Brahmamudi July 25th episode: కళ్యాణ్‌ను నిలదీసిన రాజ్.. మారనని మొండికేసిన అప్పు!
తన దగ్గరికి వచ్చిన భర్తని వెధవ వేషాలు మానేస్తేనే దగ్గరికి రానిస్తానంటుంది స్వప్న. మరోవైపు బయటకు వెళ్లాలనుకున్న రాజ్ కావ్యల ప్లాన్ చెడగొట్టాలని చూస్తాడు రాహుల్. జ్యూస్ లో మోషన్ టాబ్లెట్ కలిపేసి అతని తిక్క కుదురుస్తుంది స్వప్న. కావ్య ని సర్ప్రైజ్ చేయటానికి ఆమెని రెస్టారెంట్ కి తీసుకు వెళ్తాడు రాజ్. కానీ అతని ప్లాన్ ఫెయిల్ అవుతుంది. రాజ్ దంపతులిద్దరూ సంసార జీవితం ప్రారంభించారని తెలుసుకొని ఆనందిస్తుంది ఇందిరా దేవి. కళ్యాణ్ ప్రేమ గురించి తెలుసుకున్న రాజ్ అతని ప్రేమని గెలిపించాలనుకుంటాడు. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలెట్‌గా మిగిలాయి. ఇక జులై 25వ తేదీ ఎపిసోడ్ 471లో ఏం జరిగిందంటే..
కావ్య, స్వప్న ఇద్దరూ అప్పు కి చీర కట్టి ముస్తాబు చేస్తారు. చీరలో తనని తాను చూసుకున్న అప్పు అసహ్యించుకుంటుంది. పెళ్లి చూపుల్లో ఇలాగే తయారవ్వాలి అంటారు స్వప్న,కావ్య. చీరలో నాకు నేనే నచ్చలేదు ఇంక వచ్చిన వాళ్ళకి ఏం నచ్చుతాను అంటుంది అప్పు. అప్పుడు స్వప్న బంటి ని పిలిచి అప్పు ఎలా ఉందో చెప్పు అని అడుగుతుంది.

అప్పు ని చీరలో చూసి పగలబడి నవ్వుతాడు బంటి. అప్పు ఉడుక్కుంటుంది, బంటిని పంపించేసి నేను నేను గానే ఉంటాను,ఫాంట్ షర్ట్ లోనే కనిపిస్తాను ఎవరికోసమో మారను అంటుంది . సరే అంటారు కావ్య, స్వప్న. మరోవైపు అప్పు గురించి ఆలోచిస్తున్న కళ్యాణ్ ఆమె ఇచ్చిన జాకెట్ చూసి కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటాడు.
అది చూసిన రాజ్ ఎలా అయినా వీడి మనసులో మాట బయటపడేలా చేయాలి అనుకుని కళ్యాణ్ దగ్గరికి వచ్చి ఆఫీస్ విషయాలు మాట్లాడుతున్నట్లుగా మాట్లాడి కళ్యాణ్ చేతిలో ఉన్న జాకెట్ చూసి పాతవన్నీ ఎందుకు దాచుకుంటావు,నీకు కావలసినవన్నీ నేను అమెరికా నుంచి తెప్పించాను ఇది పారేయ్ అని చెప్పి తీసుకువెళ్లి డస్ట్ బిన్ లో పడేస్తాడు. కళ్యాణ్ డస్ట్ బిన్ దగ్గరికి వెళ్లి జాకెట్ తీసుకొని దాన్ని క్లీన్ చేస్తాడు, అలా పడేసినందుకు రాజ్ మీద సీరియస్ అవుతాడు. నిజం చెప్పు నువ్వు అప్పు మీద ప్రేమ పెంచుకున్నావు కదా అంటాడు రాజ్.
తెలియడం లేదు అన్నయ్య కానీ నిజంగా అప్పుకి ఈ పెళ్లి చేస్తే సుఖపడుతుంది అనుకుంటే నేను ఆనందిస్తాను అంటాడు. నా మనసు ఏమి బాగోలేదు నేను గెస్ట్ హౌస్ లో ఉంటాను రాత్రికి రాను అమ్మ అడిగితే చెప్పు అని రాజ్ కి చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు కళ్యాణ్. ఈ మాటలు అన్ని రుద్రాణి వినేస్తుంది. ఈ విషయం వెంటనే ధాన్యలక్ష్మికి చెప్పాలి అనుకొని ఆమె దగ్గరికి బయలుదేరుతుంది. మరోవైపు పెళ్లి వాళ్ళని చూసి టెన్షన్ పడుతున్న తల్లితో ఎందుకు అంత టెన్షన్ అని అడుగుతుంది స్వప్న.

పెళ్లి వాళ్లకి కావ్య నిజం చెప్పేస్తానంటుంది అంటుంది కనకం. చెప్పనీ పెళ్లికి ముందు తెలిస్తేనే మంచిది లేదంటే మాలాగ ఇబ్బందులు పడుతుంది అంటుంది స్వప్న. ఇంతలో పెళ్లి కూతుర్ని తీసుకురమ్మని చెప్పడంతో కావ్య,స్వప్న ఇద్దరు అప్పు ని తీసుకువస్తారు. ప్యాంటు, షర్ట్ లో అప్పుని చూసిన కనకం షాక్ అవుతుంది. ఏంటి ఇది అని అడుగుతుంది. నేను ఎలా ఉంటానో అలాగే కనిపిస్తాను అంటుంది అప్పు.
ఆమె మాటలని సమర్థిస్తాడు పెళ్ళికొడుకు శ్రీరామ్. తర్వాత కావ్య అప్పు మీద పడిన నింద గురించి చెప్పాలనుకుంటుంది. మీరు అనామిక వేసిన కేసు గురించేనా మాట్లాడేది,అందులో అప్పు తప్పు ఏమీ లేదని నాకు తెలుసు, ఆ మహిళా మండలి అధ్యక్షురాలు మా బంధువే అప్పు తప్పు ఏమీ లేదని, ఎవరు ఏమి చెప్పినా నమ్మొద్దు అని చెప్పింది అంటాడు శ్రీరామ్.

ఆ మాటలకి ఆనందపడతారు కావ్య వాళ్ళు. పెళ్లికూతురు నచ్చిందని పెళ్లి ఆడంబరంగా చేయవద్దని, అలాగే కట్న కానుకలు కూడా వద్దని మా అబ్బాయి మనసుకు నచ్చిన అమ్మాయి అయితే చాలు అంటారు పెళ్లి వాళ్ళు. అమ్మాయికి నేను నచ్చాలి కదా అంటాడు శ్రీరామ్. మా అమ్మ నాన్నలు ఇష్టమే నా ఇష్టం, అక్క వాళ్లు ఎలా చెప్తే అలా అంటుంది అప్పు. ఇరువైపుల వారికి సంబంధం నచ్చటంతో పంతులు పెళ్లి ముహూర్తం పెడతాడు.
తరువాయి భాగంలో ధాన్యలక్ష్మి దగ్గరికి వెళ్లిన రుద్రాణి తన ఫ్రెండ్ కూతురు ఉందని కళ్యాణ్ కి అయితే బాగుంటుందని చెప్తుంది. మరోవైపు ముభావంగా ఉన్న చెల్లెలి దగ్గరికి వచ్చిన కావ్య, స్వప్న నీకు ఈ పెళ్లి ఇష్టం లేదా అని అడుగుతారు.


Click it and Unblock the Notifications











