Brahmamudi July 18th Episode: రేవతి బాధ్యత తీసుకున్న కావ్య.. రాజ్‌తో అప్పూ గురించి నోరు జారిన యామిని

Photo Courtesy: JioHotstar

రేవతి అపర్ణ కూతురని, రాజ్ అక్క అని కావ్యకి చెబుతుంది ఇందిర. ఆ మాటలతో కావ్య షాక్ అవుతుంది. రేవతిని అపర్ణ- సుభాష్‌లు ప్రాణానికి ప్రాణంగా చూసుకున్నారని.. కానీ రేవతి మాత్రం కారు డ్రైవర్‌ జగదీష్‌తో ప్రేమలో పడిందని అంటుంది ఇందిర. జగదీష్‌, రేవతిలు పెళ్లి చేసుకుని ఇంటికి రావడంతో దుగ్గిరాల ఫ్యామిలీ షాక్ అవుతుంది. నా మాట కాదనరనే నమ్మకంతో ఇన్నాళ్లు మా ప్రేమ విషయం చెప్పలేదని అంటుంది రేవతి.

రేవతి మాటలు విన్న సుభాష్ మండిపడతాడు. మేం నీ గురించి ఎన్నో కలలు కంటుంటే నువ్వు ఇలా డ్రైవర్‌ని పెళ్లి చేసుకుంటావా అంటూ రగిలిపోతాడు. ఈ పెళ్లి చెల్లదని, అసలు ఈ జగదీష్ ఈరోజు ప్రాణాలతో ఇక్కడి నుంచి బయటకు వెళ్లడని అంటాడు సుభాష్. తన భర్తను తండ్రి చావబాదుతుంటే రేవతి అడ్డుపడుతుంది. దీంతో రేవతిని లాగికొట్టిన అపర్ణ.. రేవతి, జగదీష్‌లను ఇంట్లో నుంచి మెడపట్టి గెంటేస్తుంది. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. ఇక జూలై 18వ తేదీ ఎపిసోడ్ 777లో ఏం జరిగిందంటే?

Brahmamudi Serial July 18th 2025 Episode 777 Here is Today s full story

Photo Courtesy: JioHotstar

జగదీష్, రేవతిలను బయటికి గెంటేస్తుంది అపర్ణ. కూతురి మీద ఆస్తి పేపర్లు విసిరికొట్టి.. వీటి కోసమే వాడు నిన్ను పెళ్లి చేసుకున్నాడని, ఈ ముష్టి మాకేం అక్కర్లేదని చెబుతుంది అపర్ణ. దాంతో ఆ పేపర్లను తీసుకెళ్లి తండ్రి పాదాల వద్ద పెడుతుంది రేవతి. ఏదో ఒక రోజు నేను తప్పు చేయలేదని తెలుసుకుని మీరే మమ్మల్ని పిలిచే వరకు ఈ ఇంటి గడప తొక్కనని అంటుంది రేవతి. అది నేను బతికుండగా జరగదని తేల్చి చెబుతుంది అపర్ణ. దాంతో రేవతి బాధపడుతూ భర్తను తీసుకుని వెళ్లిపోతుంది.

అలా దూరమైపోయింది కాబట్టే నా మనవరాలిని ఇలా దొంగతనంగా కలవాల్సి వస్తోందని కావ్యతో చెబుతుంది ఇందిర. నేను రేవతిని కలిశానని అపర్ణకు తెలిస్తే చాలా పెద్ద గొడవ జరుగుతుందని అంటుంది. కానీ ఏదో ఒకరోజు నిజం తెలియాలి కదా అని చెబుతుంది కావ్య. నిజం తెలిసే ఛాన్స్ వస్తుందన్న నమ్మకం నాకు లేదని, అపర్ణ - సుభాష్‌లు రేవతిని ఇప్పట్లో ఇంటికి పిలవరని బాధపడుతుంది ఇందిర. అన్ని విషయాలను అమ్మానాన్నలతో షేర్ చేసుకున్న రేవతి గారు.. ప్రేమ, పెళ్లి విషయం మాత్రం ఎందుకు చెప్పలేదని అడుగుతుంది కావ్య.

చెప్పే పరిస్థితులు లేక అలా చేసిందని అంటుంది ఇందిర. పెళ్లి జరిగిన తర్వాత ఆగమేఘాల మీద ఇలా ఎందుకు చేసిందో కనుక్కున్నానని చెబుతుంది. జగదీష్ వాళ్ల అమ్మ .. అనారోగ్యంతో మంచాన పడేసరికి, తల్లి చివరి కోరికగా రేవతిని పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందని అంటుంది ఇందిర. అన్ని విషయాల్లోనూ తనకు సపోర్ట్ చేసే పేరెంట్స్ ఈ విషయంలోనూ తనకు అండగా ఉంటారని రేవతి అనుకుందని చెబుతుంది. కానీ ఆ నిర్ణయమే తన పాలిట శత్రువు అవుతుందని ఊహించలేకపోయిందని అంటుంది ఇందిర.

కనీసం మీరైనా అత్తయ్య మావయ్యలని ఒప్పించవచ్చు కదా అని కావ్య అడుగుతుంది. మా కూతురు చచ్చిపోయిందని తెగతెంపులు చేసుకున్న తర్వాత నేనేం చెప్పినా వినరని అంటుంది ఇందిర. అందుకే నేను ఏం చేయలేని అసమర్ధురాలిగా ఉండిపోయానని చెబుతుంది. ఆడపిల్ల ఇంటికి లక్ష్మీదేవి అని .. తనని ఇంతగా కన్నీరు పెట్టించడం మనకి మంచిది కాదని అంటుంది కావ్య. టైం చూసి రేవతి గారిని ఇంటికి తీసుకొచ్చే బాధ్యత నాదని చెబుతుంది. అదే కనుక జరిగితే అందరికంటే ముందు ఆనందపడేది నేనే అని అంటుంది ఇందిర.

అప్పూని బయటికి తీసుకొచ్చేందుకు ఏదైనా ఆలోచించావా? అని అడుగుతుంది ఇందిర. సాక్ష్యాన్ని వెతికే పనిలో ఉన్నానని చెబుతుంది కావ్య. అపర్ణకి రేవతి కొడుకు మాట్లాడిన మాటలు, చేసిన అల్లరి గుర్తొచ్చి తనలో తాను నవ్వుకుంటుంది. అది చూసి ఏం జరిగిందని అడుగుతాడు సుభాష్. దాంతో అపర్ణ జరిగినదంతా భర్తకు చెబుతుంది. కానీ ఆ పిల్లాడు చాలా అనుభవం ఉన్నవాడిలా, పెద్దవాడిలా మాట్లాడాడని అంటుంది. రోడ్డు మీద పిల్లలు వస్తారు చూసుకోవాలని నన్నే బెదిరించాడని చెబుతుంది అపర్ణ. వాడి మాటలు, చేష్టలు అచ్చం మన రాజ్‌కి జిరాక్స్ కాపీలా ఉన్నాడని అంటుంది. ఒక్క ఐస్‌క్రీమ్ కింద పడేసినందుకు నా చేత రెండు ఐస్‌క్రీమ్‌లు కొనిపించుకున్నాడని చెబుతుంది అపర్ణ. వాడితో ఉన్నంతసేపూ చాలా సంతోషంగా అనిపించిందని అంటుంది. ఆ పిల్లాడి పేరు కూడా స్వరాజ్ అని చెబుతుంది అపర్ణ. ఆ పిల్లాడు మళ్లీ కలిస్తే గడుపుతానని చెబుతుంది. ఆ పిల్లాడి కారణంగా నువ్వు చిన్నపిల్లలా మారిపోయావని చెబుతాడు సుభాష్.

కావ్యకి ఫోన్ చేసిన యామిని నేను సింగర్ అవుదామని అనుకుని మంచి పాటను నేర్చుకున్నానని చెబుతుంది. పాట పాడి కావ్యను మరింత రెచ్చగొడుతుంది. నా సంతోషానికి కారణం నువ్వేనని కావ్యకు చెబుతుంది యామిని. నీ చెల్లిని కాపాడుకోవడానికి వేసిన ప్లాన్ అట్టర్ ఫ్లాప్ అయినట్లుగా ఉంది అని అంటుంది. నువ్వు కారేసుకుని శీను దగ్గరికి వెళ్లగానే వాడు సరేనని కోర్టులో సాక్ష్యం చెబుతాడని అనుకున్నావా అని నిలదీస్తుంది యామిని. ఇప్పుడు ఆ ఆశ చచ్చిపోవడంతో అటు ఇటు తిరుగుతూ కన్నీళ్లు పెట్టుకుంటున్నావా అని సెటైర్లు వేస్తుంది.

నన్ను చాలా ఈజీగా తీసుకున్నావని.. నీ చెల్లిని నువ్వు ఇంకా ప్రాబ్లమ్‌లోకి నెట్టేశావని అంటుంది యామిని. ఇప్పటి వరకు అప్పూని లంచం తీసుకున్న కేసులో మాత్రమే ఇరికించానని హ్యాపీగా ఫీల్ అయ్యానని చెబుతుంది. కానీ నువ్వు ఆ శీనును వెతుక్కుంటూ వెళ్లి నాకు ఇంకో బోనస్ ఐడియా ఇచ్చావని అంటుంది. దాంతో అప్పూని రెండు కేసుల్లో ఇరికించే ఛాన్స్ ఇచ్చావని అంటుంది. ఒకటేమో లంచం తీసుకుంటూ దొరికిపోయినందుకు, ఇంకోకటేమో సాక్షిని బెదిరించి కిడ్నాప్ చేయించినందుకు అని యామిని చెప్పడంతో కావ్య షాక్ అవుతుంది.

అప్పుడే నువ్వు గెలిచానని సంబరపడిపోకు యామిని.. సముద్రం సైలెంట్‌గా ఉందంటే చేతకాక కాదని అంటుంది కావ్య. నేను అలిసిపోయి ఆగిపోయే కెరటాన్ని కాదు.. తీరాన్ని ముంచే సునామీని అని చెబుతుంది. ఓడిపోవడాదనికి నేను యామినిని కాదు.. ఓటమి ఎరుగని కావ్యని అంటుంది. నీ ఫోన్‌లో ఒక పాటని డౌన్‌లోడ్ చేసి పెట్టుకో అని సెటైర్ వేస్తుంది. రాజ్ అటు ఇటూ తిరుగుతూ ఆలోచిస్తుండగా యామిని వెళ్లి ఏం జరిగిందని అడుగుతుంది. అప్పూని కోర్టులో హాజరుపరుస్తారని, అప్పటిలోగా సాక్షిని తీసుకెళ్లకపోతే అప్పూకి శిక్ష పడుతుందని చెబుతాడు రాజ్. ఏం చేయాలా అర్ధం కాక అటు ఇటు తిరుగుతున్నానని అంటాడు యామిని. మనమంటే ఇష్టపడేవాళ్లకి ఏమైనా జరిగిందని తెలిస్తే ఖచ్చితంగా కంగారు పడతామని యామిని చెప్పిన విషయాన్ని బాగా ఆలోచిస్తాడు రాజ్. వాళ్ల అమ్మ కోసం ఖచ్చితంగా శీనుగాడు ఫోన్ చేస్తాడని అప్పుడు సిగ్నల్ ద్వారా పట్టుకుంటానని చెబుతాడు రాజ్. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X