Brahmamudi July 23rd Episode: రేవతి గతం తెలుసుకున్న రాజ్.. ఆస్తి కోసం రుద్రాణి మాస్టర్ ప్లాన్
Photo Courtesy: JioHotstar
తనను కేసు నుంచి విడిపించి పోలీస్ ఉద్యోగం తిరిగి ఇప్పించినందుకు రాజ్‌కు థ్యాంక్స్ చెబుతుంది అప్పూ. యామిని వచ్చి రాజ్‌కు కంగ్రాట్స్ చెబుతుంది. మా అప్పూని ఇరికించిన వాళ్లని అంత తేలిగ్గా విడిచిపెట్టనని కావ్య అంటుంది. దుగ్గిరాల ఫ్యామిలీ మొత్తం భోజనాల వద్ద రాజ్‌ని ఆకాశానికి ఎత్తేస్తుంది. ఇకపై ఇలాంటి గండాలు రాకుండా ఉండాలంటే అప్పూ పోలీస్ ఉద్యోగం మానేయాలని ధాన్యలక్ష్మీ తేల్చి చెబుతుంది. దీంతో రాజ్ ఆమెకు బ్రెయిన్ వాష్ చేస్తాడు.
రేవతి కొడుక్కి అపర్ణ కారు డోర్ తగిలి కింద పడిపోతాడు. దీంతో ఆమె తన మనవడికి మందు రాస్తుంది. ఇది చూసిన రేవతి ఎంతో సంతోషిస్తుంది. పక్కగా ప్లాన్ చేసి అప్పూని ఇరికించినా కావ్య చేతిలో ఓడిపోవడంతో యామిని రగిలిపోతుంది. ఇప్పుడు టైం బాలేదని కావ్యని దెబ్బకొట్టే ఛాన్స్ వచ్చినప్పుడు నేనే చెబుతానని అప్పటి వరకు సైలెంట్‌గా ఉండమని చెబుతుంది రుద్రాణి. బయటికి వస్తుండగా కారులో రేవతి భర్త జగదీష్ ఉండటంతో అతనిని ఫాలో అవుతూ వెళ్తుంది. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా నిలిచింది. ఇక జూలై 23వ తేదీ ఎపిసోడ్ 781లో ఏం జరిగిందంటే?

Photo Courtesy: JioHotstar
ఒంటరిగా ఆలోచిస్తున్న కావ్య దగ్గరికి రాజ్ వస్తాడు. అప్పూ ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోయింది? ఇంట్లో మీ అక్క కూతురి బర్త్ డే.. ఇంట్లో ఇలాంటి వాతావరణం ఉన్నప్పుడు ఎలా ఉండాలి అని ప్రశ్నిస్తాడు. నేను అత్తయ్య గురించి ఆలోచిస్తున్నానని కావ్య చెప్పడంతో అమ్మకి ఏమైందని అడుగుతాడు రాజ్. గతంలో జరిగిన ఒక గాయం ఇంకా అలాగే మిగిలిపోయిందని అంటుంది. ఆ గతంలో ఒక కూతురు కూడా ఉందని కావ్య చెప్పడంతో మరి ఇప్పుడు ఇంట్లో ఎందుకు లేదని ప్రశ్నిస్తాడు రాజ్. అత్తయ్యకి వాళ్ల కూతురికి గొడవ జరిగి తను ఇంట్లో నుంచి వెళ్లిపోయిందని చెబుతుంది కావ్య. ఏం జరిగిందో కొంచెం క్లారిటీ చెప్పమని రాజ్ అడగటంతో రేవతి- జగదీష్‌ల పెళ్లి, వాళ్లని ఇంట్లో నుంచి గెంటేయడం వరకు చెబుతుంది.
ఆ మాటలు విన్న రాజ్.. రేవతి అక్క అమ్మకి కూతురా? అని షాక్ అవుతాడు. విడిపోయిన వాళ్లిద్దరినీ మనమే కలపాలని అంటుంది కావ్య. కానీ రేవతిని కలవడం అమ్మకి ఇష్టం లేదు కదా అని చెబుతాడు రాజ్. ఇన్నేళ్లుగా దూరంగా ఉండేసరికి రేవతి గారికి అమ్మ మీద ప్రేమ, బెంగ ఎక్కువై ఎప్పుడెప్పుడు కలుద్దామా అని ఎదురుచూస్తుందని అంటుంది కావ్య. ఇంట్లో ఎలాగూ ఫంక్షన్ ఉంది కాబట్టి రేవతి అక్కని కూడా పిలుద్దామని అంటాడు రాజ్. దాంతో అక్క ఇంటికి వచ్చేస్తుందని, కూతురిని చూడగానే అమ్మ దగ్గరికి తీసుకుంటుందని చాలా సింపుల్ అని చెబుతాడు.
అంత ఈజీ అయితే నేను ఇంతలా ఎందుకు ఆలోచిస్తానని అని అంటుంది కావ్య. రేవతి గారు అత్తయ్యని కలవాలని ఎంత ఆరాటపడుతున్నారో? అమ్మ పిలిస్తేనే వస్తానని అంతే మొండిగా ఉన్నారని అంటుంది కావ్య. మీరు బాధపడితే నేను తట్టుకోలేనని మనసులో అనుకుంటాడు. వాళ్లిద్దరినీ కలుపుదామని చెబుతాడు రాజ్. మనం పిలిస్తే అక్క రాదని, అమ్మ పిలిస్తే వస్తుందిగా అని అంటాడు. అక్కని అమ్మ పిలిచేలా ప్లాన్ చేద్దామని ఐడియా చెబుతాడు.. దాంతో రాజ్‌ని కావ్య ఆకాశానికి ఎత్తేస్తుంది.
తన బిడ్డను అపర్ణ ముద్దాడటంతో రేవతి పొంగిపోతుంది. ఇంతలో జగదీష్ కారును ఫాలో అవుతూ రుద్రాణి వస్తుంది. రేవతి కనుక ఇదే ఊరిలో ఉంటే ఎప్పటికైనా ఆ ఇంటికి వచ్చే ప్రమాదం ఉందని అలా జరగకూడదని రాహుల్‌తో చెబుతుంది రుద్రాణి. రేవతిని ఈ ఊరిలోనే లేకుండా చేస్తానని అంటుంది. జగదీష్ ఇంట్లోకి రాగానే అతనిని హత్తుకుంటుంది రేవతి. నేను మా అమ్మని చూశానని.. మన అబ్బాయిని ఆమె దగ్గరికి తీసుకుందని జరిగినదంతా చెబుతుంది. మా అమ్మే వాడిని వెతుక్కుంటూ రావడం ఏంటీ? ప్రేమగా వాడిని దగ్గరగా తీసుకోవడం ఏంటీ? అని సంబరపడిపోతుంది.
నీ ముఖంలో నవ్వు చూసి చానాళ్లు అయ్యిందని, నువ్విలా సంతోషంగా ఉండటం నాకు చాలా ఆనందంగా ఉందని చెబుతాడు. అమ్మ నన్ను క్షమించకపోయినా పర్లేదని, మనవడిని దగ్గరికి తీసుకుంటే చాలని అంటుంది రేవతి. వీరిద్దరి మాటలను దూరం నుంచి వింటారు రాహుల్ - రుద్రాణి. అపర్ణ ఇంటికి వచ్చేసరికి రాజ్- కావ్యలు గొడవపడుతూ ఉంటారు. రేపు స్వప్న అక్క కూతురి పుట్టినరోజు ఫంక్షన్‌కి మమ్మల్ని కాపాడిన రేవతి గారిని కూడా పిలుద్దామని చెబుతుంది కావ్య. ఇది ఫ్యామిలీ ఫంక్షన్ కాబట్టి బయటి వాళ్లు వద్దు అని ఈయన అంటున్నారని చెబుతుంది. ఆ మాటలు విన్న అపర్ణ.. రేవతిని పిలవడమే కరెక్ట్ అని చెబుతుంది.
స్వప్న, కావ్యలని ఆమె కాపాడకపోయుంటే మనం ఈరోజు సంతోషంగా ఉండేవాళ్లం కాదని.. కాబట్టి ఆ రేవతిని పార్టీకి పిలవాల్సిందేనని చెబుతుంది అపర్ణ. నేను పిలిస్తే తను రావడానికి ఒప్పుకోవట్లేదని కావ్య చెప్పడంతో నేను మాట్లాడతానని ఫోన్ చేయమంటుంది. తన పేరు ఏంటీ? అని అపర్ణ అడగ్గా.. రేవతి అని చెబుతుంది కావ్య. ఆ పేరు వినగానే అపర్ణ షాక్ అవుతుంది. రేవతికి కావ్య ఫోన్ చేసినట్లు జగదీష్ చెప్పడంతో రాహుల్ - రుద్రాణిలు షాక్ అవుతారు. ఫోన్‌లో తల్లి గొంతు వినిపించగానే రేవతి సంబరపడిపోతుంది. నా మనవరాలి బర్త్ డేకి మీరు తప్పకుండా రావాలని రేవతిని ఆహ్వానిస్తుంది అపర్ణ.
అపర్ణ ఫోన్ చేయడంతో జగదీష్ సంబరపడిపోతాడు. ఇందాక మన బాబుని మీ అమ్మ ముద్దు పెట్టుకుందని, ఇప్పుడు తనే ఫోన్ చేసి ఇంటికి పిలుస్తుందని రేవతితో అంటాడు. ప్లాన్ సక్సెస్ కావడంతో రాజ్- కావ్యలు సంతోషిస్తారు. రేవతి మళ్లీ ఇంటికి రాకుండా చేయమని రుద్రాణితో అంటాడు రాహుల్. ఇలా వెళ్లిపోయిన వాళ్లంతా తిరిగి వచ్చారంటే మన ఆస్తిలో బఠానీలు కూడా రావని చెబుతాడు. కావ్యకి రేవతి వ్యవహారం తెలిసి.. తల్లిని, కూతురిని ఒకటి చేయాలని ప్లాన్ చేస్తుందా అని రుద్రాణికి అనుమానం వస్తుంది. రేవతిని చూడగానే అపర్ణ అత్తయ్య అన్ని మరిచిపోయి మళ్లీ కలిసిపోతారని అంటాడు రాహుల్. ఆస్తి కోసం ఇంట్లో వాళ్లనే బయటికి పంపించాలని నేను చూస్తుంటే బయటికి వెళ్లిన వారిని తిరిగి రానివ్వనని అంటుంది రుద్రాణి. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications











