Brahmamudi July 22nd Episode: పగతో రగిలిపోతోన్న యామిని .. రేవతి - అపర్ణల విడదీసేలా రుద్రాణి కుట్ర

hoto Courtesy: JioHotstar

అప్పూ కేసు గురించి కోర్టులో విచారణ జరుగుతుంది. తన చెల్లెల్ని కాపాడేందుకు కావ్య సాక్ష్యాల్ని తారుమారు చేసేందుకు ప్రయత్నించిందని యామిని తరపు లాయర్ వాదిస్తాడు. శీనుగాడి కోసం వెళ్లిన రాజ్ ఎంతకు తిరిగి రాకపోవడంతో కావ్య టెన్షన్ పడుతుంది. ఇంతలో యామిని వచ్చి ఇప్పటికైనా రాజ్ బావని నాకు వదిలేయమని అంటుంది. అది ఈ జన్మకు జరగదని, గెలిచేది ధర్మమేనని చెబుతుంది కావ్య.

యామిని మనుషులను చితకబాది శీనుగాడిని విడిపించబోతుండగా.. రాజ్‌ని తలపై కొడతారు రౌడీలు. సాక్ష్యాధారాలన్నీ అప్పూకి వ్యతిరేకంగా ఉండటంతో న్యాయమూర్తి శిక్ష విధించబోతుండగా శీనుగాడిని తీసుకొస్తాడు రాజ్. అప్పూ మేడంని ఇరికించమని ఓ లేడీ డబ్బులు ఇవ్వడంతోనే ఇలా చేశానని యామిని ఇరుక్కోకుండా చూస్తాడు శీను. అన్ని సాక్ష్యాలను పరిశీలించి అప్పూని నిర్దోషిగా ప్రకటిస్తుంది కోర్ట్. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. ఇక జూలై 22వ తేదీ ఎపిసోడ్ 780లో ఏం జరిగిందంటే?

Brahmamudi Serial July 22nd 2025 Episode 780 Here is Today s full story

Photo Courtesy: JioHotstar

తనను కేసు నుంచి కాపాడటంపై రాజ్‌కు అప్పూ ధన్యవాదాలు చెబుతుంది. నువ్వే లేకుంటే నా ఉద్యోగం నాకు వచ్చేది కాదని అంటుంది. అందరూ థ్యాంక్స్‌లు చెబుతున్నారని కానీ ఒక్కరు మాత్రం చెప్పడం లేదంటూ కావ్యను ఉద్దేశించి ఇన్‌డైరెక్ట్ కామెంట్స్ చేస్తాడు రాజ్. నేను మీకు థ్యాంక్స్ చెప్పనని, లాస్ట్ మినిట్ వరకు నన్ను ఎంత టెన్షన్ పెట్టారో తెలుసా? అప్పూకి ఏం జరుగుతుందోనని నా గుండె ఆగిపోయినంత పని అయ్యిందని అంటుంది కావ్య. దీనంతటికి కారణం మీరేనని మండిపడుతుంది. మీతో జోక్ చేశానని థ్యాంక్స్ అంటుంది కావ్య.

ఇంతలో యామిని వచ్చి తను కూడా రాజ్‌కి కంగ్రాట్స్ చెబుతుంది. నువ్వు నిజంగా సూపర్ బావా లాస్ట్ మినిట్‌లో ఆ సాక్ష్యం తీసుకొచ్చి అప్పూని కాపాడేశావని అంటుంది యామిని. నువ్వే గనుక లేకపోతే అసలు అప్పూ ఈ కేసు నుంచి బయటపడేది కాదని ఆకాశానికి ఎత్తేస్తుంది. అప్పూని కాపాడినా.. అసలు అప్పూకి ఇలాంటి పరిస్ధితి కల్పించి ఎవరో తెలుసుకోలేక పోయానని అంటాడు రాజ్. వాళ్లెవరో నాకు తెలిస్తే నా స్టైల్‌లో బుద్ధి చెప్పేవాడినని చెబుతాడు. మీరేం బాధపడొద్దని మీ కోరిక తప్పకుండా నెరవేరుతుందని, అప్పూకి తన జాబ్ తిరిగొచ్చేసింది కదా ఇక తనే చూసుకుంటుందని అంటుంది కావ్య. నన్ను ఇంత ఇబ్బంది పెట్టినవాళ్లని అంత తేలిగ్గా ఎలా వదిలేస్తానని చెబుతుంది అప్పూ. ఆ మాటలతో యామిని షాకై అక్కడి నుంచి వెళ్లిపోతుంది.

దుగ్గిరాల ఫ్యామిలీ అంతా భోజనం చేస్తుండగా రామ్ తనకు అన్నం తక్కువ పెట్టారని అలుగుతాడు. అప్పూని కాపాడానన్న ఆనందంలో ఫుల్లుగా లాగించేస్తానని అంటాడు. ఈరోజు నువ్వే గనుక లేకపోతే అప్పూ పరిస్ధితి ఏమయ్యేదోనని చెబుతుంది అపర్ణ. ఈ రోజు ఇంట్లో అంతా సంతోషంగా భోజనాలు చేస్తున్నారంటే దానికి కారణం నువ్వేనని మెచ్చుకుంటుంది ఇందిర. ఆ దేవుడి దయ వల్ల పెద్ద గండం నుంచి బయటపడ్డామని అంటాడు ప్రకాశం. అయితే ఇలాంటివి మళ్లీ మళ్లీ రావని గ్యారంటీ ఏంటీ? అని ప్రశ్నిస్తుంది ధాన్యలక్ష్మీ. కనీసం ఇప్పుడైనా ఆ జాబ్‌కి రిజైన్ చేయమని చెబుతుంది.

ఇంట్లో కూర్చొని హ్యాపీగా తినడానికి ఆవిడకి వచ్చిన సమస్య ఏంటని ప్రశ్నిస్తుంది ధాన్యలక్ష్మీ. ఎవరైనా పని చేయమంటే బాధపడాలి కానీ.. పని మానేయమంటే బాధపడటం ఎందుకు అని నిలదీస్తుంది. మన కుటుంబానికి అలాంటి గండాలు రాకుండా ఉండాలంటే అప్పూ ఇంట్లో ఉండటమే మంచిదని చెబుతుంది ధాన్యలక్ష్మీ. ఆడవాళ్లే ఆడవాళ్లకి సాయం చేయకపోతే.. ఇక మీరు ఎదిగేది ఎలా? ముందుకు వెళ్లిది ఎలా? అని రాజ్ అడుగుతాడు. మేం ఎదగకపోయినా పర్లేదని కానీ ఎదుటి వాళ్ల ముందు అల్లరి కాకుంటే చాలని అంటాడు రాజ్. మీ సమస్య ఉద్యోగమా? లేక అప్పూ ఉద్యోగం చేయడమా? అని అడుగుతాడు.

అన్ని విషయాల్లో పాజిటివ్‌గా ఆలోచించే మీరు అప్పూ విషయంలో మాత్రం ఎందుకు నెగిటివ్‌గా ఆలోచిస్తున్నారని అడుగుతాడు. అప్పూ ప్లేస్‌లో మీ కూతురే ఉండి ఉంటే ఇలాగే ఆలోచిస్తారా? అని నిలదీస్తాడు రాజ్. అత్తను కూడా రెండో తల్లి అని అంటారు.. అలాంటిది మీరు కూడా ఇలా మాట్లాడితే అప్పూ ఎలా తట్టుకుంటుంది అని అడుగుతాడు రాజ్. నేను అలా ఆలోచించే వద్దు అని అంటున్నానని.. ఈరోజు చిన్న ప్రాబ్లమ్ కాబట్టి సరిపోయింది, రేపు ఏదైనా పెద్ద ప్రాబ్లమ్ వస్తే తన జీవితమే రిస్క్‌లో పడుతుందని వద్దు అని అంటున్నానని అంటుంది ధాన్యలక్ష్మీ. అప్పూ జీవితమే పోలీస్ ఉద్యోగమని, ఒకసారి మీ భయాలు వదిలేసి ఆలోచించి చూడండి.. మీరు భయపడుతున్నట్లు ఏం కాదని అంటాడు రాజ్. అప్పూ టెన్షన్‌లో పడి స్వప్న కూతురి పుట్టినరోజును మర్చిపోతున్నామని అంటుంది ఇందిర. 48 గంటల టైం ఉంది కాబట్టి గ్రాండ్‌గా చేసేద్దామని అంటాడు రాజ్.

ఎన్నిసార్లు ప్లాన్ చేసినా ప్రతిసారి ఆ కావ్య గెలుస్తూనే ఉందని యామిని రగిలిపోతుంది. అప్పూ మీద పగ సాధించాలని దానిని ఈ కేసులో ఇరికిస్తే అప్పూని కాపాడి కావ్యనే గెలిచిందని అంటుంది. ఆ కావ్యని కొన్నిరోజులు పక్కనపెట్టేయ్.. కావ్య మీద నువ్వు ఏదైనా ప్లాన్ చేస్తే, అప్పూ నీ మీద ఎంక్వైరీ మొదలుపెడుతుందని నచ్చచెబుతుంది రుద్రాణి. ఆ కావ్యని దెబ్బకొట్టే ఛాన్స్ వచ్చినప్పుడు నేనే చెబుతానని అప్పుడు గట్టిగా దెబ్బకొడదామని అంటుంది రుద్రాణి. యామిని ఇంటి నుంచి బయటికి వస్తుండగా కారు డ్రైవర్‌గా ఉన్న రేవతి భర్త జగదీష్‌ని చూస్తుంది రుద్రాణి. వెంటనే అతనిని ఫాలో చేస్తుంది.

రేవతి కొడుకు పరిగెత్తుకుంటూ వచ్చి మరోసారి అపర్ణ కారును గుద్ధుతాడు. బాబుకి దెబ్బ తగలడంతో అపర్ణ ఏడుస్తుంది. నాకు దెబ్బ తగిలితే నువ్వు ఎందుకు ఏడుస్తున్నావని అపర్ణని బాబు అడుగుతాడు. మందు తీసుకొచ్చి బాబుకి రాస్తుంది అపర్ణ. ఇది చూసిన రేవతి ఎంతో సంతోషిస్తుంది. తల్లి దగ్గరి నుంచి వచ్చిన పిల్లాడిని చూసి రేవతి మురిసిపోతుంది. అపర్ణ - రేవతి తిరిగి కలిస్తే ఆస్తిలో వాటా ఇవ్వాల్సి వస్తుందని అది జరగడానికి వీల్లేదని రాహుల్‌తో అంటుది రుద్రాణి. ఇంతలో జగదీష్‌కు రేవతి కంగారుగా ఫోన్ చేస్తుంది. తాను ఎన్నో ఏళ్ల నుంచి ఎదురుచూస్తున్న కల ఇవాళ నిజమైందని అంటుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X