Brahmamudi July 17th Episode: నోరు విప్పిన ఇందిర.. రేవతి గతం తెలుసుకున్న కావ్య

Photo Courtesy: JioHotstar

రేవతి ఇంట్లో నుంచి బయటకు వస్తున్న ఇందిరను చూసి పట్టుకుంటారు కావ్య- రాజ్. ఏదో వంక చెప్పి ఇందిర అక్కడి నుంచి తప్పించుకుంటుంది. మా అమ్మకి నేను కిడ్నాప్ అయినట్లు ఎందుకు చెప్పావు? ఆమెతో ఒకసారి ఫోన్‌లో మాట్లాడతానని అడుగుతాడు శీనుగాడు. ఇంతలో యామిని వచ్చి ఫోన్ మాట్లాడటమే కాదు.. ఇక్కడి నుంచి వెళ్లడం కూడా కుదరదని తేల్చిచెబుతుంది. రెండ్రోజులు నువ్వు ఇక్కడే ఉంటే అప్పూకి రెండు శిక్షలు పడతాయని.. దీనికి నీకు 2 లక్షల రూపాయలు ఇస్తానని అంటుంది యామిని.

శీనుగాడు దొరక్క ఒట్టి చేతులతో వచ్చిన రాజ్‌- కావ్యలను చూసి దుగ్గిరాల ఫ్యామిలీ షాక్ అవుతుంది. మేం వస్తున్న సంగతి తెలుసుకుని ఈ శీనుగాడు ఎక్కడికో వెళ్లిపోయాడని చెబుతాడు రాజ్. రేవతిని అపర్ణకు దగ్గర చేయాలని దేవుడితో మొరపెట్టుకుంటుంది ఇందిర. ఇదంతా దూరం నుంచి చూసిన కావ్య.. రేవతి ఇంట్లో మిమ్మల్ని చూశానని చెప్పడంతో ఇందిర షాక్ అవుతుంది. అసలు రేవతి ఎవరు? ఈ ఇంటికి ఆమెకు సంబంధం ఏంటీ? అని కావ్య అడుగుతుంది. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. ఇక జూలై 17వ తేదీ ఎపిసోడ్ 776లో ఏం జరిగిందంటే?

Brahmamudi Serial July 17th 2025 Episode 776 Here is Today s full story

Photo Courtesy: JioHotstar

రేవతి ఎవరో చెబుతారా? లేక నేనే అత్తయ్య దగ్గరికి వెళ్లి అడిగేస్తానని వార్నింగ్ ఇస్తుంది కళావతి. ఈ దెబ్బతో ఇందిరా దేవి ఉలిక్కిపడుతుంది. ఈ విషయం గనుక అపర్ణను అడిగితే కొంపలు అంటుకుంటాయని అంటుంది. అంటే రేవతి గారు ఈ ఇంటి మనిషేనా? ఇక్కడ ఇంత మంచి జీవితాన్ని వదిలిపెట్టి అలా బస్తీలో ఉండాల్సిన పరిస్ధితి ఆవిడకి ఎందుకొచ్చింది అని కావ్య ప్రశ్నిస్తుంది. ఒకవేళ రేవతి గారు ఏదైనా చేయకూడని తప్పు చేశారా అని నిలదీస్తుంది. ఆ మాటలతో కావ్యపై కోప్పడి నోరుమూయమంటుంది ఇందిర.

రేవతి చేసింది తప్పు కాదు.. పొరపాటని, తెలిసి తెలియక చేసిన ఆ పొరపాటుకి 15 ఏళ్ల నుంచి బాధఫడుతూనే ఉందని చెబుతుంది ఇందిర. అయినా ఆ దేవుడి మనసు కరగడం లేదు.. అపర్ణ మనసు మార్చడం లేదని అంటుంది. అసలు నువ్వు ఎవరి గురించి మాట్లాడుతున్నావో తెలుసా? నా సాయం పొందిన ఆ రేవతి ఎవరో తెలుసా? అని ప్రశ్నిస్తుంది ఇందిర. ఆ రేవతి అపర్ణకి కూతురు అని చెప్పడంతో కావ్య షాక్ అవుతుంది. రాజ్‌కి అక్క.. నీకు సొంత వదిన అని చెబుతుంది ఇందిర. అ కారణంగా అన్యాయం అయిపోయిన నా మనవరాలని చెబుతుంది ఇందిర.

రేవతి అంటే ఈ ఇంటిల్లిపాదికి కీరిటమని, దానిని నెత్తిన పెట్టుకుని చూసుకునే వాళ్లని అంటుంది ఇందిర. రేవతి గారు ఈ ఇంటి ఆడపడుచు అయితే తనను ఎందుకు దూరం చేసుకున్నారని ప్రశ్నిస్తుంది కావ్య. తనను మేం దూరం చేసుకోవడం కాదు.. అదే మా నుంచి దూరం వెళ్లిపోయిందని అంటుంది ఇందిర. ఆడపిల్లకి స్వేచ్ఛనిస్తే ఆనందంగా ఉంటుంది అనుకున్నాం.. ఆ స్వేచ్ఛ కారణంగా మా అందరి ఆనందం దూరమవుతుందని మేం ఊహించలేకపోయామని బాధపడుతుంది ఇందిర. ఆ వెంటనే ఫ్లాష్ బ్యాక్‌కి వెళ్తుంది.

రేవతిని సుభాష్, అపర్ణలు గారాభంగా చూసుకోవడంతో ఆస్తి మొత్తం దీనికే రాసిచ్చేలా ఉన్నారని మనుసులో అనుకుంటుంది రుద్రాణి. అక్క ఒక్కతే కాదు.. నేను కూడా కొడుకునే అని రాజ్ చిన్నప్పుడు మారాం చేసేవాడు. వాళ్లు తినిపించకపోతే ఏంటీ నేను తినిపిస్తానని ధాన్యలక్ష్మీ తినిపిస్తుంది. రేవతి పుట్టినరోజుకు ఖరీదైన నెక్లెస్‌ని గిఫ్ట్‌గా ఇస్తారు సుభాష్ - అపర్ణ. మీ అమ్మాయికి పెళ్లి చేయాలని అపర్ణ చెప్పడంతో రాకుమారుడి లాంటి అబ్బాయిని తీసుకొచ్చి పెళ్లి చేస్తానని అంటాడు సుభాష్.

తన కూతురు సంతోషంగా ఉండాలంటే దగ్గరి బంధువల్లోనే ఒకరికి ఇచ్చి పెళ్లి చేయాలని సుభాష్ ఆశపడ్డాడని కావ్యతో చెబుతుంది ఇందిర. అదే ఇంట్లో డ్రైవర్‌గా పనిచేస్తున్న జగదీష్‌ని ఇష్టపడుతుంది రేవతి. పుట్టినరోజు కావడంతో జగదీష్‌కి లడ్డూ తినిపిస్తుంది. ఇంట్లో అందరూ నాకు విష్ చేశారు నువ్వు మాత్రం పట్టించుకోలేదని బాధపడుతుంది రేవతి. అమ్మగారు, అయ్యగారు నీకు రాకుమారుడి లాంటి సంబంధం తీసుకొస్తానని చెప్పారని అంటాడు జగదీష్. మన ప్రేమ గెలుస్తుందా? లేదా? అని జగదీష్ అడగ్గా.. మా అమ్మానాన్నలకి నేనంటే ప్రాణమని వాళ్లని ఒప్పించి హ్యాపీగా పెళ్లి చేసుకుందామని అంటుంది రేవతి.

కూతురు మీదున్న పిచ్చి ప్రేమతో రేవతి ఏం చెబితే అది నమ్మడం మొదలుపెట్టారని కావ్యతో అంటుంది ఇందిర. ఓ రోజున పెళ్లి చేసుకుని జగదీష్‌తో కలిసి ఇంటికి వచ్చి దుగ్గిరాల వారి కుటుంబంలో తుఫాన్ తీసుకొచ్చిందని అంటుంది ఇందిర. చెప్పకుండా పెళ్లి చేసుకున్నందుకు మీకు కోపం రావొచ్చు.. కానీ నా ఇష్టాన్ని కాదనరని ఇంటికొచ్చానని అంటుంది రేవతి. ఒక డ్రైవర్‌ను పెళ్లి చేసుకోవడం మీకు ఇష్టం ఉండదని జగదీష్ చాలా బయపడుతున్నాడని చెబుతుంది రేవతి. అన్నయ్య నీ గురించి.. నీ జీవితం గురించి ఎంత గొప్పగా ఊహించుకున్నాడో తెలుసా? అని ప్రకాశం బాధపడతాడు. మనింటి పరువు ఏం అవుతుందోనని ఒక్కసారైనా ఆలోచించావా? అని మండిపడుతుంది ధాన్యలక్ష్మీ.

నాకు ఈయన నచ్చాడు అందుకే పెళ్లి చేసుకున్నానని తేల్చిచెబుతుంది రేవతి. ఆ మాటలతో కోపంతో ఊగిపోయిన సుభాష్.. జగదీష్‌ని చితకబాదుతాడు. అడిగినప్పుడల్లా జీతం పెంచాను.. అడక్కపోయినా బోనస్ ఇచ్చాను.. దానికి నువ్వు ఇచ్చే బహుమానం ఇదా అని ప్రశ్నిస్తాడు సుభాష్. డ్రైవర్.. ఓనర్ కలిసి ఒకే కారులో ప్రయాణించినంత మాత్రాన ఇద్దరూ సమానం కారని అంటాడు. మీ నాన్నని బాధపెట్టి ఈ పెళ్లి చేసుకోవాలని ఎలా అనిపించిందని రుద్రాణి ఇంకా రెచ్చగొడుతుంది. కన్నతండ్రిగా నాకు తెలియకుండా చేసుకున్న ఈ పెళ్లి చెల్లదని, వీడు కట్టిన తాళి తాళే కాదని, వీడిని ప్రాణాలతో వదలనని జగదీష్‌ని కొట్టబోతుండగా రేవతి అడ్డుకుంటుంది. ప్రేమించాను కాబట్టి పెళ్లి చేసుకున్నానని, దానికే చంపేస్తారా? అని రేవతి మండిపడుతుంది.

నా ప్రేమను అర్ధం చేసుకుంటారని అనుకున్నానని.. కానీ మీరు కూడా అందరు తల్లిదండ్రుల్లాగే మూర్ఖంగా ప్రవర్తిస్తున్నారని చెబుతుంది. ఆ మాటలతో మండిపడ్డ అపర్ణ.. రేవతిని లాగికొడుతుంది. ఒక ఆడది తనతో కలిసి కాపురం చేసే భర్తను ఎంచుకునే అధికారం లేదా అని ప్రశ్నిస్తుంది రేవతి. అసలు వీడెంత? వీడి బ్రతుకెంత? వీడు నిన్ను చూసుకోగలడని ఎలా నమ్ముతున్నావని ప్రశ్నిస్తుంది. అసలు నీకు ఇంట్లో ఉండే అర్హత లేదని తేల్చిచెబుతుంది రేవతి. కూతురు తప్పు చేస్తే సరిదిద్దాల్సిందిపోయి తప్పుడు నిర్ణయం తీసుకుంటున్నావని ఇందిర నచ్చచెబుతుంది. ఈ రోజు రేవతికి ఈ ఇంటికి సంబంధం లేదని, దీనితో ఈ ఇంట్లో మనుషులు మాట్లాడినా కలిసినా వాళ్లకి కూడా ఇదే గతి అని చెబుతుంది రేవతి. రేవతిని, జగదీష్‌ని మెడ పట్టుకుని గెంటేస్తుంది అపర్ణ. మీ అమ్మనాన్న ఎవరు అని అడిగితే మాత్రం చచ్చారు అని చెప్పమంటుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X