Brahmamudi July 22nd Episode: దుగ్గిరాల ఇంట్లో అడుగుపెట్టిన లక్కీ.. రాజ్ ప్లాన్‌తో రేఖకి ముచ్చెమటలు
Photo Courtesy: JioHotstar
తల్లిదండ్రులు, ఇరుగుపొరుగు వాళ్ల దెబ్బకి ఇందూతో కలిసి దుగ్గిరాల నిలయానికి వెళ్తుండగా ఆటోలో నుంచి దిగిపోతాడు రాజ్. నేను పెట్టే కండీషన్స్‌కి నువ్వు ఒప్పుకుంటేనే నేను నీతో పాటు వస్తాను, లేదంటే లేదని చెబుతాడు. దాంతో రాజ్ చెప్పిన వాటికి ఒప్పుకుంటుంది ఇందూ. రాజ్- ఇందూలు తిరిగి దుగ్గిరాల నిలయంలో అడుగుపెట్టడంతో రేఖ, భ్రమరాంబలు షాక్ అవుతారు. రాజ్ ఒంటి మీద గాయాలు ఉండటంతో ఏం జరిగిందని అపర్ణ కంగారు పడుతుంది. నువ్వు లేకపోవడంతో మేం శూన్యంలోకి వెళ్లిపోయామని బాధపడటంతో రాజ్ కూడా ఎమోషనల్ అవుతాడు.
నీకు శత్రువులు ఎవరైనా ఉన్నారా? ఈ యాక్సిడెంట్ చేయించిన వాళ్లని అస్సలు వదిలిపెట్టనని రాజ్‌తో అంటుంది నందూ. దాంతో రేఖకి ముచ్చెమటలు పడతాయి. ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేయమని కోపంగా వెళ్లిపోతుంది. రేఖ ప్రవర్తనపై శేషం, భ్రమరాంబలో అనుమానం వస్తుంది. గదిలోకి వెళ్లిన తర్వాత రాజ్ పెట్టిన కండీషన్స్‌ను ఒప్పుకొనేది లేదని, గతంలో ఎలా ఉన్నానో ఇప్పుడు కూడా అలాగే ఉంటానని ఇందూ చెబుతుంది. రాజ్ దగ్గరి నుంచి ఇందూ బయటకు వస్తుండగా రాజ్‌ని ఎందుకు వెనక్కి తీసుకొచ్చావు? నీకు అతనికి రిలేషన్ ఏంటని ఇందూని నందూ నిలదీస్తుంది. రాజ్ మన ఫ్యామిలీ కోసం ఎంతో చేశాడు.. అలాంటి వాడిని చంపాలని చూసిన వాళ్లని వదిలిపెట్టనని నందూ చెబుతుంది. యాక్సిడెంట్ చేయించింది రేఖ ఆంటీ అని ఇందూ చెప్పడంతో నందూ షాక్ అవుతుంది. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. ఇక జూలై 22వ తేదీ ఎపిసోడ్ 1091లో ఇంకా ఏం జరిగిందంటే?

Photo Courtesy: JioHotstar
రాజ్‌ని చంపాలని రేఖ ఆంటీ యాక్సిడెంట్ చేయించిందని తెలుసుకున్న నందూ వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేస్తానని అంటుంది. కానీ ఇందూ ఆపి.. మన దగ్గర సాక్ష్యాధారాలు లేవు, ఈ విషయంలో నువ్వు ఇన్వాల్వ్ అవ్వొద్దని చెబుతుంది ఇందూ. మనం రేఖ ఆంటీ సంగతి తేల్చాల్సిందే.. ఒకప్పుడు తనకు భయపడి తలవంచాం. ఇప్పుడు ఆ అవసరం లేదు, నేను దీనిని వదిలేయను. తను తప్పు చేసింది కాబట్టి సాక్ష్యాధారాలతో నిరూపిస్తే ఇంకోసారి అలాంటి పనులు చేయాలంటే తనకు భయం పడుతుంది. కానీ ఇందూ మాత్రం వద్దని తేల్చేసి వెళ్లిపోతుంది. ఎలాగైనా సరే రేఖ ఆంటీకి బుద్ధి చెబుతానని అనుకుంటుంది నందూ.
వెంకీకి నందూ ఫోన్ చేసి మీ అన్నయ్యకి యాక్సిడెంట్ చేసిన వాడిని పట్టుకోవాలని చెబుతుంది. ఆ యాక్సిడెంట్ అనుకోకుండా జరిగిందా? లేకపోతే కావాలనే ఎవరైనా చేయించారా? అనేది తెలియాలి అంటుంది. ఇది ఎవరైనా కావాలనే చేయించి ఉంటే మరోసారి రిపీట్ కాకుండా చూడాలి, ఈ విషయంలో నాకు హెల్ప్ చేయాలని చెబుతుంది నందూ. నువ్వు నా పక్కనుంటే చాలని అంటుంది. ఉదయాన్నే శృతి వచ్చి ఇందూ మేడం కోసం వచ్చానని చెప్పడంతో ఐశ్వర్య సీరియస్ అవుతుంది. కొంచెం డబ్బులు అవసరమై వచ్చానని శృతి చెప్పడంతో ఐశ్వర్య నానామాటలు అంటుంది. సరాసరి ఇంట్లోకి వచ్చేస్తావా? నీకు అర్జెంట్ అయితే మాకెంటీ? అయినా ఏదైనా అవసరానికి అడుక్కోవాలి అనుకుంటే గడపకి అవతల నిలబడి అడగాలని చెబుతుంది. ఆ మాటలు విన్న నందూ సీరియస్ అవుతుంది.
