Brahmamudi July 25th Episode: రుద్రాణి ప్లాన్ తిప్పికొట్టిన స్వప్న.. పుట్టింటిలో అడుగుపెట్టిన రేవతి

Photo Courtesy: JioHotstar

కారులో వెళ్తూ కావ్యతో మన పెళ్లి వయసు దాటిపోతోందని మీరు ఆంటీలా కనిపిస్తున్నారని అంటాడు. ఆ మాటలతో కావ్య మండిపడుతుంది. ఇద్దరూ కలిసి ఇంటికి రావడాన్ని యామిని, వైదేహిలు చూస్తారు. యామినిని ఇంకా రెచ్చగొట్టాలనే ఉద్దేశంతో రాజ్‌కి హగ్ ఇస్తుంది కావ్య. ఇంట్లోకి వస్తున్న రాజ్‌ని నీ మనసులోని మాటను కావ్యతో చెప్పావా? లేదా? అని అడుగుతుంది యామిని. కావ్యకి చిన్న ప్రాబ్లం ఉందని అది సాల్వ్ కాగానే ప్రపోజ్ చేస్తానని చెబుతాడు రాజ్.

అపర్ణ దగ్గరికి వెళ్లి తాను జగదీష్‌ను చూశానని చెబుతుంది రుద్రాణి. ఆ మాటలతో అపర్ణ మహాకాళిలా మండిపోతుంది. ఇంకెప్పుడూ రేవతి పేరును తన వద్ద ఎత్తవద్దని వార్నింగ్ ఇస్తుంది. రాజ్ కోసం గుమ్మం దగ్గరే నిలబడి ఎదురుచూస్తున్న కావ్య.. రేవతిని అత్తయ్యతో ఎలా కలుపుతారంటూ పక్కకి తీసుకెళ్లి అడుగుతుంది. కూతురికి కావాలనే తక్కువ రకం డ్రెస్ తీసుకొచ్చి గొడవ పెట్టుకోవాలని ప్లాన్ చేస్తాడు రాహుల్. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా నిలిచింది. ఇక జూలై 25వ తేదీ ఎపిసోడ్ 783లో ఏం జరిగిందంటే?

Brahmamudi Serial July 25th 2025 Episode 783 Here is Today s full story

Photo Courtesy: JioHotstar

స్వప్న కూతురి పుట్టినరోజు సందర్భంగా దుగ్గిరాల ఫ్యామిలీ అంతా గిఫ్ట్‌లు తీసుకొచ్చి ఇస్తారు. అందరూ గిఫ్ట్‌లు ఇస్తున్నారు.. మనం కూడా ఏదో ఒకటి ఇవ్వాలి కదా అని కావ్యతో అంటాడు రాజ్. మీరు తీసుకొచ్చారు అనుకుని నేను తీసుకురాలేదని చెబుతాడు. అందరూ గిఫ్ట్‌లు ఇచ్చారు మనం ఇవ్వకపోతే పరువు పోతుందని అంటాడు. ఇంతలో కావ్య గిఫ్ట్ బయటికి తీయడంతో రాజ్ దానిని తీసుకుని నేను తీసుకొచ్చానని పాపకి ఇస్తాడు. రాజ్య గిఫ్ట్ తీసుకొచ్చాడు.. నువ్వేం ఇవ్వవా అని కావ్యని అడుగుతుంది స్వప్న. ఆయన ఇచ్చింది నాదేనని అంటుంది కావ్య.

అందరూ గిఫ్ట్‌లు తీసుకొచ్చారు.. కన్నతండ్రివి నువ్వేం తీసుకొచ్చావ్ అని రాహుల్‌ని అడుగుతుంది ఇందిర. నా కూతురి కోసం ఎక్స్‌లెంట్ డ్రెస్ తీసుకొచ్చానని దానిని ఇస్తాడు. డ్రెస్ చూసిన వెంటనే స్వప్న దానిని నేలకేసి కొడుతుంది. పుట్టినరోజు నాడు ఎవరైనా రెండు, మూడొందల డ్రెస్‌లు గిఫ్ట్‌గా ఇస్తారా అని మండిపడుతుంది. ఏదో తెచ్చాడు సంతోషించు అని రుద్రాణి జోక్యం చేసుకుంటుంది. వాడికి డ్రెస్ సెలక్షన్ తెలియదని కవర్ చేసే ప్రయత్నం చేస్తుంది. మీ కొడుకు వేసుకునే డ్రెస్‌లు మాత్రం చాలా కాస్ట్‌లీ, చాలా బ్రాండెడ్‌వి తెచ్చుకుంటాడని.. నా కూతురికి తీసుకురమ్మంటే మాత్రం రెండు, మూడొందలు విలువ చేసే డ్రెస్ తీసుకొస్తాడా అని మండిపడుతుంది స్వప్న.

నువ్వు డబ్బులు ఇవ్వకపోతే వాడు మాత్రం ఎక్కడి నుంచి తీసుకొస్తాడని నిలదీస్తుంది రుద్రాణి. నువ్వేమో నాకు డబ్బులు ఇవ్వడం లేదు.. నేనేమో జాబ్ చేయడం లేదు మరి నేను ఎక్కడి నుంచి తీసుకురావాలని అడుగుతాడు రాహుల్. నీ భార్య డబ్బులు ఇవ్వకపోతే నీ కూతురికి కనీసం ఒక డ్రెస్ కూడా కొనివ్వలేవా? అని నిలదీస్తుంది ఇందిర. మాకు వచ్చే వాటా మాకు ఇచ్చేస్తే ఏదో ఒక బిజినెస్ చేసుకుని కాలు మీద కాలు వేసుకుని బతుకుతామని అంటుంది రుద్రాణి. మీరేమో ఆస్తి పంచకుండా నాకొడుక్కి పాకెట్ మనీ కూడా ఇవ్వకుండా పనోడిగా మార్చేశారని మండిపడుతుంది.

ఏదైనా స్వప్న చూసుకుంటుంది.. తను చెప్పినట్లే చేయమని అన్నారు కదా మరి వాడు ఇలాగే చేస్తాడని అంటుంది రుద్రాణి. మా డబ్బు మాకిస్తే మేం కూడా ఎదుగుతామని చెబుతుంది. మీ నాన్న నాకు ఇచ్చిన విల్లాను మీకు రాసిచ్చేస్తానని ఇందిర చెప్పడంతో రుద్రాణి సంబరపడిపోతుంది. ఆస్తిని పంచాల్సిన అవసరం లేదని, వీళ్లకి ఆస్తుల్ని ఇస్తే నా కూతురు ఎదిగిన తర్వాత దానిని ఎక్కడో అమ్మేస్తారని అంటుంది స్వప్న. మీకు అంతగా ఇవ్వాలి అనుకుంటే నా కూతురు పెద్దది అయ్యాక దాని పేరు మీద రాయొచ్చు అని చెబుతుంది స్వప్న. ఈ గొడవతో రాహుల్, రుద్రాణిలు అలిగి వెళ్లిపోతారు.

పుట్టింటికి ఎప్పుడెప్పుడు వెళ్దామా అని రేవతి ఆతృతగా ఎదురుచూస్తుంటుంది. ఫోను రమ్మని పిలిచినా అక్కడికి వెళ్లాక మా అమ్మ ఎలా రియాక్ట్ అవుతుందోనని టెన్షన్‌గా ఉందని జగదీష్‌తో చెబుతుంది రేవతి. ఆ రేవతి నేను అని తెలిస్తే మా అమ్మ ఫోన్ కూడా చేసేది కాదని అంటుంది. మా అమ్మ చాలా పట్టుదల మనిషి అని.. ఒక్కసారి పంతం పట్టిందంటే అస్సలు వదిలిపెట్టదని చెబుతుంది రేవతి. అమ్మకి నా మీద కోపం పోయిందా? తిరిగి నన్ను కూతురిగా అంగీకరిస్తుందా? అని అడగ్గా ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తుందని అంటాడు జగదీష్. నువ్వు ఆటో దిగిన వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చి తనివితీరా ముద్దులు కూడా పెడుతుందని చెబుతాడు.

