Brahmamudi july 2nd episode: అప్పు ని బ్లాక్ మెయిల్ చేస్తున్న కనకం.. అగ్నికి ఆజ్యం పోస్తున్న తల్లి కొడుకులు!
రాజ్ దంపతుల ఫస్ట్ నైట్ వేడుక జరగకూడదని రుద్రాణి కుట్ర పన్నుతుంది. హోటల్లో జరిగిందానికి కారణం అనామిక అని ఇంట్లో నిరూపించి ఆమెకి విడాకులు ఇస్తానంటాడు కళ్యాణ్. వాళ్లని కలిపే ప్రయత్నం చేస్తారు రాజ్ దంపతులు. అయితే అనామిక తల్లిదండ్రులని ఇంటికి పిలిపించి పంచాయతీ పెట్టడంతో తల్లిదండ్రులతో సహా ఆమెని బయటికి పొమ్మంటాడు కళ్యాణ్. తరువాత అనామిక కళ్యాణ్ పై పోలీస్ కేసు పెడుతుంది ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలెట్‌గా మిగిలాయి. ఇక జులై 2వ తేదీ ఎపిసోడ్ 451 లో ఏం జరిగిందంటే..
రాజ్ ధాన్యలక్ష్మి దగ్గరికి వెళ్లి పోయిన పరువు ఎలాగో పోయింది ఇప్పుడు మనం ఆలోచించాల్సింది కళ్యాణ్ సంతోషం గురించి అంటాడు. నాకేమీ అర్థం కావడం లేదు మీకు ఎలా మంచిదనిపిస్తే ఎలా చేయండి అంటుంది ధాన్యలక్ష్మి. రాజ్ కళ్యాణ్ దగ్గరికి వెళ్లి నువ్వు భయపడకుండా పోలీస్ స్టేషన్ కి వెళ్ళు న్యాయం మన వైపు ఉంది మనమే గెలుస్తాము అని చెప్పటంతో పోలీసుల వెంట వెళ్తాడు కళ్యాణ్. మరోవైపు విషయం బంటి ద్వారా తెలుసుకున్న అప్పు పోలీస్ స్టేషన్ కి వెళ్లాలనుకుంటుంది.

ఇప్పుడు నువ్వు అక్కడికి వెళ్తే సమస్య పెద్దది అవుతుంది,మీ ఇద్దరికీ అక్రమ సంబంధం ఉందని వాళ్ళు కేసు పెట్టారు ఇప్పుడు నువ్వు వెళ్తే వాళ్ళు చెప్పిందే నిజం అవుతుంది అంటుంది కనకం. ఎవరో ఏదో అన్నారని నా ఫ్రెండ్ కష్టంలో ఉంటే వదిలేయలేను కదా, ఒకప్పుడు నేను కష్టంలో ఉంటే ఎక్కడ ఉన్నానో తెలియకపోయినా వెతుక్కుని మరీ వచ్చి నన్ను విడిపించుకుని వెళ్ళాడు మరిచిపోయావా అంటూ తల్లి చెప్పినా వినిపించుకోకుండా బయటికి వెళ్లాలనుకుంటుంది అప్పు.

అప్పుడు కనకం నువ్వు ఇల్లు దాటి వెళ్ళావంటే నేను చచ్చినంత ఒట్టు, కాదు అని నువ్వు అక్కడికి వెళ్తే నువ్వు వచ్చేసరికి ఈ అమ్మ శవమై ఉంటుంది అని చెప్పి కోపంగా ఇంట్లోకి వెళ్లిపోతుంది. ఎందుకు నాన్న అమ్మ ఇంత మొండి గా ప్రవర్తిస్తుంది అంటుంది అప్పు. అమ్మ చెప్పింది దాంట్లో కూడా న్యాయం ఉంది, ఇప్పుడు నువ్వు వెళితే సమస్య పెద్దదవుతుంది అని కూతురికి సర్ది చెప్తాడు కృష్ణమూర్తి. మరోవైపు తమ కేసు కోసం పెద్ద లాయర్ ని మాట్లాడమని ఎవరితోనో చెప్తాడు రాజ్.
రాజ్ ఫోన్ పెట్టేసిన తర్వాత మీరు కూడా ఆవేశపడుతున్నారా అలా చేస్తే ఇంక అనామికకి మనకి తేడా ఏం ఉంటుంది ఒకసారి ఆలోచించండి అంటుంది కావ్య. అలాంటి ఆడదాన్ని క్షమించకూడదు తను మీ ఇంట్లో ఆడవాళ్ళందర్నీ నానా మాటలు అన్నది అసలు నీకు పౌరుషం రావాలి కానీ ఎందుకు ఇలా మాట్లాడుతున్నావో అర్థం కావడం లేదు అంటాడు రాజ్. ఒక జంట కలిసి ఉండటం కోసం ఎన్ని మెట్లు దిగినా తప్పులేదు అంటుంది కావ్య.

అయినా రాజ్ వినిపించుకోకపోవడంతో మీ ఇష్టం అని చెప్పి వెళ్ళిపోతుంది. తరువాత సుమిత్ర వచ్చి కావ్య చెప్పింది దాంట్లో న్యాయం ఉంది అంటాడు. ఆమెకు కూడా నచ్చ చెప్పి పంపిస్తాడు రాజ్. మరోవైపు ఇంట్లో జరుగుతున్న దానికి ఆనందపడుతూ ఉంటారు రాహుల్, రుద్రాణి. అనామిక ఇంత పిచ్చిదనుకోలేదు దాని కాపురాన్ని అదే పాడు చేసుకుంటుంది ఈ అగ్నిలో మనం కొంచెం ఆధ్యం పొయ్యాలి అంటుంది రుద్రాణి. అంటే ఏం చేయాలి అంటాడు రాహుల్.
రేపు కళ్యాణ్ స్టేషన్ కి వెళ్తున్నాడు అని మీడియాకి తెలియజేస్తే చాలు మిగిలింది వాళ్ళు చూసుకుంటారు అంటుంది రుద్రాణి. సరే అంటూ అక్కడినుంచి వెళ్ళిపోతాడు రాహుల్. మరోవైపు పోలీస్ స్టేషన్ ముందు మహిళా సంఘం ధర్నా చేస్తూ ఉంటుంది. మరొకవైపు మీడియా దిగ్గిరాల కుటుంబం కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. కావ్య వాళ్ళు స్టేషన్ కి వచ్చేసరికి రాజ్ వాళ్ళని ప్రశ్నల మీద ప్రశ్నలు వేసి ఇబ్బంది పడతారు మీడియా వాళ్ళు.
అప్పుడు కావ్య మాట్లాడుతూ మేము కూడా ఆ ఇంటి కోడళ్ళమే మేము ఎప్పుడు ఆ ఇంట్లో ఇబ్బందులు ఎదుర్కోలేదు అంటూ తన కుటుంబాన్ని వెనకేసుకొస్తుంది. కళ్యాణ్ మీ చెల్లెలితోనే కదా అక్రమ సంబంధం పెట్టుకున్నది, అందుకే అనామికని తప్పుపడుతూ మీ కుటుంబాన్ని వెనకేసుకొస్తున్నారా అని అడుగుతారు మీడియా వాళ్ళు. మీరు ఇప్పుడు ఏం చెప్పినా అర్థం చేసుకునే పరిస్థితులలో లేరు అని అంటుంది కావ్య.

అంతలోనే పోలీసులు కళ్యాణ్ ని తీసుకువస్తారు. కళ్యాణ్ ని కూడా నానా ప్రశ్నలు వేస్తారు మీడియా వాళ్ళు. కళ్యాణ్ ని ఆ పరిస్థితులలో చూసి కన్నీరు పెట్టుకుంటుంది ధాన్యలక్ష్మి. అనామిక లాంటి ఆడదాన్ని ప్రేమించి పెళ్లి చేసుకుంటే ఇలాంటి పరిస్థితే వస్తుంది అంటాడు ప్రకాష్. అలాంటి ఆడదాన్ని ప్రేమించి పెళ్లి చేసుకొని ఇంటికి తీసుకువచ్చినందుకు నన్ను క్షమించండి అంటూ తల్లిదండ్రులకి క్షమాపణ చెప్తాడు కళ్యాణ్.

తరువాయి భాగంలో లాయర్ రాజ్ తో మాట్లాడుతూ మీ తమ్ముడు నిర్దోషి అని నిరూపించడానికి సాక్షాలు కావాలి అంటాడు. ఒక భర్త భార్యని బాగా చూసుకున్నాడు అనటానికి సాక్ష్యాలు ఎలా వస్తాయి అంటుంది ధాన్యలక్ష్మి. కోర్టుకి సాక్షాలే కావాలి అంటాడు లాయర్. అలాంటి సాక్ష్యాలు వాళ్ల దగ్గర ఉండవు అని లాయర్ తో చెప్తూ నన్ను క్షమాపణ అడిగి మీ అబ్బాయి నన్ను ఇంటికి తీసుకువెళ్తాడేమో అడగండి అని ధాన్యలక్ష్మి వాళ్ళతో అంటుంది అనామిక. నిన్ను నమ్మి ఒకసారి మోసపోయాను మళ్ళీ నమ్మటానికి సిద్ధంగా లేను అంటాడు కళ్యాణ్. సరే అయితే కోర్టులోనే తేల్చుకుందాం అంటుంది అనామిక.


Click it and Unblock the Notifications











