Brahmamudi July 16th Episode: లక్కీకి తల్లినని ఒప్పుకో.. రేఖకి రాజ్ డెడ్‌లైన్, ఐశ్వర్య చేతిలో అపర్ణకి అవమానం
Photo Courtesy: JioHotstar
మా ఇంట్లో ఉంటేనే మా బావని నేను కాపాడుకోగలను.. ఆయనని నాతో పంపండి అని చలపతి కాళ్ల మీద పడుతుంది ఇందూ. దాంతో చలపతి మనసు కరిగిపోతుంది. మాకు కావాల్సింది వాడు ప్రాణాలతో ఉండటం, సంతోషంగా ఉండటం అది మీ ఇంట్లోనే జరిగితే అక్కడికే తీసుకెళ్లమని అంటాడు చలపతి. కానీ రాజ్ దుగ్గిరాల వారసుడని మీ ఇంట్లో వాళ్లకి కానీ, బంధువులకు కానీ ఎప్పటికీ నిజం చెప్పకూడదని మాట ఇవ్వమని అడుగుతాడు. దానికి అంగీకరిస్తూ చలపతికి మాటిస్తుంది ఇందూ. రాజ్ స్పృహలోకి రావడంతో చూడటానికి వెళ్లి బావ అని పిలుస్తుంది.. దాంతో రాజ్, చలపతి, లక్ష్మీలు షాక్ అవుతారు.
భర్తని బావ అని పిలవొచ్చు కదా అని ఇందూ కవర్ చేస్తుంది. మేం మా ఇంటికి వెళ్తాం.. నువ్వు మీ అత్తారింటికి వెళ్లమని చలపతి చెప్పడంతో రాజ్ షాక్ అవుతాడు. నీకు యాక్సిడెంట్ జరిగి ఏమవుతుందోనని ఈ అమ్మాయికి రాత్రంతా కునుకు లేదు.. దానికి మా మనసు కరిగిపోయింది. వాడిని సంతోషంగా ఇంటికి తీసుకెళ్లమని ఇందూకి చెబుతాడు. అందంగా ముస్తాబవున్న రేఖ దగ్గరికి భ్రమరాంబ వచ్చి ఎక్కడికి వెళ్తున్నావని అడగ్గా ఆ రాజ్ గాడిని చంపించేశాను, శ్రద్ధాంజలి ఘటించడానికి వాడి ఇంటికి వెళ్తున్నానని చెబుతుంది రేఖ. ఆ మాటలతో భ్రమరాంబ షాక్ అవుతుంది. అత్తారింటికి వెళ్లకుండా మా ఇంట్లో ఎందుకు ఉన్నావని రాజ్‌పై మండిపడతాడు చలపతి. నువ్వు ఒప్పుకుంటే సరిపోతుందా? నేను ఒప్పుకోవాలి కదా అని అంటాడు రాజ్. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. ఇక జూలై 16వ తేదీ ఎపిసోడ్ 1086లో ఇంకా ఏం జరిగిందంటే?

Photo Courtesy: JioHotstar
ఎవరెన్ని చెప్పినా సరే నా మనసు మారదు.. ఇక తమరు వెళ్లొచ్చు అని ఇందూపై మండిపడతాడు రాజ్. ఆ అమ్మాయిని పంపేయండి అని చలపతిని అడగ్గా.. మేం తనని పంపించలేను, తను నీ భార్య, ఈ ఇంటి కోడలు. ఈ ఇంట్లో ఉండటానికి నీకెంత అధికారం ఉందో, తనకు కూడా అంతే హక్కు ఉంది. భార్యాభర్తలే తేల్చుకుంటారని లక్ష్మీని తీసుకుని వెళ్లిపోతాడు చలపతి. నువ్వు ఏదైనా అనుకుంటే అది సాధించే వరకు వదిలిపెట్టవు కదా? అని ఇందూపై మండిపడతాడు. మరెందుకు ఆలస్యం నాతో పాటు వచ్చేయమని అడుగుతుంది ఇందూ. రాజు కోపంగా వెళ్లిపోతూ కిందపడిపోబోతుండటంతో ఇందూ పట్టుకుంటుంది. ఇంతలో రేఖ అక్కడికి రావడంతో ఇద్దరూ షాక్ అవుతారు.
రాజ్ ప్రాణాలతో బతికే ఉండటం చూసి రేఖ అవాక్కవుతుంది. ఈ రాజ్ గాడిని చంపకుండా వాడు సగం సగం పనులు చేశాడని రౌడీపై రగిలిపోతుంది. నీకు యాక్సిడెంట్ జరిగిందని ఇప్పుడే తెలిసింది.. నీకెలా ఉందని అడుగుతుంది. బాగానే ఉన్నాను.. ఎవరో నా ప్రాణాలు తీసేయాలని బాగా ట్రై చేశారు. కానీ మనది గట్టి పిండం కదా? చిన్న చిన్న దెబ్బలతో బయటపడ్డామని అంటాడు రాజ్. ఇందూ ఏంటీ ఇక్కడుంది అనుకుంటున్నావా? ఎంత కాదు అనుకున్నా నేను మొగుడిని కదా? నాకు ఇలా జరిగిందని తెలిశాక నా మీదున్న ప్రేమతో ఉండబట్టలేక నా దగ్గరికి వచ్చేసింది, నాకు సపర్యలు చేస్తోంది. మీ రేఖ ఆంటీ ఫస్ట్ టైం మనింటికి వచ్చింది కాఫీ తీసుకురమ్మని చెబుతాడు రాజ్.
నువ్వు చాలా పెద్ద ప్రమాదం నుంచి బయటపడినట్లుగా ఉన్నావని రేఖ అడుగుతుంది. నాకు ప్రమాదం చేయించిందే నువ్వేనని రాజ్ అనడంతో రేఖ షాక్ అవుతుంది. నేను యాక్సిడెంట్ చేయించడం ఏంటీ? నాకేం సంబంధం లేదని బుకాయిస్తుంది రేఖ. నువ్వే నన్ను చంపాలని అనుకున్నావు.. నీకు తప్పించి నాకు చంపాలని ఎవరికి ఉంటుంది. లక్కీగాడి విషయాన్ని పాతిపెట్టడానికే నన్ను అడ్డు తొలగించుకోవాలని అనుకున్నావు, నీ గురించి అన్ని తెలిసిన నాకు ఈ మాత్రం అర్ధం కాదా అని అనడంతో రేఖ అవాక్కవుతుంది. అందుకే నా జాగ్రత్తలో నేను ఉన్నాను.. లక్కీగాడి కన్నతల్లివి నువ్వేనన్న నిజాన్ని నేను ఇంకోకరికి కూడా చెప్పాను అనడంతో ఆమెకు ముచ్చెమటలు పడతాయి. నువ్వు నన్ను ఏమైనా చేస్తే వాళ్లు ఆ నిజాన్ని బయటపెట్టేస్తారు. నేను కనుక పోయుంటే నేను పోయిన మరుక్షణమే వాళ్లు నిజాన్ని బయటపెట్టేవాళ్లు. నువ్వు ఇంత చేశావు కాబట్టి నీ నోటితోనే ఆ నిజాన్ని బయటపెట్టిస్తానని రాజ్ చెబుతాడు.