ముష్టి చిల్లర కోసం, నెల జీతం కోసం డైరెక్ట్‌గా ఇంట్లోకి వచ్చేస్తావా అని మండిపడుతుంది. అది చిల్లర అయినా నెల జీతమైనా తను కష్టపడి సంపాదించుకుంటోంది, నీలాగా ఎదుటివాళ్లు సంపాదించింది ఖర్చు పెట్టుకుంటూ విచ్చలవిడిగా తిరగడం లేదని అంటుంది. దాంతో నందూని కొట్టడానికి చేయి ఎత్తగా ఇందూ వచ్చి అడ్డుకుంటుంది. ఇంతలో ఇందూ వచ్చి శృతికి డబ్బులు ఇస్తుంది. అడగ్గానే డబ్బులు ఇచ్చేస్తున్నావు.. ఇలాంటివన్నీ ఆఫీసులో చూసుకోవాలని అంటుంది ఐశ్వర్య. కంపెనీ సీఈవో అయ్యావని పొగరు చూపిస్తున్నావా అని అంటుంది. నువ్వు కూడా కష్టపడి పనిచేయడం నేర్చుకో, అటు ఇటు తిరగకుండా ఆఫీస్‌కి వస్తూ ఉండు... నువ్వు కూడా ఏదో ఒక పనిచేస్తే అప్పుడు నీకు కూడా కావాల్సినంత మర్యాద దొరుకుతుందని చెబుతుంది ఇందూ.
ఇది నాది అని చెప్పుకునే డబ్బు నీ దగ్గర లేదు. అలాంటప్పుడు ఎందుకు ఊరికే బిల్డప్‌లు ఇస్తున్నావని మండిపడుతుంది ఇందూ. అయితే నేను కూడా సంపాదించి చూపిస్తానని ఛాలెంజ్ చేస్తుంది ఐశ్వర్య. ఇంతలో రాజ్ వచ్చి మీరిద్దరూ తనని ఇన్సల్ట్ చేస్తున్నారని అడుగుతుంది. అలా అంటే అయినా తనలో మార్పు వస్తుందని చిన్న ప్రయత్నం చేశానని చెబుతుంది ఇందూ. ఆవిడ గారు మారే రకం కాదని రాజ్ సెటైర్లు వేస్తాడు. తను మారాలి, కష్టపడి పనిచేయడం అలవాటు చేసుకోవాలి.. మేం మా అక్కని మార్చుకుంటామని చెబుతుంది ఇందూ.
రాజ్‌కి మరోసారి యాక్సిడెంట్ కలలోకి వచ్చి ఉలిక్కిపడి లేవడంతో ఇందూ వచ్చి ఏం జరిగిందని అడుగుతుంది. ఈ కల నాకు చిన్నప్పటి నుంచి వస్తుంది. ఏదో పెద్ద బ్లాస్ట్ జరిగినట్లుగా ఉంటుందని చెబుతాడు. ఆ కలలో కనిపించిన వారిలో నీకు ఎవరైనా గుర్తున్నారా అని అడుగుతుంది ఇందూ. ఆ మనుషులు నాకు బాగా కావాల్సిన వాళ్లలా అనిపిస్తున్నారు. దీనికి నాకు సంబంధం ఏంటో అర్ధం కావడం లేదని చెబుతాడు రాజ్.
లక్కీగాడి కన్నతల్లిని నేనే అని ఆ రాజ్‌గాడు చెప్పింది ఎవరికి? లక్కీగాడికి చెప్పుంటాడా? ఒకవేళ ఇందూకి చెబితే నాతో చెప్పేది కదా అని ఆలోచిస్తూ ఉంటుంది రేఖ. ఇంతలో భూషణ్ రావడంతో రేఖ ఉలిక్కిపడుతుంది. ఈ మధ్య చాలా టెన్షన్‌గా కనిపిస్తున్నావు? దేని గురించో ఆలోచిస్తున్నావు? ఏం జరిగిందో చెప్పమని అడుగుతాడు భూషణ్. నీ కంటే ముందు నేను ఒకరితో తిరిగి ఒక బిడ్డకు జన్మనిచ్చానని చెప్పనా? నేను విసిరేసిన ఆ బిడ్డ పెరిగి పెద్దవాడై నా కళ్లముందుకు వచ్చాడు.. ఈ నిజం నీకు చెబితే అస్సలు ఊరుకోవని మనసులో అనుకుంటుంది రేఖ. అసలు ఈ రాజ్‌గాడి ప్లాన్ ఏంటీ? వాడిని ఎలా ఎదుర్కోవాలి? అని రేఖ ఆలోచిస్తుంటుంది.
ఉదయాన్నే లక్కీకి రాజ్ ఫోన్ చేసి మా ఇంటికి వచ్చేయమని చెప్పడంతో లక్కీ సరాసరి దుగ్గిరాల నిలయంలో అడుగుపెడతాడు. అది చూసిన భ్రమరాంబ నువ్వు ఈ ఇంటికి ఎందుకు వచ్చావు అని అడుగుతుంది. నేనే రమ్మన్నాను, వాడు కూడా ఈరోజు నుంచి నాతో పాటే ఈ ఇంట్లో ఉంటాడని రాజ్ చెప్పడంతో అంతా షాక్ అవుతారు. నువ్వే ఎక్స్‌ట్రా అనుకుంటే నీకు వీడు తోడా అని నానామాటలు అంటుంది భ్రమరాంబ. ఇలాంటి బస్తీలో ఉండేవాళ్లంతా నా ఇంట్లో సుస్తి చేస్తుందని అనడంతో రాజ్ రగిలిపోతాడు. అసలు మీకు మాత్రం ఏం అర్హత ఉందని ఈ ఇంట్లో ఉంటున్నారని నిలదీస్తాడు. అసలు ఈ ఇంటికి మీకు ఉన్న సంబంధం ఏంటీ? ఏం లేకపోయినా మీరు ఉంటున్నారు? మీరు ఉంటున్నట్లే నా ఫ్రెండ్ కూడా ఇక్కడే ఉంటాడని చెబుతాడు రాజ్.
నేను ఒప్పుకోను అని భ్రమరాంబ తేల్చేస్తుంది. ఒప్పుకోవాల్సింది నువ్వు కాదు పిన్ని అని రాజ్ పిలవగా లక్కీని చూసి రేఖ షాక్ అవుతుంది. వాడు ఏమైనా పెద్ద సెలబ్రిటీనా గుర్తుపట్టడానికి, వీడిని కూడా ఇక్కడే ఉంచుతానని అంటున్నాడని భ్రమరాంబ చెబుతుంది. అసలు వాడిని ఎందుకు తీసుకొచ్చావని భూషణ్ ప్రశ్నిస్తాడు. చిన్నప్పటి నుంచి వీడికి అమ్మనాన్న ప్రేమ తెలియకుండానే అనాథగా బతికాడు. వాళ్లమ్మ వీడిని పసికందుగా ఉన్నప్పుడే అనాథాశ్రమంలో వదిలేసి జాలి, దయ లేకుండా వెళ్లిపోయింది. తినడానికి తిండి లేక.. ఉండటానికి గూడు లేక ఎలాగోలా బతికేశాడు. వాడు తల్లి కోసం ఎన్నో ఏళ్లుగా వెతుకుతూనే ఉన్నాడు.. కానీ ఇంత వరకు ఆమె జాడ తెలియలేదని చెబుతాడు రాజ్.
అసలు అది మనిషేనా? పశువులు కూడా వాటి కడుపున బిడ్డల మీద వాత్సల్యం చూపిస్తాయి.. అలాంటిది తను ఇలాంటిది చేయడం ఏంటీ? ఇలా చేసిందంటే పశువు కంటే హీనమని నానామాటలు అంటుంది అపర్ణ. బిడ్డల కోసం పరితపించే తల్లుల్ని చూశాను కానీ ఇలా బిడ్డల్ని వదిలేసుకునే తల్లిని ఎప్పుడూ చూడలేదు.. తనెంత కఠినాత్మురాలో అర్ధమవుతోందని అంటాడు సుభాష్. వీడికి వాళ్లమ్మని చూపిస్తానని చెప్పాను, అందుకే వీడిని ఇక్కడికి తీసుకొచ్చానని రాజ్ చెప్పడంతో రేఖ షాక్ అవుతుంది. బయటున్న అనాథాశ్రమాలలో ఉన్నవాళ్లకి కూడా వాళ్ల అమ్మానాన్నలు దొరుకుతారా అని అంటుంది భ్రమరాంబ. తప్పకుండా వీడికి వాళ్ల అమ్మ దొరికిపోతుంది.. రేఖ పిన్ని ఉంది కదా అని రాజ్ అనడంతో అంతా షాక్ అవుతారు. రేఖకి అడ్రస్, ఆథార్ కార్డ్ ఏమైనా తన దగ్గర ఉందా అని భ్రమరాంబ ప్రశ్నిస్తుంది. వేరే అక్కర్లేదు.. తనే అడ్రస్, తనే ఆథార్ కార్డ్ అని రాజ్ అనడంతో అంతా ఉలిక్కిపడతారు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications