Brahmamudi july 27th episode: కావ్యకి ధాన్యలక్ష్మి కండిషన్.. భార్యను తప్పుపడుతున్న రాజ్!
కావ్య ని సర్ప్రైజ్ చేయటానికి ఆమెని రెస్టారెంట్ కి తీసుకు వెళ్తాడు రాజ్. కానీ అతని ప్లాన్ ఫెయిల్ అవుతుంది. రాజ్ దంపతులిద్దరూ సంసార జీవితం ప్రారంభించారని తెలుసుకొని ఆనందిస్తుంది ఇందిరా దేవి. కళ్యాణ్ ప్రేమ గురించి తెలుసుకున్న రాజ్ అతని ప్రేమని గెలిపించాలనుకుంటాడు. అప్పుకి పెళ్లి చూపులు అని తెలిసి హర్ట్ అవుతాడు కళ్యాణ్. తనకి ఇష్టం లేకపోయినా తల్లిదండ్రుల కోసం పెళ్లికి ఒప్పుకుంటుంది అప్పు. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలెట్‌గా మిగిలాయి. ఇక జులై 27వ తేదీ ఎపిసోడ్ 473లో ఏం జరిగిందంటే..
నా క్యారెక్టర్ గురించి తప్పుగా మాట్లాడుతున్న మీకు మర్యాద ఇచ్చేది ఏమిటి అయినా ఇప్పుడు నేను మా అక్క ఎక్కడినుంచి వస్తున్నాము తెలుసా మా చెల్లి పెళ్లిచూపులుకి వెళ్ళాము ఆ పెళ్లి ఖాయం చేసుకొని వస్తున్నాము. అయినా మీతోనే రుద్రాణి గారి తోటి నేను మా అక్క పడుతున్న మాటలు చాలు అన్న మళ్లీ మా చెల్లిని తీసుకొచ్చి ఇంటి కోడలు చేయడానికి నాకు అస్సలు అలాంటి ఉద్దేశం లేదు అంటుంది కావ్య. ఏమో ఎవరికి తెలుసు నువ్వు ముసుగేసుకుని పెళ్లి చేసుకున్నట్టు మీ చెల్లికి కూడా ముసుగేసి పెళ్లి చేస్తారేమో అంటుంది రుద్రాణి.

ఆ మాటలకి అపర్ణ కోప్పడుతుంది ఆ ముసుగేసింది నువ్వే, అందుకే కదా నిన్ను చంప దెబ్బ కొట్టింది అప్పుడే మర్చిపోయావా అంటుంది. సరే అయితే నువ్వు నిజంగా నీ మరిది జీవితం బాగుపడాలి అనుకుంటే అతడిని పెళ్లికి ఒప్పించు అని కండిషన్ పెడుతుంది ధాన్యలక్ష్మి. దానికి ఏమవసరం, మీ పాట్లు మీరు పడండి అంటుంది స్వప్న. కళ్యాణ్ ని కావ్య పెళ్లికి ఒప్పించకపోతే అప్పుని ఇంటి కోడలు చేసే ఉద్దేశ్యం ఉన్నట్లే లెక్క అంటుంది ధాన్యలక్ష్మి.
మీరు అన్నారని కాకపోయినా నిజంగా కవి గారి జీవితం బాగుపడుతుంది అంటే అతడిని పెళ్లికి ఒప్పించే బాధ్యత నాది అని మాట ఇస్తుంది కావ్య. మరోవైపు అప్పుని కలిసిన కళ్యాణ్ నిజంగా నీకు పెళ్లి ఇష్టమేనా అని అడుగుతాడు. ఇష్టం లేదు అని చెప్తే ఇష్టం లేని పెళ్లి చేసుకోవద్దు అని గొడవ పెడతావు, నిన్నూ బాధ పెట్టలేను, నా తల్లిదండ్రులని బాధ పెట్టలేను అని మనసులో అనుకున్న అప్పు పెళ్లికి ఇష్టం లేకపోతే పెళ్లి చూపులకు ఎందుకు ఒప్పుకుంటారు ఈ పెళ్లి నాకు ఇష్టమే అంటుంది.

ఈ పెళ్లి ఇష్టం లేదని చెప్పు వెంటనే నా మనసులో మాట నీకు చెప్పి నిన్ను నా దాన్ని చేసుకుంటాను అని మనసులో అనుకుంటాడు కళ్యాణ్. కానీ అప్పు ఈ పెళ్లి ఇష్టమే అని చెప్పడంతో ఆమెకి ఆల్ ద బెస్ట్ చెప్పి బాధతో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మరోవైపు కళ్యాణ్ ని పెళ్లికి ఒప్పిస్తానని కావ్య ఇచ్చిన మాట గురించి తెలుసుకొని భార్యని నిలదీస్తాడు రాజ్. మాట ఇచ్చే ముందు కళ్యాణ్ మనసులో ఏముందో తెలుసుకోవా అంటూ కోప్పడతాడు. అంతా మీ పిన్ని గారి వల్లే, ఆవిడ నన్ను ఎన్ని మాటలు అన్నారో తెలుసా అంటుంది కావ్య.
అయినా కళ్యాణ్ మనసులో ఏముందో తెలుసుకోకుండా ఎలా మాటిచ్చేస్తావు అతని మనసులో అప్పు ఉంది అని చెప్తాడు రాజ్. మీరు కూడా అందరిలాగా తప్పుగా అర్థం చేసుకుంటున్నారు అప్పు అంటే కళ్యాణ్ కి కేవలం స్నేహం మాత్రమే అంటుంది కావ్య. కాదు కళ్యాణ్ మనసులో అప్పు ఉంది నాకు తెలుసు అంటాడు రాజ్ ఈ విషయం నేను కవి గారిని అడిగి తెలుసుకుంటాను అంటుంది కావ్య. మరోవైపు కావ్య ఇచ్చిన మాట తలుచుకొని ఆనందపడుతుంది రుద్రాణి.
నువ్వెందుకు అంతలా ఆనందపడుతున్నావు నిజానికి కావ్యకి అప్పు ని ఈ ఇంటి కోడల్ని చేయటం ఇష్టం లేదేమో అంటాడు రాహుల్. కానీ కళ్యాణ్ మనసులో అప్పు ఉంది ఆ విషయం కళ్యాణ్ రాజ్ కి చెప్తుంటే నేను విన్నాను. ఇప్పుడు రాజ్ అప్పు ని ఇంటి కోడలు చేసుకోవాలి అనుకున్నా కావ్య అందుకు ఒప్పుకోదు అని ఆనందంగా చెప్తుంది రుద్రాణి. మరోవైపు కావ్య కళ్యాణ్ తో మాట్లాడుతూ మీరు అప్పు ని ప్రేమిస్తున్నారా.. మీ అన్నయ్య మీరు అప్పు నీ ప్రేమిస్తున్నారు అని చెప్తున్నారు.
మీ వల్ల అప్పుకి అన్యాయం జరిగిందని మీరు తన మీద చూపిస్తున్న జాలి వాళ్ళకి ప్రేమ లాగా కనిపిస్తుంది. అయినా అప్పు నాకు ఈ ఇంటి కోడలు అవ్వడం ఇష్టం లేదు ఇప్పటికే నేను మా అక్క ఈ ఇంటి కోడళ్లు గా నానా మాటలు పడుతున్నాము, ఇక మా చెల్లిని కూడా ఈ ఇంటి కోడల్ని చేస్తే ఇక రుద్రాణి గారు మమ్మల్ని బ్రతకనివ్వరు, మీ అమ్మగారు కూడా అప్పుని జీవితాంతం కోడలుగా అంగీకరించరు ఆ విషయం మీకు కూడా తెలుసు అంటుంది కావ్య.
తరువాయి భాగంలో కళ్యాణ్ మనసులో అప్పు ఉందని రాజ్ అందరి ముందు చెప్తాడు. ఆ మాటలకి కావ్య మీకు ఎన్ని సార్లు చెప్పినా అర్థం కాదా కవి గారిది అప్పుది కేవలం స్నేహం మాత్రమే అని భర్త మీద కోప్పడుతుంది. ధాన్యలక్ష్మి అప్పు ని ప్రేమించావా అని కొడుకుని అడుగుతుంది. నిజం చెప్పమంటాడు రాజ్.


Click it and Unblock the Notifications











