Brahmamudi July 3rd Episode: తల్లిదండ్రులతో రాజ్ తెగతెంపులు.. రాజ్‌‌ను వదులుకోలేక ఇందూ మనసు ముక్కలు

Photo Courtesy: JioHotstar

ఉదయాన్నే బట్టలు ఐరన్ చేస్తున్న ఇందూ దగ్గరికి వెళ్లి తన షర్ట్ కూడా ఇస్త్రీ చేయమని చెబుతాడు రాజ్. తనకే పని చెబుతాడా అంటూ రాజ్‌పై రగిలిపోయిన ఇందూ.. ఆ షర్ట్‌ని కాల్చేస్తుంది. కాసేపటి తర్వాత వచ్చి చూసిన రాజ్‌కు షర్ట్ కాలిపోయి కనిపించడంతో ఇందూని కొట్టడానికి ఇల్లంతా వెంటపడతాడు. వారిద్దరిని చూసి అపర్ణ- సుభాష్‌లు సంతోషిస్తారు. ఇంతలో అక్కడికి వచ్చిన చలపతి - లక్ష్మీలు అక్కడికొచ్చి షాక్ అవుతారు. నీకు, ఇందూకి పెళ్లి జరిగిందా? లేదా? అని చలపతి అడగ్గా.. జరిగిందని ఒప్పుకోవడంతో రాజ్ చెంప పగలగొడతాడు తండ్రి. మేం చచ్చామని ఇలా చేశావా? గొప్పింటి వాళ్ల జోలికి వెళ్లొద్దని .. ఈ పెళ్లి మాకు ఇష్టం లేదు, ఇంటి వెళ్లిపోదామని లాక్కెళ్తాడు చలపతి.

పిల్లల ఇష్టాన్ని గౌరవించాలని అపర్ణ, సుభాష్ ఎంత చెబుతున్నా వినిపించుకోకుండా మాకు వాడు ప్రాణాలతో ఉంటే చాలని అంటాడు చలపతి. నీకు మేం కావాలా? ఇందూ కావాలా తేల్చుకోమని చలపతి చెప్పడంతో నా భార్యను, ఈ ఇంటిని వదిలి ఎక్కడికి రాలేనని తేల్చేస్తాడు రాజ్. దాంతో రేఖ, ఐశ్వర్యలు షాక్ అవుతారు. తనకు ఇచ్చిన మాట కోసం కన్నవాళ్లనే వదులుకున్న రాజ్‌ని చూసి ఎమోషనల్ అవుతుంది ఇందూ. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. ఇక జూలై 3వ తేదీ ఎపిసోడ్ 1075లో ఇంకా ఏం జరిగిందంటే?

Brahmamudi Serial July 3rd 2026 Episode 1075 Here is Today s full story

Photo Courtesy: JioHotstar

ఇంటికి రాకుండా గుమ్మంలోనే ఆగిపోయిన రాజ్‌పై చలపతి మండిపడతాడు. నీకు ఈ కన్నవాళ్లు కావాలా? ఈ ఖరీదైనా ఇల్లు కావాలా? అని నిలదీస్తాడు. నాన్నని జాగ్రత్తగా తీసుకెళ్లమని లక్ష్మీతో అనడంతో భార్యాభర్తలిద్దరూ షాక్ అవుతారు. అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావో నీకు అర్ధమవుతుందా? నువ్వు ఎవరిని కాదంటున్నావో నీకు అర్ధమవుతుందా అని కొడుకుని లక్ష్మీ నిలదీస్తుంది. కన్నకొడుకు అంటే నీలా ఉండాలి? నీలాంటి కొడుకుని కన్న తల్లిదండ్రులు రోజూ ఏడుస్తూ బతకాల్సిందేనని కంటతడి పెడతాడు చలపతి. ఈ కోట్ల ఆస్తిని చూడగానే మన కొడుకు అన్న విషయం కూడా మరిచిపోయాడు, వీడు పూర్తిగా మారిపోయాడు, మనల్ని బికారివాళ్లుగా చూస్తున్నాడు, వీడి మనసు స్వార్ధంతో నిండిపోయిందని బాధపడతాడు చలపతి.

మమ్మల్ని నువ్వు మరిచిపోయావు, మా పాతికేళ్ల ప్రేమకు అర్ధం లేకుండా చేశావు. మేం నీ మీద పెట్టుకున్న ఆశల్ని నిలువునా కూల్చేశావు, మేం నీకు ఏం అన్యాయం చేశాం? మమ్మల్ని ఎందుకు ఇంతలా బాధపెడుతున్నావని కంటతడి పెడతాడు చలపతి. ఇన్నాళ్లూ నువ్వు ఇంటికి రాకపోతే ఎక్కడున్నావో? ఎలా ఉన్నావో తెలియక ఎంత ఏడ్చామో తెలుసా? మా ప్రేమకు, మా కన్నీళ్లకు నువ్వు ఇచ్చే ఫలితం ఇదా అని బాధపడతాడు. నువ్వు లేకుండా మేం ఉండలేమని మాతో వచ్చేయమని ప్రాధేయపడుతుంది లక్ష్మీ. కాళ్లు పట్టుకున్నా సరే వాడి మనసు మారదు, వాడికి కావాల్సింది కన్నవాళ్లు కాదు ఈ కోట్ల ఆస్తి.

నువ్వు తీసుకున్న నిర్ణయం ఏదో ఒకరోజు తప్పని నీకు తెలుస్తుంది, అది తెలిసిన రోజున ఈ తండ్రి నీకు ఉండడని చలపతి అనడంతో రాజ్ షాక్ అవుతాడు. నేను చచ్చిన తర్వాత కూడా నాకు తలకొరివి పెట్టడానికి కూడా నువ్వు మా ఇంటికి రావొద్దని తేల్చిచెబుతాడు చలపతి. ఒకప్పుడు నిన్ను చూసి నువ్వు మా ఇంటి కోడలివి అయితే బాగుండు అనిపించింది. కానీ నువ్వు మాకు కోడలివి అయి, మా కొడుకుని మాకు కాకుండా చేశావని ఇందూని అంటాడు చలపతి. అసలు వాడికి తల్లిదండ్రులు లేకుండా చేశావని కంటతడి పెడతాడు. ఆ మాటలతో రాజ్, ఇందూ బాధపడతారు. రాజ్ గురించి తలచుకుంటూ చలపతి, లక్ష్మీలు ఇంటి దగ్గర ఏడుస్తుంటారు.

మీరెందుకు అంతలా ఆవేశపడ్డారు? అలాంటి మాటలు ఎందుకు మాట్లాడారు? అని లక్ష్మీ అడుగుతుంది. అలా మాట్లాడితే అయినా వాడు మనతో ఇంటికొస్తాడని అనుకున్నాను, అందుకే అంత కఠినంగా మాట్లాడానని చెబుతాడు చలపతి. కానీ నా మాటలు వాడి మనసుని కరిగించలేకపోయాయని అంటాడు. వాడు మనకి తెలియకుండా పెళ్లి చేసుకోవడం ఏంటీ? పోయి పోయి ఆ దుగ్గిరాల ఇంటి అమ్మాయినే పెళ్లి చేసుకోవాలా? వాడు అక్కడుంటే వాడి ప్రాణాలు పోతాయని గానీ.. వాడు ఆ ఇంటి వారసుడు అని గానీ నిజం చెప్పలేం. నిజం తెలియకుండానే వాడు ఆ ఇంటిలో నుంచి అడుగుపెట్టలేదు. అలాంటిది వాడు ఆ ఇంటి మనిషి అని తెలిస్తే అస్సలు రాడని బాధపడతాడు చలపతి. వాడు పెద్ద సమస్యలో ఇరుక్కున్నాడు.. దాని నుంచి వాడిని ఎలా కాపాడుకోవాలో తెలియడం లేదని అంటాడు.

రాజు విషయంలో మనం తప్పు చేస్తున్నాం, ఇన్నాళ్లుగా ఎలాంటి అండ లేని ఆ దుగ్గిరాల కుటుంబానికి అండగా ఉండాలని ఆ దేవుడే ఇలా చేస్తున్నాడని అంటుంది లక్ష్మీ. వాడు ఏ ఇంటికి వెళ్లకూడదని అనుకున్నామో ఆ ఇంటికే వెళ్లాడు, ఆ ఇంటి మనిషినే పెళ్లి చేసుకున్నాడు. నిజంగా ఇదంతా ఆ దేవుడు ఆడిస్తున్న ఆటలా ఉంది. మనం ఆ ఇంటికి వాడిని ఎంత దూరం చేయాలని అనుకుంటే అంత దగ్గరవుతున్నాడని బాధపడుతుంది లక్ష్మీ. వాడి ప్రాణాలు కాపాడటం కోసమో, వాడు లేకపోతే మనం బతకగలమా? వాడు ఆ ఇంట్లోకి లేకపోతే ఏమవుతుంది? మహా అయితే వాడి ఆస్తిని ఆ రేఖ సొంతం చేసుకుంటుంది. అంతేకానీ వాడు ప్రాణాలైతే పోవు కదా? వాడిని మనం అక్కడి నుంచి ఎలాగైనా తీసుకురావాలని చెబుతాడు చలపతి.

రాజ్ గాడిని ఇంట్లో నుంచి పంపిస్తానని చెప్పావు? నీ ప్లాన్ అట్టర్ ఫ్లాప్ అయిపోయిందని రేఖని నానామాటలు అంటుంది భ్రమరాంబ. మనం ఈ ఆస్తి కోసం ఎన్నో అరాచకాలు చేశాం, 25 సంవత్సరాలుగా ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నాం. రాజ్ ‌గాడు ఒక కిడ్నాపర్.. డబ్బుల కోసం ఏమైనా చేస్తాడు, వాడికి ఎంతో కొంత పడేసి మన పనిని చేయించుకుందామని అనుకుంటే వాడు ఏకంగా నిన్ను కంపెనీ నుంచి పంపేశాడు. కంపెనీ డీల్స్ ఓకే చేశాడు, ఎంప్లాయిస్‌ అందరికీ శాలరీలు కరెక్ట్‌గా ఇప్పిస్తున్నాడని చెబుతాడు భూషణ్. ఆ రాజ్‌గాడిని ఎలాగైనా పంపించేస్తానని అంటుంది రేఖ. వాడు వెళ్లిపోవడానికి ఒక బీజం పడింది, నేను డల్‌గా ఉంటేనే ఇందూ తట్టుకోలేదు, అలాంటిది ఆ రాజ్‌గాడి గురించి ఇంకెంత ఆలోచిస్తుందో అని చెబుతుంది. అందుకే రాజ్ వెళ్లను అని చెప్పినాసరే.. ఇందూ పట్టుబట్టి మరి ఇక్కడి నుంచి పంపించేస్తుందని అంటుంది రేఖ.

ఇందూ అంత మంచిది కాదు, అది అమాయకురాలు కాదని చెబుతుంది ఐశ్వర్య. ఆ రాజ్‌ని ఇందూ ఇంట్లో నుంచి పంపించకపోతే నేను చేయాల్సింది నేను చేస్తాను కదా అని అంటుంది రేఖ. ఇప్పటి వరకు రాజ్‌ని పంపించడానికి నాకు అవకాశం దొరకలేదు, ఈసారి మాత్రం వదిలిపెట్టనని చెబుతుంది. ఇంట్లో జరిగిన గొడవ గురించి ఇందూ బాధపడుతుంది. మీ నాన్న అంత బాధపడినప్పటికీ నువ్వు ఈ ఇంట్లో ఉండటంలో అర్ధం లేదని రాజ్‌తో అంటుంది. నేను ఇక్కడ ఉండటానికి చాలా కారణాలు ఉన్నాయి, నీకు తోడుగా ఉండమని నువ్వు కూడా ప్రామీస్ చేయించుకున్నావు కదా? ఆ ప్రామీస్ బ్రేక్ చేయమంటావా? నీకు తోడుగా ఉండకుండా వెళ్లిపోమంటావా? అని ప్రశ్నిస్తాడు రాజ్. నువ్వు తోడుగా ఉంటే నాకు ధైర్యంగా ఉంటుందని, నేను అలా చేశాను, నువ్వు నా పక్కన ఉంటే నేను ఏమాత్రం వెనుదిరగకుండా కంపెనీని నడిపించగలనని అలా చేశానని చెబుతుంది ఇందూ.

నా వల్ల మీ ఇంట్లో వాళ్లు అలా బాధపడే పరిస్ధితి వస్తుందంటే నేను మాత్రం అలా ఎందుకు ప్రామీస్ చేయించుకుంటాను? నువ్వు ఇక్కడి నుంచి వెళ్లిపో? మీ అమ్మనాన్నల దగ్గరకి వెళ్లిపో అని అంటుంది ఇందూ. ఆ మాటలతో రాజ్ షాక్ అవుతాడు. ఇక్కడున్న ప్రాబ్లమ్స్, నువ్వు ఉన్న పరిస్థితులు ఏంటీ? అసలు నన్ను వెళ్లిపోమంటావా? అని రాజ్ నిలదీస్తాడు. నా కోసం నువ్వు నా ఫ్యామిలీని వదులుకోవడం నాకు ఇష్టం లేదు, నువ్వు అలా కన్నవాళ్లకు దూరమైతే ఆ బాధ నాకు తెలుసు. చిన్నప్పటి నుంచి ఆ బాధను నేను అనుభవిస్తూనే ఉన్నా, నీ వాళ్లని నీకు దూరం చేసి ఆ పాపాన్ని మోయలేను అంటుంది ఇందూ. ఇక్కడ నీది అవసరం, నాది స్వార్ధం. నీ అవసరానికి నన్ను పిలిచావు, నా స్వార్ధానికి ఇక్కడికి వచ్చాను .. అలాంటప్పుడు నింద నీ మీదే వేసుకుంటున్నావు. మా నాన్న తిట్టడం ఇది మొదటిసారి కాదు, నాకు కొత్త కాదు.. మళ్లీ మాట్లాడతాడు అంటాడు రాజ్. మీ ఇంటికి వచ్చినప్పుడు మీ వాళ్లని చూశాను, వాళ్ల మనస్తత్వాలు అర్ధం చేసుకున్నా.. చాలా మంచోళ్లు. అలాంటివాళ్లు కన్నీళ్లు పెడుతున్నారంటే లోపల ఎంతో బాధతోనే ఇలా మాట్లాడారని అంటుంది ఇందూ. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X