Brahmamudi July 18th Episode: రాజ్- ఇందూకి శోభనం.. ఇందూ అందాలకు పిచ్చెక్కిపోయిన రాజ్
Photo Courtesy: JioHotstar
అపర్ణతో వంట చేయించి, చేసిన ఉప్మా బాలేదన్న భ్రమరాంబ, ఐశ్వర్యలకు బుద్ధి చెప్పడానికి ఉప్మాలో గమ్ వేసి తయారు చేస్తుంది నందూ. ఇంత వయసొచ్చింది ఉప్మా ఎలా తయారు చేయాలో తెలియదు, నందూని చూడు ఎలా తయారు చేసిందోనని అపర్ణని నానామాటలు అంటుంది భ్రమరాంబ. నందూ చేసిన ఉప్మాని ఎప్పుడెప్పుడు తినాలా అని వెయిట్ చేస్తున్నానని అంటుంది. ఐశ్వర్యకు మాత్రం ఉప్మా వాసన తేడాగా ఉండటంతో ముందు మీరు తినండి తర్వాత నేను తింటానని చెబుతుంది. ఉప్మా నోటిలో పెట్టుకోగానే భ్రమరాంబకి నోరు అతుక్కుపోతుంది.
ఆ వెంటనే ఐశ్వర్య కూడా ఉప్మా తినగానే తనకు కూడా నోరు అతుక్కుపోతుంది. ఈ ఇంట్లో ఎవరి పనులు వాళ్లే చేసుకోవాలి? ఈ వయసులో మా నానమ్మ మీకు వండి పెట్టాలా? ఇది మరోసారి రిపీట్ అయితే పనిష్మెంట్ మరోలా ఉంటుందని వార్నింగ్ ఇస్తుంది. ఐశ్వర్య కొట్టడానికి చేయి ఎత్తగా దానిని అడ్డుకుని రగిలిపోతుంది నందూ. నేను ముందే చెప్పాను ఆ నందూతో జాగ్రత్తగా ఉండమని మీరే వినిపించుకోలేదని భ్రమరాంబ మీద ఫైర్ అవుతాడు శేషం.
రాజ్‌ని గదిలోకి తీసుకెళ్లి కాలికి మర్దన చేస్తానని అడుగుతుంది ఇందూ. దానికి రాజ్ ససేమిరా అనడంతో నీకు మరో కాలు ఉందనే కదా? నేనంటే లెక్క లేకుండా మాట్లాడుతున్నావు, నీ రెండో కాలిని కూడా చితక్కొడితే చచ్చినట్లు నా మాట వింటావని అంటుంది. దాంతో చేసేదేం లేక మర్దన చేయించుకోవడానికి ఒప్పుకుంటాడు రాజ్. నన్ను వదిలేసి వెళ్లిపోమంటే ఎందుకు వెళ్లడం లేదు? నీకు నాకు సంబంధం ఏంటీ అని ఫైర్ అవుతాడు రాజ్. నువ్వు వచ్చాక నా జీవితంలో చాలామంచి జరిగింది, అలాంటిది నిన్ను వదిలేసి వెళ్లనని తేల్చేస్తుంది ఇందూ. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. ఇక జూలై 18వ తేదీ ఎపిసోడ్ 1088లో ఇంకా ఏం జరిగిందంటే?

Photo Courtesy: JioHotstar
నీకు నాకు పెళ్లయిందని మా అమ్మానాన్నలు ఫస్ట్ నైట్ ఏర్పాటు చేస్తారని, నీ జీవితం నాశనమేనని బెదిరిస్తాడు రాజ్. అందుకే నువ్వు ఇక్కడి నుంచి వెళ్లిపో అని అంటాడు. నువ్వు ఇంటికొచ్చేలా నేనే చేస్తానని అంటుంది దీప. నందూ చేసిన ఉప్మా తిన్న భ్రమరాంబ మూతి అతుక్కుపోతుంది. రేఖ రాగానే నందూ మీద కంప్లయంట్ ఇవ్వాలని అనుకుంటుంది. రేఖ హడావుడిగా వచ్చి మనం అనుకున్నది జరగలేదు.. ఆ రాజ్‌గాడికి యాక్సిడెంట్ జరిగినా బతికే ఉన్నాడని చెబుతుంది. నేను ఇంత మాట్లాడుతున్నా సైలెంట్‌గా ఎందుకు ఉన్నావని రేఖ అడగ్గా.. నోరు అతుక్కుపోయిందని చెబుతాడు శేషం. ఆ నందూ నీకు ఏం పెట్టిందో కానీ నువ్వు ఇన్నాళ్లకు నోరు మూసుకున్నావని సెటైర్లు వేస్తాడు శేషం. నందూ మీద రేఖకి కంప్లయంట్ ఇద్దామని అనుకుంటున్నావా? అసలే చాలా చిరాకులో ఉంది, నువ్వు వెళితే కొట్టినా కొడుతుందని అంటాడు శేషం.
రాజ్‌కి యాక్సిడెంట్ జరిగిందని తెలిసి లక్కీ కంగారుపడతాడు. నిన్ను ఇలా చూడలేకపోతున్నాను, మా అమ్మ గురించి, నా ఫ్యామిలీ గురించి సాయంత్రం లోగా తెలుస్తుందని చెప్పి వెళ్లినవాడివి.. ఇలా దెబ్బలు తగిలించుకున్నావేంటీ? అని అడుగుతాడు. మనకు ప్రతి మలుపులో ప్రమాదాలు ఎదురవుతూనే ఉంటాయి. అయినా అనుకున్నది అనుకున్నట్లుగా జరిగితే ఇక లైఫ్ ఏముంది? జీవితం ఎవరినీ వదిలిపెట్టదు అందరి సరదా తీర్చేస్తుందని చెబుతాడు రాజ్. అసలు యాక్సిడెంట్ చేయించిందెవరు? అని లక్కీ అడగ్గా.. ఎవరైతే ఏముందిలా అని నిజం దాచేస్తాడు. మీ అమ్మ గురించి ఆ రోజు తెలిసేది కానీ మిస్ అయ్యిందని అంటాడు రాజ్.
నువ్వు తప్పించి నాకు వేరే ఎవరూ లేరు. మా అమ్మ ఎవరో తెలియక జీవితం మీద విరక్తి కలుగుతోంది. నా దగ్గరున్న డబ్బులన్నీ ఆ ఆంటోనీ గాడికే తగలబెట్టాను, కానీ వాడు నిజం చెప్పకుండా మోసం చేశాడని బాధపడతాడు లక్కీ. ఎక్కడున్నాసరే మీ అమ్మని నీ ముందు నిలబెడతానని చెబుతాడు రాజ్. నాకు నీ మీదే నమ్మకమని వెళ్లిపోతాడు లక్కీ. రాజ్ పడిపోతుండగా పట్టుకుంటుంది ఇందూ. అతను కోపంగా ఉండటంతో పాట పాడి కూల్ చేస్తుంది.
మరోవైపు.. తెల్ల చీర కట్టుకుని, పాల గ్లాసుతో అందంగా రెడీ అయి లోపలికి వచ్చిన ఇందూని చూసి రాజ్ షాక్ అవుతాడు. నీ పిలుపు మారింది, చూపులు మారాయి.. నిన్ను చూస్తుంటేనే భయంగా ఉంది. అసలు నీ ప్లాన్ ఏంటీ ముందు అది చెప్పమని అంటాడు రాజ్. నిన్ను మా ఇంటికి తీసుకెళ్లడానికి మాత్రమే ప్రయత్నాలు చేస్తున్నానని చెబుతుంది ఇందూ. ఆ పాలలో ఏదైనా కలిపావేమో నేను మాత్రం తాగను అంటాడు రాజ్. ఊరుకుంటుంటే ఓవరాక్షన్ చేస్తున్నావు.. అయినా నేను ఒక చూపు చూస్తే చాలు నువ్వే ఒప్పుకుంటావని అంటుంది ఇందూ. ఆడవాళ్ల చూపుకి కరిగిపోయేంత వీక్ కాదు, మనం రాయి లాంటివాడిని చలనం కూడా ఉండదని చెబుతాడు రాజ్.
దాంతో రాజ్‌ని టచ్ చేస్తుంది ఇందూ. ఆ దెబ్బతో మెలికలు తిరుగుతాడు రాజ్. ఇంట్లో నుంచి నేను వచ్చేశానా? నువ్వే పంపించావా అని అడుగుతాడు. తప్పు నాదేనని చెంపలు వేసుకుంటుంది ఇందూ. నన్ను అంతలా అవమానించి, ఇప్పుడు తప్పయిపోయిందని మెలికలు తిరిగితే నేను వస్తాను అనుకుంటున్నావా? అస్సలు రాను అంటాడు రాజ్. నువ్వు ఇక్కడే ఉంటే నన్ను ఏదో ఒకటి చేసేలా ఉన్నావని ఇందూని బయటకు గెంటేస్తాడు రాజ్. నన్నే బయటకు గెంటేస్తావా? నిన్ను ఒప్పించకపోతే నా పేరు ఇందూనే కాదు అనుకుంటుంది.
ఉదయాన్నే నిద్రలేచిన రాజ్.. ఇందూ కోసం వెతుకుతాడు. అయితే ఇంట్లో ఎక్కడా ఇందూ లేకపోవడంతో వెళ్లిపోయిందని సంతోషిస్తాడు. అయితే ఉదయాన్నే ఇందూ టెంట్ వేసి ప్లకార్డులు పట్టుకుని ధర్నా చేస్తుంది అది చూసి రాజ్ షాక్ అవుతాడు. కోడలికి చలపతి, లక్ష్మీలు కూడా సహకరిస్తారు. దీనిని ఆపాల్సిందిపోయి.. దానితో కలిసి మీరు కూడా ధర్నా చేస్తారా అని ఫైర్ అవుతాడు రాజ్. తను నీ కోసం నిరాహార దీక్ష చేస్తానని అడగటంతో కోడలికి సాయం చేస్తున్నానని చెబుతాడు చలపతి. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications