Brahmamudi July 30th Episode: మనవడితో ఆడుకున్న సుభాష్- అపర్ణ .. కావ్య ప్లాన్‌ పసిగట్టిన రుద్రాణి

Photo Courtesy: JioHotstar

అపర్ణని రేవతిని కలిపేందుకు రాజ్ మాస్టర్ ప్లాన్ వేస్తాడు. బాబు ద్వారానే మీ ఇద్దరిని తిరిగి ఒక్కటి చేస్తానని రేవతితో చెప్పగా ఆమె వద్దు అంటుంది. అయినప్పటికీ రాజ్ నచ్చచెప్పి రేవతిని ఒప్పిస్తాడు. అపర్ణ గుడిలో దర్శనం చేసుకుని వచ్చేసరికి రేవతి కొడుకు రాజ్ ఆమెను ఢీకొడతాడు. నేను మా అమ్మ నుంచి తప్పిపోయామని చెబుతాడు. పోలీసులకు కంప్లయింట్ఇస్తే వాళ్లే వెతికి పెడతారని అపర్ణ చెప్పడంతో కావ్య, రాజ్‌లు పరిగెత్తుకుంటూ అక్కడికి వస్తారు.

వాళ్లని చూసిన అపర్ణ.. మీరిద్దరూ ఇక్కడేం చేస్తున్నారు? అని అపర్ణ నిలదీస్తుంది. ఆమెకు ఏదో ఒక ఆన్సర్ ఇచ్చి ఇద్దరూ తప్పించుకుంటారు. వీడి గురించి పోలీసులకు కంప్లయింట్ ఇద్దామని అపర్ణ చెప్పగా.. మనింట్లోనే పోలీస్ ఉందని అప్పూ గురించి చెబుతుంది కావ్య. దాంతో కావ్య, రాజ్, అపర్ణలు కలిసి బాబును తీసుకుని దుగ్గిరాల వారింటిలో అడుగుపెడతారు.
ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా నిలిచింది. ఇక జూలై 30వ తేదీ ఎపిసోడ్ 787లో ఏం జరిగిందంటే?

Brahmamudi Serial July 30th 2025 Episode 787 Here is Today s full story

Photo Courtesy: JioHotstar

ఇంట్లోకి వచ్చిన రేవతి కొడుకుని చూసిన దుగ్గిరాల ఫ్యామిలీ .. ఈ బాబు ఎవరని అడుగుతుంది. దీంతో సుభాష్‌కి గతం మొత్తం గుర్తుచేస్తుంది. నచ్చితే ఏ చాక్లెట్టో బిస్కెట్టో కొనివ్వాలి కానీ ఇలా ఇంటి దాకా తీసుకొచ్చావేంటీ అని రుద్రాణి అడుగుతుంది. ఈ పిల్లాడు ఎవరి బాబు అని ప్రకాశం అడగ్గా.. అది తెలియకే ఇంటికి తీసుకొచ్చానని చెబుతుంది అపర్ణ. ఈ బాబుని ఎక్కడో చూసినట్లుగా అనిపిస్తుందని స్వప్న, అప్పూ అనడంతో రాజ్, కావ్యలు షాక్ అవుతారు. ఈ బాబు ఎవరో నాకు తెలుసని స్వప్న చెప్పబోతుండగా కావ్య అడ్డుపడి చెప్పొద్దని సైగలు చేస్తుంది. అమ్మ వెళ్లిన గుడిలో వాళ్ల అమ్మ కోసం వెతుక్కుంటూ ఉండటంతో చూసి తట్టుకోలేకపోయిందని అంటాడు రాజ్. మా అమ్మకి వీడు ముందే తెలుసు కాబట్టి ఇంటికి తీసుకొచ్చిందని చెబుతాడు.

బాబును ఇప్పుడే తెలుసని చెప్పి అప్పుడే మాట మారుస్తున్నారేంటీ అని రుద్రాణికి అనుమానం మొదలవుతుంది. ఈ బాబు ఎవరో బాగా ఆలోచిస్తే పొద్దున్నే వాళ్ల పేరెంట్స్‌కి అప్పగిద్దామని అప్పూతో అంటాడు రాజ్. ఇంటికొచ్చిన రేవతి కొడుకుని చూసి ఇందిర షాక్ అవుతుంది. ఈ విషయాన్ని సీతారామయ్యకి చెప్పాలని ఇందిర పరిగెత్తుకుంటూ వెళ్తుంది. అపర్ణ తన మనవడు కలిస్తే బాగుండు అన్నానా? పైన తథాస్తు దేవతలు తథాస్తు అన్నారేమో అపర్ణ నా ముని మనవడిని ఇంటికి తీసుకొచ్చేసిందని చెబుతుంది ఇందిర. రేవతి కొడుకుని చూసి సీతారామయ్య కూడా సంతోషిస్తాడు. ఏమైనా తిన్నావా అని సీతారామయ్య అడగ్గా.. భోజనం పెడతానని అపర్ణ తీసుకెళ్తుంది.

ఆ పిల్లాడు అపర్ణ మనవడే కదా అని సీతారామయ్య అనడంతో రాజ్, కావ్యలు షాక్ అవుతారు. అత్తయ్యని, రేవతి గారిని కలపాలని చూస్తున్నామని ఎవరితోనూ చెప్పొద్దని అంటుంది కావ్య. నేను ఎవరికీ చెప్పనని, మీరు చేసే పని మంచిదే అయినా అందులో చాలా ప్రమాదం ఉందని హెచ్చరిస్తాడు సీతారామయ్య. తన కడుపున పుట్టిన బిడ్డని ఇంట్లో నుంచి గెంటేయడానికి అపర్ణ అర క్షణం కూడా ఆలోచించలేదని, అపర్ణ పంతానికి పోతే చాలా మొండిగా ఉంటుందని అంటాడు. రేవతి కొడుక్కి నువ్వు తెలుసు కాబట్టి గుర్తుపడతాడని, అది గనుక జరిగితే అపర్ణ కోపాన్ని ఎవ్వరూ కంట్రోల్ చేయలేరని ఇందిరని హెచ్చరిస్తాడు సీతారామయ్య.

నా ప్లాన్ ఎంత బాగా సక్సెస్ అయ్యిందో చూశారా అని కళావతి ముందు రాజ్ బిల్డప్ ఇస్తాడు. నేను రాముడి లెక్క ఇచ్చిన మాట ప్రకారం బాబుని ఇంటికి తీసుకొచ్చాను, అమ్మకి దగ్గర చేశానని అంటాడు. ఇప్పటికైనా నేను గ్రేట్ అని ఒప్పుకుంటారా అని అడుగుతాడు. మీరు ఇంకా సక్సెస్ కాలేదని.. అప్పటి వరకు ఒప్పుకోనని చెబుతుంది కావ్య. కలపడం అంటే తీసుకొచ్చి పక్కపక్కనే నిలబెట్టడం కాదని, వాళ్లిద్దరి మధ్య ప్రేమను క్రియేట్ చేయాలని అంటుంది కావ్య. అత్తయ్య నిజంగానే స్వరాజ్‌ని ప్రేమిస్తుందని, నిజంగానే ప్రేమ చూపిస్తుందని నాకు అనిపించాలని చెబుతుంది కావ్య. నిజంగానే బాబుని అంతగా ఇష్టపడితే వేరే కుర్చీలో కూర్చోబెట్టి అన్నం పెట్టదని.. తన ఒళ్లో కూర్చోబెట్టుకుని తినిపిస్తుందని అంటుంది.

కావ్య మాటలతో కోప్పడిన రాజ్.. డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్లి మా అమ్మకి ఈ బాబు మీద నిజంగా ప్రేమ లేదని అంటాడు. ప్రేమ, అనురాగాల్లో అబద్ధాలు ఉండవని చెబుతుంది కావ్య. వీడు పరాయివాడు అయినప్పటికీ బాబు మీద నేను అబద్ధపు ప్రేమ చూపిస్తానా? అని అడుగుతుంది అపర్ణ. ప్రేమించిన వాళ్లలో మోసం చేసేవాళ్లు ఉండొచ్చు కానీ ప్రేమ ఎప్పుడు మోసం కాదని అంటుంది. వీడిని నిజంగానే ప్రేమిస్తానని తేల్చి చెబుతుంది అపర్ణ. రాజ్ ప్లాన్ మొత్తం చెడగొట్టేలా ఉండటంతో అతనిని అక్కడి నుంచి తీసుకొచ్చేస్తుంది కావ్య. అత్తయ్యగారికి నిజం చెబితే ఎంత ప్రమాదమో తెలిసి కూడా మీకు కామెడీగా ఉందా అని మండిపడుతుంది కావ్య. మొన్న రేవతి గారు ఇంటికొస్తేనే అత్తయ్య గారు ఎలా ఫైర్ అయ్యారో? ఎలా గొడవ చేశారో? చూశారు కదా అని గుర్తుచేస్తుంది. ఆ బాబు తన మనవడని, ఇదంతా మనం ఆడుతున్న నాటకమని తెలిస్తే అత్తయ్య ఊరుకుంటారా? అని ఫైర్ అవుతుంది.

భోజనాల దగ్గర పిల్లాడు నాకు వంకాయ కూర నచ్చదని చికెన్ కావాలని అడుగుతాడు. దాంతో అపర్ణ చికెన్ కర్రీ తెప్పిస్తుంది. మీ ఇంట్లో జీనీ ఉన్నాడా? ఈ చికెన్ కర్రీ ఇలా అడగ్గానే అలా వచ్చేసిందని పిల్లాడు అనడంతో అంతా నవ్వేస్తారు. మా ఇంట్లో ఎప్పుడూ చికెన్ కర్రీ రెడీగా ఉంటుందని నీకు కారమని పెట్టలేదని చెబుతుంది. అయినా చిన్నపిల్లలకు ఇలా తినిపించకూడదని.. నేను ఇళ్లంతా పరిగెడతానని నువ్వొచ్చి నన్ను పట్టుకుని తినిపించాలని అంటాడు పిల్లాడు. పిల్లాడి అల్లరితో ఇల్లంతా సందడి నెలకొంటుంది. సుభాష్ ఆ బాబుని ఎత్తుకుని ఒడిలో కూర్చోబెట్టుకుంటే అపర్ణ తినిపిస్తుంది. దానిని వీడియో కాల్‌లో రేవతికి ఫోన్ చేసి చూపిస్తుంది కావ్య.

తన కొడుకుపై ఇంట్లో వాళ్లు చూపిస్తున్న ప్రేమను చూసి రేవతి సంతోషిస్తుంది. ఇలాంటి రోజు ఒకటి వస్తుందని కలలో కూడా అనుకోలేదని అంటుంది. బాబుని ఇంట్లో వాళ్లు నెత్తిన పెట్టుకోవడంతో రేవతి కంటతడి పెడుతుంది. నాకు, మా అమ్మకి దగ్గరయ్యే రోజు లేదని అనుకున్నానని.. నన్ను పిలవకపోయినా నాతో కలవకపోయినా తన మనవడినైనా ఒక్కసారి దగ్గరికి తీసుకుంటే చాలు అనుకున్నానని చెబుతుంది రేవతి. కానీ ఏకంగా వాడిని నెత్తిన కీరిటంలా పెట్టుకుంటుందని అస్సలు ఊహించలేదని అంటుంది. ఇంటిల్లిపాది వాడితో ఆడుకుంటూ వాడిని ముద్దు చేస్తుంటే ఇది కలా, నిజమా అని నమ్మలేకపోయానని చెబుతుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X