Brahmamudi July 25th Episode: రేఖ- లక్కీ రిలేషన్‌పై భ్రమరాంబ అనుమానం.. నందూపై ప్రేమను చంపుకున్న వెంకీ
Photo Courtesy: JioHotstar
తననే పనిచేయమని చెప్పడంతో ఇందూపై రగిలిపోతుంది ఐశ్వర్య. ఆ అక్కాచెల్లెళ్లు ఇద్దరికీ బుద్ధి చెబుతానని మనసులో అనుకుంటుంది. ఇంతలో తనను వెతుక్కుంటూ లక్కీ రావడంతో ఐశ్వర్య షాక్ అవుతుంది. నువ్వు మా ఇంట్లో ఉన్నావేంటీ అని నిలదీయగా.. ఇకపై నేను కూడా ఇదే ఇంట్లో ఉంటానని లక్కీ చెప్పడంతో ఉలిక్కిపడుతుంది. మీ ఆంటీయే నన్ను ఇక్కడ ఉండటానికి పర్మిషన్ ఇచ్చిందని చెప్పడంతో రేఖతోనే తేల్చుకుంటానని కోపంగా వెళ్తుంది ఐశ్వర్య. మరోవైపు.. రాజ్ ఏం చెప్పినా ఓకే చెప్పడం, లక్కీ ఇక్కడ ఉండటానికి ఒప్పుకోవడంతో రేఖపై భూషణ్, భ్రమరాంబలు ఆమెను నిలదీస్తారు. ఆ రాజ్‌గాడిని నా దారిలోకి తెచ్చుకోవడానికి లక్కీగాడి తల్లి విషయంలో సాయం చేస్తానని చెప్పానని కవర్ చేస్తుంది రేఖ.
మదన్‌ని వాడుకుని పిన్ని చేతే లక్కీగాడు నా కొడుకు అని చెప్పేలా చేస్తానని ఇందూతో అంటాడు రాజ్. ఇంతలో లక్కీ వచ్చి నేను ఎక్కడ ఉండాలని అడుగుతాడు.. నువ్వెళ్లి లక్కీగాడి గదిలో ఉండమని రాజ్ చెబుతాడు. తన ఫ్రెండ్ చెప్పినట్లే మదన్ రూమ్‌లోకి లక్కీ వెళ్లడంతో అతను మండిపడతాడు. మీ అమ్మే నన్ను ఇక్కడ ఉండమని చెప్పిందని లక్కీ అనడంతో మీ అందరి సంగతి తేల్చేస్తానని మదన్ కింద పంచాయతీ పెడతాడు. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. ఇక జూలై 25వ తేదీ ఎపిసోడ్ 1094లో ఇంకా ఏం జరిగిందంటే?

Photo Courtesy: JioHotstar
లక్కీగాడిని మదన్ రూమ్‌లో ఉండాలో వద్దో ఫైనల్ డెసిషన్ నీదేనని రాజ్ చెప్పడంతో రేఖ ఆలోచనలో పడుతుంది. వాడిని బయటకు వెళ్లిపోమ్మని చెప్పమని రేఖతో భ్రమరాంబ చెబుతుంది. కొన్నిరోజులు నువ్వు అడ్జెస్ట్ అవ్వమని మదన్‌తో రేఖ చెప్పడంతో అంతా షాక్ అవుతారు. వాడు నా గదిని షేర్ చేసుకోవడం ఏంటీ అని మదన్ ప్రశ్నిస్తాడు. నేను చెప్పింది అర్ధం చేసుకుని చెప్పినట్లు వినమని వార్నింగ్ ఇస్తుంది రేఖ. ఏదో డౌట్ కొడుతుందోని నేను చెప్పానా? అని శేషం అంటాడు. ఇది ఎక్కడికో దారితీసేలా ఉంది జాగ్రత్తగా ఉండమని భూషణ్‌కి వార్నింగ్ ఇస్తాడు. మన రేఖ ఆ లక్కీగాడిని మదన్ రూమ్‌లో ఉండమని చెప్పడం ఏంటీ? ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకోవాల్సిందే.. ఆ రాజ్‌గాడికి మన రేఖ భయపడటం ఏంటీ? అని భ్రమరాంబ అనుమానిస్తుంది.
దుగ్గిరాల ఇంటికి వెంకీని తీసుకొచ్చిన నందూ.. నా ఫైల్ రూమ్‌లో ఉందని చెబుతుంది. నీ రూమ్ ఇక్కడ కాదని వెంకీ చెప్పగా.. ఇది మా ఇల్లు, ఇప్పుడు నేను ఇక్కడే ఉంటున్నానని చెబుతుంది నందూ. దుగ్గిరాల వారి ఇల్లు నీ ఇల్లా అని వెంకీ అడగ్గా.. నీకు అసలు విషయం చెప్పడం మరిచిపోయాను, మీ వదిన ఇందూ ఎవరో కాదు మా సొంత అక్క అని అని నందూ చెప్పడంతో వెంకీ షాక్ అవుతాడు. నేను చిన్నప్పుడే మా ఇంట్లో నుంచే పారిపోయానని నిజం చెబుతుంది నందూ. నువ్వు ఇప్పుడు దుగ్గిరాల వారి వారసురాలివి కదా అని వెంకీ అనడంతో నందూ అవునని అంటుంది. దుగ్గిరాల ప్రకాష్- ధాన్యలక్ష్మీల కొడుకు కళ్యాణ్ కూతురిని అని చెబుతుంది నందూ.
ఆ మాటలు వినగానే నేను వెళ్లిపోతానని చెప్పి కోపంగా వెళ్లిపోతాడు వెంకీ. నాతో ఏదో చెప్పాలని అన్నావు కదా? చెప్పమని నందూ అడగ్గా.. తండ్రికి ఇచ్చిన మాట గుర్తొచ్చి ఆగిపోతాడు వెంకీ. మనం అనుకున్నవన్నీ జరగాలని లేవు కదా అని చెబుతాడు. నందూ గురించి ఆలోచిస్తూ బాధగా వెళ్తుంటాడు వెంకీ. నందూకి గుమ్మంలో ఇందూ ఎదురై నువ్వు ఎక్కడికి వెళ్లావని ప్రశ్నిస్తుంది. రాజ్ యాక్సిడెంట్ గురించి ఎంక్వైరీ చేయడానికి వెళ్లానని తెలిస్తే అక్క సీరియస్ అవుతుందని నందూ అనుకుంటుంది. నేను, వెంకీ కలిసి బయటికి వెళ్లామని చెబుతుంది నందూ. మీరిద్దరూ కలిసి సినిమాకి వెళ్లారా? ఏదైనా పార్క్‌కి వెళ్లారా? మీ ఇద్దరి మధ్య ఏదో ఉందని అనిపిస్తోందని అంటుంది ఇందూ. నువ్వు వెంకీని ఇష్టపడుతున్నావా అని ఇందూ ప్రశ్నించగా నందూ సిగ్గుపడుతుంది.
వాడంటే నాకు ఇష్టం.. వాడిని ప్రాణంగా ప్రేమిస్తున్నాను, వాడు చాలా అమాయకుడు చిన్న అబద్ధం కూడా ఆడడు, కల్మషం లేని మనిషి.. వాడి అమాయకత్వం, మంచితనం నాకు చాలా బాగా నచ్చాయి. తెలియకుండానే వాడంటే నాకు ఇష్టం కలిగింది, ఆ ఇష్టం కాస్తా వాడే నా ప్రపంచంలా మారిపోయిందని అంటుంది నందూ. వాడికి కూడా నేనంటే ఇష్టమే కానీ బయటపడటం లేదు.. ఫస్ట్ వాడే ప్రపోజ్ చేయాలి, వాడు ప్రపోజ్ చేయగానే నేను యాక్సెప్ట్ చేయను.. అలాగనీ రిజెక్ట్ కూడా చేయను, సైలెంట్‌గా ఉండిపోతానని చెబుతుంది నందూ.
వాడిని వెయిట్ చేయించి ఫైనల్‌గా వాడి లవ్ యాక్సెప్ట్ చేస్తానని అంటుంది. కానీ వెంకీ నీకు ప్రపోజ్ చేయాలంటే చాలా కష్టం అనిపిస్తోంది. ఒకవేళ వాడు నీకు ప్రపోజ్ చేస్తే నువ్వు ఎలా యాక్సెప్ట్ చేస్తావోనని ఆలోచిస్తూ ఉంటాడని అంటుంది ఇందూ. అప్పుడే నీ మరిదికి సపోర్ట్ చేస్తున్నావా అని నందూ అడగ్గా.. ఇప్పుడు బావ గురించి ఎందుకు అని ఇందూ అనడంతో నందూ షాక్ అవుతుంది. వెంకీ నాకు భర్త అయితే, రాజు నాకు బావ అవుతాడు కదా? నాకు బావ అయితే నీకు కూడా బావే కదా అంటుంది ఇందూ. వెంకీ గాడు త్వరలోనే ప్రపోజ్ చేస్తాడని చెబుతుంది నందూ.
పార్టీలో ఐశ్వర్య డల్‌గా ఉండటంతో ఏం జరిగిందని అడుగుతుంది ఆమె ఫ్రెండ్. ఇంట్లో నాకు మర్యాద లేదు, అందరూ నన్నే అంటున్నారని చెబుతుంది ఐశ్వర్య. మహారాణిలా బతికే అదృష్టం నీ ముందే కనిపిస్తుంది, ఆ శశిగాడు చాలా రోజుల నుంచి నీ వెంట పడుతున్నాడు. నువ్వు వాడిని అస్సలు పట్టించుకోవడం లేదు.. వాడు కోటీశ్వరుడు అని చెబుతుంది ఫ్రెండ్. నువ్వు వాడి లవ్‌ని యాక్సెప్ట్ చేస్తే నిజంగానే మహారాణిలా ఉండొచ్చని అంటుంది. ఆ శాన్వీ ఎప్పటి నుంచో శశిని ట్రై చేస్తోంది.. నువ్వు గనుక నో చెబితే వాడు దానికి కనెక్ట్ అయిపోతాడని హెచ్చరిస్తుంది. రెండ్రోజుల్లో క్రెడిట్ కార్డ్ బిల్ కట్టాలని టెన్షన్ పడుతుంది ఐశ్వర్య. ఆడదానికి అందం ఉన్నంత వరకే విలువ అని ఐశ్వర్య మనసుని చెడగొడుతుంది ఫ్రెండ్.
మదన్, లక్కీల మధ్య ఏ చిన్న గొడవ జరిగినా రేఖ పిన్ని తట్టుకోలేదు.. అప్పుడు లక్కీ ఎవరో చెబుతుందని తన ప్లాన్ చేబుతాడు రాజ్. నీ లైఫ్‌లోకే వచ్చాయి అమ్మాయి చాలా లక్కీ అని రాజ్‌ని మెచ్చుకుంటుంది ఇందూ. నీ లైఫ్‌లోకి వచ్చే అమ్మాయి ఎలా ఉండాలో చెప్పమని అడుగుతుంది. నీలాగా మాత్రం అస్సలు ఉండకూడదు.. నీకంటే హైట్ ఉండాలి, అస్సలు చదువుకోకూడదు, కనీసం స్మార్ట్‌ఫోన్ వాడటం రాకూడదని, పిల్లలకు ఏబీసీడీలు వచ్చిన అమ్మాయి అయితే బెటర్ అని అంటాడు రాజ్. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications