Brahmamudi July 26th Episode: రేవతికి పుట్టింట్లో ఘోర అవమానం.. కావ్యకి అపర్ణ వార్నింగ్

Photo Courtesy: JioHotstar

స్వప్న కూతురికి దుగ్గిరాల కుటుంబ సభ్యులు బర్త్ డే గిఫ్ట్ ఇస్తారు. అందరూ ఇస్తున్నారు మనం ఇవ్వకపోతే బాగోదని కావ్య దగ్గరి గిఫ్ట్ లాక్కొని ఇస్తాడు రాజ్. తండ్రిగా రాహుల్ ఏం తీసుకురాలేదా అని అడగటంతో ముందుగా తెచ్చిపెట్టిన తక్కువ రకం గౌను తీసుకొచ్చి ఇస్తాడు రాహుల్. అది చూసి నేలకేసి కొడుతుంది స్వప్న. నేను ఏ జాబ్ చేయడం లేదు.. నువ్వు నాకు డబ్బులు ఇవ్వవు.. నా దగ్గర ఉన్నవాటితోనే తీసుకొచ్చానని స్వప్నతో చెబుతాడు రాహుల్.

మా ఆస్తి మాకు ఇచ్చేస్తే మేం కూడా దర్జాగా బతుకుతామని రుద్రాని గొడవ పడటంతో విల్లాను రాసిస్తానని చెబుతుంది ఇందిర. దానికి స్వప్న అడ్డుపడి నా కూతురు ఎదిగిన తర్వాత దాని పేరు మీద రాయమని అడుగుతుంది. తమ ప్లాన్ ఫెయిల్ కావడంతో రుద్రాణి - రాహుల్‌లు అలిగి వెళ్లిపోతారు. కేక్ కట్ చేయబోతుండగా.. రేవతి వాళ్లు రాకపోవడంతో కాసేపు ఆపమని చెబుతుంది కావ్య. ఇంతలో ఆటో దిగి లోపలికి వస్తున్న రేవతి, జగదీష్‌‌ను చూసి అపర్ణ రగిలిపోతుంది. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా నిలిచింది. ఇక జూలై 26వ తేదీ ఎపిసోడ్ 784లో ఏం జరిగిందంటే?

Brahmamudi Serial July 26th 2025 Episode 784 Here is Today s full story

Photo Courtesy: JioHotstar

ఈ రేవతి ప్రాణాలు కాపాడిందో లేక ప్రాణాలు కాపాడినట్లు నటించి తిరిగి ఇంటికి రావాలని ప్లాన్ చేసిందో ఎవరికి తెలుసు అని మండిపడుతుంది అపర్ణ. రేవతి అమ్మ అని పిలవబోతుండగా నోరుమూయ్ అని కేకలు వేస్తుంది అపర్ణ. అమ్మ అని పిలిచే అర్హత నువ్వు కోల్పోయావని, నువ్వు ఈ ఇంట్లో అడుగుపెట్టడం అంటూ జరిగితే అది నా చావు తర్వాతే అని అంటుంది. రేవతి గారు మీ కూతురన్న విషయం నాకు ఇప్పటిదాకా తెలియదని చెబుతుంది కావ్య. నేను మీ కోడలిని అన్న విషయం తనకి కూడా తెలియదని అంటుంది. అందుకే నేను ఈ ఫంక్షన్‌కు పిలిచానని, నా మాట కాదనలేక రేవతిగారు ఇక్కడికి వచ్చారని చెబుతుంది కావ్య.

ఆ రోజు మేం ప్రమాదంలో ఉంటే మేం ఎవరో కూడా తెలియకపోయినా రేవతి గారే మమ్మల్ని కాపాడరని అంటుంది స్వప్న. అలాంటి మనిషిని ఇలా ఇంటికి పిలిచి అవమానించడం కరెక్ట్ కాదని చెబుతుంది. ఎప్పుడో ఏదో గొడవ జరిగిందని దానినే మనసులో పెట్టుకుని ఇప్పుడు అవమానించడం ఏంటీ? అని ప్రశ్నిస్తుంది కావ్య. తను చేసిన తప్పుల్ని క్షమించమని అడుగుతుంది. ఇన్నిరోజులుగా మా వదిన కూతురు చేసిన అవమానాన్ని మరిచిపోవడానికి ప్రయత్నిస్తుంటే మళ్లీ నువ్వు వాటిని గుర్తు చేస్తావా అని మండిపడుతుంది రుద్రాణి. కట్టుకున్న భర్త కోసం కన్న తల్లిదండ్రుల్ని అవమానించిందని చెబుతుంది. పుట్టింటితో బంధమే అవసరం లేదని వెళ్లిపోయిందని అంటుంది రుద్రాణి. ఇది తల్లికి కూతురికి సంబంధించిన విషయమని, మీరు జోక్యం చేసుకోవద్దని వార్నింగ్ ఇస్తుంది కావ్య.

రేవతి మా వదిన కూతురని పొరపాటున తీసుకొచ్చావ్.. మరి రేవతికి తనెవరో తెలుసు కదా అని అడుగుతుంది రుద్రాణి. ఆ విషయాన్ని దాచిపెట్టి తన మొగుడిని వెంటపెట్టుకుని వచ్చిందంటే ఇదంతా తన ప్లాన్‌లో భాగమని అంటుంది. మీ మాటలు చూస్తుంటే వారిద్దరికి గొడవ పెట్టడానికి చూస్తున్నట్లుగా ఉందని, సమస్యని పరిష్కరించేలా కనిపించడం లేదని రాజ్ మండిపడతాడు. అపర్ణ మనసుని ఇంకా ఎందుకు పాడు చేస్తున్నావని ఇందిర ప్రశ్నిస్తుంది. రేవతి ఇన్నేళ్లుగా శిక్ష అనుభవిస్తూనే ఉందని, కూతురికి దూరమై మీరిద్దరూ ఎంత బాధపడ్డారో నాకు తెలుసని అంటుంది ఇందిర. మన ఇంటి కోడళ్లని రేవతి కాపాడిన మాట నిజమేనని, కావ్య తెలియకుండానే రేవతిని ఇక్కడికి పిలిపించిన మాట కూడా నిజమేనని.. ఇదంతా దేవుడే చేశాడని ఎందుకు అనుకోవడం లేదని చెబుతుంది ఇందిర. నువ్వు రేవతిని క్షమిస్తే అందరం సంతోషంగా ఉండొచ్చని సలహా ఇస్తుంది.

రేవతి గారిని క్షమించమని కావ్య కూడా అడగటంతో .. కోడలు అని నెత్తిన పెట్టుకున్నందుకు ఈరోజు నాకు మంచి బహుమతి ఇచ్చావని మండిపడుతుంది. నువ్వు కూడా నన్ను బాధపెట్టావని, కోడలివన్న ఒకే ఒక్క కారణంతో నువ్వు చేసిన తప్పుని క్షమిస్తున్నానని అంటుంది. రేవతిని మాత్రం ఎప్పటికీ క్షమించనని తేల్చిచెబుతుంది అపర్ణ. కష్టాలు పడి చేసుకున్న పెళ్లి తప్పు అని తెలుసుకుని తిరిగి ఇంటికొస్తే నేను క్షమించేయాలా? అని అడుగుతుంది. మీకు చెప్పకుండా పెళ్లి చసుకోవడం తప్పేనని, మీరు నన్ను క్షమించి కూతురిగా అంగీకరిస్తారని ఆశతో వచ్చానని చెబుతుంది రేవతి. నా కొడుకు కోల్పోయిన కుటుంబాన్ని వాడికి ఇవ్వాలని అనుకున్నానని, నేను చేసిన తప్పుకి వాడికి శిక్ష వేయకూడదని.. వాడిని నీ కళ్ల ముందుకు తీసుకురావాలని ఆశపడ్డానని చెబుతుంది రేవతి.

ఇంత జరిగినా పెళ్లి చేసుకుని తప్పు చేయలేదని రేవతి అంటుందని, దీనిని తిరిగి ఇంట్లోకి తీసుకురావాలా? అని ప్రశ్నిస్తుంది అపర్ణ. ఈ ఇంట్లో అందరికీ నేను తీసుకున్న నిర్ణయం నచ్చినా నచ్చకపోయినా దీనిని ఎప్పటికీ ఇంట్లోకి రానివ్వనని తేల్చి చెబుతుంది అపర్ణ. నువ్వు చేసిన తప్పుకు నీ కొడుకు ఈ కుటుంబంతో సంబంధం లేకుండానే పెరుగుతాడని అంటుంది. ఒకవేళ వాడు అమ్మమ్మ ఏమైందని అడిగితే .. అమ్మమ్మ చచ్చిపోయిందని చెప్పు అనడంతో దుగ్గిరాల ఫ్యామిలీ షాక్ అవుతుంది. దాంతో రేవతిని తీసుకుని జగదీష్ అవమానంతో వెళ్లిపోతాడు.

గొడవ అయిపోయాక రేవతి ఫోటోని చూసుకుని బాధపడుతుంది అపర్ణ. ఇన్నేళ్ల తర్వాత కూతురు వెతుక్కుంటూ కన్నవాళ్ల దగ్గరికి వస్తే అవమానించి తప్పు చేశావేమోనని అంటాడు సుభాష్. అసలు అది ఇంటికి వస్తున్న విషయం తెలుసుకోకుండా తప్పు చేశానని చెబుతుంది అపర్ణ. అసలు మనిద్దరం దాని మీదే ప్రాణం పెట్టుకున్నామని.. కానీ కట్టుకున్నవాడి కోసం తల్లిదండ్రుల్ని అవమానించొచ్చా అని నిలదీస్తుంది. ఇంట్లో వాళ్లంతా రేవతిని నువ్వు క్షమించాలని ఆశపడ్డారని సుభాష్ చెప్పడంతో .. వాళ్ల సంగతి తర్వాత మీ సంగతి చెప్పమంటే సుభాష్ సైలెంట్ అయిపోతాడు. రేవతి ఇంకా పెళ్లి చేసుకుని తప్పు చేయలేదనే చెబుతుందని అపర్ణ మండిపడుతుంది.

రేవతిని అపర్ణని కలపడానికి నేను చేస్తున్న ప్రయత్నాల్ని మీరిద్దరూ నాశనం చేశారని కావ్య- రాజ్‌లపై ఇందిర మండిపడుతుంది. కూతురిని చూడగానే కరిగిపోతుందని అనుకున్నామని.. కానీ ఇలా కోప్పడుతుందని అనుకోలేదని అంటాడు రాజ్. అమ్మానాన్నల మనసుని గాయపరిచానని, ఎప్పటికీ వాళ్లు నన్ను క్షమించరని అర్ధమైపోయిందని చెబుతుంది రేవతి. అత్తయ్య మిమ్మల్ని ఖచ్చితంగా క్షమిస్తుందని అంటుంది కావ్య. ఆరోజు నువ్వు ఆవేశంతో కాకుండా ఆలోచించి నిర్ణయం తీసుకుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని చెబుతుంది ఇందిర. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X