Brahmamudi July 26th Episode: ధాన్యలక్ష్మిని రెచ్చగొట్టిన రుద్రాణి.. అప్పుని రిక్వెస్ట్ చేస్తున్న కళ్యాణ్!
బయటకు వెళ్లాలనుకున్న రాజ్ కావ్యల ప్లాన్ చెడగొట్టాలని చూస్తాడు రాహుల్. జ్యూస్ లో మోషన్ టాబ్లెట్ కలిపేసి అతని తిక్క కుదురుస్తుంది స్వప్న. కావ్య ని సర్ప్రైజ్ చేయటానికి ఆమెని రెస్టారెంట్ కి తీసుకు వెళ్తాడు రాజ్. కానీ అతని ప్లాన్ ఫెయిల్ అవుతుంది. రాజ్ దంపతులిద్దరూ సంసార జీవితం ప్రారంభించారని తెలుసుకొని ఆనందిస్తుంది ఇందిరా దేవి. కళ్యాణ్ ప్రేమ గురించి తెలుసుకున్న రాజ్ అతని ప్రేమని గెలిపించాలనుకుంటాడు. అప్పుకి పెళ్లి చూపులు అని తెలిసి హర్ట్ అవుతాడు కళ్యాణ్. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలెట్‌గా మిగిలాయి. ఇక జులై 26వ తేదీ ఎపిసోడ్ 472లో ఏం జరిగిందంటే..
ధాన్య లక్ష్మీ దగ్గరికి వెళ్ళిన రుద్రాణి కళ్యాణ్ కి మంచి సంబంధం వచ్చింది కళ్యాణ్ గురించి అన్ని విషయాలు తెలిసినా వాళ్ళు ఒప్పుకున్నారు అని చెప్తుంది. విడాకులు వచ్చి ఇంకా రెండు రోజులు కూడా కాలేదు అప్పుడే వాడికి పెళ్లి ఏంటి అంటుంది ధాన్యలక్ష్మి. నువ్వు అలాగే ఆలోచిస్తూ కూర్చో ఈ లోపు ఆ కావ్య ఏం చేయాలనుకుందో అది చేసేస్తుంది అంటుంది. తను ఏం చేస్తుంది అంటుంది ధాన్యలక్ష్మి. తన చెల్లెల్ని ఈ ఇంటి కోడల్ని చేయాలనుకుంటుంది అంటుంది రుద్రాణి.

అందుకు నేను ఒప్పుకోవాలి కదా అంటుంది ధాన్యలక్ష్మి. తను ఈ ఇంటికి వచ్చినప్పుడు కనీసం ఎక్కడ ఉండాలో కూడా తెలియని పరిస్థితి అలాంటిది ఇప్పుడు ఇంటికి మహారాణి అయిపోయింది, అత్తని, భర్తని మార్చేసింది, నా ప్రమేయం లేకుండానే నా కొడుక్కి పెళ్లి చేసేసింది రేపు నీ పరిస్థితి కూడా అంతే, అప్పు గనక ఈ ఇంటికి కోడలైతే మా అందరికీ మొగుడు అవుతుంది నీకు మాత్రం యముడు అవుతుంది ఆలోచించుకో అని ధాన్యలక్ష్మి ని రెచ్చగొట్టి వెళ్ళిపోతుంది రుద్రాణి. మరోవైపు కనకం కుటుంబ సభ్యులందరూ కూర్చొని పెళ్లి గురించి చర్చించుకుంటూ ఉంటారు.
పెళ్లి వాళ్ళు చాలా మంచి వాళ్ళు అప్పు అదృష్టవంతురాలు అంటుంది కనకం. కానీ మధ్యతరగతి కుటుంబంలోకి కోడలుగా వెళుతుంది రేపు దానికి ఏదైనా కష్టం వస్తే ఎవరు చూస్తారు అంటుంది స్వప్న. ఆ బ్రమలోంచి నేను ఎప్పుడో బయటపడ్డాను డబ్బున్న కుటుంబానికి మీ ఇద్దరినీ కోడళ్లని చేశాను రాహుల్తో నువ్వు ఏమైనా సుఖపడుతున్నావా, ఇక కావ్య జీవితం ఇప్పుడిప్పుడే చక్కదిద్దుకుంటుంది కాబట్టి నాకు అలాంటి బ్రమ ఏమీ లేదు అంటుంది కనకం.

వాళ్లకి డబ్బు లేకపోవచ్చు కానీ సంస్కారం ఉంది అది వాళ్ళ మాటల్లోనే తెలుస్తుంది అంటాడు కృష్ణమూర్తి. ఇంతలోనే అప్పు అక్కడి నుంచి బయటికి వచ్చేస్తుంది. ఆమె వెనకే వెళతారు కావ్య, స్వప్న. పెళ్లి నీకు ఇష్టం లేదా అని అడుగుతుంది కావ్య. అలాంటిదేమీ లేదు అమ్మానాన్నల ఇష్టమే నా ఇష్టం అంటుంది అప్పు. మధ్యతరగతి జీవితం జీవించగలవా అని అడుగుతుంది స్వప్న. మనం పుట్టక ముందే పేదరికం మన ఇంట్లో పుట్టింది అది నాకు మరో అక్క లాంటిది అని చెప్తుంది అప్పు. ఆ మాటలకి కావ్య, స్వప్న ఆనందపడతారు.
మరోవైపు కళ్యాణ్ అప్పుకి ఫోన్ చేస్తే ఆమె లిఫ్ట్ చేయదు మళ్లీ ఫోన్ చేసి ఎందుకు లిఫ్ట్ చేయడం లేదు నన్ను అవాయిడ్ చేస్తున్నావా అని అడుగుతాడు. అలాంటిదేమీ లేదు అంటుంది అప్పు. నాకు నిన్ను కలిసి మాట్లాడాలని ఉంది ఒకసారి మాట్లాడి వెళ్లిపోతాను మనం ఎప్పుడూ కలుసుకునే ప్లేస్ కి రా అని రిక్వెస్ట్ చేస్తాడు కళ్యాణ్. అందుకు ఒప్పుకుంటుంది అప్పు. మరోవైపు ధాన్యలక్ష్మి ఇంట్లో కళ్యాణ్ పెళ్లి గురించి పంచాయతీ పెడుతుంది. ముందుగా నాకెందుకు చెప్పలేదు అంటాడు భర్త.

అందరితోని ఒకేసారి చెప్పాలనుకున్నాను అంటుంది ధాన్య లక్ష్మి. ఇంట్లో వాళ్ళందరూ అప్పుడే వాడికి పెళ్లి ఏంటి అని మందలిస్తారు. అప్పుడే ఇంటికి వచ్చిన కావ్య కూడా కవి గారికి అప్పుడే పెళ్లి ఏంటి అంటుంది. వాడి తరపున నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు, వాడికి పెళ్లి చేయడం ఇష్టం లేదా లేదంటే వేరే అమ్మాయిని చేసుకోవడం ఇష్టం లేదా అని అడుగుతుంది ధాన్యలక్ష్మి. మీరేం మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదు అంటుంది కావ్య.
నువ్వు నీ చెల్లెల్ని కళ్యాణ్ కి ఇచ్చి పెళ్లి చేద్దామనుకుంటున్నావు అంటుంది ధాన్యలక్ష్మి. మీరు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారో అర్థమయింది మీరు మా అత్త తో మంతనాలు మానేస్తేనే గాని బాగుపడరు అంటుంది స్వప్న. తను ఏమైనా చిన్న పిల్ల నేను చెప్తే వినటానికి అంటుంది రుద్రాణి. కావ్య గురించి తప్పుగా మాట్లాడినందుకు ఇందిరా దేవి, అపర్ణ కూడా ధాన్యలక్ష్మిని మందలిస్తారు.
అనామిక వెళ్ళిపోయింది ఇప్పుడు మీరు తయారయ్యారా నన్ను అనటానికి అంటుంది కావ్య. మర్యాద లేకుండా మాట్లాడుతున్నావ్ ఏంటి అంటుంది ధాన్యలక్ష్మి. నా క్యారెక్టర్ గురించి మీరు తప్పు గా మాట్లాడుతున్నప్పుడు మీకు మర్యాద ఇచ్చేది ఏంటి అంటుంది కావ్య. చూసావా అక్క నీ కోడలు ఎలా మాట్లాడుతుందో అంటే అనవసరంగా మాటలు పడొద్దు అని నేనే నా కోడలికి చెప్పాను అంటుంది అపర్ణ.

తరువాయి భాగంలో కళ్యాణ్ ని పెళ్లికి ఒప్పిస్తానని మాట ఎందుకు ఇచ్చావు కళ్యాణ్ మనసులో ఏముందో తెలుసుకోవా అనే భార్యపై కోప్పడతాడు రాజ్. అతని మనసులో అప్పు లేదు అది కేవలం స్నేహం మాత్రమే అంటుంది కావ్య. కాదు కళ్యాణ్ అప్పుని ప్రేమిస్తున్నాడు అంటాడు రాజ్. ఆ మాటలకు షాక్ అవుతుంది కావ్య. మీరు అప్పు నీ ప్రేమిస్తున్నారా అని వెళ్లి కళ్యాణ్ ని సూటిగా అడుగుతుంది కావ్య. షాక్ అవుతాడు కళ్యాణ్.


Click it and Unblock the Notifications











