Brahmamudi July 24th Episode: చక్రం తిప్పిన రాజ్.. రేఖ- లక్కీ బంధంపై భూషణ్‌లో అనుమానం..
Photo Courtesy: JioHotstar
లక్కీకి రేఖ పిన్నియే అడ్రస్.. తనే ఆధార్ కార్డ్ అని రాజ్ చెప్పడంతో అంతా షాక్ అవుతాడు. అంటే తన పలుకుబడిని ఉపయోగించి లక్కీ వాళ్ల అమ్మని వెతుకుతుందని నా ఉద్దేశం అని అంటాడు. లక్కీ వాళ్ల అమ్మని వెతికి పెడతానని రేఖ పిన్నియే నాకు మాటిచ్చింది.. అందుకే వాడిని తీసుకొచ్చానని అంటాడు. నేను నా కన్నతల్లి స్పర్శ తెలియకుండానే పెరిగాను.. మీరు నా తల్లిని వెతికి పెడతారా అని రేఖతో అంటాడు లక్కీ. రేఖ పిన్ని మాట తప్పదు.. మాట మీదే నిలబడుతుందని చెబుతాడు రాజ్. ఇకపై నాకు ఇచ్చిన గౌరవమే వీడికి కూడా ఇవ్వాలని చెబుతాడు రాజ్.
నందూ మీద ఇష్టం పెంచుకున్న వెంకీ.. ఆమెకు ప్రపోజ్ చేయడానికి లవ్ లెటర్ రాసిపెట్టుకుంటాడు. రాజ్ గురించి ఆలోచిస్తున్న చలపతి- లక్ష్మీలు .. వెంకీని పిలిచి నువ్వు ఎవరినీ ప్రేమించినా మాకు అభ్యంతరం లేదు. కానీ ఆ దుగ్గిరాల ఇంటి వారసురాలిని మాత్రం ప్రేమించొద్దని మాట తీసుకుంటాడు చలపతి. నందూ ఆ ఇంటి వారసురాలని తెలియక మాటిస్తాడు వెంకీ. ఇంతలో నందూ రావడంతో ఇద్దరూ కలిసి బయటకు వెళ్తారు. లక్కీని నువ్వు తీసుకురావడం వెనుక ఏదో కారణం ఉందని రాజ్‌ని ఇందూ నిలదీయడంతో రేఖ ఆంటీయే లక్కీ కన్నతల్లని రాజ్ చెప్పడంతో ఇందూ షాక్ అవుతుంది. వాడికి తల్లిని దగ్గర చేయడానికి నీ సాయం కావాలని చెబుతాడు. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. ఇక జూలై 24వ తేదీ ఎపిసోడ్ 1093లో ఇంకా ఏం జరిగిందంటే?

Photo Courtesy: JioHotstar
తనను పనిచేయమంటూ ఇందూ అన్న మాటలతో ఐశ్వర్య రగిలిపోతుంది. మనం సైలెంట్‌గా ఉంటే నందూ- ఇందూలు రెచ్చిపోతారు. వీరిద్దరికి సరైన బుద్ది చెప్పాలని అనుకుంటుంది. ఇంతలో లక్కీ వెళ్లి ఐశ్వర్యకి సైట్ కొడతాడు. నువ్వు ఇక్కడున్నావేంటీ అని ఐశ్వర్య షాక్ అవుతుంది. ఈరోజు నుంచి నేను కూడా ఈ ఇంట్లోనే ఉంటున్నాను, ఆ దేవుడు చాలా గ్రేట్. నేను నిన్ను ప్రాణంగా ప్రేమిస్తున్నాను, అందుకే నన్ను మీ ఇంటికి పంపించాడని అంటాడు లక్కీ. అసలు నిన్ను ఇంట్లోకి ఎవరు రానిచ్చారని మండిపడుతుంది ఐశ్వర్య. మీ రేఖ ఆంటీయే నన్ను ఇంట్లో ఉండమని చెప్పిందని లక్కీ అనడంతో ఐశ్వర్య షాక్ అవుతుంది.
