Brahmamudi July 27th episode: ప్రేమే లేకపోతే.. పెళ్లి అనగానే ఎందుకు భయం.. అప్పు అఫైర్‌పై కళ్యాణ్!
రాజ్ దంపతులిద్దరూ సంసార జీవితం ప్రారంభించారని తెలుసుకొని ఆనందిస్తుంది ఇందిరా దేవి. కళ్యాణ్ ప్రేమ గురించి తెలుసుకున్న రాజ్ అతని ప్రేమని గెలిపించాలనుకుంటాడు. అప్పుకి పెళ్లి చూపులు అని తెలిసి హర్ట్ అవుతాడు కళ్యాణ్. తనకి ఇష్టం లేకపోయినా తల్లిదండ్రుల కోసం పెళ్లికి ఒప్పుకుంటుంది అప్పు. కావ్య తన చెల్లెల్ని కళ్యాణ్ కి ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటుందని కావ్య తో గొడవపడుతుంది ధాన్యలక్ష్మి. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలెట్‌గా మిగిలాయి. ఇక జులై 29వ తేదీ ఎపిసోడ్ 474లో ఏం జరిగిందంటే..
మీరు నిజంగా అప్పుని ప్రేమించలేదు కదా, మీ అన్నయ్య అపోహ పడుతున్నారు కదా నిజం చెప్పండి అంటుంది కావ్య. నేను ఏమనుకుంటున్నాను, ఇంట్లో వాళ్ళు ఏమనుకుంటున్నారు అనే విషయం పక్కన పెట్టండి అప్పు సంతోషంగా ఉంటే అంతే చాలు అంటాడు కళ్యాణ్. ఆ మాటలకి ఆనందించిన కావ్య ఇప్పుడు నా మనసు కుదుటపడింది.

ఇప్పుడు మీరు నాకు ఒక మాట ఇవ్వాలి అంటుంది కావ్య. అప్పు పెళ్లికి రాకూడదు అంతే కదా అంటాడు కళ్యాణ్. కాదు మీరు కూడా మీ అమ్మగారు తెచ్చిన సంబంధం చేసుకోండి అప్పుడు అందరి అనుమానాలకి తెరదించినట్లు అవుతుంది అంటుంది కావ్య. నేను ఏ పరిస్థితులలో ఉన్నాను, మీరు ఏం మాట్లాడుతున్నారు, నా మనసుకి అయిన గాయం అప్పుడే తగ్గేది కాదు అంటాడు కళ్యాణ్.
మీరు నా మాటకి ఏమాత్రం విలువ ఇచ్చిన దయచేసి పెళ్లికి ఒప్పుకోండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది కావ్య. మరోవైపు రుద్రాణి ధాన్యలక్ష్మి దగ్గరికి వెళ్లి కావ్య ఇచ్చిన మాట ఏం చేసిందో ఇప్పుడే వెళ్లి అడుగు, ఈ విషయంలో ఏ మాత్రం వెనకడుగు వేసినా ఆ అప్పు ఈ ఇంటి కోడలై కూర్చుంటుంది అని రెచ్చగొడుతుంది. రుద్రాణి మాటలకు రెచ్చిపోయిన ధాన్యలక్ష్మి కావ్య దగ్గరికి వెళ్లి కళ్యాణ్ తో మాట్లాడావా అని అడుగుతుంది.
నేను కవి గారిని కనుక్కున్నాను ఆయన మనసులో అప్పు లేదని చెప్పారు అంటుంది కావ్య. మరి నాకు ఇచ్చిన మాట సంగతి ఏంటి అంటుంది ధాన్యలక్ష్మి. మీ కొడుకుని ఒప్పించాల్సిన బాధ్యత నా చెల్లెలికి ఏం పట్టింది మీ భర్తతో పాటు మీ కొడుకు కూడా మీ మాట వినటం లేదా అని వెటకారంగా ఉంటుంది స్వప్న. అప్పుడే అక్కడికి వచ్చిన రాజ్ ఎవరు ఎవరికి మాట ఇవ్వాల్సిన అవసరం లేదు, కళ్యాణ్ మనసులో అప్పు ఉంది అని చెప్తాడు. ఆ మాటలకి షాక్ అవుతుంది ధాన్యలక్ష్మి.

మీకు ఒకసారి చెప్తే అర్థం కాదా, కవిగారి మనసులో అప్పు లేదని ఆయనే నాకు చెప్పారు అంటుంది అప్పు. కానీ కళ్యాణ్ మనసులో అప్పు ఉందని నాకు తెలుసు అంటాడు రాజ్. కళ్యాణ్ కి నేను వేరే సంబంధం చేయాలనుకుంటున్నాను అంటుంది ధాన్య లక్ష్మి. ఈ వాదనంతా ఎందుకు, కళ్యాణ్ ని పిలిచి అడిగితే నిజం తెలిసిపోతుంది ఒకవేళ కళ్యాణ్ మనసులో అప్పు ఉంది అంటే నా సపోర్ట్ నీకే రాజ్ అంటుంది స్వప్న.
సరే అంటూ రాజ్ వెళ్లి కళ్యాణ్ ని తీసుకొని వస్తాడు. కళ్యాణ్ మనసులో ఉన్న మాట చెప్పమని ఇంట్లో వాళ్ళందరూ అడుగుతారు. కళ్యాణ్ ఏదో చెప్పబోయే అంతలో ప్రకాష్ మాట్లాడుతూ ఇది నీ జీవితానికి సంబంధించిన విషయం మీ అమ్మ కోసమో,ఇంకెవరి కోసమో ఆలోచించి నీ నిర్ణయాన్ని మార్చుకోకు నీ మనసులో మాట నిర్బయంగా చెప్పు అంటాడు ప్రకాష్.
అప్పుడు కళ్యాణ్ మాట్లాడుతూ నేను అప్పు ని ప్రేమించలేదు. మా మధ్య ఉన్నది కేవలం స్నేహం మాత్రమే అంటాడు. నువ్వు ఇంట్లో వాళ్లకు భయపడి అలా చెప్తున్నావు కదా, నీకు అప్పు అంటే ప్రేమ లేకపోతే తనకి పెళ్లి అనగానే ఎందుకు అంతలా బాధపడ్డావు, నీకేమీ భయం లేదు నిర్భయంగా నిజం చెప్పు నీకు నేను ఉన్నాను అంటాడు రాజ్. ఒక మగ స్నేహితుడికి పెళ్లయితే వాడి ఇంటికి వెళ్ళొచ్చు, రావచ్చు. కానీ ఒక స్నేహితురాలికి పెళ్లయితే ఆమె ఇంటికి వెళ్లడం ఒక మగ స్నేహితుడికి కుదరదు అని చెప్తాడు కళ్యాణ్.
తరువాయి భాగంలో కళ్యాణ్ మనసులో అప్పు ఉంది,అప్పు మనసులో కళ్యాణ్ ఉన్నాడు ఆ విషయం వాళ్ళకి తెలుసు మనకి తెలుసు అని అంటాడు రాజ్. అవునా అయితే అప్పు మనసులో ఏముందో కనుక్కోండి అంటుంది అంటుంది కావ్య. కనకం వాళ్ళ ఇంటికి వెళ్లిన రాజ్ కళ్యాణ్ అప్పు ని ప్రేమిస్తున్నాడు అని చెప్తాడు. అప్పు మాత్రం తన ఇష్ట ప్రకారమే పెళ్లి జరుగుతుందని చెప్తుంది.


Click it and Unblock the Notifications











