Brahmamudi July 23rd episode: భర్తని కాళ్లు పట్టుకోమన్న కావ్య.. టెన్షన్‌తో చచ్చిపోతానంటున్న ఇందిరాదేవి!
కళ్యాణ్ ని విడిపించడానికి వచ్చిన రాజ్ ని కూడా అరెస్టు చేస్తారు పోలీసులు.చాకచక్యంతో వాళ్లని విడిపించుకొస్తుంది కావ్య. అందరి బాగోగుల గురించి ఆలోచించింది చాలు ఇక మీ సంసారం చక్కదిద్దుకోండి అని కావ్య దంపతులకు ఉపదేశిస్తారు అపర్ణ, ఇందిరాదేవి. మరోవైపు తన దగ్గరికి వచ్చిన భర్తని వెధవ వేషాలు మానేస్తేనే దగ్గరికి రానిస్తానంటుంది స్వప్న. మరోవైపు బయటకు వెళ్లాలనుకున్న రాజ్ కావ్యల ప్లాన్ చెడగొట్టాలని చూస్తాడు రాహుల్. జ్యూస్ లో మోషన్ టాబ్లెట్ కలిపేసి అతని తిక్క కుదురుస్తుంది స్వప్న. కావ్య ని సర్ప్రైజ్ చేయటానికి ఆమెని రెస్టారెంట్ కి తీసుకు వెళ్తాడు రాజ్. కానీ అతని ప్లాన్ ఫెయిల్ అవుతుంది. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలెట్‌గా మిగిలాయి. ఇక జులై 23వ తేదీ ఎపిసోడ్ 469లో ఏం జరిగిందంటే..
రాజ్, కావ్య ల కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఇందిరా దేవి, అపర్ణ. ఇన్నాళ్లు నేను కావ్య ని మోసం చేశాను ఆమె ఏమి చేసినా నటిస్తుందనే అనుకున్నాను, నేను ఎంత ద్వేషించినా తను నన్ను అభిమానిస్తూనే వచ్చింది అందుకే ఇకమీదట తన సంతోషమే నా సంతోషం అంటుంది. కోడల్ని ఇన్నాళ్ళకైనా అర్థం చేసుకున్నావు అదే సంతోషం అంటుంది ఇందిరా దేవి . మరోవైపు పొద్దున్నే లేచిన రాజ్ బంగ్లా దిగి కిందికి వస్తాడు.

అప్పుడే అక్కడికి ఒక వ్యక్తి వచ్చి సర్ మీరు చెప్పినట్లే చేశాను కొంచెం చూసి డబ్బులు ఇవ్వండి అంటాడు. రాజ్ ఏం చెప్పాను, ఏం చేశావు అంటూ అతడి కి చివాట్లు పెట్టి డబ్బులు ఇచ్చి పంపించేస్తాడు. వెనక్కి తిరిగి చూసేసరికి కావ్య ఉండటం చూసి షాక్ అవుతాడు. అంటే ఇదంతా మీరు కావాలనే ప్లాన్ చేశారన్నమాట బాగానే ప్లాన్ చేశారు, ప్రేమగా దగ్గరికి తీసుకొని ఆనందంగా చేసుకోవలసిన మొదటి రాత్రి ని ఇలా బూత్ బంగ్లాలో కానిచ్చేస్తారా నన్ను భయపెట్టి నాకు గా నేను లొంగి పోయేలాగా చేస్తారా దీన్నే ఈగో అంటారు.
నా ఇష్టంతో మీకు పని లేదా. ఈ విషయం అత్తయ్యకి, అమ్మమ్మ గారికి చెప్తాను, వాళ్ళే మీకు చివాట్లు పెడతారు అంటూ హడావిడి చేస్తుంది కావ్య. వాళ్లకి చెప్పొద్దు, పరువు పోతుంది కావాలంటే నీ కాళ్లు పట్టుకుంటాను అంటాడు రాజ్. అవునా అయితే కాళ్లు పట్టుకోండి అంటుంది కావ్య. ది గ్రేట్ రాజ్ ని నేను నీ కాళ్లు పట్టుకోవాలా అంటాడు రాజ్. సరే అయితే అత్తయ్య వాళ్ళకి చెప్పేస్తాను అంటుంది కావ్య. తప్పక కావ్య కాళ్లు పట్టుకోబోతుంటే వారిస్తుంది కావ్య.

సరే అయితే అమ్మమ్మ వాళ్లకి చెప్పవు కదా అని రాజ్ అంటే అందుకు అంగీకరిస్తుంది కావ్య. మరోవైపు వాళ్ల కోసం ఎదురు చూస్తూన్న ఇందిరాదేవి, అపర్ణ రాత్రి వెళ్ళిన వాళ్ళు ఇంకా రాలేదు ఏమైపోయారో ఏంటో అని కంగారు పడుతూ ఉంటారు. అంతలోనే ఇంటికి వచ్చిన మనవడని మనవరాల్ని చూసి రాత్రి అంతా ఏం చేశారు మీకోసం మేము ఇక్కడ చాలా అరేంజ్మెంట్లు చేసాము అవన్నీ వేస్ట్ అయిపోయాయి అంటారు. కావ్య జరిగింది చెప్పడానికి ప్రయత్నిస్తుంటే రాజ్ వద్దని వారిస్తుంటాడు.
జరిగింది సరిగ్గా చెప్పండి లేదంటే టెన్షన్ తో పోయేలాగా ఉన్నాను అంటుంది ఇందిరాదేవి.రాత్రి జరిగిందంతా చెప్పి అత్తగారి ముందు అమ్మమ్మ ముందు భర్తని బుక్ చేసేస్తుంది కావ్య. మీ మనవడికి నా ఇష్టంతో పనిలేదు నా బాధ ఎవరితో చెప్పుకోవాలి అని బాధ నటిస్తూ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. వెళుతూ వెళుతూ రాజ్ కి కన్ను గీటి వెళ్ళిపోతుంది. అపర్ణ ఇందిరా దేవి ఇద్దరు రాజ్ ని మందలిస్తారు.
నువ్వు ఇలా చేస్తావ్ అనుకోలేదు అని అపర్ణ అంటే నిన్ను మనవడిని ఇమ్మన్నాను అని భార్యని ఇలా రాక్షసంగా లొంగదీసుకుంటావా అని ఇందిరా దేవి చివాట్లు పెడతారు. అది చెప్పిందే నమ్ముతున్నారు కానీ నా మాట వినటం లేదు అంటాడు రాజ్. అయినా రాజ్ మాటలు పట్టించుకోకుండా కావ్య నే వెనకేసుకొస్తారు అత్త కోడలు. ఆ తర్వాత గదిలో ఉన్న కావ్య దగ్గరికి వెళ్లి రాజ్ మంచివాడే, తనని అపార్థం చేసుకోవద్దు తను చేసే పనిలో కోపం ఉండవచ్చు కానీ అది దాటి చూస్తే అంతులేని ప్రేమ కనిపిస్తుంది అర్థం చేసుకో అని చెప్తుంది ఇందిరాదేవి.ఆయన మంచితనం గురించి నాకు తెలుసు బామ్మ.

ఆయన బిడ్డను తీసుకు వచ్చినప్పుడు మీ అందరూ అనుమానించారు కానీ నేను అనుమానించలేదు, నా పుట్టింటి వాళ్ళు కష్టంలో ఉంటే ఆయనే సహాయం చేశారు, తనని అవమానించి వెళ్లిపోయిన స్వప్నని మన్నించారు అలాంటి ఆయనని తప్పుగా ఎందుకు అనుకుంటాను, అయినా రాత్రి జరిగిన దానికి నేనేమీ బాధపడటం లేదు, నా ఇష్టం లేకుండా అయినా నా ఒంటి మీద చేయి వేయగలరా అంటుంది కావ్య. ఆ మాటలకి సంతోషిస్తుంది ఇందిరాదేవి. ఇలాగే సంతోషంగా కాపురం చేసుకుని పిల్లల్ని కనండి అని దీవిస్తుంది.
తరువాయి భాగంలో కళ్యాణ్ రాసి విసిరేసిన కవిత ని చదివిన రాజ్ మనసులో అప్పు మీద ఎంత ప్రేమని పెట్టుకున్నావా అని తమ్ముడు గురించి బాధపడుతూ నీ ప్రేమని నేను గెలిపిస్తాను అనుకుంటాడు. మరోవైపు అప్పుకి పెళ్లి సంబంధం కుదిరిందని కూతురితో చెప్పి వాళ్లని కూడా రమ్మంటుంది కనుక అదే విషయం కావ్య భర్తకి చెప్తుంది.


Click it and Unblock the Notifications











