Brahmamudi July 28th Episode: లక్కీకి అండగా రాజ్.. రేఖ చేతిలో మదన్‌కి అవమానం, షాక్‌లో భూషణ్
Photo Courtesy: JioHotstar
తనకు కాబోయే భార్య ఎలా ఉండాలో ఇందూకి చెబుతాడు రాజ్. దాంతో ఉదయాన్నే కాఫీ కప్పుతో రాజ్‌ని నిద్ర లేపి స్నానానికి నీళ్లు, వేసుకోవడానికి బట్టలు ఇస్తుంది. ఇదంతా చూసి రాజ్ షాక్ అవుతాడు. ఇంట్లో నిన్ను అవమానిస్తున్న వాళ్లకు బుద్ధి చెప్పు, ఆ శశిగాడి ప్రేమను యాక్సెప్ట్ చేయమని ఐశ్వర్యకి నూరిపోస్తుంది ఆమె ఫ్రెండ్ రేణు. వెంటనే శశిగాడి దగ్గరికి వెళ్లి.. పిల్ల బుట్టలో పడినట్లే.. దానికున్న ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ క్లియర్ చేస్తే ఐశ్వర్య నీ సొంతం అని చెబుతుంది. దాంతో ఆమెకు ఐ ఫోన్‌ని గిఫ్ట్‌గా ఇస్తాడు. ఇదే అదనుగా ఐశ్వర్య దగ్గరికి వెళ్లి మాయమాటలు చెప్పి ఆమెను నవ్విస్తాడు.
లక్కీని టిఫిన్ చేయడానికి డైనింగ్ టేబుల్ దగ్గరికి బలవంతంగా తీసుకొస్తాడు రాజ్. తన పక్కన కూర్చొన్న ఐశ్వర్యని గోకుతుంటా లక్కీ.. ఆమెను కాలుతో రాస్తుండగా, ఐశ్వర్య కోపంతో లక్కీ కాలుని తొక్కుతుంది. రాజ్ కోసం స్పెషల్‌గా పెసరట్లు తీసుకొచ్చి పెడుతుంది ఇందూ. ఇదంతా చూసి అద్దె మొగుడివి నీకోసం ఇన్ని సేవలు చేస్తోంది ఏంటని అడుగుతాడు లక్కీ. నాకు యాక్సిడెంట్ జరిగినప్పటి నుంచి ఇందూ విచిత్రంగా ప్రవర్తిస్తోందని చెబుతాడు రాజ్. నందూకి ప్రేమ విషయం చెబుదామనేకునేలోగా ఆమె దుగ్గిరాల వారసురాలని తెలియడంతో బాధపడుతుంటాడు వెంకీ. ఆమె కోసం రాసిన లేఖని బయటికి విసిరేసి తనలో తాను కుమిలిపోతాడు. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. ఇక జూలై 28వ తేదీ ఎపిసోడ్ 1096లో ఇంకా ఏం జరిగిందంటే?

Photo Courtesy: JioHotstar
నందూకి ఎలా ప్రపోజ్ చేయాలో అర్ధం కావడం లేదు.. నువ్వు లేకుండా ఎలా ఉండాలి? ఈ బాధ ఎలా మోయాలి అని వెంకీ బాధపడుతుండగా నందూ ఫోన్ చేస్తుంది. కానీ కాల్ కట్ చేస్తాడు. పదే పదే ఫోన్ చేయడంతో ఏం జరిగింది? నా ఫోన్ ఎందుకు కట్ చేస్తున్నావని మండిపడుతుంది నందూ. పని మీదున్నాను అందుకే కట్ చేశానని అంటాడు వెంకీ. మనిద్దరం అర్జెంట్‌గా బయటికి వెళ్లాలని నందూ అడగ్గా.. నేను రాలేనని చెబుతాడు. దాంతో నందూ షాక్ అవుతుంది. నీ వర్క్ నాకంటే ఇంపార్టెంటా? అని అడగ్గా.. కాల్ కట్ చేస్తాడు వెంకీ. ఒకవేళ నాకు ప్రపోజ్ చేస్తే నేను ఏమంటానో అని టెన్షన్ పడుతున్నాడా అని నందూ కంగారుపడుతుంది. మనమే ఒకడుగు ముందుకు వేయాలని వెంకీ దగ్గరికి బయల్దేరుతుంది.
ఉదయాన్నే లక్కీ సీరియల్ చూస్తుండగా రిమోట్ లాక్కుంటాడు మదన్. గొడవపడితే నా తల్లిని వెతకడం మానేస్తాడని భయపడ్డ లక్కీ సైలెంట్ అయిపోతాడు. అయితే మదన్ టీవీ చూడకుండా ఫోన్ చూసుకుంటూ ఉండటంతో రిమోట్ లాక్కుని సీరియల్ చూస్తాడు లక్కీ. ఇది చూసిన మదన్ సీరియస్ అవుతాడు. నేను ఏం చూడాలో కూడా నువ్వే డిసైడ్ చేస్తావా? నువ్వు ఏ అర్హత లేని మనిషివి.. అలాంటిది నా ఇంట్లోకి వచ్చావు, నా రూమ్‌లోకి వచ్చావు, నా వస్తువులు ముట్టుకుంటున్నావు, ఇప్పుడు నువ్వు నేను చూస్తున్న ఛానెల్ కూడా మార్చేస్తున్నావని మండిపడతాడు మదన్.
దాంతో రిమోట్ విసిరేసి నీకు నచ్చిన ఛానెల్ పెట్టుకోమని చెబుతాడు లక్కీ. దీనికి సీరియస్ అయిన మదన్ వెళ్లి లక్కీ కాలర్ పట్టుకుంటాడు, లక్కీకి కోపం వచ్చి తను కూడా పట్టుకుంటాడు. ఇదంతా చూసిన భ్రమరాంబ, భూషణ్‌లు కంగారుపడతారు. వద్దు వద్దు అని నెత్తి నోరు కొట్టుకుంటున్నా.. నా మాట లెక్క చేయకుండా ఈ లక్కీగాడిని ఇంట్లో ఉండనిచ్చావు, మనం పడేసే ఎంగిలి మెతుకులు తినే వీడు.. ఈరోజు నీ కొడుకు కాలర్ పట్టుకునేంత వరకు వచ్చాడంటే దీనికి కారణం నువ్వేనని రేఖపై సీరియస్ అవుతుంది భ్రమరాంబ.
వాడు నీలాగా బస్తీవాడు అనుకుంటున్నావా? నీలాగా అడ్రస్ లేనివాడు అనుకుంటున్నావా? వాడు నా కొడుకు .. కేరాఫ్ రేఖ భూషణ్.. అలాంటిది నువ్వు నా కొడుకు కాలర్ పట్టుకుంటావా అని మండిపడతాడు భూషణ్. వీడెంత వీడి బతుకెంత? వాడిని నాలుగు తగిలించి ఇంట్లో నుంచి పంపేయమని చెబుతుంది భ్రమరాంబ. నేను కావాలని కాలర్ పట్టుకోలేదు.. అప్పటికీ నేను చాలా తగ్గానని అని చెబుతాడు లక్కీ. నువ్వు తప్పు చేయనప్పుడు నువ్వు సారీ చెప్పొద్దని అంటాడు రాజ్. అసలు వాడు ఈ ఇంట్లో ఉండటమే ఎక్కువ అనుకుంటే అలాంటిది వాడు నా మేనల్లుడి కాలర్ పట్టుకోవడం ఏంటని భ్రమరాంబ సీరియస్ అవుతుంది.
లక్కీగాడిని చాలా అవమానంగా మాట్లాడుతున్నారు, నా ఫ్రెండ్‌ని తిట్టినట్లే నన్ను తిట్టినట్లే. మీ మేనల్లుడికి బుద్ధి చెప్పుకోండని సీరియస్ అవుతాడు రాజ్. నా మేనల్లుడు చక్కగా చదువుకున్నాడు, వాడికి అన్ని తెలుసు అంటుంది భ్రమరాంబ. అంత చదువు చదుకున్నాడు కానీ సంస్కారం నేర్చుకోలేదు.. అమ్మాబాబులు సంస్కారం నేర్పుంటే ఇలా ఎదుటివాళ్లని తక్కువ చేసి ఎందుకు మాట్లాడతాడు. ఏం జరిగిందని అడుగుతాడు రాజ్. నాకు అర్హత లేదు.. అయినా సైలెంట్‌గానే ఉన్నాను, ముందు తనే కాలర్ పట్టుకోవడంతో కోపంతో నేను కూడా కాలర్ పట్టుకున్నానని చెబుతాడు లక్కీ. తప్పు తను చేసి మా వాడితో సారీ చెప్పించుకోవాలని చూస్తారా? అసలు సారీ చెప్పాల్సింది ఈ మదన్ అంటాడు రాజ్.
వాడికి నా మేనల్లుడు సారీ చెప్పేదేంటీ? లాగిపెట్టి వాడిని కొట్టమని రేఖతో అంటుంది భ్రమరాంబ. దాంతో రేఖ సీరియస్‌గా వచ్చి మదన్‌ను కొడుతుంది. దాంతో అంతా షాక్ అవుతారు. ఈ రేఖ కొడుకు ఎలా ఉండాలి? నీ స్థాయి ఏంటో తెలిసి కూడా ఇలాంటి వాళ్లతో గొడవపడుతున్నావంటే సిగ్గుగా లేదా అని మండిపడుతుంది. రేఖ ప్రవర్తనతో భ్రమరాంబ, భూషణ్, శేషం షాక్ అవుతారు. రేఖ ముందులా ఉండటం లేదు.. తను మారిపోయింది, తనను ఏదో ఆవహించింది అదేంటో కనుక్కో.. లేదంటే ఇలాంటి ఎదురుదెబ్బలు చాలానే చూడాల్సి వస్తుందని చెబుతాడు శేషం.
శశితో కలిసి ఐశ్వర్య మందుకొడుతుంది. ఇంతలో శశి వాళ్ల నాన్న ఫోన్ చేసి లండన్ వెళ్లమని చెబుతాడు. నా వల్ల కాదని చెప్పి ఐశ్వర్య ముందు బిల్డప్ కొడతాడు శశి. మనకి ఒకటే లైఫ్ ఎంజాయ్ చేసే సమయంలో ఎంజాయ్ చేయాలి, ఆ తర్వాత మా డాడీ బిజినెస్‌లు నేను చూసుకుంటానని మాయమాటలు చెబుతాడు. ఆ మాటలకి ఐశ్వర్య పడిపోతుంది. మరోవైపు.. ఇందూ - రాజ్‌లు మాట్లాడుకుంటూ ఉంటారు. ఉదయం జరిగిన గొడవకి ఆ లక్కీగాడి చెంప పగిలిందనుకుంటే, ఆ మదన్ గాడి చెంప పగిలిందని అంటాడు రాజ్. మదన్‌ని కొడితే గొడవ అక్కడితో ఆగిపోతుంది.. అదే లక్కీని కొడితే గొడవ పెద్దదవుతుందని రేఖ పిన్ని తెలివిగా ఇలా చేసిందని చెబుతాడు.
మళ్లీ మళ్లీ మన ప్రయత్నాలు చేస్తూనే ఉండాలి.. మా డోస్ మరింత పెంచాలని చెబుతుంది ఇందూ. తన నోటితో నిజం చెప్పేంత వరకు రాజ్ గాడు అస్సలు వదిలిపెట్టడని అంటాడు. మనమే ఇలా ఆలోచిస్తున్నామంటే ఆ రేఖ పిన్ని ఎలా ఆలోచిస్తుందో, తను చాలా డేంజరస్.. జాగ్రత్తగా ఉండాలని చెబుతుంది ఇందూ. జరిగిన దానికి మదన్ బాధపడుతుండగా రేఖ వెళ్లి ఓదారుస్తుంది. నీ సారీ నాకేం వద్దు.. ఆ లక్కీగాడు ఒక అనాథ, వాడికెందుకు అంత స్పేస్ ఇస్తున్నావు.. ఒకప్పుడు అలాంటి వాళ్లతో మాట్లాడేదానివి కాదు, ఇప్పుడెందుకు ఆ లక్కీగాడిని నా గదిలో పెట్టావు. చిన్నప్పటి నుంచి నా మీద చేయి చేసుకోని నువ్వు ఈరోజు కొట్టావు, అది వాడి కోసం కొట్టావు, నీ కన్నకొడుకు కంటే ఆ అనాథ ఎక్కువైపోయాడా అని బాధపడతాడు మదన్. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications