Brahmamudi July 17th Episode: రాజ్‌ని బావ అని పిలిచిన ఇందూ.. ఐశ్వర్యకి బుద్ధి చెప్పిన నందూ

Photo Courtesy: JioHotstar

నేను నీతో కలిసి మీ ఇంటికి రాను.. నువ్వు ఇక్కడి నుంచి వెళ్లిపోమ్మని ఇందూపై సీరియస్ అవుతాడు రాజ్. ఈ అమ్మాయిని అర్జెంట్‌గా ఇక్కడి నుంచి పంపించేయమని చలపతిని అడుగుతాడు. తను నీ భార్య, ఈ ఇంటి కోడలు.. నీకు ఈ ఇంట్లో ఉండటానికి ఎంత హక్కుందో, తనకు అంతే హక్కుంది.. అయినా భార్యాభర్తల గొడవల్లోకి మేమెందుకు అని చలపతి, లక్ష్మీలు వెళ్లిపోతారు. రాజ్ కోపంగా వెళ్తుండగా కాలు జారి కిందపడిపోతుండగా ఇందూ వచ్చి పట్టుకుంటుంది. రాజ్ బతికే ఉండటం చూసి రేఖ షాక్ అవుతుంది. వీడు ఇంకా బతికే ఉన్నాడు.. ఆ రౌడీగాడు డబ్బులు తీసుకుని మోసం చేశాడని రగిలిపోతుంది.

నువ్వు చాలా పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డావని అంటుంది రేఖ. లక్కీగాడి మేటర్ సమాధి చేయడానికి నన్ను చంపాలని నువ్వే ఈ యాక్సిడెంట్ చేశావని నాకు తెలుసని రాజ్ అనడంతో రేఖ షాక్ అవుతుంది. లక్కీగాడి మేటర్ నేను మరొకరికి కూడా చెప్పాను.. నాకు ఏదైనా జరిగితే వాళ్లు వచ్చి ఈ విషయం బయటపెట్టేవారు అనడంతో రేఖకి చెమటలు పడతాయి. త్వరలోనే నేను మళ్లీ దుగ్గిరాల నిలయానికి వస్తాను.. అప్పుడు లక్కీగాడి విషయం కూడా బయట పెడతానని చెబుతాడు. నువ్వెందుకు ఇక్కడే ఉన్నావని ఇందూని రేఖ అడగ్గా.. నేను ఇక్కడ లేకపోతే మీరే రాజ్‌కి యాక్సిడెంట్ చేయించారని అనుకుంటారని చెబుతుంది. దాంతో ఇందూని అక్కడే ఉండమని అంటుంది రేఖ. అపర్ణ చేసిన టిఫిన్ బాగోకపోవడంతో భ్రమరాంబ, ఐశ్వర్యలు మండిపడతారు. ఇంతలో నందూ వచ్చి వారిపై సీరియస్ అవుతుంది. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. ఇక జూలై 17వ తేదీ ఎపిసోడ్ 1087లో ఇంకా ఏం జరిగిందంటే?

Brahmamudi Serial July 17th 2026 Episode 1087 Here is Today s full story

Photo Courtesy: JioHotstar

నందూకి వంట ఖచ్చితంగా ఉండొచ్చునని అంటుంది భ్రమరాంబ. ఈ చేత్తో చాలామందికి వండి పెట్టాను.. ఈసారి నేను ఉప్మా చేసి తీసుకొస్తానని వెళ్తుంది నందూ. తను చేసేది తినకుండా ఈ ఉప్మాని తినేస్తానని అంటాడు శేషం. ఎందుకైనా మంచిది మీరు కూడా ఈ ఉప్మానే తినేయండి అని హెచ్చరిస్తాడు. ఉప్మాని రెడీ చేసి తీసుకొచ్చిన నందూ.. భ్రమరాంబ ముందు పెడుతుంది. ఘమఘమలు చూస్తే నోరూరిపోతుంది.. నువ్వు ఏనాడైనా చేశావా అని అపర్ణని నానామాటలు అంటుంది భ్రమరాంబ. అయితే ఐశ్వర్యకి మాత్రం డౌట్ వస్తుంది. భ్రమరాంబ ఉప్మా తినగానే నోరు అతుక్కుపోతుంది. భ్రమరాంబని చూసి ఐశ్వర్య కూడా ఉప్మాని నోటిలో పెట్టుకోగా.. ఆమె నోరు అతుక్కుపోతుంది.

ఇద్దరికి నోరు అతుక్కుపోయిందా అని శేషం అంటాడు. నువ్వు ఉరిమి చూసినా, ఉరుములు కురిపించినా ఇక్కడ భయపడేవాడు లేడు. ఇందూ అక్క జోలికి రావొద్దు.. ఎవరి పనులు వాళ్లే చేసుకోవాలి. ఇదేమీ రాజుల కాలం కాదు.. మీరేమీ రాజకుటుంబీకులు కూడా కాదు, మీకు ఇక్కడ సేవకులు, బానిసలు ఎవ్వరూ లేరని వార్నింగ్ ఇస్తుంది నందూ. ఐశ్వర్య కొట్టబోతుండగా అడ్డుకుంటుంది నందూ. ఇంకోసారి రిపీట్ అయితే నీ వేళ్లు విరిచేస్తానని ఐశ్వర్యకి కౌంటర్ ఇస్తుంది. ఈ వయసులో మా నానమ్మ మీకు వంట చేయడం, వడ్డించడమే ఎక్కువ. అలాంటిది వంకలు పెడతారా? ఇన్నాళ్లూ మా నానమ్మ మీరు చెప్పిన దానికి తలూపింది, ఇకపై మా నానమ్మ జోలికి వస్తే ఉప్మాలో ఇంకేదో కలుపుతానని బెదిరిస్తుంది నందూ. నాకు ముందే అనుమానం వచ్చి జాగ్రత్త పడ్డా.. నేను తినకుండా ఊరుకున్నానని భ్రమరాంబతో అంటాడు శేషం. నా మాట నువ్వు వినిపించుకోలేదు.

రాజ్‌కి కాఫీ ఇచ్చి మనం గదిలోకి వెళ్లాలని చెబుతుంది ఇందూ. ఆ మాటలతో లక్ష్మీ, చలపతి షాక్ అవుతారు. మీ కాలికి ఉన్న కట్టు తీసి .. మర్దన చేయాలని చెబుతుంది ఇందూ. అయినా నువ్వు చేయడం ఏంటీ అని రాజ్ అడగ్గా.. నేనే చేస్తానని అంటుంది. నువ్వేం నాకు సేవలు చేయొద్దు.. నాకు మా అమ్మ చేస్తుందని చెబుతాడు రాజ్. నేను ఏం చేయలేనని లక్ష్మీ చెప్పగా.. నువ్వు పెళ్లి చేసుకున్నాక కూడా నేను నీకు సేవలు చేయాలా? నాకు ఒంట్లో ఓపిక లేక ఇంటి పని, వంట పనికి నాకు సాయం ఉంటారని కోడళ్లను పంపించమని ఆరోజు నీ ముందే దేవుడికి మొక్కుకున్నాను అంటుంది లక్ష్మీ. ఆయన తథాస్తు అన్నాడు.. నువ్వు ఈ అమ్మాయిని ఇంటికి కోడలిగా తీసుకొచ్చావని చెబుతాడు చలపతి. నీ భార్యే నీకు అన్నీ చేసి పెడుతుందని వార్నింగ్ ఇస్తుంది లక్ష్మీ.

జీవితాంతం స్టిక్ సాయంతో నడుస్తాను కానీ నీతో మాత్రం చేయించుకోనని చెబుతాడు రాజ్. నీకు ఇంకో కాలు ఉందనే ధైర్యంతోనే కదా? ఇలా మాట్లాడుతున్నావు.. ఆ కాలు కూడా విరగ్గొడితే చచ్చినట్లుగా నా మాట వింటావని అంటుంది ఇందూ. వెంటనే గదిలోకి వెళ్లి కర్ర తీసుకొస్తుంది. అది సరిపోదని రోకలి బండ తీసుకొచ్చి కొట్టమని ఇస్తాడు చలపతి. ఇన్నాళ్లూ ఈ తండ్రి బాధ నీకు అర్ధం కాలేదు కదా? ఇప్పడు నా సపోర్ట్ నీకే.. ఇరగదీసేయ్ అంటాడు చలపతి. నీకు కొడుకు కన్నా.. తనే ఎక్కువైందా అని మండిపడతాడు రాజ్. నా కోడలు నువ్వు నా కళ్లు ముందు మోకరిల్లేలా చేసింది.. నేను సాధించేశానని అంటాడు చలపతి.

నువ్వు మర్ధన చేయించుకుంటావా? లేక నీ రెండో కాలు విరగ్గొట్టమంటావా అని వార్నింగ్ ఇస్తుంది ఇందూ. చచ్చినట్లు చేయించుకుంటాను.. కాకపోతే గదిలో వద్దు, బయట చేయించుకుంటానని చెబుతాడు రాజ్. బావ కాలికి మర్దన చేస్తుంది ఇందూ. అసలు నువ్వు నన్ను ఎన్ని మాటలు అన్నావు.. ఈరోజు నువ్వే నన్ను మళ్లీ ఇంటికి రమ్మంటున్నావని మండిపడతాడు రాజ్. నిన్ను ఇంటరిగా వదిలేయడం నాకు ఇష్టం లేదు.. నువ్వు మా ఇంట్లోనే ఉండాలి, అక్కడే ఉంటే నీకు ఏం కాకుండా చూసుకుంటానని చెబుతుంది ఇందూ. నీ మాటలు ఎవరూ నమ్ముతారని అనడంతో ఇందూ బాధపడుతుంది. నీకు ఏదైనా అయితే నేను తట్టుకోలేను, నువ్వు లేకుండా నేను ఉండలేనని అంటుంది.

నీ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది.. కానీ నీకు నాకు సంబంధం ఏంటీ అని అడుగుతాడు రాజ్. అది డీల్ కావొచ్చు, కానీ నీ వల్ల నాకు చాలా మంచి జరిగిందని అంటుంది ఇందూ. ఈసారి నిజంగానే నీ మెడలో మూడు ముళ్లు వేసి ఆ ఇంట్లో అడుగుపెట్టనా అని అంటాడు రాజ్. అది నీ ఇష్టమని ఇందూ అనడంతో రాజ్ షాక్ అవుతాడు. జీవితాంతం ఒంటరిగా ఉండిపోతాను కానీ నీలాంటి దానిని మాత్రం చేసుకోను అంటాడు రాజ్. దీనితో ఇంకా బతిమలాడించుకోవాలని అనుకుంటాడు. నాకు నీతో అవసరం లేదు.. నేను నీతో రాను అంటాడు. ఒకప్పుడు అంటే వదిలేసే దానినేమో ఈసారి మాత్రం అస్సలు వదలను బావ అని ఇందూ అనడంతో రాజ్ షాక్ అవుతాడు. అలా పిలవాలని అనిపించిందని చెబుతుంది ఇందూ. ఈ రాజ్ ‌గాడు డబ్బుకు తప్ప ఏ ఎమోషన్‌కి బెండ్ కాడని అంటాడు రాజ్. మా నాన్నగారు మనిద్దరికీ పెళ్లి జరిగిందని అనుకుని పెళ్లి తర్వాత జరగాల్సిన కార్యక్రమాలు జరిపించేస్తారని చెబుతాడు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X