Brahmamudi July 3rd Episode: స్వప్నకి పట్టుబడ్డ రాహుల్.. రాజ్‌‌కి కావ్య ఎండీ ట్రైనింగ్, రుద్రాణిలో అనుమానం

Photo Courtesy: JioHotstar

కావ్య, రాజ్‌లు కారులో వెళ్తుండగా రేవతి తన బాబుని తీసుకుని ఓ చెప్పుల షాపుకు వెళ్తుంది. అక్కడ షూ చూసి అదే కావాలంటే కొడుకు మారాం చేస్తాడు. అది కొనేంత డబ్బు లేకపోవడంతో పిల్లాడిని తీసుకుని ఏడుస్తూ వెళ్లిపోతుంది రేవతి. దీనిని చూసి రాజ్, కావ్యలు బాధపడుతూ.. ఆ పిల్లాడికి మనం గిఫ్ట్ ఇవ్వాల్సిందే అనుకుని రేవతి ఇంటికి వెళ్తారు. రాజ్‌ను చూడగానే రేవతి ఆనందంతో అతనిని హత్తుకుంటుంది. నేను, మీకు ముందే తెలుసా? అని రాజ్ అడగ్గా.. కావ్య షాక్ అవుతుంది.

రేవతి కొడుకు పుట్టినరోజు కావడంతో చిన్నారితో కేక్ కట్ చేయిస్తారు రాజ్, కావ్య. తర్వాత బాబుకి వాళ్లు తీసుకొచ్చిన గిఫ్ట్ ఇవ్వడంతో ఆ పిల్లాడు షూ చూసుకుని ఆనందిస్తాడు. పుట్టినరోజు నాడు నా కొడుకును సంతోషపెట్టారని రాజ్, కావ్యలకి రేవతి ఆమె భర్త థ్యాంక్స్ చెబుతారు. మీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా ఫోన్ చేయమని రాజ్ వాళ్లతో అంటాడు. ఇద్దరూ కలిసి కారులో సంతోషంగా మాట్లాడుకుంటూ వెళ్తారు. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. ఇక జూలై 3వ తేదీ ఎపిసోడ్ 764లో ఏం జరిగిందంటే?

Brahmamudi Serial July 3rd 2025 Episode 764 Here is Today s full story

Photo Courtesy: JioHotstar

ప్రియురాలికి ఆస్తి పత్రాలు ఇచ్చి తన సొంతం చేసుకోవాలని అనుకున్న రాహుల్‌కి తాళాలు కనిపించకపోవడంతో కబోర్డ్ తలుపులు గట్టిగా లాగుతాడు. ఆ వెంటనే స్వప్న రావడంతో రాహుల్ షాక్ అవుతాడు. మళ్లీ నా కబోర్డ్ మీద పడ్డావ్.. ఈసారి ఏం కొట్టేయాలని అనుకుంటున్నావ్? అని నిలదీస్తుంది. నిన్ను మొన్న దొంగ అంటేనే ఫీలయ్యావ్.. మళ్లీ ఏం దొంగ పని చేద్దామని వచ్చావని ప్రశ్నిస్తుంది. నాకు దొంగతనం చేయడం తప్పించి మరో పనిలేదా అని అడుగుతాడు రాహుల్. తప్పులు చేయడమనేది నీ డీఎన్ఏలోనే ఉందని.. ఏం చేస్తాం.. ఇలాగే అనుమానిస్తామని చెబుతుంది స్వప్న. గదిలో ఇంత ప్లేస్ ఉండగా నువ్వు ఇక్కడికే ఎందుకొచ్చావ్ అని నిలదీస్తుంది.

ఇందిర, అపర్ణలు కాఫీ తాగుతూ.. నిన్న కావ్య, రాజ్‌ల మధ్య ఏం జరిగిందో? ఎక్కడికి వెళ్లారో ఏం చెప్పరేంటీ అని అపర్ణ. వీళ్లిద్దరికీ మూడు ముళ్లు వేసేయ్యాలని లేకపోతే ఆ యామిని ఎప్పుడు ఏం చేస్తుందో భయపడాల్సి వస్తోందని అంటుంది. ఇంతలో రాజ్ రావడంతో నిన్న ఏం జరిగిందో చెప్పమని అడుగుతుంది ఇందిర. మా ఇద్దరి జీవితాల గురించి పూర్తిగా, క్లారిటీగా మాట్లాడుకున్నామని చెబుతాడు రాజ్. ఇక మా ఇద్దరి మధ్య ఎలాంటి కన్‌ఫ్యూజన్ ఉండదని చెప్పడంతో అపర్ణ, ఇందిరలు సంతోషిస్తారు. ఇక వెంటనే పెళ్లి ఏర్పాట్లు మొదలు పెట్టేయాలని, ఆ యామినిలా చీప్‌గా కాకుండా నా కొడుకు పెళ్లి హైదరాబాద్ మొత్తం మాట్లాడుకునేలా చేద్దామని అంటుంది అపర్ణ. ఆ మాటలతో రాజ్ షాక్ అవుతాడు.

మేం మాట్లాడుకుంది ప్రేమ, పెళ్లి గురించి కాదని.. కళావతిగారి ఆఫీసులో ఏదో ప్రాబ్లమ్ వచ్చిందని ఆ విషయంలో నన్ను హెల్ప్ చేయమని చెప్పిందని అంటాడు రాజ్. హెల్ప్ అడిగిన దానికి ఏదో ఐఏఎస్ ఎగ్జామ్ పాస్ అయినట్లుగా చెబుతావా? అంటూ ఇందిర మండిపడుతుంది. మేమిద్దరం మీరు పూర్తిగా మాట్లాడేసుకున్నారు? పెళ్లికి రెడీ అయిపోయారు? అనుకుంటున్నామని చెబుతుంది. మా పెళ్లి ఎంతో దూరంలో లేదని.. నేను ఎండీగా ఎలా ఉండాలో కళావతి ట్రైనింగ్ ఇస్తానని చెప్పిందని అంటాడు రాజ్. ఆఫీసులో ప్రాబ్లం సాల్వ్ అయిపోగానే నా ప్రేమ విషయం చెప్పేస్తానని, మా పెళ్లికి ఓకే కూడా చేయిస్తానని చెబుతాడు. ఇంతలో కావ్య వచ్చి రాజ్‌పై కోప్పడుతుంది. మనం చేయబోయే పని గురించి క్లారిటీగా చెబుతున్నానని అంటాడు రాజ్. నేర్చుకోవాల్సింది, చేయాల్సింది మీరని లోపలికి లాక్కెళ్తుంది కావ్య.

అప్పూకి తన ఏడు వారాల నగలు ఇస్తుంది స్వప్న. మన కంపెనీలో మెరుగు పెట్టించి ఇస్తే బ్యాంక్ లాకర్‌లో పెడతానని అంటుంది. ఈ ఇంట్లో అసలే దొంగలు ఉన్నారని.. ఇంటి దొంగని ఈశ్వరుడు కూడా పట్టలేడని, నేను లేని టైం కొట్టేస్తే ఏం చేస్తామని ప్రశ్నిస్తుంది. కనీసం బ్యాంక్ లాకర్‌లో ఉంటే సేఫ్‌గా ఉంటాయని చెబుతుంది స్వప్న. అందరు ఆడపిల్లలకి కొంటె పనులు చేసే భర్త దొరికితే నాకు మాత్రం భార్య దగ్గరే నగలు కొట్టేసే భర్త దొరికాడని అంటుంది. నువ్వు వెళ్లి మెరుగు పెట్టించి తీసుకురా అని తన నగలు ఇస్తుంది స్వప్న.

మీ కంపెనీని లాక్కోవాలని చూస్తున్న వాడికి బుద్ది వచ్చేలా చేయాలని కావ్యతో అంటాడు రాజ్. ఈ రెండు రోజుల పోరాటంలో విజయం మనదే కావాలని అంటాడు. రాజ్‌కి సూట్ ఇచ్చి వేసుకోమని చెబుతుంది కావ్య. సూట్‌లో బయటికి వచ్చిన రాజ్‌ని చూసి కావ్య మురిసిపోతుంది. మీ బాస్‌లా ఉన్నానా? అని రాజ్ అడగ్గా.. ఒరిజినల్ ఫోన్, డూప్లికేట్ ఫోన్ ఒకేలా ఉంటాయని అంటుంది కావ్య. కంపెనీ ఎండీ ఎలా నడుచుకుంటూ వస్తారో? ఒకసారి చూపించమని అడుగుతుంది కావ్య. రాజ్ వాకింగ్ స్టైల్ చూసి మీరు ఎండీలా లేరని, రోడ్డు మీద అమ్మాయిలకి సైట్ కొట్టే జులాయిలా ఉన్నారని చెబుతుంది. ఒక కంపెనీ నడిచే నడకలో, చూసే చూపులో, మాట తీరులో, షేక్ హ్యాండ్ ఇచ్చే విధానంలో, పేదాలపై కనిపించే నవ్వులో కాన్ఫిడెన్స్ కనిపించాలని చెబుతుంది.

మీరు చెప్పినవన్నీ చేయడం నాకు రాదని రాజ్ చెప్పగా.. మీరు ఎలా నడవాలో, ఎలా నడుచుకోవాలో నేను చూపిస్తానని అంటుంది కావ్య. కావ్య నడిచి చూపించిన తర్వాత రాజ్‌కి ఆ స్టైల్ రాకపోవడంతో అలిసిపోతాడు. ఈ టైట్ బట్టల్లో మీ బాస్ ఎలా ఉన్నాడో అర్ధం కావడం లేదని అంటాడు రాజ్. ఒక్కరోజుకే మీరు భరించలేకపోతున్నారని.. నేను ఇన్ని రోజులుగా టార్చర్ అనుభవిస్తున్నానని చెబుతుంది కావ్య. మిమ్మల్ని మీరు తిట్టుకుంటుంటే బావుందని నవ్వుకుంటుంది. నన్ను కాదు.. మీ బాస్‌ని తిడుతున్నానని చెబుతాడు రాజ్. ఈరోజు నుంచి మీరే కదా మా బాస్ అంటుంది కావ్య. భోజనం చేసేటప్పుడు కూడా స్టైల్‌గా ఎలా ఉండాలో నేర్పిస్తుంది. వాళ్లిద్దరినీ చూసిన రుద్రాణి.. రాజ్‌కి పోలీస్ ట్రైనింగ్ ఇస్తుంది? ఎందుకిలా చేస్తుంది? అని అనుమానం పడుతుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X