Brahmamudi July 1st Episode: రాజ్ ప్రేమలో ఇందూ.. రాజ్ అడ్డు తొలగించుకునేలా రేఖ కుట్ర
Photo Courtesy: JioHotstar
రాజ్‌ని ఇలాగే వదిలేస్తే మీ అందరినీ పనిమనుషులుగా మార్చేసి, మీపై పెత్తనం చేస్తాడని శేషం చెప్పడంతో రేఖ, భ్రమరాంబలు షాక్ అవుతారు. నేను ఎప్పటికీ ఓటమిని ఒప్పుకోను, ఖచ్చితంగా ఆ రాజ్‌గాడికి రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని రగిలిపోతుంది రేఖ. కాస్తుంటే అమ్మనాన్నలకి దొరికిపోయేవాడినని నందూ దగ్గర బాధపడతాడు. ఈ విషయం వాళ్లతో చెబితే నీకు మనశ్శాంతి దొరుకుతుందని నందూ సలహా ఇస్తాడు. నా కోసం అమ్మనాన్న, మా అన్నయ్య ఎంతో త్యాగం చేశారు.. ఇప్పటికీ కష్టపడుతున్నారు అలాంటి వాళ్లకు నేను డెలివరీ బాయ్ ఉద్యోగం చేస్తున్నానని తెలిస్తే తట్టుకోలేరని బాధపడతాడు నందూ.
ఇందూకి అండగా నిలిచి కంపెనీకి కాంట్రాక్ట్ దక్కేలా చేశావని రాజ్‌ను సుభాష్, అపర్ణలు మెచ్చుకుంటారు. ఇకపై మీ ఇద్దరికీ శత్రువులు ఎక్కువ అవుతారని, జాగ్రత్తగా ఉండమని ఇద్దరికీ సుభాష్ వార్నింగ్ ఇస్తాడు. వెంకీ అర్ధరాత్రి ఇంటికి రాగానే టిప్స్ బాగా వచ్చాయా అని అడుగుతాడు చలపతి. మేం నిన్ను ఎలా చూడాలనుకున్నాం.. నువ్వు ఎలా ఉన్నావని బాధపడతాడు. ఉద్యోగం వచ్చే వరకు మీకు అండగా నిలబడటానికే అలా చేశానని చెబుతాడు వెంకీ. నువ్వు ఆ డెలివరీ బాయ్ జాబ్ మానేయ్.. నీ ఖర్చులకు, ఇంటి సంగతి నేను చూసుకుంటానని చెప్పడంతో తండ్రిని వెంకీ హత్తుకుంటాడు. ఇంతలో నందూ వచ్చి వాడు ఇప్పుడిప్పుడే దారిలో పడుతున్నాడు, చెడగొట్టద్దని చెప్పడంతో డెలివరీ బాయ్‌గా ఉండటానికి చలపతి ఒప్పుకుంటాడు. రాజ్‌కి స్వీట్స్ తినిపించడానికి ఇందూ రావడంతో అతను ఇదంతా కల అనుకుంటాడు. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. ఇక జూలై 1వ తేదీ ఎపిసోడ్ 1073లో ఇంకా ఏం జరిగిందంటే?

Photo Courtesy: JioHotstar
ఇందూ తనకు స్వీట్ తినిపిస్తుండగా అదంతా కల అనుకుంటాడు రాజ్. అయితే ఇందూ తన వెనకే వస్తున్నా పట్టించుకోకపోవడంతో మండిపడుతుంది. ఇదంతా నీ ఊహా కాదు.. నిజమని టెస్ట్ చేసుకోమని చెబుతుంది. దాంతో మంచం మీద కూర్చోమని, నిల్చోమని అంటాడు రాజ్. నేను చెప్పినట్లు చేస్తున్నావంటే నువ్వు ఖచ్చితంగా నా ఊహావే, నిజం కాదు. నిజంగా ఇందూ అయితే నా మాట అస్సలు వినవని అంటాడు రాజ్. అయితే నేనే నిన్ను గిల్లుతున్నానని గిల్లడంతో రాజ్ కేకలు పెడతాడు. నువ్వు నాకు స్వీట్ తినిపించడానికి వచ్చావా? నేను నమ్మలేకపోతున్నానని అంటాడు రాజ్. నీలో ఇంత సాధు స్వభావం, ప్రేమా ఉన్నాయా అని ప్రశ్నిస్తాడు.
