Brahmamudi July 2nd Episode: రేవతికి కావ్య సర్‌ప్రైజ్.. రాజ్‌ని హగ్ చేసుకున్న రేవతి.. కావ్యలో అనుమానాలు
Photo Courtesy: JioHotstar
కావ్యకి యామిని ఫోన్ చేసి నా సర్‌ప్రైజ్ ఎలా ఉంది అని అడుగుతుంది. సిద్ధార్ధ్‌ను ఆఫీస్‌కు పంపించి.. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్ పెట్టమని చెప్పింది నేనే అంటుంది యామిని. ఇకపై ఇలాంటి షాకులు వస్తూనే ఉంటాయని కావ్యకు చెబుతుంది. అప్పూ పోలీస్ స్టేషన్‌లో ఉండగా ఇద్దరు కుర్రాళ్లు గొడవ పడటంతో వారిద్దరినీ పిలిపించి విషయం కనుక్కుంటి. తాము డబ్బు బాకీ కోసం కొట్టుకుంటున్నామని చెప్పడంతో అప్పూ వారికి మధ్యవర్తిగా ఉంటుంది. బయటికి వచ్చిన వారిద్దరూ మన ట్రాప్‌లో అప్పూ చిక్కుకుందని యామినికి ఫోన్ చేసి చెబుతారు. అప్పూ మన ప్లాన్‌లో ఇరుక్కుందని చెప్పడంతో యామిని చాలా సంతోషిస్తుంది.
రాజ్‌కి కావ్య ఫోన్ చేసి అర్జెంట్‌గా కలవాలని చెబుతుంది. మా బాస్ ఫారిన్‌లో ఉన్నాడని.. ఆయన లేని టైంలో సిద్దార్ధ్ అనే వ్యక్తి మా కంపెనీని కొట్టేయాలని చూస్తున్నాడని చెబుతుంది. కంపెనీని నమ్ముకుని ఉన్న ఉద్యోగుల కోసం మీరు మా బాస్‌లా నటించాలని అంటుంది కావ్య. ఉద్యోగుల కోసం ఈ పని చేయడానికి రాజ్ ఒప్పుకుంటాడు. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. ఇక జూలై 2వ తేదీ ఎపిసోడ్ 763లో ఏం జరిగిందంటే?

Photo Courtesy: JioHotstar
రాజ్ - కావ్య కారులో వెళ్తుండగా రేవతి తన కొడుకుతో కలిసి నడుస్తూ వెళ్తుంది. నాకు ఈ షూ కావాలని వాళ్ల బాబు అడుగుతాడు. మీ నాన్న మొన్ననే కదా కొత్త షూ తీసుకొచ్చారని చెబుతుంది రేవతి. ఈ రోజు నా బర్త్ డే కదా నేను అడిగింది కొనివ్వవా .. నాకు షూ కావాల్సిందేనని బాబు మారాం చేయడంతో రేవతి బాధపడుతుంది. ఆ షూ ఎంత అని షాప్ అబ్బాయిని అడగ్గా రేవతి షాక్ అవుతుంది. చేతిలో 500 రూపాయలు మాత్రమే ఉండటంతో తర్వాత వస్తాం అని చెప్పి కొడుకుని తీసుకుని వెళ్లిపోతుంది రేవతి. నువ్వు ఎప్పుడు ఇలాగే చెబుతున్నావ్.. లాస్ట్ ఇయర్ నా బర్త్ డేకి సైకిల్ కొనిస్తానని చెప్పావ్? ఎప్పుడు నువ్వు అబద్ధమే చెబుతున్నావ్.. నేను అడిగింది కొనివ్వడం లేదని బాబు అడగటంతో రేవతి బాధపడుతుంది. వీరిద్దరి మాటలను కావ్య - రాజ్ చూసి బాధపడతారు.
కొడుకు అడిగింది కొనివ్వలేని ఆ తల్లిని చూస్తుంటే చాలా బాధగా ఉందని కావ్యతో అంటాడు రాజ్. మనకి కొనే బలం ఉంది కాబట్టి వాళ్ల ఆశను మనం తీర్చొచ్చు కదా అని రాజ్ తో అంటుంది కావ్య. ఆవిడ వెళ్లిపోయింది కదా? ఎలా కొనిస్తారని రాజ్ అడుగుతాడు. ఇంటికి వెళ్లి ఇద్దామని కావ్య చెప్పడంతో ఆవిడ మీకు తెలుసా అని రాజ్ అడుగుతాడు. ఒకసారి మా ప్రాణాలు కాపాడిందని కావ్య చెప్పడంతో అలాంటి మంచి మనిషికి ఖచ్చితంగా సాయం చేయాలని అంటాడు రాజ్. ఇంట్లో రేవతి కూరగాయలు కట్ చేస్తుండగా బాబు వచ్చి కేక్ కట్ చేసేటప్పుడు ఈ డ్రెస్ వేసుకోనా? అని అడుగుతాడు. అప్పుడే రేవతి భర్త రావడంతో కేక్ తీసుకొచ్చావా అని బాబు అడుగుతాడు. ఓనర్‌ని కేక్ కోసం డబ్బులు అడిగితే ఇప్పటికే చాలా అడ్వాన్స్ తీసుకున్నావ్ .. ఇవ్వడం కుదరదు అన్నాడని చెబుతాడు. అయితే ఈరోజు నేను కేక్ కట్ చేయనా అని బాబు బాధపడతాడు.
