Brahmamudi July 18th episode: కోరిక తీర్చమంటున్న ఇందిరాదేవి.. ఓ రేంజ్‌లో పోట్లాడుకున్న కావ్య, రాజ్

జీవితంలో భర్తని క్షమించలేనంటుంది అపర్ణ. అత్తగారి మనసు మార్చే ప్రయత్నం చేస్తుంది కావ్య. మరోవైపు అప్పుని అరెస్టు చేశారని ఆవేశంగా స్టేషన్ కి వెళ్లి పోలీసుని కొట్టిన కళ్యాణ్ ని కూడా అరెస్టు చేస్తారు పోలీసులు. కళ్యాణ్ ని విడిపించడానికి వచ్చిన రాజ్ ని కూడా అరెస్టు చేస్తారు పోలీసులు.చాకచక్యంతో వాళ్లని విడిపించుకొస్తుంది కావ్య. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలెట్‌గా మిగిలాయి. ఇక జులై 18వ తేదీ ఎపిసోడ్ 465లో ఏం జరిగిందంటే..

అప్పుకి ఎలాంటి సాయం చేయకుండా అక్కడి వాళ్ళు, ఇక్కడి వాళ్ళు నా చేతులు కట్టేశారు అంటాడు కళ్యాణ్. నువ్వు సాయం చేయలేకపోవచ్చు కానీ నేను చేయగలను, మీ వదిన చేయగలదు. కావ్యకి అప్పు సొంత చెల్లెలు, చెల్లి కోసం కావ్య ఏం చేయడానికైనా సిద్ధంగా ఉంటుంది అప్పు కోసం నువ్వు ఏమి బాధపడకు అంతా మీ వదిన చూసుకుంటుంది అని కళ్యాణ్ కి ధైర్యం చెప్పి వెళ్ళిపోతాడు రాజ్.

Brahmamudi July 18th episode

మరోవైపు ఇందిరా దేవి రాజ్ దగ్గరికి వచ్చి వాళ్ల గురించి, వీళ్ళ గురించి ఆలోచించడమేనా, నీ భార్య గురించి ఆలోచించేది ఏమైనా ఉందా అని అడుగుతుంది. అంటే తమ్ముడు కష్టంలో ఉంటే చూస్తూ వదిలేయమంటావా అంటాడు రాజ్. అలా అనటం లేదు కానీ నీ భార్య కష్టసుఖాలు కూడా నువ్వు పట్టించుకోవాలి కదా, ఆమెకు కూడా సరదాలు సంతోషాలు ఉంటాయి కదా అంటుంది ఇందిరాదేవి.

ఇంట్లో ఇన్ని సమస్యలు ఉంటే అని రాజ్ ఏదో అంటూ ఉండగానే సమస్యలు లేని ఇల్లు ఏదో చూపించు. మనమే ఈ విధంగా ఆలోచిస్తే మధ్యతరగతి వాళ్ళు, పేదవాళ్లు ఎంత ఆలోచించాలి తెల్లవారి లెగిస్తే ఇంటి అద్దె, నెలసరి సామాన్లు అంటూ వాళ్లకి బోలెడన్ని సమస్యలు అయినా సంసారాలు చేయడం మానేశారా, పిల్లల్ని కనటం మానేశారా కాస్త ఆలోచించు.

నువ్వు నీ భార్యతో సంసారం చేసి పిల్లల్ని కంటే చూసి చనిపోవాలని ఉంది ఈ ఒక్క కోరిక తీర్చు చాలు అని చెప్పి బాధగా అక్కడ నుంచి వెళ్ళిపోతుంది ఇందిరా దేవి. ఇదంతా అనుకోకుండా కళ్యాణ్ కూడా వింటాడు. మరోవైపు పని చేసుకుంటున్న కావ్య దగ్గరికి వచ్చి నీకు వాళ్ల బాధలు వీళ్ళ బాధలు తప్పితే నీ బాధ నీకు అక్కర్లేదా కానీ అడుగుతుంది అపర్ణ. దేని గురించి మాట్లాడుతున్నారు అంటుంది కావ్య. దేని గురించో నీకు తెలియదా అసలు నీ భర్త నీతో సంసారం చేస్తున్నాడా అని అడుగుతుంది అపర్ణ.

ఒకసారి ఇష్టపడినట్లుగానే ఉంటారు కానీ మరొకసారి అలా కనిపించరు ఆడదాన్ని నేను ఎలా అడగాలి అని మొహమాటంగా అంటుంది కావ్య. అది నీ హక్కు నువ్వే సాధించుకోవాలి. పుట్టింట్లో గాని అత్తింట్లో గాని ఏ సమస్యలు వచ్చినా నువ్వేముందుండి పరిష్కరిస్తావు అలాంటిది నీ దగ్గరికి వచ్చేసరికి ఎందుకు ఇంత మెతకబడిపోతావు వెళ్ళు నీ భర్త దగ్గరికి వెళ్లి నీ జీవితాన్ని పండించుకో, నీ జీవితం పిల్లాపాపలతో ఆనందంగా ఉండాలి అంటుంది అపర్ణ.

పాలు తోడు బెట్టి వెళ్ళిపోతాను అన్న కావ్య తో వాటి సంగతి నేను చూసుకుంటాను ముందు నీ తోడు నువ్వు చూసుకో అని కోడల్ని మందలించి పంపిస్తుంది అపర్ణ. తర్వాత రాజ్,కావ్య ఇద్దరు వారి గదిలోకి వెళ్తారు. కావ్య తో నీ తప్పులన్నీ క్షమించేస్తున్నాను అంటాడు రాజ్. నా తప్పులు క్షమించడానికి మీరెవరు అసలు తప్పులు అన్నీ చేసింది మీరు. ఒకసారి నన్ను వర్షంలో బయట నుంచో పెట్టేసారు.

ఒకసారి మా ఇంటి దగ్గర దిగబెట్టేశారు, ఒకసారి నా బిడ్డ అంటూ ఎవర్నో తీసుకొచ్చారు, అన్ని తప్పులూ మీరు చేసి నన్ను క్షమించాను అంటారు ఏమిటి అని పోట్లాడుతుంది కావ్య. నువ్వే మోసం చేసి పెళ్లి చేసుకున్నావు, కడుపులో ఇంత కుళ్ళు పెట్టుకొని బయటికి మాత్రం మంచి దానిలాగా నటిస్తున్నావా అంటూ రాజ్ కూడా పోట్లాటకి దిగుతాడు. పోట్లాటలో ఏ మాత్రం తగ్గకుండా పోట్లాడుకొని అలసిపోయి పడుకుంటారు దంపతులిద్దరూ.

తరువాయి భాగంలో నీతో కలిసి డిన్నర్ చేయాలనుకుంటున్నాను వస్తావా అని భార్యని అడుగుతాడు రాజ్. అందుకు ఒప్పుకుంటుంది కావ్య. రుద్రాణి కొడుకుతో మాట్లాడుతూ వాళ్ళిద్దరూ డిన్నర్ కి వెళ్ళారంటే రాజ్ కావ్య మాయలో పడిపోతాడు, ఇక మన ఆటలు సాగవు అంటుంది. వాళ్ళిద్దరూ కలిసి డిన్నర్ కి వెళ్ళకూడదు అంతే కదా అంటాడు రాహుల్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X