Brahmamudi July 27th Episode: ఐశ్వర్యని అనుభవించాలని శశి కుట్ర... ఇందూ ప్రేమతో రాజ్ ఉక్కిరిబిక్కిరి

Photo Courtesy: JioHotstar

లక్కీ మదన్ రూమ్‌లో ఉండాలో వద్దో రేఖ పిన్నిదే ఫైనల్ డెసిషన్ అని చెబుతాడు రాజ్. చేసేదేం లేక కొడుకుని కొన్ని రోజులు అడ్జెస్ట్ కావాలని రేఖ చెప్పడంతో భ్రమరాంబ, భూషణ్ షాక్ అవుతారు. ఈ రేఖ పాత రేఖ కాదు.. మారిపోయింది, రాజ్ ఏం చెబితే అది చేస్తోందని అనుమానిస్తాడు శేషం. తాను దుగ్గిరాల వారసురాలిని అని, ఇందూ చెల్లెలిని అని నందూ చెప్పడంతో వెంకీ షాక్ అవుతాడు. దుగ్గిరాల కుటుంబం గురించి తండ్రి మాటలు గుర్తొచ్చి తన ప్రేమను దాచిపెట్టి బాధగా వెళ్లిపోతాడు వెంకీ.

వీరిద్దరినీ చూసిన ఇందూ.. తన చెల్లెలిని పక్కకి పిలిచి వెంకీని ఇష్టపడుతున్నావా అని అడుగుతుంది. దానికి నందూ అవునని సమాధానం చెబుతుంది. వెంకీ అమాయకుడు నువ్వే త్వరగా ప్రపోజ్ చేసేయమని అంటుంది ఇందూ. ఐశ్వర్య కష్టాల్లో ఉందని తెలుసుకున్న ఆమె ఫ్రెండ్.. ఆమెను తన బాయ్‌ఫ్రెండ్‌తో కలపాలని ప్లాన్ చేస్తుంది. డబ్బు మీద ఆశ చూపించి అతనికి దగ్గర చేయాలని మాయమాటలు చెప్పడంతో ఐశ్వర్య ఆలోచనలో పడుతుంది. లక్కీకి, మదన్‌కి గొడవ జరిగితే రేఖ పిన్ని ఎవరికీ సపోర్ట్ చేయాలో అర్ధం కాక అసలు విషయం చెబుతుందని తన ప్లాన్ చెబుతాడు రాజ్. ఇంతలో నీకు కాబోయే భార్య ఎలా ఉండాలో నాకు చెప్పమని రాజ్‌ని ఇందూ అడుగుతుంది. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. ఇక జూలై 27వ తేదీ ఎపిసోడ్ 1095లో ఇంకా ఏం జరిగిందంటే?

Brahmamudi Serial July 27th 2026 Episode 1095 Here is Today s full story

Photo Courtesy: JioHotstar

తనకు కాబోయే భార్య గురించి రాజ్‌ను అడిగి తెలుసుకుంటుంది ఇందూ. వాలు జడ వేసుకుని, దానికి చివరిలో జడగంటలు పెట్టుకుని అలా నడుస్తూ ఉంటే చూడాలని ఉంటుంది. అలాంటి అమ్మాయి ఉదయాన్నే తల స్నానం చేసి అందంగా చీరకట్టుకుని అలా తడిజుట్టుతో వేడి వేడి కాఫీ తీసుకొచ్చి ఇవ్వాలని అడుగుతాడు రాజ్. నేను ఏ బట్టలు వేసుకోవాలో తనే డిసైడ్ చేయాలి. ఉదయం నిద్ర లేచిన దగ్గరి నుంచి రాత్రి పడుకునే వరకు నా చుట్టూనే తిరగాలని రాజ్ చెప్పడంతో ఇందూ నవ్వుకుంటుంది. పగటి కలల కనడం ఆపాలి, అలాంటి క్వాలిటీలు ఉన్న అమ్మాయి అసలు ఈ భూమ్మీద ఉంటుందా? అని ప్రశ్నిస్తుంది ఇందూ. ఆల్రెడీ అలాంటి అమ్మాయి నా కోసం ఎక్కడో పుట్టే ఉంటుందని అంటాడు రాజ్. నీకు పక్కా పదహారాణాల తెలుగు అమ్మాయి కావాలా, నువ్వు కోరుకున్నట్లే నేను ఉంటానని అనుకుంటుంది ఇందూ.