ఇంతలో రేవతి ఇంటికి రాజ్- కావ్యలు రావడంతో ఆమె షాక్ అవుతుంది. రాజ్‌ను చూసి రేవతి హగ్ చేసుకుని ఎలా ఉన్నావని అడగటంతో కావ్య ఆశ్చర్య పోతుంది. ఈయన మీకు ముందే తెలుసా? అని కావ్య ప్రశ్నిస్తుంది. మా ఫ్యామిలీ గురించి మీకు తెలుసు కాబట్టి ఓకే.. మరి నా గురించి ఈవిడకు ఎలా తెలుసని రాజ్ అడగటంతో కావ్య ఏం చెప్పాలో తెలియక బాధపడుతుంది. నువ్వు అచ్చం మా తమ్ముడిలా ఉంటే తనే అనుకున్నానని రేవతి చెబుతుంది. తనను చూసి చాలాకాలం అవ్వడంతో పొరపాటు పడ్డానని అంటుంది. నన్ను కూడా మీ తమ్ముడే అనుకోండి.. ఈరోజు నుంచి నేను మిమ్మల్ని అక్కా అని పిలుస్తానని చెబుతాడు రాజ్. నేను, ఆంటీ కలిసి నీకు గిఫ్ట్ తీసుకొచ్చామని బాబు చేతిలో పెడతాడు రాజ్. నీ పేరు ఏంటని రాజ్ అడగటంతో నా పేరు రాజ్.. స్వరాజ్ అని చెబుతాడు బాబు. ఆ మాటలతో కావ్య షాక్ అవుతుంది.
బాబు గిఫ్ట్ బాక్స్ ఓపెన్ చేసి చూడగా అందులో షూ ఉంటుంది.. అది చూసి బాబు సంతోషంతో కేరింతలు కొడతాడు. ఇందాక మమ్మల్ని చూశారా? అని రేవతి అడుగుతుంది. మీరు మా ప్రాణాల్ని కాపాడారు.. దాని ముందు ఇదెంత అని అంటుంది కావ్య. బాబుతో రాజ్ కేక్ కట్ చేయించడంతో రేవతి భర్త బాధపడతాడు. మీ ఇద్దరి వల్ల వాడి కళ్లలో ఆనందం చూడగలిగానని థ్యాంక్స్ చెబుతాడు. తను మా అక్క అయితే మీరు నాకు బావ అని అంటాడు రాజ్. కొత్తగా మీ ఇంటికి చుట్టాలు వచ్చినట్లున్నారని ఓ వ్యక్తి రేవతిని అడుగుతాడు. ఇలాంటి కాస్ట్‌లీ చుట్టాలు కనుక నాకుంటే నేను ఈ బస్తీ వదిలేసేవాడినని అంటాడు. మీకు ఎప్పుడు ఏ సాయం కావాలన్నా ఈ తమ్ముడికి కాల్ చేయండి అని రేవతికి చెబుతాడు రాజ్.
రాజ్‌ను చాలా రోజుల తర్వాత చూడటంతో గతమంతా నా కళ్లముందు కనిపించిందని భర్తతో రేవతి అంటుంది. లోపలికి వచ్చి ఫోటో చూసుకుని కంటతడి పెడుతుంది. రాజ్‌కి నిజం చెప్పొచ్చు కదా అని రేవతితో భర్త అంటాడు. నిన్ను చూశాక రాజ్ ఎందుకు గుర్తుపట్టలేదని అడుగుతాడు. ఇంట్లో వాళ్లనే గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నాడని.. ఇక నన్నేం గుర్తుపడతాడని ప్రశ్నిస్తుంది రేవతి. మీ వాళ్లని కలిసేందుకు ఆ దేవుడే నీకు అవకాశం ఇస్తే వదులుకుంటావా అని అంటాడు రేవతి భర్త. ఆరోజు మా ఇంటి పరువుని రోడ్డు మీద పడేశాను.. వాళ్ల గురించి ఒక్క క్షణం కూడా ఆలోచించలేదని అంటుంది రేవతి. ఆ ఇంట్లో అడుగుపెట్టే అర్హత లేదని రేవతి చెబుతుంది.. ఒకవేళ ఇంట్లో వాళ్లు నిన్ను మనస్పూర్తిగా క్షమిస్తే అని భర్త అడుగుతాడు. ఇన్నేళ్లు ఆ ఇంటి నుంచి ఒక్కరు కూడా మనవైపు చూడలేదని, అలాంటిది రాజ్ వెతుక్కుంటూ వచ్చాడని అంటాడు. అది ఎప్పటికీ జరగదని నేనే నా మనసుకు సర్దిచెప్పుకుంటున్నానని రేవతి చెబుతుంది. రాజ్‌ని చూస్తుంటే మళ్లీ పాత రోజులు వస్తాయని అనిపిస్తుందని అంటాటు రేవతి భర్త.
కారులో వెళ్తుండగా రేవతి గురించి మాట్లాడుకుంటారు రాజ్, కావ్య. నాకు ఇంత మంచి జ్ఞాపకాన్ని ఇచ్చినందుకు కావ్యకు రాజ్ థ్యాంక్స్ చెబుతాడు. రాహుల్‌కి తన ప్రియురాలు ఫోన్ చేసి నేను అడిగిన ప్రాపర్టీ ఏం చేశావని అడుగుతుంది. ఆ పనిలోనే ఉన్నానని.. త్వరలోనే నువ్వు కోరుకున్నది నీ చేతుల్లో ఉంటుందని అంటాడు రాహుల్. స్వప్న దగ్గరున్న ప్రాపర్టీ డాక్యుమెంట్స్ కొట్టేసి వాటికి డూప్లికేట్ తయారు చేయించి దానిని నా సొంతం చేసుకుంటానని అనుకుంటాడు రాహుల్. తాళాల కోసం వెతుకుతుండగా స్వప్న రావడంతో రాహుల్ షాక్ అవుతాడు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications











