Brahmamudi July 19th Episode: యామిని సూపర్ ట్విస్ట్.. కోర్టు బోనులో దోషిలా కావ్య.. షాక్‌లో అప్పూ

Photo Courtesy: JioHotstar

జగదీష్, రేవతిలను బయటికి గెంటేసి ఆస్తి పేపర్లను ముఖాన కొడుతుంది అపర్ణ. నాకు ఏ ఆస్తి అక్కర్లేదని, మీరు మనసు మార్చుకుని పిలిచిన రోజునే తిరిగి ఇంటికి వస్తామని చెప్పి వెళ్లిపోతుంది రేవతి. ఇదంతా కావ్యకి చెప్పి బాధపడుతుంది ఇందిర. రేవతిని ఈ ఇంటితో కలిపే బాధ్యత నాదని, మీరు బాధపడొద్దని మాట ఇస్తుంది కావ్య. రేవతి కొడుకు మాటలు, వాడి ప్రవర్తన గుర్తొచ్చి నవ్వుకుంటుంది అపర్ణ. ఆమెను చూసిన సుభాష్.. ఏం జరిగిందని అడగ్గా రోడ్డుపై జరిగినదంతా చెబుతుంది అపర్ణ.

కావ్యకి యామిని ఫోన్ చేసి నువ్వు సాక్షిని వెతుక్కుంటూ రావడం వల్ల నీ చెల్లెలికి రెండు శిక్షలు పడతాయని భయపెడుతుంది. నేను ఖచ్చితంగా అప్పూని విడిపిస్తానని నువ్వు ఓడిపోవడానికి సిద్ధంగా ఉండమని అంటుంది కావ్య. అప్పూ కోసం బాధపడుతున్న రాజ్‌కి యామిని చిన్న క్లూ ఇస్తుంది. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. ఇక జూలై 19వ తేదీ ఎపిసోడ్ 778లో ఏం జరిగిందంటే?

Brahmamudi Serial July 19th 2025 Episode 778 Here is Today s full story

Photo Courtesy: JioHotstar

శీనుగాడు వాళ్ల అమ్మకి తప్పకుండా ఫోన్ చేస్తాడని ఆ సిగ్నల్ ఆధారంగా వాడిని పట్టుకోవాలని అనుకుంటాడు రాజ్. వెంటనే రేవతికి ఫోన్ చేసి నీతో సాయం పడిందని అంటాడు. నువ్వు అడిగితే సాయం ఏంటీ? ప్రాణం కూడా సంతోషంగా ఇచ్చేస్తానని అంటుంది రేవతి. ఈ ప్రపంచంలో ఎవడికైనా అమ్మ అంటే ఇష్టం ఉంటుందని, శీనుగాడికి కూడా వాళ్ల అమ్మ అంటే ప్రేమ ఉండి ఉంటుందని చెబుతాడు రాజ్. ఆ ప్రేమే ఏదో ఒక టైంలో వాళ్ల అమ్మకి కాల్ చేసేలా చేస్తుందని, నువ్వు ఈ ఒక్క రాత్రికి ఆ శీనుగాడి అమ్మ దగ్గర ఉండగలిగితే వాడు ఫోన్ చేసిన విషయం నీకు తెలుస్తుందని అంటాడు రాజ్. వాడు ఎక్కడున్నా సరే నేను తీసుకొచ్చేస్తానని చెబుతాడు. రేవతి అలాగేనని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది.

రాజ్ కోసం కోర్టులో అప్పూ, కావ్య, కళ్యాణ్ ఎదురుచూస్తుంటారు. ఇంతలో రాజ్ కోర్టుకు వస్తాడు. ఆ శీనుగాడి ఆచూకి గురించి నాకేం తెలియదని, నేను కూడా దాని గురించే ఆలోచిస్తున్నానని అంటాడు రాజ్. కాసేపట్లో హియరింగ్ ప్రారంభమవుతుందని, ఈ లోపు మనం శీనుగాడిని పట్టుకుని కోర్టులో హాజరు పరచకుంటే జడ్జిగారు అప్పూని సస్పెండ్ చేసి శిక్ష కూడా వేస్తారని చెబుతుంది కావ్య. మీరు భయపడినట్లుగా ఏం జరగదని, నేను రాత్రి రేవతి అక్కతో ఫోన్‌లో మాట్లాడానని వాడికి సంబంధించిన ఏ ఇన్ఫర్మేషన్ తెలిసినా నాకు కాల్ చేస్తానని అంటాడు రాజ్. నేను ఆమె ఫోన్ కోసమే ఎదురుచూస్తున్నానని చెబుతాడు. ఇంతలో రేవతి ఫోన్ చేస్తుంది.

రాత్రి శీనుగాడు వాళ్ల అమ్మకి కాల్ చేశాడని జరిగనదంతా కాల్ చేసి చెబుతుంది. యామిని అడ్డాలో ఉన్న శీనుగాడు.. రెండ్రోజులు నేను ఇంటికి రావడం లేదని అమ్మకి ఫోన్ చేసి చెప్పాలని లేదంటే కిడ్నాప్ అయ్యానని బాధపడుతుందని అనుకుంటాడు. యామిని మనిషి దగ్గర ఫోన్ కొట్టేసిన శీనుగాడు.. వెంటనే వాళ్ల అమ్మకి కాల్ చేస్తాడు. నువ్వు ఎవరినో అరెస్ట్ చేయించడం ఏంటీ? నిన్ను ఎవరో కిడ్నాప్ చేయడం ఏంటీ అని అడుగుతుంది తల్లి. నేను కిడ్నాప్ అవ్వలేదని, ఇదంతా నాటకమని నేను ఇంటికొచ్చాక మొత్తం చెబుతానని ఫోన్ పెట్టేస్తాడు శీనుగాడు. ఆ మాటలు విన్న రాజ్.. రేవతికి థ్యాంక్స్ చెబుతాడు.

ఆ శీనుగాడు రాత్రికి వాళ్ల అమ్మకి కాల్ చేశాడని కావ్యతో చెబుతాడు రాజ్. నాకు పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో హెల్ప్ కావాలని అప్పూని అడగటంతో మా హెడ్ కానిస్టేబుల్ శేషు మీకు సాచయం చేస్తాడని చెబుతుంది అప్పూ. శీనుగాడిని తీసుకొని వస్తానని రాజ్ చెప్పగా .. నేను కూడా వస్తానని కావ్య అంటుంది. మీరు అప్పూ దగ్గరే ఉండండి నేనొక్కడినే వెళ్తానని అంటాడు రాజ్. ఇంతలో యామిని వచ్చి లోపల భయపడుతూ పైకి ధైర్యంగా ఉన్నట్లు నటిస్తున్నావా? అని సెటైర్లు వేస్తుంది. అప్పూని ఎలా కాపాడుకోవాలో అర్ధం కావడం లేదా? అని ప్రశ్నిస్తుంది. నాకేమో రాజ్ కావాలి? నీకేమో నీ చెల్లెలు కావాలి? నువ్వు రాజ్ బావని వదిలేసి తనని నా దగ్గరికి పంపిస్తానని మాటిస్తే .. ఆ శీనుని తీసుకొచ్చి మీ చెల్లెల్ని నిర్దోషిగా బయటికి తీసుకొస్తానని అంటుంది యామిని.

రాజ్ బావని నాకు కాకుండా చేస్తావో.. లేక రాజ్‌ని నా దగ్గరికి పంపించి, నీ చెల్లెలి జీవితాన్ని పాడు చేస్తావో ఆలోచించుకో అని చెబుతుంది కావ్య. నీకు ఎక్కువ టైం లేదని బావ కావాలా? నీ చెల్లెలి జీవితం కావాలా అని అడుగుతుంది. దాంతో రెండూ కావాలని అంటుంది కావ్య. నువ్వు సాయం చేయకపోతే నేను నా చెల్లెల్ని కాపాడుకోలేను అనుకుంటున్నావా? అని మండిపడుతుంది. నీ సాయం లేకుండానే నేను అప్పూని కాపాడుకుంటానని సవాల్ విసురుతుంది కావ్య. ఆ శీనుగాడిని తీసుకొచ్చి నీ చెల్లెలు తప్పు చేయలేదని నిజం చెప్పించడం తప్పించి నీకు వేరే ఆప్షనే లేదని అంటుంది యామిని. ఆ శీనుగాడు ఎక్కడ ఉన్నాడో నీకు తెలియదని చెబుతుంది. ఆల్రెడీ రాజ్ గారు శీనుగాడి దగ్గరికే వెళ్లాడని కొద్దిసేపట్లో వాడిని పట్టుకుని తీసుకొస్తారని అంటుంది కావ్య. ఆ మాటలతో యామిని షాక్ అవుతుంది.

శీనుగాడి చుట్టూ ఎలాంటి వాళ్లని కాపలా పెట్టానో తెలుసా? ఆ మాయల పకీరు ప్రాణం చిలుకలో ఉన్నట్లు ఆ శీను ఇప్పుడు నా గుప్పిట్లో ఉన్నాడని అంటుంది యామిని. ఎలాగైనా శీనుగాడిని ఇక్కడికి తీసుకొస్తామని కావ్య చెప్పడంతో యామిని షాక్ అవుతుంది. వెంటనే తన మనుషుల్ని అలర్ట్ చేస్తుంది. శీనుగాడి ఇంటికి వచ్చిన రాజ్.. మీ అబ్బాయి గురించి ఏమైనా తెలిసిందా అని అడుగుతాడు. కొడుక్కి ఏమైనా సమస్యలు వస్తాయని భయపడ్డ శీనుగాడి తల్లి నాకు ఫోన్ రాలేదని అబద్ధం చెబుతుంది. మీరు వాడిని కోర్టుకు తీసుకెళ్తే నా కొడుకుని జైలుకి పంపిస్తారని అంటుంది శీనుగాడి తల్లి.

శీనుగాడి తల్లి ఫోన్ నుంచి వాడికి ఫోన్ చేసి మీ అమ్మకి యాక్సిడెంట్ జరిగిందని చెబుతాడు రాజ్. దాంతో టెన్షన్ పడ్డ శీనుగాడు.. వెంటనే ఇంటికి బయల్దేరబోతుండగా యామిని మనిషి చూసి కత్తితో బెదిరిస్తాడు. శీనుగాడిని యామిని మనుషులు ఆపేస్తారని నేనే వాడి దగ్గరికి వెళ్తానని కానిస్టేబుల్ శేషుకి శీనుగాడి నెంబర్ ట్రేస్ చేయమని చెబుతాడు రాజ్. కోర్టులో అప్పూని బోనులో నిలబెట్టి విచారణ చేయిస్తుండగా సాక్షి శీనుగాడు కనిపించడం లేదని జడ్జిగారికి చెబుతారు పోలీసులు. ఇంతలో శీనుగాడి లోకేషన్‌‌ను రాజ్‌కి పంపిస్తాడు శేషు. తర్వాత కావ్యని బోనులో నిలబెట్టి ఎంక్వైరీ చేస్తారు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X