Brahmamudi july 22th episode: రాజ్ ప్లాన్ అట్టర్ ప్లాప్.. కావ్యని మోసం చేశానంటున్న అపర్ణ!
కళ్యాణ్ ని విడిపించడానికి వచ్చిన రాజ్ ని కూడా అరెస్టు చేస్తారు పోలీసులు.చాకచక్యంతో వాళ్లని విడిపించుకొస్తుంది కావ్య. అందరి బాగోగుల గురించి ఆలోచించింది చాలు ఇక మీ సంసారం చక్కదిద్దుకోండి అని కావ్య దంపతులకు ఉపదేశిస్తారు అపర్ణ, ఇందిరాదేవి. మరోవైపు తన దగ్గరికి వచ్చిన భర్తని వెధవ వేషాలు మానేస్తేనే దగ్గరికి రానిస్తానంటుంది స్వప్న. మరోవైపు బయటకు వెళ్లాలనుకున్న రాజ్ కావ్యల ప్లాన్ చెడగొట్టాలని చూస్తాడు రాహుల్. జ్యూస్ లో మోషన్ టాబ్లెట్ కలిపేసి అతని తిక్క కుదురుస్తుంది స్వప్న. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలెట్‌గా మిగిలాయి. ఇక జులై 22వ తేదీ ఎపిసోడ్ 468లో ఏం జరిగిందంటే..
కావ్య ని రెస్టారెంట్ కి తీసుకువచ్చి ఇకమీదట నీకు అన్ని థ్రిల్సే అంటాడు రాజ్. హాండ్స్ వాష్ చేసుకుని వస్తాను అని చెప్పి హోటల్ మేనేజర్ దగ్గరికి వెళ్లి నేను చెప్పింది అంతా గుర్తుంది కదా చెప్పింది చెప్పినట్లు చేయండి అని చెప్తాడు.మీకెందుకు, నేను ఉన్నాను కదా మీరు వెళ్లి కూర్చోండి అంటాడు మేనేజర్. సరే అని మళ్ళీ కావ్య దగ్గరికి వస్తాడు రాజ్. వాష్ రూమ్స్అటువైపు ఉన్నాయి కదా మీరు ఎందుకు ఇటువైపు వెళ్ళారు అని అడుగుతుంది కావ్య. రాజ్ తడబడుతూ అక్కడ నాకు ఏమైనా లవర్ ఉందనుకున్నావా అటువైపు కూడా వాష్రూమ్స్ ఉన్నాయి అని చిన్నగా కోప్పడతాడు.

తర్వాత మెనూ చూస్తూ నీకేం కావాలి అని అడుగుతాడు. తిట్లు అంటుంది కావ్య. ప్రశ్నార్థకంగా చూస్తాడు రాజ్. ఇక్కడ కూడా అవి తప్పేటట్టు లేవు అందుకే అలా అన్నాను అంటుంది కావ్య. ఇంతలో మేనేజర్ వచ్చి ఇవాళ మన రెస్టారెంట్ కి ఒక స్పెషల్ గెస్ట్ విచ్చేశారు. ఆయనే స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అధినేత స్వరాజ్ గారు.ఆయన భార్య కి ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేశారు అంటూ మ్యూజిక్ స్టార్ట్ చేయమని అనౌన్స్ చేస్తాడు మేనేజర్. అయితే అక్కడ రొమాంటిక్ సాంగ్ కాకుండా సిస్టర్ సెంటిమెంట్ సాంగ్ వస్తుంది. రాజ్ డిస్టర్బ్ అయితే కావ్య నవ్వుతుంది.
కేక్ మీద కూడా డియర్ సిస్టర్ అనే రాసి ఉండటంతో మరింత సర్ప్రైజ్ అవుతుంది కావ్య. అప్పుడు మేనేజర్ కంగారుగా కేక్ మార్పించి మరొక కేకు తెప్పిస్తాడు. ఈసారి షష్టిపూర్తి కేక్ వస్తుంది. దానిని చూసి మరింత నవ్వుతుంది కావ్య. మరీ ఇంత సర్ప్రైజ్ ఇస్తారనుకోలేదు, నిజంగా సర్ప్రైజ్ అయ్యాను అని నవ్వుతుంది. మేనేజర్ మీద చిరాకు పడతాడు రాజ్. తర్వాత అక్కడి నుంచి వచ్చేస్తారు కావ్య దంపతులు. కార్ లో వస్తూ ఉంటే డిస్టర్బ్ గా ఉంటాడు రాజ్ ఏం జరిగింది అంటుంది కావ్య.

నా ప్లాన్ మొత్తం ఫెయిల్ చేశాడు అని చిరాకు పడతాడు రాజ్. పోనీలెండి మంచి మ్యూజిక్ వింటే మూడు బావుంటుంది అని సాంగ్స్ ప్లే చేస్తుంది కావ్య. అందులో కూడా సిస్టర్ సెంటిమెంట్ సాంగ్సే వస్తాయి. మళ్లీ నవ్వుతుంది కావ్య. నువ్వేదో గాంబ్లింగ్ చేస్తున్నావు అంటాడు రాజ్. నాకేం అవసరం అంటుంది కావ్య. ఇంతలో కారు ఆగిపోతుంది. తన ఫోన్ కి ఛార్జింగ్ లేకపోవడం కావ్య ఫోన్ తీసుకురాలేదని తెలుసుకొని మరింత ఫ్రస్టేట్ అవుతాడు రాజ్.
ఇంతలో వర్షం పడే సూచనలు కనిపించడంతో మనం రాకరాక బయటకు వస్తే ప్రకృతికి కూడా కామెడీ అయిపోయింది అన్నీ ఇలాగే జరుగుతున్నాయి అంటుంది కావ్య. ఎదురుగా ఉన్న పాడుబడిన బంగాళాలోకి వెళ్లి తల దాచుకుందాం అనుకుని అక్కడికి వెళ్లి చూస్తారు. అక్కడ ఎవ్వరూ లేకపోవడం, క్యాండిల్స్ డెకరేట్ చేసి ఉండటం చూసి ఆశ్చర్యపోతారు. అప్పటికే తడిచిపోయి ఉన్న కావ్యకి అక్కడ ఉన్న ఒక చీర తీసి ఇస్తాడు రాజ్. అది ఎవరిదో ఏమిటో అంటుంది కావ్య.

కొత్తదిలానే ఉంది పర్వాలేదు కట్టుకో అని చెప్పి పంపిస్తాడు రాజ్. చీర మార్చుకొని వచ్చిన కావ్యని చూసి టెంప్ట్ అవుతాడు. మరోవైపు కావ్య దంపతుల కోసం రూమ్ డెకరేట్ చేసి వాళ్ల కోసం ఎదురు చూస్తూ ఉంటారు అపర్ణ, ఇందిరా దేవి. డిన్నర్ కి వెళ్ళిన వాళ్ళు ఇంకా రాలేదేమిటి ఫోన్ చేసేదా అంటుంది అపర్ణ. బయటికి వెళ్ళిన వాళ్ళు తినేసి వచ్చేస్తారా ఏంటి సరదాగా తిరిగి వస్తారులే అంటుంది ఇందిరాదేవి. ఇన్నాళ్లు నేను కావ్యని మోసం చేశాను అంటుంది అపర్ణ.
తరువాయి భాగంలో తను రాసిన కవితని నలిపి విసిరేస్తాడు కళ్యాణ్. అది చదివిన రాజ్ నువ్వు అప్పు మీద ఇంత ప్రేమ పెట్టుకొని ఏమీ లేనట్లు నటిస్తున్నావా, నువ్వు ఇంత బాధ పడుతుంటే నేను ఎలా చూస్తూ ఊరుకుంటాను నీ ప్రేమను నేను గెలిపిస్తాను అనుకుంటాడు రాజ్. మరోవైపు అప్పుకి పెళ్లి సంబంధం కుదిరిందని కావ్య వాళ్ళని ఇన్వైట్ చేస్తుంది కనకం. అదే విషయం రాజ్ కి చెప్తుంది కావ్య. షాక్ అవుతాడు రాజ్.


Click it and Unblock the Notifications











