Brahmamudi July 20th episode: కళ్యాణ్‌కు అప్పు స్ట్రాంగ్ రిప్లై..రాహుల్ తిక్క కుదిర్చిన స్వప్న!
అప్పుని అరెస్టు చేశారని ఆవేశంగా స్టేషన్ కి వెళ్లి పోలీసుని కొట్టిన కళ్యాణ్ ని కూడా అరెస్టు చేస్తారు పోలీసులు. కళ్యాణ్ ని విడిపించడానికి వచ్చిన రాజ్ ని కూడా అరెస్టు చేస్తారు పోలీసులు.చాకచక్యంతో వాళ్లని విడిపించుకొస్తుంది కావ్య. అందరి బాగోగుల గురించి ఆలోచించింది చాలు ఇక మీ సంసారం చక్కదిద్దుకోండి అని కావ్య దంపతులకు ఉపదేశిస్తారు అపర్ణ, ఇందిరాదేవి. మరోవైపు తన దగ్గరికి వచ్చిన భర్తని వెధవ వేషాలు మానేస్తేనే దగ్గరికి రానిస్తానంటుంది స్వప్న. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలెట్‌గా మిగిలాయి. ఇక జులై 20వ తేదీ ఎపిసోడ్ 467లో ఏం జరిగిందంటే..
రాత్రి డిన్నర్ కి వెళ్దాం పద అంటాడు రాజ్. ఇది మీరు ప్రేమతో పిలుస్తున్నట్లుగా లేదు డిమాండ్ చేస్తున్నట్లుగా ఉంది ఒక భర్త ఒక భార్యని ఎలా పిలుస్తారో అలా పిలవండి అప్పుడు ఆలోచిస్తాను అంటుంది కావ్య. సాయంత్రం నీతో డిన్నర్ చేయాలని ఉంది వస్తావా అని గోముగా అడుగుతాడు రాజ్. ఇది బాగుంది ఇలా పిలిస్తే తప్పకుండా వస్తాను అని నవ్వుతూ వెళ్ళిపోతుంది కావ్య. ఇదంతా చూస్తున్న రుద్రాణి భార్యని డిన్నర్ కు తీసుకువెళ్తావా ఎలా తీసుకువెళ్తావో నేను చూస్తాను అంటూ విషయం రాహుల్ కి చెప్తుంది.

ఇప్పుడు వాళ్ళిద్దరూ డిన్నర్ కి వెళ్ళకూడదు అంతే కదా అర్జెంట్ మీటింగ్ ఉందని చెప్పి రాజ్ ని నాతో పాటు ఆఫీస్ కి తీసుకెళ్ళిపోతాను అంటాడు రాహుల్. అనుకోకుండా ఈ మాటలు స్వప్న వినేస్తుంది. శుభమా అని నా చెల్లెలు భర్తతో కలిసి బయటికి వెళ్తుంటే ఆపడానికి ప్రయత్నిస్తారా అంటూ కిచెన్లోకి వెళ్లి జ్యూస్ లో మోషన్ టాబ్లెట్స్ కలిపి రాహుల్ కి ఇచ్చి తాగమంటుంది. ఇప్పుడే కదా నన్ను కసురుకున్నావు మళ్లీ ఇప్పుడే జ్యూస్ ఇస్తున్నావు అంటూ స్వప్న మీద చిరాకుపడతాడు రాహుల్.
కానీ స్వప్న వదలకుండా రాహుల్ టెంప్ట్ అయ్యేలాగా మాట్లాడి జ్యూస్ తాగేలా చేస్తుంది. అప్పుడే రాజ్, కావ్య బయటికి వెళ్ళడం చూసిన రాహుల్ వాళ్ళని ఆపి ఆఫీసులో అర్జెంట్ మీటింగ్ ఉంది నువ్వు నాతో రావాలి అంటాడు. అంత ఇంపార్టెంట్ మీటింగ్ అయితే డాడీ నాతో చెప్పేవారు కదా అంటాడు రాజ్. వాళ్ళిద్దరూ కలిసి బయటికి వెళ్తాను అంటే మధ్యలో నీ గొడవ ఏంటి అంటుంది స్వప్న. అప్పటికే రాహుల్ స్టమక్ డిస్టబెన్స్ అవ్వటం స్టార్ట్ అవుతుంది.

వాళ్లతో మాట్లాడలేక వాష్ రూమ్ కి పరిగెడతాడు.రాహుల్ అలాగే అంటాడు మీరు వెళ్ళండి అని చెప్పి కావ్య వాళ్ళని పంపించేస్తుంది స్వప్న. వాష్ రూమ్ నుంచి వచ్చిన రాహుల్ వీళ్ళు ఏరి అని అడుగుతాడు. నీ పెళ్ళాం దగ్గరుండి పంపించింది అని చెప్తుంది రుద్రాణి. స్వప్నని కోప్పడతాడు రాహుల్. మళ్లీ వాష్ రూమ్ కి పరిగెడతాడు. ఏం చేశావు నా కొడుకు ఎందుకలా పరిగెడుతున్నాడు అంటుంది రుద్రాణి.
కుళ్ళు మొహాలు ఎవరైనా సంతోషంగా ఉంటే చూడలేరు. వెళ్లక వెళ్లక నా చెల్లెలు భర్తతో కలిసి డిన్నర్ కి వెళ్లాలనుకుంటే మీరు డిస్టర్బ్ చేయాలనుకున్నారు అందుకే జ్యూస్ లో మోషన్ టాబ్లెట్స్ కలిపి ఇచ్చేసాను అంటుంది స్వప్న. డిహైడ్రేషన్ అయి చచ్చిపోతాడు అంటుంది రుద్రాణి. వాడికి కాబట్టి మోషన్ టాబ్లెట్ ఇచ్చాను నీకు ఎప్పుడు ఎందులో ఏం కలిపి చంపేస్తానో నాకే తెలియదు అయినా మీలాంటి పాపాత్ములకి అంత త్వరగా ఏమీ కాదు.

నీకు అంత కంగారుగా ఉంటే డాక్టర్ని పిలిపించి సెలైన్ పెట్టించు నీ కొడుక్కి, ఆ తర్వాత వాష్ రూమ్ క్లీన్ చెయ్యు అంటుంది స్వప్న. నేను చెయ్యను అంటుంది రుద్రాణి. అప్పుడు నువ్వు నా రూమ్ లోకి, నేను నీ రూమ్ లోకి మారవలసి ఉంటుంది అనటంతో అక్కడినుంచి వెళ్ళిపోతుంది రుద్రాణి. మరోవైపు కళ్యాణ్ అప్పు కి ఫోన్ చేస్తాడు, అప్పు ఫోన్ లిఫ్ట్ చేసి ఇప్పటివరకు జరిగింది చాలు ఇకమీదట మనం మాట్లాడుకోకుండా ఉండడమే మంచిది.
మా ఇంట్లో నాకు సంబంధాలు చూస్తున్నారు వాళ్ళని ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది అప్పు. కళ్యాణ్ బాధతో కవిత్వం రాస్తాడు. మరోవైపు కావ్య ని రెస్టారెంట్ కి తీసుకు వస్తాడు రాజ్. అప్పుడప్పుడు ఇలా తీసుకొస్తూ ఉండండి నాకు కూడా ప్రశాంతంగా ఉంటుంది కావ్య. ఇది ఆరంభం మాత్రమే ఇకమీదట నీకు అన్ని థ్రిల్సే ఇస్తాను, నువ్వు కూర్చో నేను ఇప్పుడే హ్యాండ్ వాష్ చేసుకుని వస్తాను అని కావ్య చెప్పి వాష్ రూమ్ కి వెళ్తాడు రాజ్.

తరువాయి భాగంలో వర్షంలో తడిచిపోయిన రాజ్ దంపతులిద్దరూ ఒక ఇంట్లోకి ప్రవేశిస్తారు. అక్కడ ఎవరిని పిలిచినా పలక్క పోవటంతో అక్కడే ఉన్న ఒక చీరని భార్య ని కట్టుకోమంటాడు రాజ్. ఇది ఎవరిదో ఏమిటో అంటుంది కావ్య. నువ్వు తడిచిపోయి ఉన్నావు ఇప్పుడు అవన్నీ ఆలోచించొద్దు అంటాడు రాజ్.


Click it and Unblock the Notifications











