Brahmamudi July 31st Episode: బుడ్డోడికి దొరికిపోయిన ఇందిర .. రాజ్ కోసం యామిని మాస్టర్ ప్లాన్
Photo Courtesy: JioHotstar
ఇంట్లోకి వచ్చిన పిల్లాడు రేవతి కొడుకని గుర్తించిన ఇందిర ఆ విషయాన్ని సీతారామయ్యకి చెబుతుంది. ఆ బాబుని చూసిన సీతారామయ్య కిందకి వచ్చి పిల్లాడికి ఏమైనా పెట్టమని అపర్ణకి చెబుతుంది. మనవడిపై అత్తయ్య నిజంగా ప్రేమ చూపించడం లేదని రాజ్‌తో కావ్య అంటుంది. దీంతో అపర్ణ దగ్గరికి రాజ్ వెళ్లి ఇదే మాట చెబుతాడు. ప్లాన్ మొత్తాన్ని చెడగొట్టేలా ఉండటంతో కావ్య వెళ్లి అలర్ట్ చేస్తుంది. బాబు తన మనవడని తెలిస్తే అత్తయ్య ఊరుకుంటుందా? అని మండిపడుతుంది కావ్య.
నాకు వంకాయ కూర ఇష్టం ఉండదని చికెన్ కర్రీ కావాలని బాబు మారాం చేయడంతో చికెన్ కర్రీ తెప్పిస్తుంది అపర్ణ. ఇలా డైనింగ్ టేబుల్ దగ్గర తినడం నాకు ఇష్టం ఉండదని, ఇళ్లంతా తిరుగుతానని నువ్వు నన్ను పట్టుకోవాలని చెబుతాడు. పిల్లాడు ఇళ్లంతా తిరుగుతూ సందడిగా ఉంటుంది. సుభాష్ బాబుని ఒడిలో కూర్చోబెట్టుకుంటే అపర్ణ అన్నం తినిపిస్తుంది. ఇదంతా రేవతికి కావ్య వీడియో కాల్ చేసి చూపిస్తుంది. అది చూసిన రేవతి కంటతడి పెడుతుంది. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా నిలిచింది. ఇక జూలై 31వ తేదీ ఎపిసోడ్ 788లో ఏం జరిగిందంటే?

Photo Courtesy: JioHotstar
రేవతి కొడుకుని ఇంట్లో వాళ్లంతా ముద్దు చేస్తుండటంతో రుద్రాణికి డౌట్ వస్తుంది. భోజనం చేసిన తర్వాత పిల్లాడు మంచినీళ్లు తాగమంటే తాగడు. నన్ను పట్టుకోవాలని చెప్పడంతో అపర్ణ నా వల్ల కాదు.. నా కాళ్లు నొప్పి పుడుతున్నాయని చెబుతుంది. దీంతో బాబు వద్దులే మంచి నీళ్లు తాగుతానని అంటాడు. నువ్వు నీళ్లు తాగుతావని అబద్ధం చెప్పానని అపర్ణ అనడంతో నువ్వు నన్ను చీటింగ్ చేశావని అంటాడు బాబు. నా చేత నా కొడుకే పరుగులు పెట్టించలేదు.. నన్ను ఇల్లంతా తిప్పుతావా? అంటుంది అపర్ణ. అమ్మ, బాబు కలిసిపోయారని నేను ప్లాన్ చేస్తే దానికి తిరుగుండదని అంటాడు రాజ్. మీరు సక్సెస్ అయ్యింది 50 శాతం మాత్రమేనని, ఇంకా 50 శాతం బ్యాలెన్స్ ఉందని అంటుంది కావ్య. ఇంతలో ఇందిర వచ్చి ఆ 50 శాతం కూడా పూర్తయితే అపర్ణకి మీరు దొరికిపోతారని చెబుతుంది.
నాతో చెప్పకుండా రేవతి కొడుకుని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారని నిలదీస్తుంది ఇందిర. రేవతి గురించి అనవసరంగా మీకు చెప్పి తప్పు చేశానని బాధపడుతుంది. ఆ రోజు కూడా నాకు చెప్పకుండా రేవతిని ఇంటికి పిలించి అపర్ణతో గొడవ చేయించారని అంటుంది. ఈరోజు ఏకంగా దాని కొడుకుని తీసుకొచ్చి మనింట్లోనే పెట్టారని మండిపడుతుంది ఇందిర. మీకు చెప్పకపోవడం తప్పేనని క్షమించమని అడుగుతుంది కావ్య. బాబు లేకుండా ఉండలేని స్థితికి తీసుకొచ్చి .. పిల్లాడు కావాలని అమ్మతోనే చెప్పిస్తానని అంటాడు రాజ్. మీరు నిజం చెప్పగానే హారతి ఇచ్చి ఆహ్వానిస్తుందని మీరు అనుకుంటున్నారా అని మండిపడుతుంది ఇందిర.
అమ్మకి బాబు ఎవరో తెలియకుండా ఆమెకు కనెక్ట్ చేస్తే నెమ్మదిగా వాడి మీద ప్రేమ పెంచుకుంటుందని చెబుతాడు రాజ్. ఆ ప్రేమ కాస్తా అతి ప్రేమగా మారిపోయి వాడికి ఎడిక్ట్ అయిపోతుందని, కరెక్ట్‌గా అదే టైంలో వాడిని దూరం చేస్తే పిల్లాడు లేకుండా ఉండలేకపోతున్నానని అంటుందని చెబుతాడు రాజ్. టైం చూసుకుని బాబుని తీసుకొచ్చి నిజం చెప్పేస్తానని చెబుతాడు. అప్పుడు కూతురి కోసం కాకపోయినా మనవడి కోసమైనా తప్పకుండా క్షమిస్తుందని అంటాడు రాజ్.
చీటింగ్ చేయడం నాక్కూడా వచ్చని అపర్ణతో అంటాడు చిన్నారి స్వరాజ్. నిజంగానే కాళ్లు నొప్పులు పుడుతున్నాయంటే నమ్మేశావా? అని అంటూ ఆటపట్టిస్తాడు. పిల్లాడు ఎక్కడ గుర్తుపట్టేస్తాడోనని ఇందిర ముఖాన్ని చీరతో కవర్ చేసుకుంటుంది. దీంతో రుద్రాణికి డౌట్ వచ్చి ఎందుకు ముసుగు వేసుకున్నావని అడుగుతుంది. పరిగెత్తుకుంటూ వచ్చి పెద్దావిడని గుద్దేసిన పిల్లాడు వెంటనే తాతమ్మ అని పిలవడంతో దుగ్గిరాల ఫ్యామిలీ అంతా షాక్ అవుతుంది. మా అమ్మని అలా ఎందుకు పిలిచావని రుద్రాణి, సుభాష్ అడగటంతో తాతమ్మని తాతమ్మ అనే పిలుస్తారని చెబుతాడు స్వరాజ్. రుద్రాణి గట్టిగా అడగటంతో నువ్వు నాకు నచ్చలేదు.. నేను నీకు చెప్పను అంటాడు.
మా అత్తయ్య నీకు ఎలా తెలుసు? అంత ఖచ్చితంగా తాతమ్మ అని ఎలా పిలిచావు అని అడుగుతుంది అపర్ణ. నాకు మా అమ్మ చెప్పింది.. అందుకే పిలిచానని పిల్లాడు చెప్పడంతో అంతా షాక్ అవుతారు. బొండంలా ఉన్న ముసలివాళ్లు ఎవరు కనిపించినా తాతమ్మ అని పిలవాలని, వాళ్లకి సాయం చేయాలని మా అమ్మ చెప్పిందని అనడంతో అంతా ఊపిరి పీల్చుకుంటారు. కావ్య- రాజ్‌ను బయటికి తీసుకెళ్లి స్వరాజ్.. మా ఫ్రెండ్‌కి నిజం చెప్పేస్తానని టెన్షన్ పడ్డారా అని అడుగుతాడు. ఈ స్వరాజ్ ఎవరికైనా మాటిస్తే తప్పడని అంటాడు పిల్లాడు. ఆ బాబుకి ఈ ఇంటికి ఏదో సంబంధం ఉందని దానిని తేల్చేస్తానని రాహుల్‌తో చెబుతుంది రుద్రాణి.
భోజనం చేయకుండా రాజ్ కోసం ఎదురుచూస్తుంటుంది యామిని. భర్త తినకుండా భార్య ఎక్కడైనా భోజనం చేస్తుందా అని అడగటంతో వైదేహి, రఘునాథ్‌లు షాక్ అవుతారు. రాజ్ నన్ను త్వరలోనే పెళ్లి చేసుకుంటాడని, నా మెడలో తాళి కడతాడని చెబుతుంది. నువ్వు అందని ద్రాక్ష కోసం ఆశపడుతున్నావని మండిపడతాడు రఘునాథ్. ఇంతలో యామినికి రాజ్ ఫోన్ చేసి ఇంటికి రావడం కొంచెం లేట్ అయ్యేలా ఉందని చెబుతాడు. మళ్లీ ఏమైనా ప్రాబ్లమా అని అడుగుతుంది యామిని. ప్రాబ్లమ్ ఏం లేదని ఈరోజు కళావతి గారికి ప్రపోజ్ చేద్దామని అనుకుంటున్నానని అంటాడు. ఆ మాటలతో యామిని షాక్ అవుతుంది.
కావ్యకి ప్రపోజ్ చేయడానికి వాళ్లింట్లోనే బావ ఉన్నాడని.. అందుకే ఇంటికి రావడం లేట్ అవుతుందని తల్లిదండ్రులతో చెబుతుంది యామిని. ఆ రాజ్- కావ్యలు విడిపోవడం జరగదని.. వారి మధ్య ఉన్న తాళి బంధమే వాళ్లని బలంగా కాపాడుతుందని చెబుతాడు రఘునాథ్. నువ్వు అనసవరంగా రాజ్ మీద ఆశలు పెంచుకుని జీవితాన్ని నాశనం చేసుకుంటున్నావని అంటాడు. పెళ్లయిన ఓ అమ్మాయి జీవితాన్ని నాశనం చేస్తున్నా నీకోసం చూస్తూ ఉండిపోయానని చెబుతాడు రఘునాథ్. పరిస్ధితులు చూస్తుంటే రాజ్ నీకు సొంతం కావడం కష్టమేనని చెబుతాడు. రాజ్- కావ్య విడిపోతే నేనే నీకు సపోర్ట్ చేస్తానని తేల్చిచెబుతాడు రఘునాథ్.
పిల్లాడిని పిలిచి నువ్వు మీ ఫ్రెండ్ దగ్గరే పడుకోవాలని చెబుతుంది కావ్య. ఇదంతా చూసిన రాజ్.. బాబుకి ట్రైనింగ్ ఇస్తున్నారని అంటాడు. వాడిని వీలైనంత ఎక్కువసేపు అత్తయ్యకి దగ్గర చేస్తే మంచిదని అలా చేశానని అంటుంది కావ్య. కావ్యకి రాజ్ ప్రపోజ్ చేయబోతుండగా ప్రకాశం రావడంతో రాజ్ వెళ్లిపోతాడు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications










