Brahmamudi July 4th Episode: కావ్యకి షాకిచ్చేలా యామిని ప్లాన్.. రాహుల్ గోల్డ్ స్కాం కనిపెట్టిన స్వప్న
Photo Courtesy: JioHotstar
రాహుల్‌కి భయపడి తన దగ్గర ఉన్న నగల్ని అప్పూకి ఇస్తుంది స్వప్న. ఇంట్లో ఉంటే రాహుల్ వీటిని కొట్టేస్తాడని మన కంపెనీలో ఇచ్చి మెరుగు పెట్టించమని చెబుతుంది స్వప్న. మెరుగు పెట్టించిన తర్వాత నా ఏడు వారాల నగల్ని బ్యాంక్ లాకర్‌లో పెడతానని అంటుంది. దుగ్గిరాల వారింటికి రాజ్ రాగానే నిన్న కావ్యతో ఏం చేశావ్? ప్రపోజ్ చేశావా? లేదా అని అడుగుతారు అపర్ణ, ఇందిర. కళావతిగారితో నా ఫ్యూచర్ గురించి డిస్కషన్ చేసినట్లు రాజ్ చెప్పడంతో వారిద్దరూ సంతోషిస్తారు.
వెంటనే మీ ఇద్దరికీ పెళ్లి చేస్తానని.. హైదరాబాద్ మొత్తం తెలిసేలా పెళ్లి చేస్తానని అంటుంది అపర్ణ. ఇంతలో కావ్య వచ్చి మీరు అనుకున్నట్లుగా ఏం జరగలేదని చెప్పి రాజ్‌ను లోపలికి తీసుకెళ్తుంది. రాజ్ పాత సూట్‌ని వేసి.. కంపెనీ ఎండీ ఎలా నడవాలో? ఎలా తినాలో ట్రైనింగ్ ఇస్తుంది. దీనిని రుద్రాణి చూసి షాక్ అవుతుంది. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. ఇక జూలై 4వ తేదీ ఎపిసోడ్ 765లో ఏం జరిగిందంటే?

Photo Courtesy: JioHotstar
రాజ్‌కి కావ్య ట్రైనింగ్ ఇస్తూ కనిపించడంతో రుద్రాణికి అనుమానం వస్తుంది. కావ్య ఏదో పెద్ద ప్లానే వేసిందని, అదేంటో తెలుసుకోవాలని అనుకుంటుంది. రాజ్ వాటర్ తాగబోతుండగా కావ్య అడ్డుకుని మా బాస్ భోజనం అయిన 15 నిమిషాల తర్వాతే వాటర్ తాగుతారని చెబుతుంది. ఈలోపు ఎక్కిళ్లు వస్తే అని రాజ్ అడగ్గా ఓర్చుకోవాలని అంటుంది. భోజనం చేసి రాజ్ పడుకోబోతుండగా కావ్య మళ్లీ ఆపుతుంది. ఆఫీసులో మా బాస్ ఇలా రిలాక్స్ తీసుకోరని అంటుంది. కావ్య మాటలకు రాజ్‌కు వస్తుంది. మీరే మా బాస్‌లా చేస్తానని చెప్పారని.. ఇప్పుడు కోప్పడుతున్నారా? అని మడిపడుతుంది. తర్వాత కావ్యకి రిలాక్స్ ఎలా అవ్వాలో చూపిస్తుంది కావ్య.
కావ్య దెబ్బకి రాజ్ అలిసిపోతాడు. ఇప్పులే రిలాక్స్ అయితే ఎలా మీరు చేయాల్సిన పనులు చాలా ఉన్నాయని చెబుతుంది కావ్య. బోర్డ్ మీటింగ్‌లో సిద్ధార్ధ్‌కు ఎదురుగా, ధీటుగా నిలబడి సమాధానాలు చెప్పాలంటే కంపెనీకి సంబంధించిన అన్ని వివరాలు మీకు తెలియాలని అంటుంది. పదేళ్లుగా కంపెనీలో జరిగిన డీల్స్ గురించి తెలియాలని చెబుతుంది. కంపెనీ ఎండీగా నటించడమంటే వెళ్లి నాలుగు మాటలు మాట్లాడటం అనుకున్నానని, కానీ ఇంత కష్టంగా ఉంటుందని అనుకోలేదని చెబుతాడు రాజ్. మా బాస్ ప్లేస్‌లో నటించడమంటే అంత ఈజీ అనుకున్నారా? అని కావ్య అడుగుతుంది. ఈ మాటలు విన్న రుద్రాణి.. ఇదా నీ ప్లాన్.. రాజ్‌కి తెలియకుండా వాడినే వాడుకుందామని అనుకుంటున్నావా? అనుకుంటుంది.
కావ్య ప్లాన్ గురించి యామినికి ఫోన్ చేస్తుంది. ఇక్కడ కొంపలు అంటుకుంటుంటే నువ్వు కూల్‌గా సాంగ్స్ వింటూ కాఫీ తాగుతున్నావా అని మండిపడుతుంది. ఆ కావ్య రాజ్‌కి కంపెనీ ఎండీగా ట్రైనింగ్ ఇస్తుందని రుద్రాణి చెప్పడంతో యామిని షాక్ అవుతుంది. ఆ కావ్య చాలా తెలివైనది అనుకున్నాను.. కానీ ఇంత పిచ్చిదని ఇప్పుడే అర్ధమవుతుందని అంటుంది యామిని. అది పిచ్చిది కాదు.. మనం ఇలాగే ఉంటే అదే మనల్ని పిచ్చోళ్లని చేస్తుందని హెచ్చరిస్తుంది రుద్రాణి. ఆఫీస్‌లో గతం గుర్తొచ్చినట్లుగా రాజ్ బిహేవ్ చేస్తే మన ప్లాన్ అంతా మిస్ ఫైర్ అయిపోతుందని చెబుతుంది రుద్రాణి.
ఏదో ఒకటి చేసి రాజ్ ఆఫీస్‌కి రాకుండా చేయమని యామినితో అంటుంది రుద్రాణి. మీరేం భయపడోద్దు.. కావ్య ప్లాన్ ఏది జరగనివ్వనని చెబుతుంది యామిని. వాడు మాత్రం ఆఫీస్‌కి రావడానికి వీల్లేదని అంటుంది రుద్రాణి. రేపటి నీ యుద్ధం కోసం సైనికుడిని రెడీ చేస్తున్నావా? నీకు డబుల్ ధమాకా ఎలా ఉంటుందో నేను చూపిస్తానుగా అని కావ్యను ఉద్దేశించి అనుకుంటుంది యామిని. స్వప్న ఇచ్చిన నగలు తీసుకుని అప్పూ కోపంగా వస్తుంది. నీకు నన్ను ఫూల్‌ను చేయాలని అంత సరదాగా ఉంటే ఏ ఏప్రిల్ ఫస్ట్‌కో చేసుకో అంతేకానీ గిల్ట్ నగలు ఇస్తావా అని మండిపడుతుంది. ఆ మాటలతో స్వప్న షాక్ అవుతుంది.
నేను నీకు గిల్ట్ నగలు ఇవ్వడం ఏంటీ? ఇవి నా ఏడు వారాల ఒరిజినల్ నగలని చెబుతుంది స్వప్న. నాకు తాతయ్య గారు ఇచ్చిన నగలు ఇవేనని చెబుతుంది. కంపెనీ వాళ్లు చెక్ చేసి మరి ఇవి రోల్డ్ గోల్డ్ నగలని చెప్పారని అంటుంది అప్పూ. కంపెనీలో అందరి ముందు నాకు తల కొట్టేసినట్లుగా అయ్యిందని చెబుతుంది అప్పూ. ఇది ఎవరి పనో నీకు ఇప్పుడు అర్ధమైందని, ఆ రోజు రాహుల్ నగల్ని దొంగతనం చేయాలని చూడలేదు.. ఒరిజినల్ నగల్ని దొంగతనం చేసి వాటి ప్లేస్‌లో గిల్ట్ నగల్ని కబోర్డ్‌లో పెడుతున్నప్పుడు దొరికాడని అంటుంది స్వప్న. నా నగల్ని అప్పటికే నా దొంగ మొగుడు కొట్టేశాడని చెబుతుంది. ఇన్ని రోజులు నేను ఒరిజినల్ నగలకి కాపలా కాచానని అంటుంది. మనం ఈ విషయాన్ని ఇంట్లో వాళ్లకి చెప్పొద్దని.. అసలు వాడు ఈ నగల్ని ఎవరికి ఇచ్చాడో కనుక్కుందామని అంటుంది. రాహుల్ వీటిని డబ్బులు అవసరమై దొంగిలించలేదని.. దీని వెనుక ఇంకేదో ఉందని స్వప్నకి డౌట్ వస్తుంది.
కావ్య నిద్రపోతుండగా రాజ్ ఫోన్ చేస్తాడు. మీకు మాట్లాడటానికి వేరే టైం దొరకలేదా అని కావ్య అడుగుతుంది. నేను తనకంటే ముందే ఆఫీస్‌కి వెళ్లి స్టాఫ్‌ని పరిచయం చేసుకుంటానని అనుకుంటాడు రాజ్. మంచి టైం చూసుకుని నా మనసులోని మాటను చెబుతానని అనుకుంటాడు. రాహుల్‌ని ట్రాప్ చేయడానికి ఓ చోట తాళాలు పెడుతుంది స్వప్న. అది చూసి రాహుల్ సంబరపడిపోతాడు. వాటితో ప్రాపర్టీ పేపర్స్ కొట్టేయాలని అనుకుంటాడు . అర్ధగంట వరకు నేను బయటికి వెళ్తున్నానని.. పాపని చూసుకోమని చెప్పి వెళ్లిపోతుంది. నేను చూసుకుంటానని స్వప్నకి మాయమాటలు చెబుతాడు. రాహుల్ తాళం తీసుకుని ప్రాపర్టీ డాక్యుమెంట్స్ కొట్టేస్తాడు. దానిని అప్పూ, స్వప్నలు చూసి షాక్ అవుతారు. చండాలంగా భార్య ఆస్తులు కొట్టేయడం ఏంటీ? అని అప్పూ అడగ్గా మళ్లీ మనకే చిక్కుతాడని అంటుంది స్వప్న. అసలు ఆ పేపర్స్ ఎక్కడికి తీసుకెళ్తున్నాడో తెలుసుకోవాలని అంటుంది
ఉదయాన్నే రాజ్ .. స్వరాజ్ కంపెనీకి స్టైలీష్‌గా ఎంట్రీ ఇస్తాడు. ఆఫీస్‌లో అందరినీ తిట్టేస్తూ ఉంటాడు. ఆ దెబ్బతో శృతికి చెమటలు పడతాయి. పెండింగ్‌లో ఉన్న ఫైల్స్ అన్ని తీసుకుని నువ్వు, మేనేజర్ నా రూమ్‌లోకి రమ్మను అని ఆర్డర్స్ వేస్తాడు రాజ్. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications











