Brahmamudi july 24th episode: పెళ్లి కూతురిగా అప్పు.. కళ్యాణ్‌ను రెచ్చగొడుతున్న రాజ్!

అందరి బాగోగుల గురించి ఆలోచించింది చాలు ఇక మీ సంసారం చక్కదిద్దుకోండి అని కావ్య దంపతులకు ఉపదేశిస్తారు అపర్ణ, ఇందిరాదేవి. మరోవైపు తన దగ్గరికి వచ్చిన భర్తని వెధవ వేషాలు మానేస్తేనే దగ్గరికి రానిస్తానంటుంది స్వప్న. మరోవైపు బయటకు వెళ్లాలనుకున్న రాజ్ కావ్యల ప్లాన్ చెడగొట్టాలని చూస్తాడు రాహుల్. జ్యూస్ లో మోషన్ టాబ్లెట్ కలిపేసి అతని తిక్క కుదురుస్తుంది స్వప్న. కావ్య ని సర్ప్రైజ్ చేయటానికి ఆమెని రెస్టారెంట్ కి తీసుకు వెళ్తాడు రాజ్. కానీ అతని ప్లాన్ ఫెయిల్ అవుతుంది. రాజ్ దంపతులిద్దరూ సంసార జీవితం ప్రారంభించారని తెలుసుకొని ఆనందిస్తుంది ఇందిరా దేవి. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలెట్‌గా మిగిలాయి. ఇక జులై 24వ తేదీ ఎపిసోడ్ 470లో ఏం జరిగిందంటే..

తను రాసిన కవిత చూసుకొని అప్పు తనతో మాట్లాడొద్దని ఫోన్ చేయొద్దని చెప్పింది ఇక తన గురించి నేను ఏమనుకుంటున్నాను అని తనకి చెప్పి కూడా ప్రయోజనం లేదు అనుకుంటూ తను రాసిన కవిత మూలన పడేస్తాడు కళ్యాణ్. ఇదంతా గమనిస్తున్న రాజ్ కళ్యాణ్ వెళ్ళిపోయిన తరువాత ఆ లెటర్ తీసి చదువుతాడు. అప్పు గురించి నీ మనసులో ఇంత ప్రేమ పెట్టుకొని ఏమీ లేనట్లు నటిస్తున్నావా, నీ ప్రేమను బయటకు తీయటమే కాదు గెలిపిస్తాను కూడా అనుకుంటాడు. మరోవైపు కనకానికి ఆమె అక్క ఫోన్ చేసి అప్పుకి మంచి సంబంధం వచ్చింది అని చెప్తుంది.

Brahmamudi serial July 24th 2024 Episode of 470 Here is full story

సరే అయితే వాళ్లని ఈ రోజే పెళ్లి చూపులకు రమ్మను అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది కనకం తర్వాత విషయం అంతా భర్తకి చెప్తుంది. అప్పుకి చెప్పావా అని అడుగుతాడు కృష్ణమూర్తి. అంతలోనే అక్కడ ఉన్న అప్పు ని చూసి కనకం జరిగిందంతా విన్నావు కదా నీకు ఇష్టమే కదా అంటుంది కనకం. ఇన్నాళ్లు నా జీవితం నా నిర్ణయం మీదే నడవాలి అనుకున్నాను కానీ దానివల్ల చాలా ఇబ్బందులు పడవలసి వచ్చింది,అందుకే నేను నిర్ణయం తీసుకోవడం మానేశాను మీ ఇష్టమే నా ఇష్టం అని చెప్పి వెళ్ళిపోతుంది అప్పు. ఆ మాటలకి కనకం ఆనందపడుతుంది.

Brahmamudi serial July 24th 2024 Episode of 470 Here is full story

మనం తప్పు చేస్తున్నామేమో సరి అయినది కాదేమో స్వప్న కావ్యలని రమ్మను మన నిర్ణయం సరియైనది అవునా కాదా అని సలహా ఇస్తారు అని చెప్తాడు కృష్ణమూర్తి. అదే సమయంలో కావ్య రాజ్ తో మాట్లాడుతూ తనకి పుట్టబోయే బిడ్డల గురించి వాళ్ల చదువులు, పెళ్లిళ్ల గురించి మాట్లాడుతూ ఉంటుంది. ఇంకా నిన్నే ఫస్ట్ నైట్ అయింది అప్పుడే పిల్లల పెళ్లి వరకు వెళ్లిపోయావా అంటాడు రాజ్. బూత్ బంగ్లా గురించి ఇంట్లో ఎవరికీ చెప్పనని ఎందుకు చెప్పావు అంటూ భార్యని నిలదీస్తాడు.

Brahmamudi serial July 24th 2024 Episode of 470 Here is full story

అత్తయ్యకి, అమ్మమ్మ గారికి తప్ప నేను ఇంకెవరికి చెప్పలేదు కావాలంటే ప్రతి ఒక్కరిని అడుగుదాం పదండి అని భర్తని ఆటపట్టిస్తుంది కావ్య. అందరి ముందు నా పరువు తీసేదాకా ఊరుకునేలా లేవు అంటాడు రాజ్. అంతలోనే కనకం కావ్యకి ఫోన్ చేసి అప్పు పెళ్లి చూపులు విషయం చెప్పి అల్లుడు గారిని కూడా తీసుకొని రా అని చెప్తుంది. సరే అని ఫోన్ పెట్టేసిన కావ్య భర్తతో విషయం చెప్తుంది. అప్పుకి పెళ్లి చూపులనగానే షాక్ అవుతాడు రాజ్. నాకు కాళీ లేదు మీరు వెళ్ళండి అంటాడు.

సరే స్వప్నక్కని రెడీ అవ్వమని చెప్తాను అని వెళ్ళిపోతుంది కావ్య. ఈ విషయం అడ్డం పెట్టుకొని కళ్యాణ్ మనసులో మాట బయటకు రప్పించాలి అనుకుంటాడు రాజ్ . మరోవైపు అప్పు దగ్గరికి వచ్చిన బంటి నువ్వు తప్పు చేస్తున్నావ్ అక్క ఈ పెళ్లి చేసుకుంటే నువ్వు సంతోషంగా ఉండవేమో కళ్యాణ్ ని పెళ్లి చేసుకో అంటాడు. అందుకు అంగీకరించదు అప్పు, ఈ పెళ్లి అమ్మ నాన్నల సంతోషం కోసమే చేసుకుంటున్నాను అంటుంది.

Brahmamudi serial July 24th 2024 Episode of 470 Here is full story

మరోవైపు ఇంటికి వచ్చిన స్వప్న, కావ్యలని చూసి ఆనందపడుతుంది కనకం. అప్పు పెళ్లికి ఒప్పుకుందా అంటుంది కావ్య. అదే కంగారుగా ఉంది అంటుంది కనకం. ఆ సంగతి మేం చూసుకుంటాంలే అంటూ అక్క చెల్లెలు ఇద్దరు అప్పుని రెడీ చేయటానికి వెళ్తారు. మరోవైపు రాజ్ కళ్యాణ్ మనసులో మాట బయటికి రప్పించడం కోసం అతని దగ్గరికి వెళ్లి ఈరోజు అప్పు కి పెళ్లి చూపులు నీకు ఎవరూ చెప్పలేదా అని అడుగుతాడు.

ఆ మాటలకి షాక్ అవుతాడు కళ్యాణ్. అది గమనిస్తాడు రాజ్. ఇన్నాళ్ళకి నీ కల నెరవేరుతుంది, అప్పు ఫ్యూచర్ ఏమవుతుందో అని భయపడ్డావు ఇప్పుడు తన లైఫ్ సెటిల్ అవుతుంది, నువ్వు ఇదే కదా కోరుకున్నావు అని కళ్యాణ్ ని రెచ్చగొట్టేలాగా మాట్లాడుతాడు రాజ్. కళ్యాణ్ ఏమి మాట్లాడలేక దిగులుగా ఉండిపోతాడు. నువ్వుకుంటూ వెళ్ళిపోతాడు రాజ్. మరోవైపు అప్పుని పెళ్లికూతురులా ముస్తాబు చేస్తారు కావ్య, స్వప్న.

Brahmamudi serial July 24th 2024 Episode of 470 Here is full story

తరువాయి భాగంలో పెళ్ళివారు మాట్లాడుతూ మాకు కట్నం అక్కర్లేదు అని చెప్తారు. ఆ మాటలకి ఆనందపడుతుంది కనకం. తర్వాత దిగులుగా ఉన్న అప్పు దగ్గరికి వస్తారు కావ్య, స్వప్న. నీకు ఈ పెళ్లి ఇష్టం లేదా అని అడుగుతుంది కావ్య.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X