నువ్వు నన్ను చంపలేవు.. నేను ఆ నిజాన్ని బయటపెట్టిస్తాను.. నేను మళ్లీ ఆ ఇంట్లో తిరిగి అడుగుపెట్టబోతున్నాను. నేను చెప్పినట్లు చేయడం తప్పించి నీకు ఆప్షన్ లేదని అంటాడు రాజ్. నీతో మాట్లాడాలని ఇందూని పక్కకి తీసుకెళ్తుంది రేఖ. రాజ్‌గాడి దగ్గరికి ఎందుకు వచ్చావని ఇందూని అడుగుతుంది.. మీరు కూడా రాజ్ చనిపోయాడా? లేదా అని చూడటానికి వచ్చారా అని ఇందూ అడగటంతో రేఖ షాక్ అవుతుంది. రాజ్ ఇంటి నుంచి బయటికి రాగానే.. అందరూ మనమే చేయించామని అనుకుంటున్నారని ఇందూ చెబుతుంది. రాజ్ అమ్మానాన్నలు మిమ్మల్ని అనుమానిస్తారు. ఇది జనంలోకి వెళితే నింద మీ మీదకి వస్తుంది. ఇంకా చెప్పాలంటే అది కేసు వరకు వెళ్తుంది, యాక్సిడెంట్ మీరు చేయించలేదని అందరికీ అర్ధమయ్యేలా చేయడానికి నేను ఇక్కడికి వచ్చానని చెబుతుంది ఇందూ.
మనింటికి వెళ్లిపోదామని రేఖ అడగటంతో నేను రాను అని చెబుతుంది ఇందూ. వాళ్ల అమ్మనాన్నలకు డౌట్ పోయేవరకు ఇక్కడే ఉంటానని తేల్చేస్తుంది. నేను మీతో రావాలా? మీకు ఆ యాక్సిడెంట్‌కు సంబంధం లేదని చేయాలా అని ఇందూ అడగ్గా.. ఇక్కడే ఉండమని చెప్పి వెళ్లిపోతుంది రేఖ. రాజ్ దుగ్గిరాల వారసుడు, నా బావ అని తేలిస్తే నీ గుండె ఆగిపోతుందని మనసులో అనుకుంటుంది ఇందూ. నువ్వు ఆ డీల్ ఇంకా కంటిన్యూ అవ్వాలని కోరుకుంటున్నావు.. అందుకే నేను రాను అని చెప్పినా వెళ్లడం లేదని అంటాడు రాజ్. మా పిన్ని ఏమనుకుంటుంది అని రాజ్ అడగ్గా.. నాకు నిజం తెలుసో లేదోనన్న కన్‌ఫ్యూజన్‌లో ఉందని చెబుతుంది ఇందూ. ముందు నువ్వు ఇక్కడి నుంచి బయల్దేరమని రాజ్ అడగ్గా.. నాతో పాటు వస్తేనే ఇక్కడి నుంచి బయల్దేరతానని చెబుతుంది ఇందూ.
ఇంటి దగ్గర ఉప్మా పెట్టడంతో అపర్ణపై మండిపడుతుంది ఐశ్వర్య. నీ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నావని అపర్ణ చెప్పగా.. నా లైఫ్ నా ఇష్టమని ఫైర్ అవుతుంది. ఉప్మా రుచిగా లేకపోవడంతో అపర్ణపై సీరియస్ అవుతారు భ్రమరాంబ, ఐశ్వర్య. ఆ రాజ్‌గాడు వచ్చాక వీళ్లకి కొమ్ములు వచ్చాయి.. మనకి నచ్చినట్లుగా కాకుండా వాళ్లకి నచ్చినట్లుగా వండటం స్టార్ట్ చేశారని అంటుంది భ్రమరాంబ. ఆ రాజ్‌గాబు వెళ్లిపోయాడు.. ఈ ఇంటికి పట్టిన దరిద్ర్యం వదిలిపోయిందని సంతోషించే లోపు మళ్లీ ఆ నందూ ఎంట్రీ ఇచ్చింది. ఇప్పుడు వీళ్లు దాని అండ చూసుకుని ఇలా చేస్తున్నారని అనడంతో నందూ ఆ మాటలన్నీ వింటుంది. ఉప్మా బాలేదని భ్రమరాంబ, ఐశ్వర్యలు చెప్పడంతో నందూ ఉప్మా తిని చూస్తుంది. అస్సలు బాలేదని చెప్పడంతో శేషం షాక్ అవుతాడు. నీకు చేయడం ఇబ్బందిగా ఉంటే నేనే చేసి పెట్టే దానిని కదా అని అంటుంది నందూ. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications