Brahmamudi july 3rd episode: అనామిక మనసు మార్చే ప్రయత్నం చేసిన కావ్య.. అప్పుని కోర్టులో ప్రవేశపెట్టమన్న జడ్జి!

హోటల్లో జరిగిందానికి కారణం అనామిక అని ఇంట్లో నిరూపించి ఆమెకి విడాకులు ఇస్తానంటాడు కళ్యాణ్. వాళ్లని కలిపే ప్రయత్నం చేస్తారు రాజ్ దంపతులు. అయితే అనామిక తల్లిదండ్రులని ఇంటికి పిలిపించి పంచాయతీ పెట్టడంతో తల్లిదండ్రులతో సహా ఆమెని బయటికి పొమ్మంటాడు కళ్యాణ్. తరువాత అనామిక కళ్యాణ్ పై పోలీస్ కేసు పెడుతుంది. అప్పు కళ్యాణ్ దగ్గరికి వెళ్తానంటే కనకం అడ్డుకుంటుంది. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలెట్‌గా మిగిలాయి. ఇక జులై 3వ తేదీ ఎపిసోడ్ 452 లో ఏం జరిగిందంటే..

కొడుకుని మీడియా ప్రశ్నలతో ఇబ్బంది పెడుతుంటే బాధపడుతుంది ధాన్య లక్ష్మి. బాధపడకమ్మా వాళ్లకి నిజం తెలియదు కాబట్టి అలా అంటున్నారు రేపు నిజం తెలిసిన రోజు తిట్టిన నోళ్లే పొగుడుతాయి అంటాడు కళ్యాణ్. అదే సమయంలో రాజ్ ని పక్కకు తీసుకు వెళ్లిన కావ్య ఆవేశంలో మీరు ఏ మాట జారినా అది కవి గారికి ఇబ్బందిగా మారుతుంది అంటుంది. నా తమ్ముడ్ని వాళ్ళు అలా ఇబ్బంది పెడుతుంటే చూస్తూ ఊరుకోమంటావా అంటాడు రాజ్.

Brahmamudi serial July 3rd 2024 Episode of 452 Here is full story

నిజమే కానీ నలుగురిలో ఉన్నప్పుడు ఎలా మాట్లాడాలో మీరే నాకు చెప్పారు అలాంటిది ఇప్పుడు మీరు ఆవేశపడితే ఎలా అని భర్తకి సర్ది చెప్తుంది. అప్పుడే అనామిక కోర్టుకు వస్తుంది ఇదంతా తన వల్లే అని ఆవేశంగా అంటాడు రాజ్. మీరు ఆవేశ పడకండి నేను తనతో మాట్లాడుతాను అంటుంది కావ్య. అనామిక దగ్గరికి వెళ్లి ఆమె మనసు మార్చే ప్రయత్నం చేస్తుంది కావ్య.కానీ ఇంతవరకు వచ్చిన తర్వాత నీతో మాట్లాడవలసిన అవసరం లేదు అంటూ కోర్టులోకి వెళ్లిపోతుంది అనామిక.

Brahmamudi serial July 3rd 2024 Episode of 452 Here is full story

ఇదంతా చూస్తున్న రుద్రాణి కావ్య మాటలు విని అనామిక ఎక్కడ మనసు మార్చేసుకుంటుందో అని భయపడ్డాను కానీ అలా జరగలేదు అని కొడుకుతో చెప్తుంది. మరోవైపు కోర్టులో అనామికని, కళ్యాణ్ ని ప్రవేశపెడతారు. అనామిక లాయర్ మాట్లాడుతూ దుగ్గిరాల ఇంటి కోడలైన తర్వాత శారీరకంగా, మానసికంగా నా క్లైంట్ అనామిక చాలా ఇబ్బంది పడింది, ఆమె భర్త మరొక స్త్రీ తో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు, అదనపు కట్నం కావాలంటున్నాడు అని చాలా ఆరోపణలు చేస్తుంది.

కళ్యాణ్ తరపు లాయర్ మాట్లాడుతూ ఆమె చేసిన ఆరోపణలు అబద్ధాలు అంటూ అనామిక దగ్గరికి వచ్చి మీరు కట్నం ఇచ్చారా అని అడుగుతాడు కోటి రూపాయలు కట్నం ఇచ్చాను అని అబద్ధం చెప్తుంది అనామిక. మరి పెళ్లిలో మీ నాన్నగారికి రెండు కోట్లు అప్పు ఉంది అని తీర్చకపోతే పెళ్లి జరగనివ్వనని ఎవరో సేటు వచ్చే గొడవ పెడితే స్వరాజ్ గారే ఆ రెండు కోట్లు కట్టి మీ పెళ్లి జరిపించారు, అలాగే కళ్యాణ్ గారు కవిగానే మీకు పరిచయమయ్యారు.

Brahmamudi serial July 3rd 2024 Episode of 452 Here is full story

ఆ కవినే మీరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు అలాంటి సున్నితమైన కవి హృదయాన్ని మీరు ఇబ్బంది పెడుతున్నారు అతని భావుకత్వాన్ని చంపేస్తున్నారు అంటూ గట్టిగా వాదిస్తాడు. అప్పుడు అనామిక లాయర్ మాట్లాడుతూ అతను అప్పు అనే ఆమెతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు అని చెప్తుంది. లేదు మేము కేవలం ఫ్రెండ్స్ మాత్రమే అంటాడు కళ్యాణ్. అలాంటప్పుడు అప్పు, ఆమె తల్లి మీ పెళ్లి ఆపాలని ఎందుకు ప్రయత్నించింది అని అడుగుతుంది అనామిక లాయర్.

ఆమె తనకి తెలియకుండానే నన్ను ప్రేమించడం ప్రారంభించింది, కానీ ఆ విషయం నాకు తెలియదు అంటాడు కళ్యాణ్. ఇప్పటివరకు స్నేహం మాత్రమే అన్నావు మరి మధ్యలో ఈ ప్రేమ ఎలా వచ్చిందని కళ్యాణ్ ని నిలదీస్తాడు జడ్జి. తర్వాత లాయర్ ని అప్పు ఏది అని అడుగుతాడు జడ్జి. ఆమె అందుబాటులో లేదు అని చెప్తాడు లాయర్. ఈ కథకి కారణమైన వ్యక్తి అందుబాటులో లేకపోవడం ఏమిటి రేపు ఆమెని కోర్టులో హాజరపరచండి అని చెప్పి కేసుని రేపటికి వాయిదా వేస్తాడు జడ్జి.

తరువాయి భాగంలో మీరు అమ్మాయిని హెరేజ్ చేయలేదు అని సాక్ష్యాలు కావాలి అని కళ్యాణ్ వాళ్ళని అడుగుతాడు లాయర్. అప్పుడే అక్కడికి వచ్చిన అనామిక అలాంటి సాక్షాలు వాళ్ళ దగ్గర ఉండవు, నన్ను క్షమాపణ అడిగి ఆ ఇంటికి నన్ను తీసుకువెళ్తాడేమో అడగండి అంటుంది అనామిక. ఒకసారి ప్రేమించాను అంటే నిన్ను నమ్మి మోసపోయాను మళ్ళీ మోసపోవటానికి నేను సిద్ధంగా లేను అంటాడు కళ్యాణ్. సరే అయితే రేపు కోర్టులోనే తేల్చుకుందాం అంటుంది అనామిక.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X