Brahmamudi July 28th Episode: రేవతి పెళ్లి వెనుక రుద్రాణి కుట్ర.. బయటపడ్డ రహస్యం, షాక్‌లో కావ్య

Photo Courtesy: JioHotstar

స్వప్న కూతురితో కేక్ కట్ చేస్తుండగా కావ్య కార్యక్రమాన్ని ఆపుతుంది. ఇంకా రావాల్సిన వారు ఉన్నారని.. వాళ్లు వచ్చే వరకు కేక్ కట్ చేయడం ఆపుదామని చెబుతుంది. ఆ మాటలతో షాకైన అపర్ణ.. మన ఫ్యామిలీ అంతా ఉంది కదా? ఇంకెవరు రావాలని అడుగుతుంది. ఆ రోజు మమ్మల్ని రౌడీల నుంచి కాపాడిన రేవతి గారు ఇంకా రాలేదని చెబుతుంది కావ్య. ఇంతలో ఆటోలో నుంచి దిగిన రేవతి- జగదీష్‌లను చూసి దుగ్గిరాల కుటుంబం షాక్ అవుతుంది. అపర్ణ ఏం గొడవ చేస్తుందోనని ప్రకాశం, ధాన్యలక్ష్మీ, ఇందిరలు వణికిపోతుంటారు. గుమ్మంలో అడుగుపెడుతున్న రేవతిని చూసి మళ్లీ ఏ ముఖం పెట్టుకుని వచ్చావని కఠినంగా మాట్లాడుతుంది అపర్ణ.

నా కొడుకుకి పెద్ద కుటుంబాన్ని ఇవ్వాలని ఆశపడ్డానని అందుకే వచ్చానని రేవతి చెబుతుంది. నీ కొడుకు ఎప్పటికీ ఈ ఇంటికి దగ్గర కాలేడని.. వాడు అడిగితే అమ్మమ్మ చచ్చిపోయిందని చెప్పమని అంటుంది అపర్ణ. పుట్టింటిలో జరిగిన అవమానంతో జగదీష్ - రేవతిలు ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్లిపోతారు. కూతురి ఫోటో చూస్తూ బాధపడుతున్న అపర్ణని సుభాష్ ఓదారుస్తాడు. కార్యక్రమం ముగిశాక కావ్య- రాజ్‌లపై ఇందిర మండిపడుతుంది. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా నిలిచింది. ఇక జూలై 28వ తేదీ ఎపిసోడ్ 785లో ఏం జరిగిందంటే?

Brahmamudi Serial July 28th 2025 Episode 785 Here is Today s full story

Photo Courtesy: JioHotstar

మనం తీసుకునే నిర్ణయాలే, మన జీవితాన్ని ఎటు వైపుకు తీసుకెళ్లాలో నిర్ణయిస్తాయని రేవతితో అంటుంది ఇందిర. ఆ రోజు నువ్వు ఆవేశంలో కాకుండా ఆలోచించి నిర్ణయం తీసుకుని ఉంటే ఈరోజు ఇలా బాధపడాల్సిన అవసరం ఉండేది కాదని చెబుతుంది. నా రాత అలా రాసి పెట్టుంటే ఏం చేస్తామని అంటుంది రేవతి. మీ అమ్మకి చెప్పకుండా అడుగు కూడా ముందుకు వేసే దానివి కాదు.. అలాంటిది ఇంత పెద్ద నిర్ణయం ఎలా తీసుకున్నావ్ అని ప్రశ్నిస్తుంది ఇందిర. అమ్మనాన్నలకి చెప్పి వాళ్లని ఒప్పించి మేం పెళ్లి చేసుకోవాలని అనుకున్నామని, కానీ రుద్రాణి అత్తయ్య ఇచ్చిన సలహా వల్లే ఇదంతా జరిగిందని రేవతి చెప్పడంతో ఇందిర, కావ్య, రాజ్ షాక్ అవుతారు.

నేను, ఈయన కలిసి ఉండటం రుద్రాణి అత్తయ్య చూసిందని జరిగినది చెబుతుంది. ఇంట్లో నుంచి గెంటేయడానికి మంచి ఛాన్స్ ఇచ్చిందని రుద్రాణి మనసులో అనుకుంటుంది. దయచేసి ఈ విషయం అమ్మనాన్నలకి చెప్పొద్దని రుద్రాణిని ప్రాధేయపడుతుంది రేవతి. నువ్వేంటీ, నీ స్థాయేంటీ అని రుద్రాణి కోపం నటిస్తుంది. నీ ఇష్టాన్ని నేను ఎలా కాదనగలను అని అంటుంది. ప్రేమించడం తప్పు కాదని, ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకోకపోవడమే తప్పని చెబుతుంది రుద్రాణి. చదువు పూర్తయ్యాక అమ్మనాన్నలని ఒప్పించి జగదీష్‌ని పెళ్లి చేసుకుంటానని అంటుది రేవతి.

కూతురంటే ప్రాణం కాదా అని, నువ్వు డ్రైవర్‌ని ప్రేమిస్తే పెళ్లి చేస్తారని ఎలా అనుకున్నావని నిలదీస్తుంది రుద్రాణి. నీ ప్రేమ విషయం చెప్పగానే నిన్ను కొడతారేమో కానీ.. జగదీష్‌ని చంపేస్తారని భయపెడుతుంది రుద్రాణి. మీ నాన్న పరువు కోసం ప్రాణాలైనా ఇచ్చే మనిషి అని, అలాంటిది నువ్వు పేదవాడైన డ్రైవర్‌ను పెళ్లి చేసుకుంటే ఊరుకుంటాడా? అని ప్రశ్నిస్తుంది. నీ ప్రేమను గెలిపించుకోవడం కోసం నువ్వు ఏమైనా చేస్తావా అని అడుగుతుంది రుద్రాణి. నీ ప్రేమ గెలవాలన్నా.. తర్వాత జగదీష్ ప్రాణాలతో ఉండాలన్నా నువ్వు నేరుగా పెళ్లి చేసుకుని ఇంటికి వచ్చి మీ అమ్మానాన్నల ముందు నిలబడు అని చెబుతుంది. అప్పుడు తప్పనిసరి పరిస్ధితుల్లో నిన్ను దూరం చేసుకోలేక నీ ప్రేమను అంగీకరిస్తారని సలహా ఇస్తుంది. నేను కూడా నీ ప్రేమను ఒప్పుకోమని సపోర్ట్ చేసి మాట్లాడతానని చెబుతుంది. రుద్రాణి మాటలు నమ్మిన రేవతి.. జగదీష్‌ని పెళ్లి చేసుకునేందుకు ఒప్పుకుంటుంది.

ఇదంతా ఆ రుద్రాణి చేసిన పని అన్న విషయం తెలుసుకున్న ఇందరి రగిలిపోతుంది. ఇంట్లో అంత దారుణం జరిగితే రుద్రాణి గారి హస్తం లేకుండా ఉండదని అనుకున్నానని.. నా అనుమానామే నిజమైందని చెబుతుంది కావ్య. అందంగా కనిపించే ఆ మనిషి ఇంత కన్నింగా అని రాజ్ షాక్ అవుతాడు. మీరు ఊరుకున్నా నేను ఊరుకోనని.. దానికి సరైన బుద్ధి చెబుతానని అంటుంది ఇందిర. రేవతికి అవమానం జరగడంతో రుద్రాణి డ్యాన్స్ చేస్తుంటుంది. దీంతో రాహుల్ కంగారు పడుతూ.. మనం ఇలా డ్యాన్స్ చేస్తే ఎవరైనా చూస్తే ఈ గొడవ మనమే చేశామని అనుకుంటారని వార్నింగ్ ఇస్తాడు. ఆ రేవతిని అపర్ణ ఆంటీ ఎక్కడ క్షమించేస్తుందో, మనకి రావాల్సిన ఆస్తిలో ఇంకో వాటా పెరిగిపోతుందోనని చాలా టెన్షన్ వచ్చేసిందని అంటాడు రాహుల్.

రేవతిని, అపర్ణని అస్సలు కలవనివ్వనని.. గతంలో దానిని మోటివేట్ చేసి, ఆ జగదీష్‌ని పెళ్లి చేసుకునేలా చేసింది దాని ఆస్తి మన వాటా కిందకు రావాలనే అని చెబుతుంది రుద్రాణి. అలాంటిది దానిని ఈ ఇంట్లోకి ఎందుకు రానిస్తానని అంటుంది. ఈ ఆస్తి మొత్తం మనం అనుభవించాలంటే ఆ రాజ్‌ని కూడా యామినితో కనెక్ట్ చేయాలని చెబుతుంది. ఈ మాటలన్నీ విన్న ఇందిర .. రుద్రాణి చెంప పగులగొడుతుంది. 15 ఏళ్ల క్రితం జరిగిన దానికి ఇప్పుడు కొట్టానని చెప్పి వెళ్లిపోతుంది ఇందిర.

రేవతిని, అపర్ణని కలిపే ప్లాన్ ఫెయిల్ కావడంతో రాజ్‌పై కావ్య మండిపడుతుంది. తల్లిని, పిల్లని కలపడం కుదరలేదు కాబట్టి.. మనవడి ద్వారా మచ్చిక చేసుకుందామని మరో ప్లాన్ చెబుతాడు రాజ్. మీరు అమ్మని టెంపుల్‌కి తీసుకురండి.. నేను రేవతి అక్కని ఒప్పించి బాబుని తీసుకొస్తానని చెబుతాడు. టైం చూసి వాడిని అమ్మకి దగ్గర చేస్తానని అంటాడు. రాజ్ ప్లాన్ గురించి ఇందిరకి చెబుతుంది కావ్య. అపర్ణకి కావ్య టీ ఇవ్వబోతుండగా వద్దు అని కోడలిపై కోప్పడుతుంది. ఇంతలో ఇందిర వచ్చి నీకు మా అపర్ణ ఎలా కనిపిస్తుంది అంటూ ఆమెను రెచ్చగొడుతుంది. కోడలిని ఎందుకు క్షమించడం లేదని అడుగుతుంది కావ్య.

ఇష్టం లేకుండా పెళ్లి చేసుకుని వస్తే కోడలి పోస్ట్ ఇచ్చింది ఎవరు? అని ప్రశ్నిస్తుంది ఇందిర. రాజ్ నిన్ను తిట్టి పంపించేస్తే సపోర్ట్ చేసింది? ఆఫీస్ బాధ్యతలు అప్పగించింది ఎవరు? అని గుర్తుచేస్తుంది. అంత ప్రేమ ఉంటే ప్రతి శుక్రవారం గుడికి కలిసి వెళ్లేవాళ్లం.. ఈరోజు ఎందుకు అడగలేదని నిలదీస్తుంది కావ్య. తను తప్పు చేసింది కాబట్టి.. తనతో కలిసి వెళ్లనని అంటుంది అపర్ణ. తనతో వెళ్లను నేను ఒక్కదానినే వెళ్తానని చెబుతుంది. ప్లాన్ వర్కవుట్ కావడంతో కావ్య సంతోషిస్తుంది. ఇంతలో రాజ్ ఫోన్ చేసి రేవతి అక్కని గుడికి పంపించడం వరకు ఒప్పించానని చెబుతాడు. బాబుని గుడికి పంపడం గురించి నువ్వే చూసుకోమని చెప్పడంతో రేవతి దగ్గరికి కావ్య బయల్దేరుతుంది.

పుట్టింటిలో జరిగినది తలచుకుని రేవతి బాధపడుతుంది. ఇంతలో పిల్లాడు వచ్చి ఆకలిగా ఉందని టిఫిన్ పెట్టమని పదే పదే అడిగినా రేవతి పట్టించుకోదు. ఇదంతా చూసిన జగదీష్.. రేవతిని తట్టి లేపుతాడు. బాబు ఆకలి అని ఏడుస్తుంటే అంత పరధ్యానంగా ఏం ఆలోచిస్తున్నావని అడుగుతాడు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X