నిన్ను అవమానించే వాళ్ల బుద్ధి చెప్పొచ్చు. శశిగాడి ప్రేమను యాక్సెప్ట్ చేయమని ఐశ్వర్యని బలవంతం చేస్తుంది ఆమె ఫ్రెండ్. ఆ వెంటనే శశి దగ్గరికి వెళ్లి తనకి చాలాసార్లు చెప్పి చూసినా వర్కవుట్ కాలేదని అంటుంది. ఇంత జరిగినా అది పడేలా కనిపించడం లేదు.. అయితే క్రెడిట్ కార్డ్ బిల్ కట్టేందుకు ఇబ్బంది పడుతోంది, దానిని నువ్వు సాల్వ్ చేసి నీ మనీ పవర్ చూపిస్తే ఈజీగా నీ బుట్టలో పడిపోతుందని అంటుంది ఫ్రెండ్. ఎప్పటి నుంచో ఈ జామపండును పడేయాలని చూస్తున్నాను, ఇన్నిరోజులకు ఆ అవకాశం వచ్చింది. ఇప్పుడు దాని కోసం ఎంతైనా ఖర్చు పెడతానని అంటాడు శశి. నేను కోరుకున్నది నాకు దక్కేలా చేశావు.. అమెరికా నుంచి నీకు ఫోన్ తెప్పించాను, కారులో ఉంది వెళ్లి తెచ్చుకోమని చెబుతాడు.

ఆ వెంటనే ఐశ్వర్య దగ్గరికి వెళ్లిన శశి.. నాతో మాట్లాడటానికి ఒప్పుకున్నందుకు థ్యాంక్స్. నీతో మాట్లాడాలని, సరదాగా కబుర్లు చెప్పుకోవాలని చాలాకాలంగా వెయిట్ చేస్తున్నాను అని పులిహోర కలుపుతాడు. నా ఫేస్ నీకు నచ్చలేదా? చాలా బాగుంటాను కదా? నా ఫేస్ చూసుకోవడానికి మా ఇంట్లో చాలా కాస్ట్‌లీ అద్దాలు ఉన్నాయని అంటాడు. ఆ మాటలతో ఐశ్వర్య నవ్వుతుంది. రాజ్ ఉదయాన్నే నిద్రలేచేసరికి పూలజడ వేసుకుని కాఫీ తీసుకుని వస్తుంది ఇందూ. ఆమెను చూడగానే రాజ్ షాక్ అవుతాడు.

కాఫీ ఇవ్వడమే కాదు.. ఆ కప్పును తీయడం కూడా నాకు తెలుసు అని ఫ్రెష్ అవ్వడాదనికి టవల్, సోప్, బ్రష్ ఇస్తుంది. ఇది సడన్‌గా మారిపోయి ఇన్ని సేవలు చేస్తోంది, ఇందులో స్కామ్‌లు ఏం లేవు కదా? మళ్లీ నన్నేమైనా ఇరికించాలని చూస్తుందా అని టెన్షన్ పడతాడు రాజ్. స్నానం చేసి వచ్చేసరికి బెడ్ మీద షర్ట్, ప్యాంట్ రెడీగా ఉండటంతో ఉలిక్కిపడతాడు. నీ డ్రెస్ నేనే రెడీ చేశాను, నీ కోసం టిఫిన్ రెడీ చేసి పెట్టానని అంటాడు ఇందూ. కొత్తగా సేవలు చేస్తున్నావేంటీ అని అడుగుతాడు రాజ్. నువ్వే నీకు కాబోయే భార్య ఎలా ఉండాలో చెప్పావు కదా అని అంటుంది ఇందూ. నేను నా లైఫ్‌లోకి వచ్చిన భార్య గురించి చెప్పాను, భార్యలా నటిస్తున్న నీ గురించి కాదని అంటాడు రాజ్. నీ దృష్టిలో నేను నీ భార్యను కాకపోవచ్చు.. కానీ సమాజం దృష్టిలో నేను నీ భార్యనే అని సిగ్గుపడుతూ వెళ్లిపోతుంది.

మా అందరితో కలిసి టిఫిన్ చేయమని లక్కీని బలవంతంగా డైనింగ్ టేబుల్ దగ్గరికి తీసుకొస్తాడు రాజ్. ఈరోజు నీ ప్లాన్స్ ఏంటీ అని ఐశ్వర్యని అడుగుతాడు లక్కీ. నీతో టైంపాస్ చేసే టైం నాకు లేదు.. ఈరోజు చాలా బిజీ అని అంటుంది ఐశ్వర్య. తనని నీ దారిలో పెట్టుకోవడానికి ఇదే మంచి ఛాన్స్ అంటాడు రాజ్. టిఫిన్ చేస్తున్న ఐశ్వర్య కాళ్లని తొక్కుతాడు లక్కీ. దాంతో లక్కీని గట్టిగా తొక్కుతుంది ఐశ్వర్య. లక్కీ టార్చర్ తట్టుకోలేక ఐశ్వర్య వెళ్లిపోతుంది. ఇంతలో ఇందూ వచ్చి నీ కోసం స్పెషల్‌గా పెసరట్టు చేశానని చెబుతుంది. మాకు ఇడ్లీ పెట్టి బావకి స్పెషల్‌గా పెసరట్టు పెడుతున్నావని అడుగుతుంది స్వాతి. ఎందుకంటే బావ నాకు స్పెషల్ కాబట్టి అంటుంది ఇందూ. రాజ్ వద్దంటున్నా వినకుండా పెసరట్లు వేస్తుంది.

ఇక్కడ ఏం జరుగుతుంది.. నువ్వు అద్దె మొగుడివా? అసలు మొగుడివా? అని రాజ్‌ని అడుగుతాడు లక్కీ. ఇంతకుముందు ఇలా ఉండేది కాదు.. కానీ నాకు యాక్సిడెంట్ అయినప్పటి నుంచి తనలో ఏదో మార్పు వచ్చిందని చెబుతాడు రాజ్. అద్దెకు తెచ్చుకున్న మొగుడి మీద ప్రేమ పుట్టిందా అని లక్కీ డౌట్ పడతాడు. ఆ వెంటనే రాజ్ ప్లేట్‌లోని పెసరట్టును లాక్కుని తింటాడు లక్కీ. వంటగదిలో ఇందూని చూసి మురిసిపోతుంది అపర్ణ. ఆ రోజు రాజుని పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకొచ్చావు.. కంపెనీ కోసం మీరిద్దరూ నిలబడినా ఏదో ఒక విషయంలో గొడవపడుతూనే ఉండేవారు. నీ జీవితం ఎలా ఉంటుందోనని భయపడేదానిని, ఇప్పుడిప్పుడే మీరిద్దరూ అర్ధం చేసుకుంటున్నారు. తనని బయటికి పంపించొద్దు, మీరెప్పుడూ ఇలాగే సంతోషంగా ఉండాలని చెబుతుంది అపర్ణ. తను నీ అసలు మనవడు అని నీకు చెప్పలేకపోతున్నాను, తను నా బావ , అతనితో నను జీవితాంతం సంతోషంగా కలిసుండాలని నేను అనుకుంటున్నాను అనుకుంటుంది ఇందూ.

నందూ దుగ్గిరాల ఇంటి వారసురాలని తెలిసి, తన ప్రేమను ఎలా వదులుకోవాలో తెలియక బాధపడతాడు వెంకీ. నందూ గురించి రాసిన ప్రేమలేఖను అవతలికి విసిరేస్తాడు. ఒకప్పుడు నచ్చిన అమ్మాయి వెంట తిరుగుతూ అదే ప్రేమ అనుకున్నాను, కానీ నువ్వు పరిచయం అయ్యాకే నాకు నిజమైన ప్రేమంటే ఏంటో తెలిసిందని ఎమోషనల్ అవుతాడు వెంకీ. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X