బాబుని తీసుకెళ్దామంటే నువ్వు వినడం లేదని జగదీష్ అడగ్గా.. మా అమ్మకి నా మీద కోపం పోయిందో లేదో తెలియడం లేదు. అక్కడ ఏదైనా గొడవ జరిగి అమ్మ నన్ను తిడితే వాడి మనసు బాధపడుతుందని అంటుంది రేవతి. రాజ్ - కావ్యలు రేవతి కోసం వెయిట్ చేస్తుంటారు.. నేను రేవతి అక్కకి కాల్ చేసి మాట్లాడానని, పార్టీకి బయల్దేరారు అని చెప్పగానే రాజ్‌ని కావ్య హత్తుకుంటుంది. వాళ్లిద్దరినీ చూసి ఇందిర, అపర్ణలు సంతోషిస్తారు. కావ్య సిగ్గుపడి లోపలికి వెళ్లిపోగా.. రాజ్‌ను అత్తాకోడళ్లు ఏడిపిస్తారు.

పాప పుట్టినరోజు సందర్భంగా అందరూ బిడ్డను ముద్దు చేస్తుంటే స్వప్న కంటతడి పెడుతుంది. రాహుల్‌ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాక ఇంటికి వచ్చిన కొత్తలో నన్ను అంతా ఏదో తప్పు చేసినదానిలా చూశారు. దాంతో నా కూతురికి ఈ కుటుంబం ప్రేమ ఎక్కడ దూరమవుతుందోనని భయపడ్డానని చెబుతుంది స్వప్న. ఇప్పుడు అందరూ నా కూతురిని ప్రాణంగా చూసుకుంటూ ఉండటంతో చాలా ఆనందంగా ఉందని అంటుంది. స్వప్న పాపతో కేక్ కట్ చేయిస్తూ ఉండగా రావాల్సిన వాళ్లు ఉన్నారని అడ్డుకుంటుంది కావ్య. అందరం ఉన్నాం కదా? ఇంకా ఎవరు రావాలి? అని అడుగుతుంది అపర్ణ. మమ్మల్ని కాపాడిన రేవతి గారు ఇంకా రాలేదని చెబుతుంది కావ్య.

ఇంతలో రేవతి- జగదీష్‌లు ఆటో దిగి ఇంట్లోకి వస్తుండగా దుగ్గిరాల ఫ్యామిలీ షాక్ అవుతుంది. రేవతిని కావ్య పిలవడం ఏంటీ అని ప్రకాశంను ధాన్యలక్ష్మీ అడుగుతుంది. ఇప్పుడు అక్క ఎంత గొడవ చేస్తుందోనని భయపడుతుంది. రేవతి ఇంట్లోకి వస్తుండగా అపర్ణ ఆగమని మండిపడుతుంది. ఎంత ధైర్యం ఉంటే నువ్వు మళ్లీ ఇంటి గడప తొక్కుతావు .. అసలు ఏ ముఖం పెట్టుకుని ఈ ఇంటికి వచ్చావని నిలదీస్తుంది. మీరే ఫోన్ చేసి పిలిచి ఇంటికి వచ్చిన వాళ్లని అవమానిస్తారా అని కావ్య అడుగుతుంది. వీళ్లు అని నాకు తెలిసుంటే అసలు మాట్లాడే దానిని కాదని చెబుతుంది అపర్ణ. ఆరోజు నన్ను, మా అక్కని కాపాడింది ఈవిడేనని అంటుంది కావ్య. ప్రాణాలు కాపాడిందా? లేక ప్రాణాలు కాపాడినట్లు నటించి తిరిగి ఇంటికి రావాలని ప్లాన్ చేసిందో ఎవరికి తెలుసు అని అపర్ణ నానామాటలు అంటుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X