నీ వల్లే కదా ఈరోజు డీల్ సక్సెస్‌ఫుల్‌గా జరిగింది. నువ్వు ఇచ్చిన ఐడియా వల్లే చివరి నిమిషంలో శృతిగారు వచ్చి డిజైన్స్ ఇచ్చారు అలా మన డీల్ ఫినిష్ అయ్యిందని మెచ్చుకుంటుంది ఇందూ. చివరికి రాజ్‌కి ఇందూయే స్వీట్ తినిపించి దానిని తను తినడంతో షాక్ అవుతాడు. అతని చేయి పట్టుకుని ఈరోజు నేను ఇలా ఉన్నానంటే దానికి కారణం నువ్వే, ఈ క్షణంలో నా ముఖంలో కనిపించే సంతోషానికి కారణం నువ్వే, నువ్వొచ్చిన తర్వాతే ఆఫీసులో అడుగుపెట్టాను, ఎంప్లాయిస్‌కి శాలరీ విషయంలో హెల్ప్ చేశావు, ఇప్పుడు కాంట్రాక్ట్ ఓకే అవ్వడం కూడా నీ వల్లేనని అంటుంది. నువ్వు రాకముందు ఒక ప్రాణం లేని కట్టెగా ఉన్న నేను.. నువ్వొచ్చిన తర్వాతే చిగురించడం మొదలుపెట్టాను, నువ్వు ఇలాగే నా చేయి పట్టుకుని జీవితాంతం నాకు తోడుగా ఉంటేనని ఎమోషనల్ అవుతుంది.
ఒంటరిగా గదిలో కూర్చొని ఏడుస్తున్న రేఖ దగ్గరికి ఐశ్వర్య వచ్చి ముందు ముందు మీకు ఏం మిగలదని అంటుంది. ఆ రాజ్- ఇందూ ఇద్దరూ తోడు దొంగలే, కానీ మీరు నన్ము నమ్మలేదని అంటుంది ఐశ్వర్య. పార్టీలో వాళ్లిద్దరూ చాలా తెలివిగా మిమ్మల్ని ఫూల్‌ని చేశారు. ఇంత వరకు ఆ రాజ్‌గాడు వాళ్ల అమ్మానాన్నల్ని ఎందుకు తీసుకురాలేదు అని ప్రశ్నిస్తుంది ఐశ్వర్య. వాళ్ల దగ్గరికి మనల్ని ఎందుకు తీసుకెళ్లలేదు. ఈ ఫ్యామిలీలో ఎవ్వరినీ కూడా ఎందుకు తీసుకెళ్లలేదు, నిజంగా పెళ్లి చేసుకుంటే ఇంట్లో వాళ్లకి విషయం చెప్పాలి కదా? అని అంటుంది. వాళ్ళ పెళ్లి వెనుక ఏదో మతలబు ఉంది, అందుకే వాళ్ల అమ్మానాన్నలని దాచి పెడుతున్నాడని చెప్పడంతో రేఖ ఆలోచనలో పడుతుంది. నీకు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వబోతున్నాను.. వెయిట్ అండ్ వాచ్ అని రాజ్ గురించి మండిపడుతుంది రేఖ.
మరోవైపు.. నన్ను ఒక కారణంతో ఇక్కడికి తీసుకొచ్చావు. ఆ కారణం పూర్తయ్యే వరకు నేను అనుకునే పని నెరవేరే వరకు ఎదురుగా ఎవరున్నా, ఎన్ని ప్లాన్స్ వేసినా నేను నీతోనే ఉంటాను. ఈ లోకంలో నాకు డబ్బును మించిన కిక్ ఏది ఇవ్వదు, నేను డబ్బు కోసం ఏదైనా చేస్తాను. నాలో ఉన్న స్ట్రాంగ్ ఎమోషన్ అదొక్కటే కాదు.. డబ్బులు తీసుకున్నాక పని పూర్తయ్యే వరకు అస్సలు వదిలిపెట్టను, తీసుకున్న దానికి న్యాయం చేస్తానని అంటాడు రాజ్. అంతా బాగానే ఉంది కానీ మనిద్దరం కలిసి డీల్ ఓకే చేయించుకుని రేఖ ఆంటీని దెబ్బ కొట్టాం కదా? ఇప్పుడు తను ఏం చేస్తుందోనని కంగారుగా ఉందని భయపడుతుంది ఇందూ. రేఖ పిన్ని ఏం చేసినా కానీ తిప్పి కొట్టడానికి మనిద్దరం ఉన్నాం కదా అంటాడు రాజ్.
రేఖ రెచ్చగొట్టడంతో చలపతికి అప్పు ఇచ్చిన సేట్ తమ్ముడు కోపంతో ఊగిపోతాడు. మా అన్నయ్యకి రెండు లక్షలు ఇవ్వాలి కదా అవి ఇప్పుడే ఇవ్వమన్నాడని అనడంతో చలపతి, లక్ష్మీ, వెంకీలు షాక్ వుతారు. మేం ఆల్రెడీ శంకర్‌కి చెప్పాం కదా అని అంటాడు చలపతి. మీరు చెప్పింది నిజమని మా అన్నయ్య ఓపిక పడదామనే అనుకున్నాడు. కానీ మీరు మమ్మల్ని మోసం చేస్తున్నారని ఆ వ్యక్తి అనడంతో అంతా షాక్ అవుతారు. మీ చిన్నోడికి ఉద్యోగం లేదు ఓకే.. మరి మీ పెద్దోడి సంగతి ఏంటీ? అని ప్రశ్నిస్తాడు ఆ వ్యక్తి.
మీ పెద్దకొడుకు గొప్పింటి అల్లుడని నిజం చెప్పొచ్చు కదా అని అనడంతో అంతా షాక్ అవుతారు. మీ కొడుకుని గొప్పింటికి అల్లుడిని చేసి వాళ్ల ఆస్తిని నొక్కేయాలని చూస్తున్నారు. మా అప్పుల్ని మాత్రం ఎగ్గొడతారా అని మండిపడతాడు ఆ వ్యక్తి. మీ అన్నయ్య రాజ్ .. దుగ్గిరాల ఇంటికి అల్లుడయ్యాడని చెప్పడంతో అంతా అవాక్కవుతారు. వాళ్లకి వేలకోట్ల ఆస్తి ఉంది, ఆ ఇంటికి వారసురాలు.. సుభాష్- అపర్ణ దేవిల మనవరాలు, రాజ్- కావ్యల కూతురైన ఇందూ గారి పేరు మీదుంది. ఆ ఇందూ గారినే మీ పెద్దబ్బాయి రాజు పెళ్లి చేసుకున్నాడని చెప్పడంతో చలపతి కుటుంబం షాక్ అవుతుంది.
24 గంటల్లోపు నా డబ్బులు నాకు ఇవ్వాలి, నీ కొడుకు మాత్రం కోటీశ్వరుడి అల్లుడు కాబట్టి నాకు ఇవ్వు.. లేదంటే రోడ్డెక్కాల్సి వస్తుందని వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోతాడు. మీరు చెప్పినట్లుగానే చేశానని ఆ వ్యక్తి వెళ్లి రేఖతో చెబుతాడు. మీ అమ్మనాన్నల దగ్గర నీ పెళ్లి విషయం దాచిపెట్టావు, మా ఇంట్లోనే ఉంటూ నాకే ప్రతిసారి అడ్డుపడుతున్నావు, అందుకే అడ్డు తొలగించుకోవాలని మీ అమ్మనాన్నల దగ్గర బయటపెట్టించాను, ఇప్పుడు వాళ్లు అక్కడికి వస్తారు.. నువ్వేం సమాధానం చెబుతావో చూస్తావని అనుకుంటుంది రేఖ.
అన్నయ్య సంగతి మేం చూసుకుంటామని వెంకీని వెళ్లిపోమని చెబుతాడు చలపతి. ఇందూని ఈవెంట్ మేనేజర్ అని మనింటికి తీసుకొచ్చాడు కదా? అంటే అబద్ధమేనా అని లక్ష్మీ బాధపడుతుంది. మనం ఏదైతే జరగకూడదని అనుకున్నామో అదే జరుగుతోంది. వాడు అక్కడుంటే వాడి ప్రాణాలు పోతాయని చలపతి కంగారుపడతాడు. ముందు నిజమేంటో తెలుసుకోవాలి.. ఆ దుగ్గిరాల ఇంటికి వెళ్లాలి, వాడిని అక్కడి నుంచి తీసుకొచ్చేద్దామని బయల్దేరతారు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications