Brahmamudi July 24th Episode: రేవతిని గుర్తుచేసిన రుద్రాణి.. అపర్ణ ఉగ్ర స్వరూపం, ఆస్తి కోసం రాహుల్ స్కెచ్
Photo Courtesy: JioHotstar
ఒంటరిగా బాధపడుతున్న కావ్యని రాజ్ ఏం జరిగిందని అడగటంతో రేవతి గతం గురించి చెబుతుంది కావ్య. అపర్ణతో రేవతిని కలిపేందుకు అదిరిపోయే ప్లాన్ చెబుతాడు రాజ్. తర్వాత ఇద్దరూ కలిసి అపర్ణ ముందు నాటకం ఆడి రేవతికి ఫోన్ చేసి స్వప్న కూతురి బర్త్ డే పార్టీకి ఆహ్వానించేలా చేస్తారు. తమ బిడ్డ అపర్ణకి దగ్గర కావడం, తల్లి స్వయంగా రేవతికి ఫోన్ చేయడంతో జగదీష్ చాలా సంతోషిస్తాడు.
జగదీష్‌ను ఫాలో అయిన రాహుల్ - రుద్రాణిలు రేవతిని చూసి షాక్ అవుతారు. అపర్ణ - రేవతిలు కలిస్తే ఆస్తిలో మనకి చిల్లిగవ్వ కూడా దక్కదని ఎలాగైనా సరే విడదీయాలని అనుకుంటుంది రుద్రాణి. ముందు రేవతిపై అపర్ణకి కోపం తగ్గిందో? లేదో తెలుసుకోవాలని అనుకుంటుంది. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా నిలిచింది. ఇక జూలై 23వ తేదీ ఎపిసోడ్ 781లో ఏం జరిగిందంటే?

Photo Courtesy: JioHotstar
కారులో వెళ్తూ మీరు ఆంటీ అయిపోతున్నారని.. పెళ్లి గురించి ఏం ఆలోచించారని కావ్యని అడుగుతాడు రాజ్. పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉన్నా నాలాంటి వాళ్లని ఎవరు చేసుకుంటారు అని సెటైర్లు వేస్తుంది కావ్య. నాకు పొగరని, ఇగో ఎక్కువని పబ్లిక్ టాక్ .. అలాంటప్పుడు ఏ వెదవ వచ్చి నన్ను పెళ్లి చేసుకుంటాడు అని ప్రశ్నిస్తుంది. అలాంటి వెదవే దొరికాడు అనుకోండి మీకు ఎలాంటి అభ్యంతరం లేదు కదా అని అడుగుతాడు రాజ్. ఇంతలో యామిని ఇల్లు రావడంతో రాజ్, కావ్యలు కిందకి దిగుతారు. యామినిని ఆటపట్టించాలని రాజ్‌ను మరింత రెచ్చగొడుతుంది కావ్య. నాకు ఇప్పుడు పెళ్లి కంటే రేవతి గారు అత్తయ్యతో కలవాలని అది మీ చేతుల మీదుగానే జరగాలని అంటుంది. గుడ్ నైట్ చెప్పి రాజ్ వెళ్లిపోతుండగా అతనిని హగ్ చేసుకుంటుంది కావ్య. అది చూసిన యామిని, వైదేహిలు రగిలిపోతారు.
ఇంట్లోకి వస్తూ యామిని, వైదేహిలను చూసి రాజ్.. కారు పాడైపోయిందని అందుకే కళావతి డ్రాప్ చేసిందని చెబుతాడు. నా మనసులోని ప్రేమ విషయం చెబుదామంటే ఏదో ఒక ప్రాబ్లమ్ వస్తూనే ఉందని అంటాడు. అలాగే ఆలస్యం చేస్తే మొదటికే మోసం వస్తుందని హెచ్చరిస్తుంది యామిని. రేపు కావ్యకి ఉన్న ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తే కళావతి గారు ఫుల్ హ్యాపీగా ఉంటారని.. అప్పుడు నా ప్రేమ విషయం చెబుతానని అంటాడు రాజ్. రేపు స్వప్న కూతురి పుట్టినరోజు నువ్వు కూడా రావొచ్చు కదా అని యామినిని అడుగుతాడు. ఇప్పుడు కూడా సైలెంట్‌గానే ఉండాలా? అని వైదేహిని అడుగుతుంది యామిని. నీ తప్పులన్నీ కావ్య చేతిలో ఉన్నాయని.. ఇప్పటికే అప్పూ విషయంలో నువ్వు తొందరపడ్డావని, ఇప్పుడు నువ్వు ఒక్క తప్పు చేసినా రాజ్ దృష్టిలో తప్పుడు మనిషిగా మిగిలిపోతావని హెచ్చరిస్తుంది వైదేహి.
తాను బయటికి వెళ్లేటప్పుడు జగదీష్‌ని చూశానని అపర్ణతో అంటుంది రుద్రాణి. జగదీష్ ఎవరు? అని అపర్ణ ఎదురు ప్రశ్నిస్తుంది. మన దగ్గర డ్రైవర్‌గా పనిచేసి, రేవతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు, మనింటి అల్లుడు అని గుర్తు చేస్తుంది అపర్ణ. చూస్తుంటే చాలా కష్టాల్లో ఉన్నాడని అనిపించింది, జాలి వేసిందని అంటుంది రుద్రాణి. రేవతి ఎలా ఉందని పరిగెత్తుకుంటూ వెళ్లి అడగాలని అనిపించిందని, కానీ నువ్వు చెప్పిన మాటలు గుర్తొచ్చి ఆగిపోయానని చెబుతుంది అపర్ణ. ఇంకా ఎన్నాళ్లు ఈ అజ్ఞాతవాసం, బంగారం లాంటి రేవతి వాడిని పెళ్లి చేసుకుని ఎన్నో కష్టాలు పడుతుందని అంటుంది.
రేవతి చేసింది తప్పేనని మనింటి పనోడిని ప్రేమించిందని, మన ఇంటి పరువును పాతాళానికి తొక్కేసిందని రెచ్చగొడుతుంది రుద్రాణి. చిన్నపిల్ల ఏదో తెలియక తప్పు చేసిందని, తనని క్షమించి రేవతికి సాయం చేస్తావని చెబుతున్నానని అంటుంది. ఆ మాటలతో అపర్ణ సీరియస్ అవుతుంది. ఎవరి దగ్గరికి వచ్చి ఏం మాట్లాడుతున్నావ్? ఈ ఇంటిని, ఈ కుటుంబాన్ని కాదనుకుని వాడిని ప్రేమించినప్పుడే నా కూతురిగా అది అర్హత కోల్పోయిందని మండిపడుతుంది. తన భర్తను ఏమీ అనొద్దని, నా భర్త మీద చేయి ఎత్తినప్పుడే నా దృష్టిలో అది కూతురిగా చచ్చిపోయిందని అంటుంది అపర్ణ. ఇంకోసారి ఇంట్లో దాని పేరు పలికినా, తన ప్రస్తావన తెచ్చినా నన్ను ఇంకోలా చూడాల్సి వస్తుందని హెచ్చరిస్తుంది. తన ప్లాన్ సక్సెస్ కావడంతో రుద్రాణి- రాహుల్ సంబరపడిపోతారు.
స్వప్న కూతురు పుట్టినరోజు కావడంతో దుగ్గిరాల వారింట్లో పండగ వాతావరణం నెలకొంది. రేవతి గురించి కావ్య ఎదురు చూస్తుంటుంది. పాపకి తక్కువ రకం డ్రెస్ కొనుక్కుని వస్తాడు రాహుల్. అది చూసిన రుద్రాణి కొడుక్కి క్లాస్ పీకుతుంది. ఈ రుద్రాణి మనవరాలు, దుగ్గిరాల కుటుంబానికి వారసురాలి పుట్టినరోజుకు డ్రెస్ ఎలా ఉండాలి అని మండిపడుతుంది. నువ్వు షాప్‌లో కొన్నావా? లేక ఏదైనా ఫుట్‌పాత్ మీద కొనుక్కుని వచ్చావా అని రగిలిపోతుంది. నేను కాస్ట్ లీ డ్రెస్ కొనలేక కాదని, నేను కావాలనే తక్కువ రకం డ్రెస్ తీసుకొచ్చానని.. నా దగ్గర డబ్బులు లేవని చెప్పడానికి ఇలాంటి ప్లాన్ వేశానని అంటాడు రాహుల్. మా ఆస్తి మాకు ఇవ్వకపోవడం వల్లే మేం ఇలా బతకాల్సి వస్తుందని ఇంట్లో వాళ్లకి అర్ధం అవుతుందని చెబుతాడు. ఐడియా బాగుందని ఇన్నాళ్లు నా మనవరాలిని మహాలక్ష్మీ అనుకోలేదని.. ఇప్పుడే అదే మనకి ఆస్తిని తీసుకొస్తుందని అంటుంది రుద్రాణి.
కావ్య ఎవరో కోసమో ఎదురుచూస్తూ ఉండటంతో అది రాజ్ గురించేనని అపర్ణ, ఇందిరలు అనుకుంటారు. ఇంతలో రాజ్ రావడంతో కావ్య అతనిపై మండిపడుతుంది. మీకోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నానని చెబుతుంది. రాజ్‌ని లాక్కొని కావ్య పక్కకి తీసుకెళ్లడం చూసిన ఇందిర, అపర్ణలు ఏం జరిగిందని అడుగుతారు. మీరు అనుకున్నట్లుగా అక్కడ ఏం జరగలేదని అంటాడు రాజ్. స్వప్న కూతురికి కళ్యాణ్ గిఫ్ట్ తీసుకొచ్చి అప్పూకి ఇస్తాడు. మనం ఇవ్వడమే కానీ, మనకి ఎప్పుడు వస్తాయో అని బాధపడతాడు కళ్యాణ్. ఇద్దరూ పాప కావాలని, బాబు కావాలని కొట్టుకుంటారు. తర్వాత దుగ్గిరాల ఫ్యామిలీ అంతా కలిసి పాపకి గిఫ్ట్‌లు ఇస్తారు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications











