Brahmamudi july 17th episode: చెల్లెలి ప్రవర్తన తప్పు పట్టిన కావ్య.. అప్పు బాధ్యత తనదంటున్న కళ్యాణ్!
అపర్ణ గిఫ్ట్ తీసుకోవడంతో ఎమోషనల్ అవుతాడు సుభాష్ అయితే ఆ చీరని పని మనిషికి ఇచ్చేస్తుంది అపర్ణ. ఇదే విషయం గా భార్యని నిలదీస్తాడు సుభాష్. జీవితంలో మిమ్మల్ని క్షమించలేనంటుంది అపర్ణ. అత్తగారి మనసు మార్చే ప్రయత్నం చేస్తుంది కావ్య. మరోవైపు అప్పుని అరెస్టు చేశారని ఆవేశంగా స్టేషన్ కి వెళ్లి పోలీసుని కొట్టిన కళ్యాణ్ ని కూడా అరెస్టు చేస్తారు పోలీసులు. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలెట్‌గా మిగిలాయి. ఇక జులై 17వ తేదీ ఎపిసోడ్ 464లో ఏం జరిగిందంటే..
బంటి వీళ్ళు అప్పుని కామెంట్ చేస్తుంటే నువ్వు వీడియో తీసావు కదా అది చూపించు అంటుంది కావ్య. బంటి నిజంగానే ఫోన్ లో వీడియో రికార్డ్ చేశాడేమో అనుకొని కంగారుపడిన ఆకతాయిలు కావ్య కాళ్లు పట్టుకుంటారు. మమ్మల్ని క్షమించు అక్క, వీడు అప్పుని రూమ్ బుక్ చేస్తాను వస్తావా అని అడిగాడు అందుకే అప్పు కొట్టింది అంటాడు ఒకడు. చూసారా ఎస్సై గారు ఒక ఆడపిల్లని ఇలాంటి మాటలు అంటే ఆవేశంతో కొట్టకుండా ఏం చేస్తుంది అంటుంది కావ్య.

ఆవేశపడిన పోలీసు వాళ్ళని లోపల వేసి అప్పుని రిలీజ్ చేస్తాడు. మా మరిది గారిది కూడా తప్పేమీ లేదు ఎస్సై గారు ఇప్పుడు మీరు ఎంత ఆవేశపడ్డారో ఆయనకి కూడా అలాగే ఆవేశం వచ్చింది అంటుంది కావ్య. అప్పుడు కళ్యాణ్ ని కూడా రిలీజ్ చేస్తాడు ఎస్సై. అన్నయ్య మాటేమిటి వదిన అంటాడు కళ్యాణ్. ఇక్కడికి వచ్చే ముందు ఆయన ఏం మాట్లాడారో మీకు తెలియదు, ఆడవాళ్ళని తక్కువ చేసి మాట్లాడారు ఆయనని ఆయన విడిపించుకుంటారులే అంటుంది కావ్య. పాపం అక్క, బావ అంటుంది అప్పు.
కమిషనర్ గారు ఆయన క్లాస్మేట్ కదా ఆయన విడిపించుకుంటారులే అంటుంది కావ్య. కమిషనర్ గారు ఆయన ఫ్రెండా అని అడుగుతాడు ఎస్ఐ. అవును కావాలంటే ఆయన ఫోన్ ఆయనకు ఇవ్వండి ఫోన్ చేసి రప్పిస్తారు అంటుంది కావ్య. కంగారుపడిన ఎస్సై రాజ్ ని కూడా రిలీజ్ చేసి అతని ఫోన్ అతనికి ఇచ్చేస్తాడు. బయటికి వచ్చిన తర్వాత ఏంటి అప్పు ఇది, పెళ్లి కావలసిన ఆడపిల్లవి నువ్వు పదేపదే జైలుకు వెళ్తుంటే నలుగురు ఏమనుకుంటారు అంటుంది కావ్య.
ఏం చేయమంటావ్ అక్క రోజుకి ఒకడు ఇంటికి వస్తున్నాడు, నీ కూతురు హోటల్లో దొరికిందంట కదా అంటూ అమ్మానాన్నలని అసహ్యంగా మాట్లాడుతున్నారు, అనామిక వేసిన నిందలనే నమ్ముతున్నారు కానీ కోర్టులో ఏం జరిగిందో వాళ్లకి అనవసరం. అందుకే నేను ఆవేశం ఆపుకోలేకపోతున్నాను, నన్ను ఎవరైనా కామెంట్ చేస్తే నేను ఇలాగే రియాక్ట్ అవుతాను నువ్వు ఏమనుకున్నా సరే నేను ఇలాగే ఉంటాను అని ఆవేశంగా బంటి ని తీసుకొని అక్కడ నుంచి వెళ్ళిపోతుంది అప్పు.
ఇంటికి వచ్చిన కళ్యాణ్ ని ఇంత ఆలస్యమైంది ఏం, నీ ఫ్రెండ్ ఎవరినో విడిపించి వస్తానన్నావు కదా అంటారు ధాన్య లక్ష్మి దంపతులు. వాడు అలసిపోయి ఉన్నాడు వదిలేయండి అని రాజ్ చెప్పడంతో అక్కడినుంచి వెళ్ళిపోతారు ధాన్యలక్ష్మీ దంపతులు. ఆ తర్వాత గదిలోకి గోరింటాకుతో వచ్చిన కావ్యని ఏమిటిది అని అడుగుతాడు రాజ్. గోంగూర పచ్చడి ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్పండి అంటుంది కావ్య. నిజమే అనుకొని దానిని టేస్ట్ చేసిన రాజ్ ఆ టేస్ట్ కి అసహ్యించుకుంటాడు.
ఏంటిది అని అడుగుతాడు. గోరింటాకు అని నవ్వుతూ చెప్తుంది కావ్య. భర్తని గోరింటాకు పెట్టమని గోముగా అడుగుతుంది. ఆమె మాట కాదనలేక గోరింటాకు పెడతాడు రాజ్. మరోవైపు ముభావంగా కూర్చున్న కళ్యాణ్ ని చూసి ఏమి చేయలేక వెళ్ళిపోతారు అతని తల్లిదండ్రులు రాజ్ కూడా ఆఫీస్ కి వెళ్లేటప్పుడు కళ్యాణ్ ముభావంగా ఉండడం గమనిస్తాడు తిరిగి వచ్చేటప్పటికి కూడా కళ్యాణ్ అంతే ముభావంగా కూర్చుంటాడు.
ఫ్రెష్ అయి వచ్చిన రాజ్ కళ్యాణ్ దగ్గరికి వచ్చి నువ్వు ఇలా ముభావంగా కూర్చుంటే ఉంటే నిన్ను చూసిన వాళ్ళు ఏమవుతారో ఒకసారి ఆలోచించావా, అయినా అంతలా ఎవరి గురించి ఆలోచిస్తున్నావు ఆనామిక గురించేనా అంటాడు. ఆ పీడకల గురించి ఆలోచించడం ఎప్పుడో మానేశాను అంటూ నావల్ల అప్పుకి అన్యాయం జరిగింది అంటాడు కళ్యాణ్. ఆలోచించి ఏం చేస్తావు, అప్పు తల్లిదండ్రులు నిన్ను వాళ్ళ ఇంటికి కూడా రావద్దు అన్నారు ఆమెకి న్యాయం చేయటానికి నీకు ఒక అవకాశం ఇవ్వాలి కదా అంటాడు రాజ్.
తరువాయి భాగంలో ఇందిరాదేవి రాజ్ తో మాట్లాడుతూ నీ తమ్ముడు మనసులో బాధ అర్థమైంది గాని నీ భార్య మనసులో బాధ అర్థం కాలేదా అని అడుగుతుంది. మరోవైపు అపర్ణ కూడా కావ్యతో వాళ్ల గురించి, వీళ్ళ గురించి కాదు మీ సంసారం గురించి ఆలోచించండి ఇప్పటికైనా ఇద్దరూ ఒక్కటవ్వండి అని సలహా ఇస్తుంది.


Click it and Unblock the Notifications