అసలు ఇది ఇళ్లా, సత్రమా? ఎవరెవరో వస్తున్నారు? ఎవరెవరో పోతున్నారు.. మొన్న ఆ శృతి డబ్బుల కోసం సరాసరి ఇంట్లోకి వచ్చేసింది, ఇప్పుడు నువ్వు వచ్చావని మండిపడుతుంది. రేఖ ఆంటీకి చెబుతానని ఐశ్వర్య వెళ్తుండగా లక్కీ ఆపి ఏదో ఒకటి మాట్లాడుకుందామని అంటాడు లక్కీ. నాకు నీతో మాట్లాడే ఇంట్రెస్ట్ లేదని చెబుతుంది ఐశ్వర్య. కాసేపు ఇద్దరం మాట్లాడుకుందామని అంటాడు లక్కీ. నేను ఇంట్లో ఉంటున్నందుకు చాలా హ్యాపీగా ఉంటావని అనుకుంటే, ఇలా చేస్తున్నావని ఫైర్ అవుతుంది ఐశ్వర్య. ఎవరు ఎలా ఉన్నాసరే నేను మాత్రం నిన్ను వదిలిపెట్టను అనుకుంటాడు లక్కీ.
ఈ ఇంట్లో ఏం జరుగుతుందో నాకేం అర్ధం కావడం లేదు.. గాలికి పోయే సంత మొత్తం మనింట్లోనే ఉంది? అసలు ఆ లక్కీగాడిని మనింట్లో ఉండటానికి ఎందుకు ఒప్పుకున్నావని నిలదీస్తుంది భ్రమరాంబ. భూషణ్ కూడా ఫైర్ అవ్వడంతో రేఖ షాక్ అవుతుంది. ఆ లక్కీగాడు నా కొడుకని తెలిస్తే నువ్వు అస్సలు క్షమించవని మనసులో అనుకుంటుంది రేఖ. నువ్వు నోరు విప్పితేనే కదా? కారణం ఏంటో తెలిసేది అని అంటాడు భూషణ్. నీ మనసులో ఏదైనా రహస్యం ఉందా? మాకు చెప్పకూడదా అని శేషం గుచ్చి గుచ్చి అడగటంతో ఇంకా కంగారుపడుతుంది రేఖ.
మాకు తెలియకుండా నువ్వేమైనా దాచిపెడుతున్నావా? ఎందుకిలా ప్రవర్తిస్తున్నావు? అని ప్రశ్నిస్తుంది భ్రమరాంబ. ఈ రేఖ ఎవరి విషయంలోనూ తగ్గదని కవర్ చేస్తుంది. ఒకప్పుడు ఆ రాజ్ ఏం చెప్పినా దానిని వ్యతిరేకించే దానివి, గొడవ చేసేదానివి.. ఇప్పుడు మాత్రం వాడేం చెప్పినా సరేనని తలూపుతున్నావని అంటాడు భూషణ్. నువ్వు ఇలా సైలెంట్‌గా ఉంటే కుదరదు.. ఏదో ఒకటి చెప్పమని విసిగించడంతో చిరాకు పడుతుంది రేఖ. ఆ రాజ్‌ని పరామర్శించడానికి వెళ్లినప్పుడు ఈ లక్కీగాడి విషయం చెప్పాడు, రాజ్‌గాడిని నా దారిలోకి తెచ్చుకోవడానికి హెల్ప్ చేస్తానని చెప్పాను. వాడు దానిని ఆసరాగా తీసుకుని లక్కీగాడిని మనింట్లోనే పెట్టాడని అబద్ధం చెబుతుంది రేఖ. ఆ లక్కీగాడు ఎలా వచ్చాడో.. అలాగే పంపిస్తాను, అప్పటి వరకు మీరంతా సైలెంట్‌గా ఉండమని చెబుతుంది రేఖ. రేఖ ప్రవర్తన చాలా తేడాగా ఉంది.. రాజ్, లక్కీల విషయంలో ఏదో దాస్తోందని అంటుంది భ్రమరాంబ.
మదన్‌ని వాడుకుని లక్కీగాడి విషయం రేఖ పిన్ని నోటితోనే చెప్పిస్తానని ఇందూతో అంటాడు రాజ్. ఇంతలో లక్కీ వచ్చి నేను ఏ గదిలో ఉండాలని అడుగుతాడు. మా రేఖ పిన్ని కొడుకు మదన్ గదిలో ఉండమని చెబుతాడు రాజ్. నేను వెళ్లను, ఏదో ఒక స్టోర్ రూమ్‌లో ఉంటానని అంటాడు లక్కీ. నేను ఎలాగైతే ఈ ఇల్లు నాదని ఫీల్ అవుతున్నానో, నువ్వు కూడా అలాగే ఫీల్ అవ్వమని చెబుతాడు రాజ్. రేఖ ఆంటీ కొడుకువి నువ్వేనని నీకు తెలియదు.. ఈ ఇంటి వారసుడని రాజ్‌కి తెలియదు అనుకుంటుంది ఇందూ.
మదన్ రూమ్‌లోకి వెళితే రేఖ ఆంటీ గొడవ చేస్తుంది, అప్పుడు మా అమ్మని వెతకదని భయపడతాడు లక్కీ. నేను చెప్పినట్లు చేస్తేనే మీ అమ్మ గురించి తెలుస్తుందని అంటాడు రాజ్. ఇక నుంచి నేను నీ గదిలో ఉంటానని మదన్‌తో లక్కీ చెప్పగా.. మదన్ షాక్ అవుతాడు. ఈ విషయాన్ని మా మమ్మీతోనే తేల్చుకుంటానని లక్కీ వద్దంటున్నా వినకుండా గొడవ చేస్తాడు మదన్. ఇంతలో రేఖ వచ్చి ఏం జరిగిందని అడుగుతుంది. ఈ లక్కీగాడిని నా గదిలో ఉండమని చెప్పావా అని నిలదీస్తాడు మదన్. నేను చెప్పలేదని రేఖ అనగా.. నేను చెప్పానని అంటాడు రాజ్. నేను చెబితే పిన్ని చెప్పినట్లే.. నేను చెబితేనే పిన్ని లక్కీగాడిని ఈ ఇంట్లో ఉండటానికి ఒప్పుకుందని అంటాడు.
ఈ ఇంట్లో వీడు ఎవ్వరి గదిలోనూ ఉండలేడు.. అందుకే మదన్ గదిలోకి వెళ్లమని చెప్పాను, అప్పుడు ఒకరి గురించి ఒకరు పూర్తిగా అర్ధం చేసుకుంటారు, అన్నాదమ్ముల్లా కలిసిపోతారని అంటాడు రాజ్. ఆ మాటలు వినగానే రేఖ షాక్ అవుతుంది. ఈ అనాథ వెధవ నా అల్లుడితో కలిసుంటాడా అని భ్రమరాంబ మండిపడుతుంది. వాళ్లిద్దరూ అన్నదమ్ములని రాజ్ అనడంతో అంతా షాక్ అవుతారు. రేఖ పిన్ని లక్కీకి తల్లిలాంటిది, అప్పుడు రేఖ పిన్ని కొడుకు తమ్ముడు అవుతాడు అంటాడు రాజ్. లక్కీగాడు నన్ను తమ్ముడు అంటుంటే చిరాకుగా ఉందని మదన్ ఫైర్ అవుతాడు. ఇంత జరుగుతుంటే నువ్వు చూస్తుండిపోతున్నావు, మన కొడుక్కి అవమానం జరుగుతోందని మండిపడతాడు భూషణ్.
నా ఫ్రెండ్‌కి 20 ఏళ్లుగా అవమానాలు జరుగుతున్నాయి.. వాడి బాధ మీకు తెలియాలని అంటాడు రాజ్. ఈ లక్కీగాడిని ఎందుకు తీసుకొచ్చి పెట్టావని భ్రమరాంబ ఫైర్ అవుతుంది. ఇప్పుడు మదన్ రూమ్‌లో లక్కీగాడు ఉండటం వల్ల ప్రాబ్లమ్ లేదు కదా? ఎందుకిలా గొడవ చేస్తున్నారని ప్రశ్నిస్తుంది అపర్ణ. రేఖ పిన్ని ఒప్పుకుంటే సరిపోతుందని రాజ్ అంటాడు. వీడు నా గదిలో ఉండటం నీకు ఇష్టం లేదని చెప్పమని అడుగుతాడు మదన్. నీకు ఇష్టం ఉంటేనే లక్కీని వాడి రూమ్‌లో ఉండమని చెబుతాను, లేదంటే లేదు అంటాడు రాజ్. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications