Brahmamudi July 29th Episode: అమ్మమ్మ చెంతకు మనవడు.. రేవతి కళ్లలో ఆనందం
Photo Courtesy: JioHotstar
జగదీష్‌ని నేను అమ్మనాన్నల పర్మిషన్ అడిగే పెళ్లి చేసుకుందామని అనుకున్నానని కానీ రుద్రాణి అత్తయ్య సలహాతో గుడిలో పెళ్లి చేసుకున్నామని చెబుతుంది రేవతి. ఆ మాటలతో ఇందిర, కావ్య, రాజ్‌లు షాక్ అవుతారు. 15 ఏళ్ల క్రితం తన పెళ్లికి ముందు ఏం జరిగిందో మొత్తం చెబుతుంది రేవతి. ఇంట్లో ఇలాంటి దారుణం జరిగితే ఖచ్చితంగా ఆవిడ హస్తం ఉంటుందని ముందే అనుకున్నానని కావ్య అంటుంది. రేవతిని అపర్ణ తన కూతురిగా అంగీకరించకపోవడంతో రుద్రాణి - రాహుల్‌లు డ్యాన్స్ చేస్తుంటారు.
రేవతిని గెంటేసినట్లే రాజ్‌ని కూడా యామినితో కలిపిస్తే ఆస్తి మొత్తం మనదేనని చెబుతుంది రుద్రాణి. ఇంతలో ఇందిర వచ్చి లాగి పెట్టి కొడుతుంది. రేవతిని అపర్ణతో కలపడానికి బాబు సాయంతో కొత్త ప్లాన్ వేస్తారు కావ్య- రాజ్. ప్లాన్ ప్రకారం అపర్ణని గుడికి పంపుతుంది కావ్య. పుట్టింటిలో జరిగిన అవమానాన్ని తలచుకుంటూ బాధపడుతుంది రేవతి. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా నిలిచింది. ఇక జూలై 29వ తేదీ ఎపిసోడ్ 786లో ఏం జరిగిందంటే?

Photo Courtesy: JioHotstar
పుట్టింటిలో జరిగిన అవమానాన్ని తలచుకుని బాధపడుతున్న రేవతిని జగదీష్ ఓదారుస్తాడు. ఇంతలో రేవతికి రాజ్ కాల్ చేస్తాడు. నీకు అవమానం జరగడానికి కారణం నేనే కదా అని ఆమెకు సారీ చెబుతాడు. నిన్ను పిలిచి మరి అవమానించేలా చేశానని బాధపడతాడు రాజ్. ఒకరి తప్పుకి మరొకరు బాధ్యలు ఎప్పుడూ కారని.. నా తలరాత అలా ఉంటే దానికి నువ్వేం చేస్తావని అంటుంది రేవతి. నీ తలరాతను మార్చే అవకాశం వచ్చిందని.. బాబుని తీసుకుని శివాలయానికి తీసుకురమ్మని చెబుతాడు రాజ్. మళ్లీ ఏదైనా ప్లాన్ చేస్తున్నారా? అమ్మను పదే పదే బాధపెట్టడం నాకు ఇష్టం లేదని అంటుంది రేవతి. ఆమె ఎంత చెబుతున్నా వినిపించుకోకుండా రాజ్ వస్తున్నావా? లేదా? అని గట్టిగా అడుగుతాడు. జగదీష్ కూడా వెళ్లమని చెప్పడంతో సరేనని అంటుంది రేవతి.
గుడి దగ్గర తన ప్లాన్ మొత్తం రేవతికి చెబుతారు రాజ్- కావ్య. పొరపాటున వాడు నా కొడుకని తెలిస్తే జీవితాంతం నన్ను శత్రువులాగే చూస్తుందని భయపడుతుంది రేవతి. ఈ నాటకాలు వద్దని అమ్మ మనస్పూర్తిగా దగ్గరికి తీసుకున్నప్పుడే బాబుని ఆమెకు దగ్గర చేస్తానని చెబుతుంది. అమ్మకున్న మొండితనానికి ఇంకో పదేళ్లు అయినా సరే మీరిద్దరూ ఇలా దూరంగానే ఉంటారని అంటాడు రాజ్. అసలు ఏ ప్రయత్నం చేయకుండా ఇలా సైలెంట్‌గా ఉంటే మీరిద్దరూ లైఫ్‌లో కలుస్తారన్న గ్యారంటీ కూడా లేదని చెబుతాడు. అత్తయ్యకి బాబు బాగా దగ్గరై కనీసం వాడి వల్ల అయినా మీరిద్దరూ కలిసే అవకాశం ఉంది కదా అని కావ్య అంటుంది.
మీరిద్దరూ ఎంత చెబుతున్నా నాకు భయంగానే ఉందని.. గతంతో ఒకే ఒక్కసారి ఆమెకు చెప్పకుండా నిర్ణయం తీసుకుని పెళ్లి చేసుకున్నానని చెబుతుంది రేవతి. ఆ తప్పుకి ఇంకా శిక్ష అనుభవిస్తూనే ఉన్నానని భయపడుతుంది. బాబుకి ఓ పెద్ద ఫ్యామిలీ ఉందని, రాజులా బతికే అవకాశం ఉందని.. కానీ ఇలా ఎవరూ లేనట్లు బతకడం నీకు ఇష్టమేనా? అని నిలదీస్తాడు రాజ్. దాంతో ఆలోచనలో పడిన రేవతి.. మీ ఇష్టమని చెబుతుంది. రేపు ఎప్పుడైనా అమ్మకి నిజం తెలిస్తే ఎలా అని అడుగుతుంది రేవతి. దీనికి, మీకు ఎలాంటి సంబంధం లేదని .. నేను, కళావతి కలిసి చేశామని అమ్మతో చెబుతానని అంటాడు రాజ్.
ఇంతలో అపర్ణ గుడికి వస్తుంది. బాబుకి ఏం చేయాలో చెబుతారు రాజ్- కావ్య. బాబు వెళ్లి అపర్ణని గుద్దుకుంటాడు.. గుడిలో నేను రౌండ్స్ వేస్తుండగా అమ్మ తప్పిపోయిందని అంటాడు బాబు. మీ అమ్మ వచ్చే వరకు కబుర్లు చెప్పుకుందామని అంటుంది అపర్ణ. మన ప్లాన్ వర్కవుట్ అయ్యిందని, అమ్మకి పిల్లాడు బాగా దగ్గరైందని రేవతి- రాజ్ చెప్పుకుంటారు. మీ ఇంటి దగ్గర దించేస్తాను అడ్రస్ చూపించమని అడుగుతుంది అపర్ణ. మా ఇంటి దగ్గరికి తీసుకెళ్తే చెబుతానని అంటాడు పిల్లాడు. పోలీస్ స్టేషన్‌కు వెళ్లి కంప్లయంట్ ఇస్తే వాళ్లే మీ అమ్మని వెతుకుతారని అపర్ణ చెప్పడంతో రాజ్, కావ్య, రేవతిలు షాక్ అవుతారు.
దాంతో కావ్య, రాజ్ కలిసి అపర్ణ దగ్గరికి వెళ్లి బాబు ఎవరని అడుగుతారు. నిన్న చేసింది చాల్లేదా మళ్లి వెతుక్కుంటూ వచ్చారని మండిపడుతుంది అపర్ణ. మా అత్తయ్యకి నా మీద ఇంకా కోపం పోలేదని.. మా అమ్మకి నాకు బాగా తెలుసని నిన్ను బాగా ఇష్టపడుతుందని నిరూపిస్తానని అన్నారు అని అంటుంది కావ్య. నేను నిన్ను ఇష్టపడటం లేదా? ఇష్టం లేకుండా ఇంత ప్రేమ చూపిస్తున్నానా? అని అడుగుతుంది అపర్ణ. దిష్టిబొమ్మల్లా ఉన్నారు.. వీళ్లిద్దరూ ఎవరు అని అడుగుతాడు చిన్నారి. ఆ మాటలతో రాజ్- కావ్యలు షాక్ అవుతారు. మాట్లాడింది చాలు కానీ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి కంప్లయంట్ ఇద్దామని అంటుంది అపర్ణ.
వీళ్లమ్మని కనిపెట్టే పోలీస్ మన ఇంట్లోనే ఉందని చెబుతుంది కావ్య. అసలు వీళ్లమ్మ కనిపించడం లేదని మీకు ఎలా తెలుసు అని అపర్ణ నిలదీస్తుంది. దాంతో రాజ్- కావ్యలకు ఏం మాట్లాడాలో తెలియదు. నువ్వు బాబుతో మాట్లాడుతుంటే విన్నామని చెబుతాడు రాజ్. అసలు మీరిద్దరూ ఈ గుడిలో ఏం చేస్తున్నారు? వీడెందుకు వచ్చాడని అపర్ణ ఎంక్వైరీ చేస్తుంది. దానిని ఎలా కవర్ చేయాలో తెలియక రాజ్- కావ్యలు టెన్షన్ పడతారు. ఇంటికి వెళ్దామని అపర్ణ చెబుతుండగా.. నా పర్మిషన్ తీసుకోకుండా మీరు మీరు మాట్లాడుకుంటారా? అని మండిపడతాడు. మీ ఇంటికి వస్తాను కానీ నాకు నచ్చినట్లే మీరంతా ఉండాలని.. లేకపోతే వెళ్లిపోతానని అంటాడు పిల్లాడు.
రేవతి- జగదీష్‌లు ఎన్నో కష్టాలు పడుతున్నారని సీతారామయ్యకి చెబుతుంది ఇందిర. నేను కొంచెం డబ్బులు తీసుకెళ్తే.. నాకు డబ్బులు వద్దని, అమ్మ మనసులో నా స్థానం కావాలని రేవతి అడిగిందని అంటుంది. అమ్మ అమ్మ అని కలవరిస్తోంది.. ఆడపిల్ల కదా ఇంటి మీద ప్రాణం కొట్టుకుంటుందని చెబుతుంది ఇందిర. అపర్ణ- రేవతిని ఎలాగైనా కలపాలని సీతారామయ్యతో అంటుంది. ఇంతలో పిల్లాడిని తీసుకుని ఇంటికి వస్తారు. ఇల్లు చూసి చాలా బాగుందని నాక్కూడా ఇలాంటి ఇల్లు కట్టిస్తారా అని అడుగుతాడు బాబు. కట్టించడం ఎందుకు ఈ ఇల్లు నీదేనని అంటాడు రాజ్. ఆ మాటలతో కావ్య, అపర్ణలు షాక్ అవుతారు. బాబు ఇంట్లో అడుగుపెట్టగానే ఇల్లంతా కంపించినట్లుగా అనిపిస్తుంది ఇందిరకి. ఈ ఇంటికి ఏదో ఉపద్రవం రాబోతుందని భయపడుతుంది. ఇంట్లోకి వచ్చిన చిన్నారి రాజ్ ఇల్లంతా చూస్తుంటాడు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications











