Brahmamudi july 19th episode: రాజ్ కి వార్నింగ్ ఇచ్చిన ఇందిరాదేవి.. స్వప్నతో చాలెంజ్ చేసిన రాహుల్!

జీవితంలో భర్తని క్షమించలేనంటుంది అపర్ణ. అత్తగారి మనసు మార్చే ప్రయత్నం చేస్తుంది కావ్య. మరోవైపు అప్పుని అరెస్టు చేశారని ఆవేశంగా స్టేషన్ కి వెళ్లి పోలీసుని కొట్టిన కళ్యాణ్ ని కూడా అరెస్టు చేస్తారు పోలీసులు. కళ్యాణ్ ని విడిపించడానికి వచ్చిన రాజ్ ని కూడా అరెస్టు చేస్తారు పోలీసులు.చాకచక్యంతో వాళ్లని విడిపించుకొస్తుంది కావ్య. అందరి బాగోగుల గురించి ఆలోచించింది చాలు ఇక మీ సంసారం చక్కదిద్దుకోండి అని కావ్య దంపతులకు ఉపదేశిస్తారు అపర్ణ, ఇందిరాదేవి.ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలెట్‌గా మిగిలాయి. ఇక జులై 19వ తేదీ ఎపిసోడ్ 466లో ఏం జరిగిందంటే..

పొద్దున్నే ప్రశాంతంగా మెడిటేషన్ చేసుకుంటున్న కళ్యాణ్ ని చూసి ఆనందిస్తుంది ధాన్యలక్ష్మి. అప్పుడే జాగింగ్ నుంచి వచ్చిన భర్తకి కొడుకుని చూపిస్తుంది. ప్రకాష్ కూడా ఆనందించి ఇకమీదట నా కొడుకుని అది చేయు, ఇది చేయు అంటూ విసిగించొద్దు, వాడికి నచ్చిన పనిని వాడిని చేసుకోనివ్వు అంటాడు ప్రకాష్. మీరు చాలా విషయాలు మరిచిపోతుంటారు కదా ఇలాంటి విషయాలు మర్చిపోరేంటి అంటుంది ధాన్యలక్ష్మి. నువ్వు, నీ కోడలు నా కొడుక్కి చేసిన అన్యాయం నేను జీవితంలో మర్చిపోలేను అంటూ వెళ్ళిపోతాడు ప్రకాష్.

Brahmamudi serial July 19th 2024 Episode of 466 Here is full story

మరోవైపు మెడిటేషన్ చేస్తున్న కళ్యాణ్ చూసి ఆనందిస్తాడు రాజ్. కావ్య కూడా కళ్యాణ్ మామూలు మనిషి అవుతున్నందుకు ఆనందిస్తుంది అతని కోసం జ్యూస్ తీసుకువెళ్లి ఇస్తుంది. మీరు మళ్ళీ మామూలు మనిషి కావటం ఆనందంగా ఉంది గతాన్ని మర్చిపోండి, భవిష్యత్తు వైపు అడుగులు వేయండి అని అతనికి ధైర్యం చెప్తుంది. తర్వాత రాజ్ కూడా కళ్యాణ్ దగ్గరికి వెళ్లి కళ్యాణ్ కి ధైర్యం చెప్తాడు. మరోవైపు పని చేసుకుంటున్న కావ్య దగ్గరికి ఆనందంగా వస్తారు అపర్ణ, ఇందిరా దేవి.

రాత్రి ఏమీ జరగలేదని తెలుసుకుని కావ్యని మండలిస్తారు. నేనేం చేసేది మీ అబ్బాయి నేను తప్పులు చేశానంట, వాటిని క్షమించేసారంట అంటూ జరిగిందంతా చెప్తుంది. వాడు రెచ్చిపోతే నువ్వు కూడా రెచ్చిపోవటమేనా ఒక అడుగు తగ్గితే ఏం పోయింది అంటుంది అపర్ణ.

మరి మీరు ఎందుకు మావయ్య గారి దగ్గర తగ్గటం లేదు అంటుంది కావ్య. మధ్యలో మమ్మల్ని ఎందుకు లాగుతావు ముందు నీ సంగతి చూడు అంటుంది అపర్ణ. ఇందిరా దేవి కూడా మొగుణ్ణి కొంగుకి కట్టుకోవడం రాదు అని కావ్యని చిన్నగా మందలిస్తుంది ఇంతలో రాజ్ రావడం చూసి నువ్వు వెళ్లి నీ పని చూసుకో నేను వాడి పని చెప్తాను అంటుంది ఇందిరా దేవి. నేను కూడా వెళ్తాను మీ మనవడికి బాగా గడ్డి పెట్టండి. అసలు వాడిని మీరే పాడు చేశారు అంటుంది అపర్ణ.

అవును మరి నీ కొడుకు శుద్ధపూస అంటూ రాజ్ దగ్గరికి వెళ్తుంది ఇందిరాదేవి. ఆమె దగ్గర నుంచి తప్పించుకోవాలనుకుంటాడు కానీ ఇందిరా దేవి వదలదు. నేను ఏమని చెప్పి పంపించాను నువ్వేం చేసావు అని నిలదీస్తుంది. రాత్రి జరిగింది అంతా చెప్పేసినట్లుంది అని పెళ్ళాన్ని తిట్టుకుంటాడు రాజ్. నువ్వు ఏం చేస్తావో తెలియదు మూడు నెలలలో నా మనవరాలు నెల తప్పాలి అంటూ డెడ్ లైన్ పెడుతుంది ఇందిరా దేవి.

సరే అంటాడు రాజ్.సరే అంటూ ఇంకా ఇక్కడే ఉంటావేంటి వెళ్ళు అంటూ కావ్య దగ్గరికి పంపిస్తుంది ఇందిరాదేవి. అక్కడ కూడా మళ్లీ పోట్లాడుకుంటారు రాజ్, కావ్య. వాళ్ళిద్దర్నీ చూసి తిట్టుకుంటారు ఇందిరా దేవి, అపర్ణ. మరోవైపు రాహుల్ తన గర్ల్ ఫ్రెండ్స్ కి ఫోన్ చేస్తుంటాడు ఎవరు లిఫ్ట్ చేయకపోవడంతో చిరాకు పడతాడు. అప్పుడే స్నానం చేసి వచ్చిన స్వప్నని చూసి ఈమధ్య ఇది కూడా అందంగానే కనిపిస్తుంది అనుకుంటూ ఆమెని దగ్గరికి తీసుకుంటాడు.

పనిలో పడి ఇన్నాళ్ళు నిన్ను పట్టించుకోవడం మానేశాను అంటాడు.ఏమిటి ఈరోజు నా మీద దృస్టి మళ్ళింది మీ గర్ల్ ఫ్రెండ్స్ ఎవరు ఫోన్ ఎత్తలేదా అంటుంది. ఏం మాట్లాడుతున్నావ్ నాకు గా నేను దగ్గరకొచ్చానని ఇలా అంటున్నావా అంటాడు రాహుల్. నువ్వు రాత్రి నుంచి నీ గర్ల్ ఫ్రెండ్స్ కి ఎన్నిసార్లు ఫోన్ చేసావో చూపించమంటావా నీ వెధవ వేషాలు తగ్గినప్పుడే నిన్ను నా దగ్గరికి రానిస్తాను అంటుంది స్వప్న.

నేనే గ్రేట్ అంటూ నువ్వే నా కళ్ళు పట్టుకుంటావు చూడు అంటూ స్వప్నతో చాలెంజ్ చేసి కోపంగా వెళ్ళిపోతాడు రాహుల్. మరోవైపు స్వప్నతో సాఫ్ట్ గా మాట్లాడటానికి ప్రయత్నిస్తూ ఉంటాడు రాజ్. కానీ కావ్య అవకాశం ఇవ్వదు. కోపంతో వెనక్కు తిరిగి వచ్చేస్తుంటే కోపంగా చూస్తున్న తల్లి, నానమ్మ గుర్తొస్తారు. మళ్ళీ భార్య దగ్గరికి వెళ్తాడు రాజ్. ఇదంతా గమనిస్తున్న రుద్రాణి వీడేమిటి కావ్య వెనుక తిరుగుతున్నాడు అనుకుంటూ వాళ్ళనే గమనిస్తూ ఉంటుంది.

తరువాయి భాగంలో భార్యని హోటల్ కి తీసుకు వెళ్తాడు రాజ్. అప్పుడప్పుడు ఇలా తీసుకువస్తూ ఉండండి కొంచెం ప్రశాంతంగా ఉంటుంది కావ్య. ఇది ఆరంభం మాత్రమే ఇకనుంచి నీకు అన్ని త్రిల్స్ ఇవ్వబోతున్నాను అంటాడు రాజ్. ఇంతలోనే రెస్టారెంట్ స్టాఫ్ మాట్లాడుతూ ఈరోజు మన రెస్టారెంట్ కి ఒక స్పెషల్ గెస్ట్ వచ్చారు, ఆయనే దుగ్గిరాల స్వరాజ్ గారు ఇప్పుడు ఆయన, ఆయన భార్యకి ఒక సర్ప్రైజ్ ఇవ్వబోతున్నారు అని చెప్తాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X