Brahmamudi July 20th Episode: ఇందూ టార్చర్‌తో రాజ్‌కి ముచ్చెమటలు.. దుగ్గిరాల నిలయానికి వారసుడు
Photo Courtesy: JioHotstar
ఎంత దూరం పెడుతున్నా నా నుంచి వెళ్లిపోవడం లేదు అసలు నీకు నాకు సంబంధం ఏంటీ అని ఇందూపై మండిపడతాడు రాజ్. నువ్వు లేకుండా నేను బతకలేను, నీతోనే ఉంటానని కంటతడి పెడుతుంది ఇందూ. నీకు నాకు పెళ్లి జరిగిందని మా అమ్మానాన్నలు అనుకుంటున్నారు. మనకి పెళ్లి తర్వాత జరగాల్సిన కార్యక్రమాలు జరిపిస్తే నీ జీవితమే నాశనం అయిపోతుందని వార్నింగ్ ఇస్తాడు రాజ్. ఏం జరుగుతుందో నేను కూడా చూస్తానని ఇందూ కౌంటర్ ఇస్తుంది.
భ్రమరాంబకి నోరు అతుక్కుపోయి బాధపడుతుంటే రేఖ వచ్చి మనం అనుకున్నది ఏది జరగలేదని ఆ రాజ్‌గాడు బతికే ఉన్నాడని రగిలిపోతుంది. రాజ్‌కి యాక్సిడెంట్ జరిగిందని తెలిసి అతనిని పరామర్శించడానికి లక్కీ వస్తాడు. మీ అమ్మ అడ్రస్, వివరాలు తెలుసుకుందామని వెళ్తుంటే యాక్సిడెంట్ జరిగిందని చెబుతాడు రాజ్. మా అమ్మ ఎవరో త్వరగా తెలుసుకుని నా ముందు నిలబెట్టమని అడుగుతాడు లక్కీ. పాల గ్లాసుతో గదిలోకి వచ్చిన ఇందూని చూసి రాజ్ వణికిపోతాడు. తన అందంతో, గిలిగింతలతో రాజ్‌ని ముగ్గులోకి లాగాలని ఇందూ అనుకోగా అతను తప్పించుకుంటాడు. ఉదయాన్నే ఇంటి ముందు టెంట్ వేసుకుని ధర్నా చేస్తున్న ఇందూని, ఆమెకు సపోర్ట్ చేస్తున్న తల్లిదండ్రులను చూసి రాజ్ షాక్ అవుతాడు. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. ఇక జూలై 20వ తేదీ ఎపిసోడ్ 1089లో ఇంకా ఏం జరిగిందంటే?

Photo Courtesy: JioHotstar
నువ్వు నాతో పాటు మా ఇంటికి వచ్చే వరకు ధర్నాను ఆపనని అంటుంది ఇందూ. అసలు మీరు నా కన్నవాళ్లేనా? నేను మీ కన్న కొడుకునేనా అని మండిపడతాడు రాజ్. నాకు మీరు సపోర్ట్‌గా ఉండాల్సిందిపోయి.. తనకి సపోర్ట్ చేస్తారా అంటాడు. మాకు ఇద్దరూ సమానమేనని చెబుతుంది లక్ష్మీ. గుట్టు చప్పుడు కాకుండా ఉన్న నా బతుకు గురించి బయటపడుతుంది. ఇదంతా చూశాక నాకు పిల్లని ఎవరిస్తారని అడుగుతాడు రాజ్. దాంతో చలపతి- లక్ష్మీ షాక్ అవుతారు. నువ్వు ఈ అమ్మాయిని వదిలేసి ఇంకో పెళ్లి చేసుకుందామని ఫిక్స్ అయ్యావా అని ప్రశ్నిస్తాడు చలపతి. వెంకీ గాడికి అనబోయి నా గురించి చెప్పానని కవర్ చేస్తాడు రాజ్. మీరు ఇలా చేస్తే తమ్ముడికి సంబంధాలు రావని అంటాడు.
ఇప్పుడు మేం కోడలికి సపోర్ట్‌గా ఉన్నామని తెలిస్తే అందరూ మమ్మల్నే మెచ్చుకుంటారు. ఇంట్లో భర్తతో ఏదైనా సమస్య వచ్చినా.. మా బిడ్డకు అత్తామామలు సపోర్ట్‌గా ఉంటారని, అండగా నిలబడతారని అనుకుంటారని చలపతి చెబుతాడు. ఇందూ గొడవతో చుట్టుపక్కల ఆడోళ్లు వచ్చి ఇందూకి సపోర్ట్‌గా మాట్లాడతారు. ఈ రాజ్‌గాడి మీద కేసు పెట్టి, కోర్ట్‌కు లాగుదామని చెప్పడంతో ఇందూ, రాజ్ షాక్ అవుతారు. ఇది మా కుటుంబ వ్యవహారం.. నా మీద పాత కక్ష్యలన్నీ తేల్చుకోవాలని వచ్చారా అని రాజ్ మండిపడతాడు. మీ ఇంటి వ్యవహారం మీ ఇంట్లో ఉన్నంత వరకే.. ఎప్పుడైతే నీ పెళ్లాం రోడ్డు మీదకి వచ్చిందో అప్పుడు ఇది బజారు వ్యవహారమైందని అంటారు ఇరుగుపొరుగు వాళ్లు.
మా బావ చాలా మంచోడు.. మా ఇంటికి రావడం లేదని ధర్నా చేస్తున్నామని చెబుతుంది ఇందూ. వాడు పెద్ద ఎదవ నువ్వు వేగలేవు.. విడాకులు ఇచ్చేయమని ఇరుగు పొరుగు అనడంతో అలాంటివేవి వద్దు, నేను చూసుకుంటానని చెబుతుంది ఇందూ. నువ్వు వచ్చే వరకు వెళ్లేది లేదు.. ధర్నా ఆపనని అంటుంది. ఇది మామూల్దీ కాదు.. మా అమ్మనాన్నల్ని మాయ చేసి తనవైపుకు తిప్పుకుందని రగిలిపోతాడు రాజ్. అయినా నా విషయంలో ఇందూ ఎందుకు ఇంత మొండగా ఉంది అనుకుంటాడు. నేను లేకపోతే ఆ రేఖ దీనితో ఆడుకుంటుందని భయపడుతోంది. అది ఏం చేసినా వెళ్లకూడదని అనుకుంటాడు రాజ్.
ఇందూ నినాదాలతో చుట్టుపక్కల మగాళ్లు వచ్చి ఏం జరిగిందని అడుగుతారు. వాళ్లకి ఉన్నవి లేనివి కల్పించి చెబుతుంది ఇందూ. జీవితాంతం ఆయనతో కలిసుండాలని అంటుంది. ఆయనే నా ప్రపంచం, ఆయనే నా సర్వస్వం.. ఆయన లేకుండా నాకు జీవితమే లేదని ఏడుస్తున్నట్లు నటించడంతో మీకు మేం ఉన్నాం, మీ కాపురాన్ని మేం నిలబెడతాం.. తనని మేం పంపిస్తామని రాజ్‌తో గొడవపడతారు. తనని చూస్తుంటే చాలా మంచిదిలా ఉంది, తనకు నువ్వే ప్రాణం.. నువ్వే సర్వస్వం అంటారు. అసలు ఈరోజుల్లో ఆడోళ్లు మగాళ్లని ఎలా చూస్తున్నారో తెలుసా అని రాజ్‌ని లాక్కెళ్తారు. ఈ ప్రపంచంలో నీ అంతటి అదృష్టవంతుడు ఉండడని నచ్చచెబుతారు. మన భర్తల గ్రూప్‌లో ఒక మెసేజ్ పెట్టి లారీలకు లారీల జనం ఇక్కడ దించుతామని బెదిరిస్తాడు.
టెక్ట్స్ మెసేజ్ కాదు వాయిస్ పెట్టమని చలపతి అనడంతో నాకు శత్రువులు ఎక్కడో లేరు ఇంట్లోనే ఉన్నారని రాజ్ మండిపడతాడు. భర్త మహాశయులకు విజ్ఞప్తి నేను రామ్ నగర్ బస్తీ నుంచి మాట్లాడుతున్నాను, ఇక్కడ రాజు అనే 28 ఏళ్ల వ్యక్తి ఇందూ అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న తర్వాత ఆ అమ్మాయి మీద అలిగి పుట్టింటికి వచ్చేశాడు. అందుకు కారణం ఏంటో రాజు సరిగ్గా చెప్పడం లేదు. ఇక్కడ భార్య ఎంత మంచిదంటే రాజును కష్టపెట్టకుండా, అన్ని పనులు తానే చేస్తుంది, వంట కూడా తనే చేస్తేంది. ఇళ్లు తుడవటం, అంట్లు కడగటం, బట్టలు ఉతకం అన్ని పనులు ఆమె చేస్తుంది. అలాంటి అమ్మాయిని రాజు కొట్టాడు.. ఆ అమ్మాయి చాలా అమాయకురాలు, చాలా శాంత మూర్తిలా ఉంది. ఈరోజుల్లో ఇలాంటి అమ్మాయి దొరకడం ఎంత అదృష్టమో మనం ఈ రాజుకు తెలియజెప్పాలి. అందుకే మన భర్తలంతా మూకుమ్మడిగా ఇక్కడికి వచ్చేయాలని అతను అనడంతో రాజ్ షాక్ అవుతాడు.
వీళ్లతో పెట్టుకోవడం కంటే ఇందూతో వెళ్లిపోవడం మంచిదని అనుకుంటాడు. ఇష్టం లేనట్లుగా బలవంతంగా వస్తానని అంటున్నాడని ఇందూ అనడంతో వాయిస్ కొంచెం డెప్త్ పెట్టు, ఆ అమ్మాయి ఒంటి మీద వాతలు ఉన్నాయని కూడా పెట్టమని చెప్పడంతో రాజ్‌కి చెమటలు పడతాయి. మీ అందరికీ చాలా థ్యాంక్స్.. దేవుళ్లలా వచ్చి నా కాపురాన్ని నిలబెట్టారని అంటుంది ఇందూ. ఈ సమాజంలో భర్తల్ని పువ్వుల్లో పెట్టి చూసుకునే నీలాంటి అమ్మాయి ఉందంటే అది మామూలు విషయం కాదని ఇందూని మెచ్చుకుంటారు. రాజు అక్కడికి వెళ్లాక ఎక్స్‌ట్రాలు చేస్తే మేం చూసుకుంటామని చెబుతాడు. నువ్వు ముందు వెళ్లు.. నేను నీ వెనుక వస్తానని అంటాడు రాజ్. అదంతా కాదు.. నువ్వు కూడా నాతో పాటే రావాలని అంటుంది ఇందూ. రాజ్‌ని అందరూ కలిసి ఆటో ఎక్కిస్తారు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications