Brahmamudi July 31st episode: శుభవార్త తీసుకొచ్చామంటున్న రుద్రాణి..వర్క్ అవుట్ అయిన రాజ్ ప్లాన్!
అప్పుకి పెళ్లి చూపులు అని తెలిసి హర్ట్ అవుతాడు కళ్యాణ్. తనకి ఇష్టం లేకపోయినా తల్లిదండ్రుల కోసం పెళ్లికి ఒప్పుకుంటుంది అప్పు. కావ్య తన చెల్లెల్ని కళ్యాణ్ కి ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటుందని కావ్య తో గొడవపడుతుంది ధాన్యలక్ష్మి. కళ్యాణ్ మనసులో అప్పు ఉందని అందరి ముందు చెప్తాడు రాజ్. అప్పు మనసులోకి ఏముందో తెలుసుకోవడానికి ఆమె ఇంటికి కూడా వెళతాడు రాజ్. కానీ అక్కడ అతనికి చేదు అనుభవం ఎదురవుతుంది. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలెట్‌గా మిగిలాయి. ఇక జులై 31వ తేదీ ఎపిసోడ్ 476లో ఏం జరిగిందంటే..
ఇంటికి వచ్చిన రాజ్ ని హాల్లోనే నిలదీస్తుంది కావ్య. రండి, మీ కోసమే ఆత్రంగా ఎదురుచూస్తున్నారు మీ పిన్ని, రుద్రాణి అత్త. అక్కడ ఏం జరిగిందో చెప్పండి అంటుంది. నువ్వు ఆ ఇంటికి వెళ్ళావా అని అడుగుతుంది ఇందిరా దేవి. ఎందుకు వెళ్ళడు, అప్పు వాడి మరదలే కదా తీసుకొచ్చి ఈ ఇంటికి కోడలు చేస్తే ముగ్గురు అక్కచెల్లెళ్లు త్రివేణి సంగమం లాగా ఈ దుగ్గిరాల సముద్రంలో కలిసిపోవచ్చు అంటుంది రుద్రాణి.

మీరు జాతకం బాగానే చెప్తున్నారు, ఇప్పుడు మా అక్క ఉండి ఉంటే మీకు సరి అయిన సమాధానం చెప్పేది అని రుద్రాణి తో అంటుంది కావ్య. తర్వాత రాజ్ తో మాట్లాడుతూ అక్కడ ఏం జరిగిందో చెప్పండి ఇప్పటివరకు మీ పిన్ని వాళ్ళు నా మీద చాలా పెద్ద యుద్దాన్ని ప్రకటించారు అంటుంది. అప్పుకి ఈ పెళ్లి ఇష్టం లేదట, మా ఇంట్లో వాళ్ళు ఎవ్వరికీ అప్పుని కళ్యాణ్ కి ఇచ్చి పెళ్లి చేసే ఉద్దేశం లేదు ఈ విషయం గురించి మాట్లాడొద్దని అప్పు వాళ్ళమ్మ నా కాళ్లు పట్టుకోబోయారు అని చెప్తాడు రాజ్.
రుద్రాణి ఆనందపడుతూ శుభవార్త మోసుకొచ్చావు అంటుంది. చిన్న అత్తగారి మనసు చెడగొడుతున్నారు అంటూ రుద్రాణి కి చివాట్లు పెడుతుంది కావ్య. ఈ విషయంలో కావ్యకి ఎలాంటి సంబంధం లేదు మీరు ప్రతి విషయానికి ఆమెని బాధ్యురాలిని చేసి మాట్లాడటం నాకేమీ నచ్చడం లేదు, మళ్లీ కావ్య గురించి తప్పుగా మాట్లాడితే నేను తీసుకునే నిర్ణయాలు తీవ్రంగా ఉంటాయి అని హెచ్చరిస్తాడు రాజ్. ఇంట్లో వాళ్ళందరూ ధాన్యలక్ష్మిని మందలిస్తారు.

అందరూ వెళ్లిపోయిన తర్వాత అప్పు మనసులో ఉన్న ప్రేమని ఎలా అయినా బయట పెట్టాలి అనుకుంటాడు రాజ్. మరోవైపు బంటి అప్పు దగ్గరికి వచ్చి కళ్యాణ్ కి యాక్సిడెంట్ అయిందని కంగారుగా చెప్తాడు. కంగారు పడిన అప్పు కళ్యాణ్ దగ్గరికి బయలుదేరుతుంది. తండ్రికి విషయం చెప్పి బయలుదేరుతుంది. హాస్పిటల్ కి వెళ్తే అక్కడ రాజ్ ఆమెని కళ్యాణ్ దగ్గరికి వెళ్ళనివ్వడు. నీకు అతను అంటే ఇష్టం లేదు కదా పెళ్లి పెట్టుకొని పరాయి మగవాడిని కలవటం ఏమిటి అంటాడు. నేను కళ్యాణ్ ని ప్రేమిస్తున్నాను అంటుంది అప్పు.
అప్పుడు రాజ్ కళ్యాణ్ కి ఎలాంటి ఆక్సిడెంట్ జరగలేదని నీ మనసులో మాట బయట పెట్టడం కోసమే అలా చెప్పానని అంటాడు. మనసులో మాటని ఎందుకు దాచుకుంటున్నావు బయట పెట్టొచ్చు కదా అని అడుగుతాడు. ఇప్పటివరకు నావల్ల మా ఇంట్లో ఏ మంచి జరగలేదు, ఇప్పుడు మాట చెప్పి ఎవరినీ ఇబ్బంది పెట్టలేను నా మనసులో మాట బయటకు చెప్పానని నా పెళ్లి చెడగొట్టొద్దు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అప్పు. ఆ మాటలు అన్ని చాటుగా విన్న కళ్యాణ్ రాజ్ దగ్గరికి వస్తాడు.

అదీ విషయం ఇప్పటికైనా ధైర్యం చేసి ముందు అడుగు వెయ్యు నీకు నా సపోర్టు ఉంటుంది అని కళ్యాణ్ కి చెప్తాడు రాజ్. మరోవైపు అప్పటికే ధాన్యలక్ష్మి కావ్య తో గొడవ పెట్టుకుంటూ ఉంటుంది. రాజ్ కళ్యాణ్ ని ఎక్కడికి తీసుకు వెళ్ళాడు అంటుంది. నాకేం తెలుసు అంటుంది కావ్య. వాళ్లు అలా గొడవ పడుతూ ఉండగానే అక్కడికి కళ్యాణ్, రాజ్ వస్తారు. కావ్య జరిగింది చెప్పటంతో కావ్య జోలికి రావద్దని చెప్పాను కదా అంటాడు రాజ్. ధాన్యలక్ష్మి కళ్యాణ్ ని ఎక్కడికి వెళ్లావు అని అడుగుతుంది. నీకెందుకు చెప్పాలి అంటాడు కళ్యాణ్.
అప్పుని కలవడానికి వెళ్లావు కదా అంటుంది ధాన్యలక్ష్మి. అప్పుడే అక్కడికి వచ్చిన కనకం ఎవరు ఎవరిని కలవడానికి రాలేదు, వచ్చినా నేను రానివ్వను అని కోపంగా అంటుంది. పెళ్లి కార్డు ధాన్యలక్ష్మి చేతిలో పెట్టిఇంట్లో పెద్దవాళ్ళకి ఇవ్వకుండా మొదటి కార్డు మీకే ఇవ్వవలసిన కర్మ పట్టింది అంటూ పెళ్లి వాళ్ళ వివరాలు చెప్పి పెళ్లికి రండి నిందలు వేయకుండా అక్షింతలు వేసి ఆశీర్వదించండి అంటుంది.


Click it and Unblock the Notifications











