. పెద్దవాళ్లు అడిగినప్పుడు పిల్లలు కూడా చెప్పకూడదని అంటాడు రాజ్. అప్పూని ఇరికించిన సాక్షి ఇక్కడే ఉన్నాడని తెలిసి వచ్చామని చెబుతుంది కావ్య. మేం కూడా ఇంటికే వెళ్తున్నామని డ్రాప్ చేస్తామని రాజ్ చెబుతాడు. నాకూ కార్ ఉంది.. మీ కార్‌లో మీరు వెళ్లండి, నా కార్‌లో నేను వెళ్తానని అంటుంది ఇందిర. ఆ శీనుగాడిని పట్టుకుని సాక్ష్యం చెప్పించకపోతే కోర్టులో అప్పూకి శిక్ష పడుతుందని చెబుతుంది కావ్య. ఏదో ఒక ఐడియా ఆలోచిద్దామని కావ్యకు ధైర్యం చెబుతాడు రాజ్.

కావ్య తన చెల్లెల్ని విడిపించుకోవడానికి సాక్ష్యం సంపాదించాలని వెళ్లిందని, కానీ అది కావ్యకి దొరక్కుండా మాయం చేశానని వైదేహితో చెబుతుంది యామిని. ఏం చేయాలో తెలియక ఇంటికి వెళ్లిపోతుంటే నవ్వొస్తుందని అంటుంది. ఈ దెబ్బతో ఆ అప్పూ లైఫ్ ఖతం.. దాంతో జీవితాంతం ఆ కావ్య కుళ్లికుళ్లి ఏడుస్తుందని చెబుతుంది యామిని. ఆ కావ్యని అంత తేలిగ్గా తీసుకోవద్దని ఆమె చాలా తెలివైనదని హెచ్చరిస్తుంది. నీ పెళ్లి ఆపకుండానే ఈ పెళ్లి ఆగిపోతుందని చెప్పిందని, అది చెప్పినట్లుగానే పెళ్లి ఆపేసిందని గుర్తుచేస్తుంది వైదేహి. ఏం చేసైనా సరే అప్పూని కాపాడుకుంటుందని చెబుతుంది. అప్పూని బయటికి తీసుకొచ్చే కీ నా దగ్గర ఉందని , ఆ దేవుడు కూడా అప్పూని కాపాడలేడని అంటుంది యామిని.

సాక్ష్యం కోసం బయటికి వెళ్లిన రాజ్- కావ్యలు ఒట్టి చేతులతో ఇంటికి రావడంతో దుగ్గిరాల కుటుంబం షాక్ అవుతుంది. మీరు వెళ్లిన పని ఏమైంది? ఆ సాక్షిని పట్టుకున్నారా? అని అందరూ అడుగుతారు. ఆ సాక్షి మాకు దొరకలేదని రాజ్ చెప్పడంతో ఫ్యామిలీ మొత్తం ఉలిక్కిపడుతుంది. మరి ఏదో పొడిచేస్తాను.. పీకేస్తాను అని వెళ్లారు? ఏం చేశారని రుద్రాణి నానామాటలు అంటుంది. అప్పూ సేవ్ అయితే చాలని మేం మీ చేతుల్లో దెబ్బలు కూడా తిన్నామని చెబుతాడు రాజ్. ఇప్పుడేం చేస్తారు? రేపు కోర్టులో హియరింగ్ ఉంది.. ఈ లోగా సాక్షి దొరక్కుంటే అప్పూకి శిక్ష పడాల్సిందే అంటుంది రుద్రాణి. మేం సాక్షి ఇంటికి కరెక్ట్ టైంకే వెళ్లామని.. కానీ మేం వెళ్లిన విషయం తెలుసుకుని అతనిని ఎవరో కిడ్నాప్ చేశారని చెబుతుంది కావ్య. ఎన్నిసార్లు తన నెంబర్‌కు కాల్ చేసినా స్విచ్ఛాఫ్ అనే వస్తోందని అంటుంది. ఇక ఈ ఇంటి పరువు గంగార్పణం అని రుద్రాణి అనడంతో ఇందిర మండిపడుతుంది. రేపటి వరకు టైం ఉంది కదా ఏదో ఒకటి ఆలోచిద్దామని అంటుంది కావ్య.

మా అమ్మతో ఎందుకు కిడ్నాప్ అయ్యానని చెప్పావని యామిని మనిషితో అంటాడు శీనుగాడు. ఒకసారి మా అమ్మతో మాట్లాడతానని చెబుతుండగా యామిని వచ్చి కుదరదు అని అంటుంది. నువ్వు మీ అమ్మతో మాట్లాడటం కుదరదని, నువ్వు ఇక్కడి నుంచి వెళ్లడం కూడా కుదరదని చెబుతుంది యామిని. నేను నిజంగా కిడ్నాప్ అవ్వలేదు కదా అని అంటాడు శీనుగాడు. నువ్వు కిడ్నాప్ అవ్వలేదని ఎవరు చెప్పారు అని ప్రశ్నిస్తుంది యామిని. నేను మీ మనిషినే కదా? నన్నెందుకు కిడ్నాప్ చేశారని అడుగుతాడు శీనుగాడు. ఈ రెండ్రోజుల్లో అప్పూకి శిక్షపడే వరకు నువ్వు ఎవ్వరికీ కనిపించకూడదని అంటుంది యామిని. మొన్న కోర్టుకు వెళ్లాలి? అన్నారు.. ఇప్పుడేమో కోర్టుకు వెళ్లోద్దు అంటున్నారు.. నాకేం అర్ధం కావడం లేదని అంటాడు శీనుగాడు.

నువ్వేం టెన్షన్ పడొద్దని అంతా నిదానంగా నీకే అర్ధమవుతుందని చెబుతుంది యామిని. నువ్వు కోర్టుకు వెళ్లి అప్పూ లంచం తీసుకుందని చెబితే ఒక శిక్ష మాత్రమే పడుతుందని అంటుంది. అదే నువ్వు కోర్టుకు వెళ్లకపోతే నిన్ను ఆ అప్పూ వాళ్లే కనిపించకుండా సాక్షిని మాయం చేశారని మన లాయర్ వాదిస్తారని చెబుతుంది యామిని. అప్పుడు జడ్జి గారు అప్పూకి రెండు శిక్షలు విధిస్తారని అంటుంది. నిన్ను ఏం చేయమని , రెండ్రోజులు కనిపించకుండా ఉంటే చాలని శీనుతో చెబుతుంది యామిని. ఊరికే ఏమీ ఉండొద్దని నీకు రెండు లక్షలు ఎక్స్‌ట్రా ఇస్తామని చెబుతుంది యామిని.

రేవతిని అపర్ణతో ఎలా కలపాలా? అని దేవుడితో చెప్పుకుని బాధపడుతుంది ఇందిర. ఇది చూసిన కావ్య ఏం జరుగుతుందని అడుగుతుంది. మీరు నా దగ్గర ఏదో దాస్తున్నారని అనుమానం వ్యక్తం చేస్తుంది కావ్య. రేవతి గారి ఇంట్లో దాక్కున్న మిమ్మల్ని నేను చూశానని కావ్య చెప్పడంతో ఇందిర షాక్ అవుతుంది. ఏదో బలమైన కారణం వల్లే మీరు అక్కడికి వచ్చారని నాకు అర్ధమైందని అంటుంది. ఆ రేవతి ఎవరు? ఆ ఇంటికి ఈ ఇంటికి ఏంటీ సంబంధం అని ప్రశ్నిస్తుంది కావ్య. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X